Viral video: Professor Beats Principal Inside His Office In MP College - Sakshi
Sakshi News home page

Viral Video: ఉపాధ్యాయ వృత్తిలో ఉండి ఏందయ్యా ఇది..

Published Wed, Jan 19 2022 3:40 PM | Last Updated on Wed, Jan 19 2022 8:54 PM

Viral video: Professor Beats Principal Inside His Office In MP College - Sakshi

Professor thrashes Principal inside his office: కొంతమంది పది మందికి బోధించే వృత్తిలో ఉండి కూడా అసలు ఏమాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా అమానుషంగా దాడులు చేస్తారు. పైగా కనీసం తమ ఉనికిని కూడా మరిచిపోయి వొళ్లు తెలియకుండా ప్రవర్తిస్తుంటారు. అచ్చం అలాంటి ఘటనే మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. అతను ఒక ప్రొఫెసర్‌ అయ్యి ఉండి ప్రిన్స్‌పాల్‌పై అమానుషంగా దాడి చేసిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.

అసలు విషయంలోకెళ్తే.. ఉజ్జయినిలోని ఘట్టియాలోని దివంగత నాగులాల్ మాలవ్య ప్రభుత్వ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ బ్రహ్మదీప్ అలునె. అయితే ఏంజరిగిందో​ తెలియదు గాని ప్రొఫెసర్ బ్రహ్మదీప్ ప్రిన్సిపాల్ డాక్టర్ శేఖర్ మేడంవార్‌ పై ఆగ్రహంతో దాడి చేశాడు. అంతేగాదు ఈ ఘటన మొత్తం సీసీఫుటేజ్‌లో రికార్డు అయ్యింది. ఈ వీడియోలో ప్రోఫెసర్‌ బ్రహ్మదీప్‌ కోపంతో ప్రిన్స్‌పాల్‌పై ఒక వస్తువును విసిరాడు. పైగా ఆగ్రహంతో ఊగిపోతూ అతని వద్దకు వచ్చి చేతులతో దాడి చేసినట్లు కనిపించింది. అంతేకాదు ఆ వీడియోలో బయటి నుంచి కొంతమంది వచ్చి ఆ ప్రొఫెసర్‌ని వెనక్కి లాగి కొద్దిసేపు సద్ది చెప్పడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

ఆ తర్వాత ప్రిన్సిపాల్‌ ఆ ప్రొఫెసర్‌ని వెళ్లిపోమని చెబుతున్నప్పటికీ వినిపించుకోకుండా కోపంతో అక్కడే కుర్చిలాక్కుని మరీ కుర్చున్నాడు. అయితే ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో పోలీసులు స్వచ్ఛందంగా ఆ ప్రొఫెసర్‌పై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఈ మేరకు ప్రిన్స్‌పాల్‌ శేఖర్‌ మాట్లాడుతూ..."ఆ ప్రొఫెసర్‌ బదిలిపై భోపాల్‌ నుంచి ఉజ్జయిని కాలేజికి వచ్చారని తెలిపారు. అంతేగాక అతను రోజు 5 కి.మీ దూరం నడిచి మరి కాలేజీకి వస్తాడన్నారు. అయితే మాకు సిబ్బంది తక్కువుగా ఉ‍న్నారని, పైగా కాలేజీని కూడా వ్యాక్సిన్‌ కేంద్రగా మారుస్తున్నారనే విషయం గురించి మాట్లాడేందుకు పిలిచాను. అయతే అతను మాత్రం ఆగ్రహానికిలోనై దుర్భాషలాడుతూ కొట్టడం మొదలు పెట్టాడని చెప్పారు.

(చదవండి: ఆడమ్‌ ఆలోచన.. ప్రపంచంలోనే అతి పొడవైన సైకిల్‌గా గిన్నిస్‌ రికార్డు!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement