Man Snatches Cop's Baton: కొంతమంది అధికారులు ప్రజల పట్ల దురుసుగా ప్రవర్తిస్తుంటే...మరికొంతమంది అత్యంత సౌమ్యంగా ఉంటారు. అయితే కొంతమంది వ్యక్తులు అధికారులు అన్న భయం గానీ ఏమీ లేకుండా అత్యంత హేయంగా ప్రవర్తిస్తుంటారు. ఆ తర్వాత అధికారుల ఆగ్రహానికి గురై ఊచలెక్కెడుతుంటారు. అచ్చం అలాంటి ఘటనే మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది.
వివరాల్లోకెళ్తే...మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జై ప్రకాష్ జైస్వాల్ అనే కానిస్టేబుల్ పై ఒక వ్యక్తి దాడి చేయడం మొదలు పెట్టాడు. అయితే అక్కడే ఉన్న స్థానికులెవరు కనీసం ఆ దాడిని వారించే సాహసం కూడా చేయలేదు. పోలీసుల కథనం ప్రకారం .... దినేష్ ప్రజాపతి అనే వ్యక్తి మోటర్ బైక్‌తో కానిస్టేబుల్ జై ప్రకాశ్ మోటార్ బైక్‌ని ఢీ కొట్టాడు.
దీంతో కానిస్టేబుల్ దినేష్‌తో బైక్ జాగ్రత్తగా నడుపు అన్నాడు. అంతే కోపంతో ఆ కానిస్టేబుల్ లాఠీని లాక్కుని మరీ కొట్టడం మొదలు పెట్టాడు. అక్కడకి కానిస్టేబుల్ చాలా సౌమ్యంగా అక్కడ నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నించాడు కూడా. కానీ దినేష్ మాత్రం కానిస్టేబుల్‌ని వదలకుండా వెంబడించి మరీ దాడి చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆధారంగా ఆ నిందితుడిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు అసిస్టెంట్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ రాజీవ్ సింగ్ భదౌరియా తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో ఆన్‌లైన్‌లో తెగ వైరల్ అవుతోంది.
In Indore Police constable Jai Prakash Jaiswal assaulted in full public view accused has been arrested @ndtv @ndtvindia pic.twitter.com/NElwWSXOXq
— Anurag Dwary (@Anurag_Dwary) April 9, 2022
(చదవండి: మహిళా అభిమానికి బలవంతంగా ముద్దు పెట్టబోయిన ర్యాపర్)
Comments
Please login to add a commentAdd a comment