Beat Crime
-
ఉపాధ్యాయ వృత్తిలో ఉండి ఏందయ్యా ఇది..
Professor thrashes Principal inside his office: కొంతమంది పది మందికి బోధించే వృత్తిలో ఉండి కూడా అసలు ఏమాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా అమానుషంగా దాడులు చేస్తారు. పైగా కనీసం తమ ఉనికిని కూడా మరిచిపోయి వొళ్లు తెలియకుండా ప్రవర్తిస్తుంటారు. అచ్చం అలాంటి ఘటనే మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. అతను ఒక ప్రొఫెసర్ అయ్యి ఉండి ప్రిన్స్‌పాల్‌పై అమానుషంగా దాడి చేసిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అసలు విషయంలోకెళ్తే.. ఉజ్జయినిలోని ఘట్టియాలోని దివంగత నాగులాల్ మాలవ్య ప్రభుత్వ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ బ్రహ్మదీప్ అలునె. అయితే ఏంజరిగిందో తెలియదు గాని ప్రొఫెసర్ బ్రహ్మదీప్ ప్రిన్సిపాల్ డాక్టర్ శేఖర్ మేడంవార్ పై ఆగ్రహంతో దాడి చేశాడు. అంతేగాదు ఈ ఘటన మొత్తం సీసీఫుటేజ్‌లో రికార్డు అయ్యింది. ఈ వీడియోలో ప్రోఫెసర్ బ్రహ్మదీప్ కోపంతో ప్రిన్స్‌పాల్‌పై ఒక వస్తువును విసిరాడు. పైగా ఆగ్రహంతో ఊగిపోతూ అతని వద్దకు వచ్చి చేతులతో దాడి చేసినట్లు కనిపించింది. అంతేకాదు ఆ వీడియోలో బయటి నుంచి కొంతమంది వచ్చి ఆ ప్రొఫెసర్ని వెనక్కి లాగి కొద్దిసేపు సద్ది చెప్పడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ప్రిన్సిపాల్ ఆ ప్రొఫెసర్ని వెళ్లిపోమని చెబుతున్నప్పటికీ వినిపించుకోకుండా కోపంతో అక్కడే కుర్చిలాక్కుని మరీ కుర్చున్నాడు. అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు స్వచ్ఛందంగా ఆ ప్రొఫెసర్‌పై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఈ మేరకు ప్రిన్స్‌పాల్ శేఖర్ మాట్లాడుతూ..."ఆ ప్రొఫెసర్ బదిలిపై భోపాల్ నుంచి ఉజ్జయిని కాలేజికి వచ్చారని తెలిపారు. అంతేగాక అతను రోజు 5 కి.మీ దూరం నడిచి మరి కాలేజీకి వస్తాడన్నారు. అయితే మాకు సిబ్బంది తక్కువుగా ఉన్నారని, పైగా కాలేజీని కూడా వ్యాక్సిన్ కేంద్రగా మారుస్తున్నారనే విషయం గురించి మాట్లాడేందుకు పిలిచాను. అయతే అతను మాత్రం ఆగ్రహానికిలోనై దుర్భాషలాడుతూ కొట్టడం మొదలు పెట్టాడని చెప్పారు. (చదవండి: ఆడమ్ ఆలోచన.. ప్రపంచంలోనే అతి పొడవైన సైకిల్‌గా గిన్నిస్ రికార్డు!) An assistant professor was booked for allegedly beating up principal of a Government College in Ujjain @ndtv @ndtvindia pic.twitter.com/egom5OIVjA— Anurag Dwary (@Anurag_Dwary) January 19, 2022 -
చెన్నైలో పోలీసుల సైకిల్ గస్తీ
కేకే.నగర్: చెన్నైలో పోలీసుల గస్తీ నిర్వహించేందుకు ప్రభుత్వం సైకిళ్లను అందజేసింది. సుమారు 250 సైకిళ్లతో చెన్నైలో గల అన్ని ప్రాంతాల్లో పోలీసులు గస్తీ పెంచారు. హెడ్‌లైట్, సైరన్లు ఏర్పాటు చేసిన ఈ సైకిళ్లు పోలీసులకు ఎంతో అనువుగా ఉన్నాయి. చిన్నపాటి సందుల్లో కూడా వెళ్లే పోలీసులు గుడిసె ప్రాంతాల్లోని నేరాలను, నిందితులను సులభంగా అరెస్టు చేస్తున్నారు. టి.నగర్ సహాయ కమిషనర్ శరవణన్, కేకేనగర్ ప్రాంతంలో సైకిల్ గస్తీలను పర్యవేక్షించి పోలీసులను ప్రోత్సహించారు. గుడిసె ప్రాంతాల్లోని ప్రజల వద్ద పోలీసులు పని తీరు గురించి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. సైకిల్ గస్తీల వలన పోలీసులు ఎలాంటి సమస్య జరిగినా వచ్చి పరిష్కరిస్తున్నారని ప్రజలు తెలిపారు.