ప్రపంచంలోనే అపరకుబేరుడిగా ఉన్న ఎలోన్ మస్క్‌కు భారీ షాక్ తగిలింది. 9 నెలల కాలంలో తొలిసారి బ్లూమ్‌బెర్గ్ వరల్డ్ రిచెస్ట్ బిలియనీర్ జాబితాలో స్థానాన్ని కోల్పోయారు.
టెస్లా కంపెనీ షేర్లు 7.2 శాతం కుప్పకూలిపోవడంతో బిలియనీర్ల స్థానంలో తొలిస్థానంలో ఉన్న మస్క్ రెండో స్థానానికి పడిపోయారు. యథావిధిగా అమెజాన్ అధినేత జెఫ్‌బెజోస్ 200 బిలియన్ డాలర్ల సంపదతో తొలిస్థానాన్ని దక్కించుకున్నారు. ప్రస్తుతం మస్క్ నెట్‌వర్త్ 198 బిలియన్లుగా ఉంది.
అంత వేతనం వదులు కోవాల్సిందే
టెస్లా సంస్థ సీఈఓగా ఉన్న ఎలోన్ మస్క్ 2018లో అన్నీ రకాల ప్రయోజనాల్ని కలుపుకుని 55 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.4.5లక్షల కోట్లు) వేతనాన్ని తీసుకుంటున్నారు. దీంతో ఆయన ప్రపంచ కుబేరుల్లో ఒకడిగా నిలిచారు. అయితే, మస్క్‌కు అంత వేతనం అందుకోవడంపై టెస్లా పెట్టుబడిదారుల్లో ఒకరైన రిచర్డ్ టోర్నెట్టా.. డెలావర్ కోర్టును ఆశ్రయించారు. పలు మార్లు ఈ అంశంపై డెలావర్ కోర్టు విచారణ చేపట్టింది.
తాజాగా మస్క్ 55 బిలియన్ డాలర్ల వేతనాన్ని వదులుకోవాలని ఆదేశించింది. ఆ తీర్పుతో టెస్లా షేర్లు పడిపోవడం, ఆ సంస్థలో అత్యధిక షేర్లున్న మస్క్ సంపదపై ప్రతికూల ప్రభావం పడింది. ఫలితంగా బ్లూమ్‌బెర్గ్ ప్రపంచ కుబేరుల‍్లో అగ్రస్థానం నుంచి రెండో స్థానానికి పడిపోయారు.
పడిపోయిన టెస్లా కార్ల ఎగుమతులు
దానికి తోడు చైనాలోని షాంఘైలోని టెస్లా ఫ్యాక్టరీ నుండి కార్ల ఎగుమతులు ఒక సంవత్సరం కంటే ఎక్కువ కనిష్ట స్థాయికి పడిపోయాంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. దీంతో టెస్లా షేర్లు పడిపోయాయి. అదే సమయంలో అమెజాన్‌లో అమ్మకాలో జోరందుకోవడం ఆ సంస్థ అధినేత జెఫ్‌బెజోస్‌కి కలిసి వచ్చింది. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్ల జాబితాలో అగ్రస్థానం దక్కించుకునేందుకు దోహదం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment