![Microsoft layoffs again over 250 employees job cut - Sakshi](/styles/webp/s3/article_images/2023/07/11/microsoft-layoffs-again.jpg.webp?itok=s5J946yD)
Microsoft Layoffs: ఈ ఏడాది ప్రారంభం నుంచి దిగ్గజ కంపెనీలు గూగుల్, ట్విటర్ లెక్కకు మించిన ఉద్యోగులను తొలగించిన సంగతి తెలిసిందే. ఈ ప్రభావం చాలామంది జీవితాలను దెబ్బతీసింది. అయితే ఇప్పుడు ప్రముఖ టెక్ సంస్థ మైక్రోసాఫ్ట్ తాజాగా మరోసారి 276 మంది ఉద్యోగులను తొలగించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
వర్కర్ అడ్జస్ట్‌మెంట్ అండ్ రీట్రైనింగ్ నోటిఫికేషన్ (WARN) ప్రకారం.. బెల్లేవ్ & రెడ్‌మండ్ కార్యాలయాల్లోని మొత్తం 276 మందిని తొలగించినట్లు తెలిసింది. ఇందులో 66 మంది వర్చువల్ సిబ్బంది ఉన్నట్లు సమాచారం.
వ్యాపార నిర్వహణలో సంస్థాగత, శ్రామిక శక్తి సర్దుబాట్లు తప్పనిసరి, ఇందులో భాగంగానే ఉద్యోగుల తొలగింపు జరిగిందని కంపెనీ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. అంతే కాకుండా కంపెనీ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కూడా లేఆప్స్ జరుగుతాయి. ఉద్యోగాల తొలగింపు ఇదే మొదటి సారి కాదు. గతంలో కూడా కంపెనీ చాలామంది ఉద్యోగులను తొలగించింది.
(ఇదీ చదవండి: బైక్‌కు గుడి కట్టించి పూజలు - సినిమాను తలపించే ఇంట్రెస్టింగ్ స్టోరీ!)
మైక్రోసాఫ్ట్ అనేది ఎన్నెన్నో సవాళ్ళను ఎదుర్కుంటున్న పెద్ద టెక్ కంపెనీ. గత కొన్ని రోజుల నుంచి ఉద్యోగాల కోతలు భారీగా జరుగుతున్నాయి. దీనికి తోడు ఇప్పుడు ఏఐ ప్రభావం కూడా ఐటీ కంపెనీల మీద తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. దీన్ని బట్టి చూస్తే రానున్న రోజుల్లో మరిన్ని ఉద్యోగాలు ఊడిపోయే అవకాశం ఉందని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment