'మన ఆరోగ్యం బాగుకై ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాం. తీరికలేక మరెన్నో బాధ్యతలతో పరుగెడుతుంటాం. ఇలాంటి క్రమంలో ఆరోగ్యం రోజురోజుకి క్షీణిస్తూంటుంది. దుమ్ము, దూళి, టెన్షన్స్, అవిరామం మరెన్నో కారణాలచే అనారోగ్యం పాలై, బాగుకోసం మెడిసిన్స్ వాడుతుంటాం. ఇకపై ఇలాంటి వాటికి స్వస్తి పలకడానికి ఈ చిన్న చిన్న ట్రిక్స్ వాడితే ఎంతో మేలని చెప్పవచ్చు. మరి అవేంటో చూద్దాం!'
- కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఓ 10 ఆకులతో పేస్ట్ తయారు చేసి మజ్జిగలో కలిపేసుకుని రోజూ తాగితే వ్యర్థపదార్థాల నుంచి కాలేయానికి రక్షణ దొరుకుతుంది. రోజూ ఓ 8 ఆకుల్ని మిరియాలతో కలిపి తింటే ముక్కులో వచ్చే అలర్జీలు తగ్గిపోతాయి.
- తులసి ఆకులు, వ్యాధి నిరోధక శక్తిని వద్ధి చేయడమే కాదు, శ్వాసకోశ వ్యవస్థను బలోపేతం చేస్తాయి. ఓ ఐదారు ఆకుల కషాయాన్ని మరగించి టీ మాదిరి చేసుకుని తాగితే, దగ్గు, జలుబు, ఆస్తమా అదుపులోకి వస్తాయి.
- పసుపును పేస్ట్‌గా రోజూ ముఖానికి వాడితే, ముఖం మీద ఉండే సన్నని వెంట్రుకలు రాలిపోతాయి. అలాగే మొటిమలు, మచ్చలు కూడా మాయమవుతాయి. ఇది గొప్ప యాంటీ ఆక్సిడెంటు కాబట్టి రోజు మొత్తంలో ఒక టీ స్పూను దాకా కడుపులోకి తీసుకోవచ్చు.
- మందారం ఆకుల్ని నూరి షాంపూగా వాడితే జుత్తు బాగా పెరుగుతుంది. చుండ్రు నివారణలోనూ, తెల్ల వెంట్రుకల నిరోధకంలోనూ బాగా సాయమవుతుంది. ఒక కప్పు నీటిలో ఒక పూవు చొప్పున వేసి ఆ నీళ్లను తాగితే రక్తంలో ఐరన్ పెరుగుతుంది.
- అల్లం, జీర్ణశక్తిని పెంచడంతో పాటు కడుపులోని వికారాన్ని తగ్గిస్తుంది. అల్లం రసాన్ని తేనెతో కలిపి తీసుకుంటే, ఆకలి పెరుగుతుంది.
- పడుకునే ముందు చెర్రీపండ్లు తిన్నా లేదా జ్యూస్ తాగినా.. అందులో ఉండే ’మెలటోనిన్’ వల్ల చక్కగా నిద్ర పడుతుంది.
ఇవి చదవండి: మీకు తెలుసా! వేడి నీళ్లలో నెయ్యి కలిపి తాగితే ఏమౌతుందో!?
Comments
Please login to add a commentAdd a comment