Karive Pack
-
నైస్.. రైస్! రుచికరంగా.. కొత్తదనంగా..!
ఉదయాన్నే పాఠశాలకు వెళ్లే పిల్లలకు, ఉద్యోగ, వ్యాపార కార్యకలాపాలకు సిద్ధమయ్యే పెద్దవారికి లంచ్ బాక్సు కట్టడానికి ఇంట్లో రోజూ హడావుడి కనిపిస్తుంది. తక్కువ సమయంలో ఉదయం టిఫిన్, మధ్యాహ్నానికి భోజనం, బ్రేక్ సమయంలో స్నాక్స్ అన్నీ సిద్ధం చేయాల్సి ఉంటుంది. ఇటువంటి సమయంలో ఆహారంలో కొద్దిగా ఉప్పు తక్కువైనా, ఎక్కువైనా బాక్సు అలాగే తిరిగి ఇంటికి వచ్చేస్తుంది. నిత్యం రొటీన్ క్యారేజీ కడితే పిల్లలు తినడానికి అంతగా ఇష్టపడరు. ఈ నేపథ్యంలో అటు పిల్లలు ఇష్టపడేలా.. ఇటు పోషకాలు అధికంగా ఉండేలా.. ఆహార నిపుణుల సూచనలతో కొన్ని రెసిపీలు మీ కోసం.. – సాక్షి, సిటీబ్యూరోవంటింట్లో టమాటా రైస్, ఎగ్ రైస్, జీరా రైస్, పుదీనా రైస్, పెరుగన్నం, అప్పుడప్పుడు వెజ్, నాన్‌వెజ్ ఫ్రైడ్ రైస్ వంటివి తెలిసిన వంటకాలు. అలాగే ఆరోగ్యం అందించే కరివేపాకు రైస్, ఉల్లి రైస్, కాలిఫ్లవర్ రైస్ వంటివి కూడా ట్రై చేయండి. తయారీకి తక్కువ సమయం, తినడానికి రుచికరంగా ఉంటాయి. విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారుల లంచ్ బాక్సుకు ఉపయోగకరంగా ఉంటాయి.కరివేపాకు అన్నం..జీర్ణశక్తిని పెంపొందించడంలో కరివేపాకు ఉపయోగపడుతుంది. అందుకే తరతరాలుగా అన్ని వంటల్లో కొంచెమైనా కరివేపాకు వేస్తారు. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అయినా పిల్లలు, పెద్దల్లో కొంత మంది మాత్రం కరివేపాకులు కనిపిస్తే తీసి పక్కన పడేస్తారు. అటువంటి వారికోసం కరివేపాకు రైస్ చేసి పెడితే చకచకా తినేస్తారు. కరివేపాకుల వల్ల కలిగే లాభాలన్నీ వారికి అందుతాయి. వంట వేగంగా అయిపోతుంది.– బియ్యం కడిగి, నీటిని వడపట్టి పక్కన పెట్టుకోవాలి.– స్టవ్‌పై పాత్ర పెట్టి టీస్పూను నూనె, ఒకటిన్నర కప్పు కరివేపాకు ముక్కలు, కొబ్బరి తురుము కలిపి ఒక నిమిషం వేయించాలి.– చల్లారిన తరువాత మిక్సీలో రుబ్బుకోవాలి. మరో పాత్రలో నూనె, లవంగాలు, పచ్చి మిర్చి ముక్కలు, ఉల్లి ముక్కలు, షాజీరా, అల్లం వెల్లుల్లి పేస్టు వేయించాలి. – అప్పటికే కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వేయాలి. అందులో కరివేపాకు పేస్ట్, ఉప్పు, నిమ్మరసం వేసి కలపాలి.– బియ్యం పలుగ్గా ఉడికిన తరువాత సిమ్‌లో కొద్దిసేపు ఉంచాలి. అంతే కరివేపాకు అన్నం రెడీ.కాలిఫ్లవర్ రైస్..కాలిఫ్లవర్ ఆరోగ్యానికి మంచిది. కూరలు, ఫ్రై చేయడానికి, వెజ్ మంచూరియా వంటి వంటకాల్లో వాడుతుంటారు. కాలిఫ్లవర్ రైస్ ట్రై చేయాలనుకుంటే మాత్రం ఇలా చేయండి..– బియ్యం 80 శాతం ఉడికించి పక్కన పెట్టుకోవాలి.– మరో పాత్రలో తరిగిన కాలిఫ్లవర్ ముక్కలను ఉప్పు, పసుపు వేసి 10 నిమిషాల పాటు ఉడికించాలి.– అనంతరం నీటిని వడగట్టి ముక్కల్ని ఆరబెట్టుకోవాలి.– జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్టు, పచి్చమిర్చి, బఠాణీలు వేసి తాలింపు సిద్ధం చేసుకోవాలి.– అందులో కాలిఫ్లవర్ ముక్కలు వేసి, గరం మసాలా కలపాలి.– వేగిన తరువాత ఉడకబెట్టిన అన్నం వేసి, అవసరమైనంత ఉప్పు వేసి కలపాలి.– అన్నం పూర్తిగా ఉడికే వరకూ చూసుకోవాలి. చివరిగా కొత్తిమీర వేసుకుంటే కాలిఫ్లవర్ రైస్ సిద్ధమైనట్లే.ఉల్లి రైస్..ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదని నానుడి. ఆరోగ్యపరంగా ఉల్లికి అంత ప్రాముఖ్యత ఉందన్నమాట. కూరలు, ఇతర రెసిపీలు తయారీలోనే కాదు, ఉల్లి రైస్‌ని ట్రై చేయాలనుకుంటే మాత్రం ఇది చూడండి.– ఉల్లిని మనకు నచ్చిన రీతిలో (నిలువుగా, అడ్డంగా) ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. బియ్యం కడిగి ఉంచుకోవాలి.– పొయ్యిపై పాత్ర పెట్టి నూనె వేడెక్కాక జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శెనగపప్పు వేయించాలి.– కరివేపాకులు వేసి వేగాక, తరిగిన ఉల్లి ముక్కలు, పచ్చి మిర్చి, యాలుకలు, లవంగాలు వేసి వేయించాలి.– తరువాత కడిగి సిద్ధం చేసుకున్న బియ్యం వేసి బాగా కలపాలి.– అవసరమైనంత ఉప్పు వేసుకోవాలి. అన్నం ఉడికిన తరువాత దించితే సరిపోతుంది.ఇవి చదవండి: ఈ వాస్తు చిత్రలేఖనం.. ఇప్పుడొక ట్రెండ్! -
హెల్త్ టిప్స్: ఈ చిట్కాలు వాడారో.. ఇకపై ఆరోగ్య సమస్యలు దూరమే!
'మన ఆరోగ్యం బాగుకై ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాం. తీరికలేక మరెన్నో బాధ్యతలతో పరుగెడుతుంటాం. ఇలాంటి క్రమంలో ఆరోగ్యం రోజురోజుకి క్షీణిస్తూంటుంది. దుమ్ము, దూళి, టెన్షన్స్, అవిరామం మరెన్నో కారణాలచే అనారోగ్యం పాలై, బాగుకోసం మెడిసిన్స్ వాడుతుంటాం. ఇకపై ఇలాంటి వాటికి స్వస్తి పలకడానికి ఈ చిన్న చిన్న ట్రిక్స్ వాడితే ఎంతో మేలని చెప్పవచ్చు. మరి అవేంటో చూద్దాం!' కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఓ 10 ఆకులతో పేస్ట్ తయారు చేసి మజ్జిగలో కలిపేసుకుని రోజూ తాగితే వ్యర్థపదార్థాల నుంచి కాలేయానికి రక్షణ దొరుకుతుంది. రోజూ ఓ 8 ఆకుల్ని మిరియాలతో కలిపి తింటే ముక్కులో వచ్చే అలర్జీలు తగ్గిపోతాయి. తులసి ఆకులు, వ్యాధి నిరోధక శక్తిని వద్ధి చేయడమే కాదు, శ్వాసకోశ వ్యవస్థను బలోపేతం చేస్తాయి. ఓ ఐదారు ఆకుల కషాయాన్ని మరగించి టీ మాదిరి చేసుకుని తాగితే, దగ్గు, జలుబు, ఆస్తమా అదుపులోకి వస్తాయి. పసుపును పేస్ట్‌గా రోజూ ముఖానికి వాడితే, ముఖం మీద ఉండే సన్నని వెంట్రుకలు రాలిపోతాయి. అలాగే మొటిమలు, మచ్చలు కూడా మాయమవుతాయి. ఇది గొప్ప యాంటీ ఆక్సిడెంటు కాబట్టి రోజు మొత్తంలో ఒక టీ స్పూను దాకా కడుపులోకి తీసుకోవచ్చు. మందారం ఆకుల్ని నూరి షాంపూగా వాడితే జుత్తు బాగా పెరుగుతుంది. చుండ్రు నివారణలోనూ, తెల్ల వెంట్రుకల నిరోధకంలోనూ బాగా సాయమవుతుంది. ఒక కప్పు నీటిలో ఒక పూవు చొప్పున వేసి ఆ నీళ్లను తాగితే రక్తంలో ఐరన్ పెరుగుతుంది. అల్లం, జీర్ణశక్తిని పెంచడంతో పాటు కడుపులోని వికారాన్ని తగ్గిస్తుంది. అల్లం రసాన్ని తేనెతో కలిపి తీసుకుంటే, ఆకలి పెరుగుతుంది. పడుకునే ముందు చెర్రీపండ్లు తిన్నా లేదా జ్యూస్ తాగినా.. అందులో ఉండే ’మెలటోనిన్’ వల్ల చక్కగా నిద్ర పడుతుంది. ఇవి చదవండి: మీకు తెలుసా! వేడి నీళ్లలో నెయ్యి కలిపి తాగితే ఏమౌతుందో!? -
కరివేప్యాక్
న్యూ ఫేస్ ఆర్థికంగా ఎదగాలనో.. పోటీ ప్రపంచంలో ముందుండాలనో.. మరే ఇతర కారణాల వల్లో మనల్ని మనం నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. ముఖ్యంగా గృహిణులు తమ శరీరం పట్ల చాలా అశ్రద్ధ చూపిస్తుంటారు. కొన్ని రోజులు అలాగే వదిలేస్తే.. చర్మం, జుత్తు వంటివి కూడా క్రమంగా పాడైపోతాయి. అలా అని వాటిని జాగ్రత్తగా చూసుకోవడానికి బ్యూటీ పార్లర్ల చుట్టూ తిరగాల్సిన పని లేదు. ఇంట్లోనే మన చర్మానికి సరిపోయే ప్యాక్స్ వారానికోసారి వేసుకున్నా సరిపోతుంది. ఓసారి ఈ ప్యాక్‌ను ట్రై చేసి, ఫలితం మీరే చూడండి. కావలసినవి * కరివేపాకు పేస్ట్ (ఆకులను మిక్సీలో కానీ రోట్లో కానీ వేసి మెత్తగా రుబ్బుకోవాలి) - 1 టేబుల్ స్పూన్ * శనగపిండి - అర టేబుల్ స్పూన్ * పెరుగు లేదా పాలు - అర టేబుల్ స్పూన్ తయారీ * ఓ బౌల్లో కరివేపాకు పేస్ట్, శనగపిండి, పెరుగు లేదా పాలు వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు ప్యాక్‌గా వేసుకోవాలి. 20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో చర్మాన్ని కాస్తంత స్క్రబ్ చేసుకుంటూ కడుక్కోవాలి. ఈ ప్యాక్‌ను వారానికి రెండుసార్లు వేసుకుంటే.. మీ చర్మం అందంగా, ఆరోగ్యంగా ఉంటుంది. (కరివేపాకు పేస్ట్‌కు బదులుగా.. ఎండబెట్టిన కరివేపాకుల పొడిని కూడా ప్యాక్‌గా వేసుకోవచ్చు) * కరివేపాకులోని యాంటీ బ్యాక్టీరియల్ లక్షణం మీ చర్మాన్ని ఇన్ఫెక్షన్ల బారి నుంచి కాపాడుతుంది. అలాగే ఈ కరివేపాకు ప్యాక్ ముఖంపై మొటిమలు, దద్దుర్లను దూరం చేస్తుంది. అలాగే ఇందులోని శనగపిండి మంచి క్లీనింగ్ ఏజెంట్‌గా పని చేస్తుంది. అంతేనా, ఇది చర్మాన్ని మృదువుగా, నిగనిగలాడేలా చేస్తుంది. కరివేపాకు తినడం వల్ల వచ్చే లాభాలెన్నో మనకు తెలుసు. అలాగే ఈ ఫేస్‌ప్యాక్ కూడా చర్మానికి పలురకాలుగా ఉపయోగపడుతుంది. ఈ కరివేపాకు జుత్తు పెరుగుదలకు కూడా ఎంతో తోడ్పడుతుంది.