కరివేప్యాక్ Karive Pack | Sakshi
Sakshi News home page

కరివేప్యాక్

Published Sat, Oct 8 2016 9:54 PM

కరివేప్యాక్

న్యూ ఫేస్
ఆర్థికంగా ఎదగాలనో.. పోటీ ప్రపంచంలో ముందుండాలనో.. మరే ఇతర కారణాల వల్లో మనల్ని మనం నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. ముఖ్యంగా గృహిణులు తమ శరీరం పట్ల చాలా అశ్రద్ధ చూపిస్తుంటారు. కొన్ని రోజులు అలాగే వదిలేస్తే.. చర్మం, జుత్తు వంటివి కూడా క్రమంగా పాడైపోతాయి. అలా అని వాటిని జాగ్రత్తగా చూసుకోవడానికి బ్యూటీ పార్లర్ల చుట్టూ తిరగాల్సిన పని లేదు. ఇంట్లోనే మన చర్మానికి సరిపోయే ప్యాక్స్ వారానికోసారి వేసుకున్నా సరిపోతుంది. ఓసారి ఈ ప్యాక్‌ను ట్రై చేసి, ఫలితం మీరే చూడండి.
 
కావలసినవి
* కరివేపాకు పేస్ట్ (ఆకులను మిక్సీలో కానీ రోట్లో కానీ వేసి మెత్తగా రుబ్బుకోవాలి) - 1 టేబుల్ స్పూన్
* శనగపిండి - అర టేబుల్ స్పూన్
* పెరుగు లేదా పాలు - అర టేబుల్ స్పూన్
 తయారీ
* ఓ బౌల్‌లో కరివేపాకు పేస్ట్, శనగపిండి, పెరుగు లేదా పాలు వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు ప్యాక్‌గా వేసుకోవాలి. 20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో చర్మాన్ని కాస్తంత స్క్రబ్ చేసుకుంటూ కడుక్కోవాలి. ఈ ప్యాక్‌ను వారానికి రెండుసార్లు వేసుకుంటే.. మీ చర్మం అందంగా, ఆరోగ్యంగా ఉంటుంది. (కరివేపాకు పేస్ట్‌కు బదులుగా.. ఎండబెట్టిన కరివేపాకుల పొడిని కూడా ప్యాక్‌గా వేసుకోవచ్చు)
* కరివేపాకులోని యాంటీ బ్యాక్టీరియల్ లక్షణం మీ చర్మాన్ని ఇన్‌ఫెక్షన్ల బారి నుంచి కాపాడుతుంది. అలాగే ఈ కరివేపాకు ప్యాక్ ముఖంపై మొటిమలు, దద్దుర్లను దూరం చేస్తుంది. అలాగే ఇందులోని శనగపిండి మంచి క్లీనింగ్ ఏజెంట్‌గా పని చేస్తుంది. అంతేనా, ఇది చర్మాన్ని మృదువుగా, నిగనిగలాడేలా చేస్తుంది. కరివేపాకు తినడం వల్ల వచ్చే లాభాలెన్నో మనకు తెలుసు. అలాగే ఈ ఫేస్‌ప్యాక్ కూడా చర్మానికి పలురకాలుగా ఉపయోగపడుతుంది. ఈ కరివేపాకు జుత్తు పెరుగుదలకు కూడా ఎంతో తోడ్పడుతుంది.

Advertisement
 
Advertisement
 
Advertisement