
మన(సు)లో మాట
మా బాబు వసు 5 సంవత్సరాలు. ఒకచోట నిలకడగా ఉండMýంండా, ఎప్పుడూ అటూ ఇటూ తిరుగుతూ ఉంటాడు. ఇంట్లో, స్కూల్లో బయటా కూడా ఇలాగే చస్తుంటాడు. బయట ఫంక్షన్లకు తీసుకెళితే తనను పట్టుకోవడం, తన చుట్టూ తిరగడంతోటే సరిపోతుంది. అందువల్ల ఈ మధ్య బయటకు వెళ్లడం కూడా తగ్గించేశాం. వాళ్ల నానమ్మేమో, ఇది పిల్లల్లో మామూలే అంటుంది. ఈ మధ్య వాళ్ల స్కూల్ టీచర్ మమ్మల్ని పిలిచి, మా బాబు మీద అనేక కంప్లయింట్లు చెప్పింది. మాకు చాలా ఆందోళనగా ఉంది. – కె. మాధవి, సికింద్రాబాద్
పిల్లల మెదడులో ఉండే సెల్ఫ్ కంట్రోల్ విభాగం లోని లోపాల వల్ల, వారసత్వ లక్షణాల రీత్యా, కొందరు పిల్లలకు మీరు చెప్పిన లక్షణాలు రావచ్చు. దీనిని హైపర్ యాక్టివిటీ లేదా ఏడీహెచ్‌డీ అంటారు. నిలకడ లేకపోవడం, చదువు మీద ఏకాగ్రత లేకపోవడం, వస్తువులు విసిరేయడం, సహనం లేకపోవడం, ఎప్పుడూ అటూ ఇటూ తిరుగుతూ ఉండటం, స్కూల్‌లో వస్తువులు మరచిపోవడం, ఈ సమస్య ముఖ్య లక్షణాలు. వీరికి తెలివితేటలు బాగానే ఉన్నప్పటికీ, ఏకాగ్రత లోపించడం వల్ల చదువులో వెనకబడతారు.
ఇలాంటి వారిని ఎంత చిన్నవయసులో గుర్తించి, సరిౖయెన చికిత్స చేయిస్తే అంత తొందరగా దీంట్లోంచి బయట పడతారు. ఆక్యుపేషనల్ థెరపీ, బిహేవియర్ థెరపీ, అవసరమైతే కొద్ది మోతాదులో కొన్ని మందులు వాడటం ద్వారా వీరిని పూర్తిగా బాగు చెయ్యచ్చు. పేరెంట్స్, టీచర్లు ఇలాంటి వారిని త్వరగా గుర్తించగలిగితే తొందరగా బాగుపడతారు. మైకేల్ ఫిలిప్స్ అనే స్విమ్మర్ ఈ సమస్యతో బాధపడుతూ చికిత్స తీసుకుని బాగుపడి, ఒలింపిక్స్‌లో 20కి పైగా స్వర్ణ పతకాలు సాధించాడు. చైల్డ్ సైకియాట్రిస్ట్‌ల సూచనలు తీసుకోవడం, పాటించడం మేలు చేస్తుంది.
– డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్, సైకియాట్రిస్ట్, విజయవాడ