Vishal Reddy (18)
-
Health: మందు మానేందుకు కూడా.. మందు ఉందా?
మా వివాహమై పదిహేనేళ్ళయింది. పెళ్ళికి ముందే ఆయనకు కొద్దిగా తాగుడు అలవాటుండేది. పోను పోను ఈ మధ్య మరీ ఎక్కువైంది. రెండేళ్ళ నుండి పగలు రాత్రి తేడా లేకుండా, తాగుతున్నారు. తాగనప్పుడు ఎంత మంచిగా ఉంటారో, తాగితే అంత గొడవ చేస్తారు. పొద్దున లేస్తూనే, ఒళ్ళంతా వణకటం, నీరసం, చికాకుగా, ... ఉందంటూ ఏ పనీ చేయలేకపోవడం, మళ్ళీ తాగితేనే గాని పని చేయలేనంటున్నారు.ఈ అలవాటు వల్ల, బిజినెస్ దెబ్బ తిని, చాలా నష్టపోవటమే కాకుండా, నలుగురిలో చులకన అయిపోయారు. పిల్లలు కూడా ఆయన్ను లెక్క చేయడం లేదు. తిండి, నిద్ర కూడా బాగా తగ్గి, చిక్కిపోయారు. ఇలాగే తాగుతుంటే ఆయన మాకు దక్కరేమోనని భయంగా ఉంది. డాక్టరు దగ్గరకు రమ్మంటే రావడం లేదు. మాకేదైనా పరిష్కారం చూపించగలరు. – కోమలి, రాజమండ్రితాగుడుకు అలవాటు పడటమనేది కూడా, ఒక మానసిక జబ్బు కిందే వస్తుందన్నది చాలామందికి తెలియదు. సరదాగా ్ర΄ారంభించి, చివరకు దానికి అలవాటు పడిపోతారు. మానాలనుకున్నా మానేయలేని స్థితికి వెళ్తారు. సమస్యలొచ్చినా, సంతోషమొచ్చినా, ఏదో ఒక కారణం పెట్టుకుని చాలామంది ఇలా తాగుడుకు బానిసలవుతారు. దీనివల్ల అన్ని విధాలా నష్టపోవడమే కాకుండా లివర్ దెబ్బతిని చివరకు ‘సిరోసిస్’ అనే వ్యాధి బారిన పడతారు. ్ర΄ాణాలకు ముప్పు ఉందని తెలిసినా తెగించి తాగే వారు కూడా చాలామంది ఉంటారు.మునుపటి కంటే ఇప్పుడు తాగుడు అలవాటు నుంచి పూర్తిగా విముక్తి కల్పించేందుకు ఆధునిక మానసిక వైద్య శాస్త్రంలో మంచి మందులు, చికిత్సా పద్ధతులు ఉన్నాయి. అయితే అందుకు ఆ వ్యక్తి సహకారం చాలా అవసరం. ఏదో ఒక విధంగా ఒప్పించి మీరు సైకి యాట్రిస్ట్ దగ్గరకు తీసుకెళ్ళే ప్రయత్నం చేయండి. మద్యం పైన తపన తగ్గించేందుకు ‘యాంటీ క్రేవింగ్ డ్రగ్స్’, మద్యం పై ఎవర్షన్ కలిగించేందుకు ‘డిటెరెంట్స్’ అనే మందులతో ΄ాటు, కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ, ఫ్యామిలీ కౌన్సెలింగ్ లాంటి మానసిక చికిత్సా పద్ధతులతో మీ వారిని ఆ అలవాటు నుంచి పూర్తిగా బయట పడేయవచ్చు.– డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ. మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com -
Health: ఆ ఆలోచన నుంచి.. బయటపడేదెలా?
నా వయసు 35 సంవత్సరాలు. ఒక సంవత్సరం నుంచి నాకెందుకో చనిపోవాలనిపిస్తోంది. 24 గంటలూ ఆత్మహత్య ఆలోచనలే వస్తున్నాయి. ఏ పనీ చేయాలనిపించదు. మునుపున్న హుషారు, ఉత్సాహం అసలు లేవు. మనసంతా నెగటివ్ ఆలోచనలతో నిండి, మైండ్ మొద్దుబారి, బ్లాంక్‌గా ఉంటోంది. నిజానికి నాకసలు సీరియస్ సమస్యలేమీ లేవు. నాలో ఈ నైరాశ్యం, నిర్వేదం తొలగి భార్యా పిల్లలతో హాయిగా గడిపే మార్గం చెప్పగలరు. – రఘురాం, అనంతపురంమీరెంతో ఆవేదనతో రాసిన ఉత్తరం చదివాను. మీ పరిస్థితి అర్థం అయింది. ‘మేజర్ డిప్రెసివ్ డిజార్డర్’ అనే మానసిక వ్యాధికి గురయిన వారిలో ఏ విధమైన కారణాలూ లేకుండా ఇలా ఆత్మహత్య చేసుకుందామనే ఆలోచనలు వస్తుంటాయి. వీరిని ఎవరూ పట్టించుకోకపోతే వారిలో ఆ భావనలు బలపడిపోయి ఎలాంటి కారణం లేకుండానే ఉన్నట్టుండి ఒకరోజు ఆత్మహత్య చేసుకుంటారు.డిప్రెషన్ వ్యాధికి బయటి సమస్యల కంటే మెదడులో జరిగే కొన్ని అసాధారణ రసాయనిక చర్యలే ముఖ్యకారణమని శాస్త్రీయంగా నిర్ధారణ అయిన సత్యం. వీరు నిరాశా నిస్పృహలతో ప్రతి చిన్న సమస్యనూ భూతద్దంలో చూసి, భయపడుతూ, తాను చేతగాని వాడినని, తనవల్ల ఎలాంటి ప్రయోజనం లేదని, ఇతరులకు తనవల్ల ఎలాంటి ఇబ్బందీ కలగకూడదని, తనకిక చావే శరణ్యమని భావించి, ఆత్మహత్యకు పాల్పడతారు. ఆలస్యం చేయకుండా మీరు వెంటనే మానసిక వైద్యుని సంప్రదించి, తగిన చికిత్స తీసుకుంటే, డిప్రెషన్ పూర్తిగా తొలగిపోయి మునుపటిలా సంతోషంగా, హుషారుగా ఉండగలరు.మా అబ్బాయికి పదహారేళ్లు. ఇంటర్లో చేర్చాం. మొదటినుంచి చదువులో యావరేజ్. అయితే ఈ మధ్య వాడి దగ్గర సిగరెట్ వాసన వస్తోంది. అదేమని అడిగితే ఒప్పుకోవడం లేదు. మొన్నొకరోజు జేబులో సిగరెట్లు దొరికాయి. గట్టిగా అడిగితే ఎదురు తిరగడం, కోపంతో వస్తువులు విసిరేయడం వంటివి చేస్తున్నాడు. మొదటినుంచి వాడు కొంచెం మొండివాడే. ఈ మధ్య ఆ మొండితన మరీ ఎక్కువైంది. చదువు ఎలా ఉన్నా సరే, కనీసం వాడిలో ఈ మొండితనం, కోపం తగ్గి, స్మోకింగ్ అలవాటు మాన్పించేందుకు మాకేదైనా సలహా ఇవ్వగలరు. – విజయలక్ష్మి, హన్మకొండటీనేజ్లో వచ్చే శారీరక, మానసిక మార్పుల వల్ల వారు కొంత మొండిగా ఉండటం సహజమే. అయితే మీ అబ్బాయిలోని స్మోకింగ్, ఎదురు తిరగడం, విపరీతమైన మొండితనం, కోపం, అబద్ధాలు చెప్పడం లాంటి లక్షణాలు కాండక్ట్ డిజార్డర్ లేదా అపోజిషనల్ డిఫియెంట్ డిజార్డర్ అనే మానసిక రుగ్మతను సూచిస్తున్నాయి. వీటిని చిన్నతనంలో అరికట్టలేకపోతే, అవి భవిష్యత్తులో ఆ కుటుంబానికే కాకుండా, సమాజం మొత్తాన్ని ఇబ్బంది పెట్టే సంఘ విద్రోహ శక్తిగా మారే అవకాశం ఉంది. అంతేకాకుండా స్మోకింగ్ క్రమేణా ఒక వ్యసనంగా మారి, దాంతోపాటు గంజాయి, ఆల్కహాల్ వంటి ఇతర మత్తుపదార్థాలకు కూడా అలవాటు పడేలా చేస్తుంది. ఇలాంటి పిల్లలకు కొన్ని మందుల ద్వారా, డయలెక్టివ్ బిహేవియర్ థెరపీ అనే ప్రత్యేక మానసిక చికిత్స ద్వారా మంచి మార్పు తీసుకురావచ్చు. మీరు ఆందోళన పడకండి.– డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ. మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.comఇవి చదవండి: సిటీ కాప్స్.. గుడ్ మార్నింగ్ హైదరాబాద్! -
మా బాబు.. ఒకచోట కుదురుగా ఉండటం లేదు..!?
మా బాబు వసు 5 సంవత్సరాలు. ఒకచోట నిలకడగా ఉండMýంండా, ఎప్పుడూ అటూ ఇటూ తిరుగుతూ ఉంటాడు. ఇంట్లో, స్కూల్లో బయటా కూడా ఇలాగే చస్తుంటాడు. బయట ఫంక్షన్లకు తీసుకెళితే తనను పట్టుకోవడం, తన చుట్టూ తిరగడంతోటే సరిపోతుంది. అందువల్ల ఈ మధ్య బయటకు వెళ్లడం కూడా తగ్గించేశాం. వాళ్ల నానమ్మేమో, ఇది పిల్లల్లో మామూలే అంటుంది. ఈ మధ్య వాళ్ల స్కూల్ టీచర్ మమ్మల్ని పిలిచి, మా బాబు మీద అనేక కంప్లయింట్లు చెప్పింది. మాకు చాలా ఆందోళనగా ఉంది. – కె. మాధవి, సికింద్రాబాద్పిల్లల మెదడులో ఉండే సెల్ఫ్ కంట్రోల్ విభాగం లోని లోపాల వల్ల, వారసత్వ లక్షణాల రీత్యా, కొందరు పిల్లలకు మీరు చెప్పిన లక్షణాలు రావచ్చు. దీనిని హైపర్ యాక్టివిటీ లేదా ఏడీహెచ్‌డీ అంటారు. నిలకడ లేకపోవడం, చదువు మీద ఏకాగ్రత లేకపోవడం, వస్తువులు విసిరేయడం, సహనం లేకపోవడం, ఎప్పుడూ అటూ ఇటూ తిరుగుతూ ఉండటం, స్కూల్లో వస్తువులు మరచిపోవడం, ఈ సమస్య ముఖ్య లక్షణాలు. వీరికి తెలివితేటలు బాగానే ఉన్నప్పటికీ, ఏకాగ్రత లోపించడం వల్ల చదువులో వెనకబడతారు.ఇలాంటి వారిని ఎంత చిన్నవయసులో గుర్తించి, సరిౖయెన చికిత్స చేయిస్తే అంత తొందరగా దీంట్లోంచి బయట పడతారు. ఆక్యుపేషనల్ థెరపీ, బిహేవియర్ థెరపీ, అవసరమైతే కొద్ది మోతాదులో కొన్ని మందులు వాడటం ద్వారా వీరిని పూర్తిగా బాగు చెయ్యచ్చు. పేరెంట్స్, టీచర్లు ఇలాంటి వారిని త్వరగా గుర్తించగలిగితే తొందరగా బాగుపడతారు. మైకేల్ ఫిలిప్స్ అనే స్విమ్మర్ ఈ సమస్యతో బాధపడుతూ చికిత్స తీసుకుని బాగుపడి, ఒలింపిక్స్‌లో 20కి పైగా స్వర్ణ పతకాలు సాధించాడు. చైల్డ్ సైకియాట్రిస్ట్‌ల సూచనలు తీసుకోవడం, పాటించడం మేలు చేస్తుంది.– డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్, సైకియాట్రిస్ట్, విజయవాడ -
రోడ్డు ప్రమాదంలో వరంగల్ డీసీసీ అధ్యక్షుడి కుమారుడు మృతి
హైదరాబాద్: వరంగల్ డీసీసీ అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి కుమారుడు విశాల్‌రెడ్డి (18) బుధవారం హైదరాబాద్‌లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. ఇక్కడి చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్‌కు సమీపంలోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయం వద్ద ఉదయం 8.15 గంటల సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. ఇదే చోట కొద్ది గంటల ముందే ఓ హౌజింగ్ కాంట్రాక్టర్ ఆర్టీసీ బస్ కింద పడి మృతి చెందడం గమనార్హం. విశాల్‌రెడ్డి దోమలగూడలోని ఓ అపార్ట్మెంట్లో తల్లి నీలిమ, సోదరితో కలసి నివాసం ఉంటున్నాడు. తండ్రి వరంగల్ డీసీసీ అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి తరచూ వారి వద్దకు వచ్చి వెళుతుంటారు. విశాల్ తన సోదరికి చెందిన స్కూటీపై తరచూ బయటికి వెళుతుంటాడు. తరచుగా అక్క గోదారెడ్డి స్కూటి వాహనాన్ని తీసుకుని బయటకు వెళ్లేవాడు. బుధవారం ఉదయం స్కూటిపై ముషీరాబాద్‌లోని స్నేహితుడి వద్దకు వెళ్లిన విశాల్... తిరిగి ఆర్టీసీ క్రాస్రోడ్వైపు వస్తుండగా అదుపుతప్పి పడిపోయాడు. బస్సు వెనుక టైర్ అతని తలపై నుంచి వెళ్లడంతో.. అక్కడిక్కడే మృతి చెందాడు. ప్రమాదానికి ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. డ్రైవర్ రాంచందర్‌ను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. విశాల్ మృతి విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. విశాల్ తండ్రి రాజేందర్‌రెడ్డిని కాంగ్రెస్ నేతలు జానారెడ్డి, మల్లు భట్టివిక్రమార్క, అంజన్‌కుమార్ యాదవ్ తదితరులు పరామర్శించారు. భౌతికకాయాన్ని అంత్యక్రియల నిమిత్తం వరంగల్‌కు తరలించారు.