మన(సు)లో మాట
మా వివాహమై పదిహేనేళ్ళయింది. పెళ్ళికి ముందే ఆయనకు కొద్దిగా తాగుడు అలవాటుండేది. పోను పోను ఈ మధ్య మరీ ఎక్కువైంది. రెండేళ్ళ నుండి పగలు రాత్రి తేడా లేకుండా, తాగుతున్నారు. తాగనప్పుడు ఎంత మంచిగా ఉంటారో, తాగితే అంత గొడవ చేస్తారు. పొద్దున లేస్తూనే, ఒళ్ళంతా వణకటం, నీరసం, చికాకుగా, ... ఉందంటూ ఏ పనీ చేయలేకపోవడం, మళ్ళీ తాగితేనే గాని పని చేయలేనంటున్నారు.
ఈ అలవాటు వల్ల, బిజినెస్ దెబ్బ తిని, చాలా నష్టపోవటమే కాకుండా, నలుగురిలో చులకన అయిపోయారు. పిల్లలు కూడా ఆయన్ను లెక్క చేయడం లేదు. తిండి, నిద్ర కూడా బాగా తగ్గి, చిక్కిపోయారు. ఇలాగే తాగుతుంటే ఆయన మాకు దక్కరేమోనని భయంగా ఉంది. డాక్టరు దగ్గరకు రమ్మంటే రావడం లేదు. మాకేదైనా పరిష్కారం చూపించగలరు. – కోమలి, రాజమండ్రి
తాగుడుకు అలవాటు పడటమనేది కూడా, ఒక మానసిక జబ్బు కిందే వస్తుందన్నది చాలామందికి తెలియదు. సరదాగా ్ర΄ారంభించి, చివరకు దానికి అలవాటు పడిపోతారు. మానాలనుకున్నా మానేయలేని స్థితికి వెళ్తారు. సమస్యలొచ్చినా, సంతోషమొచ్చినా, ఏదో ఒక కారణం పెట్టుకుని చాలామంది ఇలా తాగుడుకు బానిసలవుతారు. దీనివల్ల అన్ని విధాలా నష్టపోవడమే కాకుండా లివర్ దెబ్బతిని చివరకు ‘సిరోసిస్’ అనే వ్యాధి బారిన పడతారు. ్ర΄ాణాలకు ముప్పు ఉందని తెలిసినా తెగించి తాగే వారు కూడా చాలామంది ఉంటారు.
మునుపటి కంటే ఇప్పుడు తాగుడు అలవాటు నుంచి పూర్తిగా విముక్తి కల్పించేందుకు ఆధునిక మానసిక వైద్య శాస్త్రంలో మంచి మందులు, చికిత్సా పద్ధతులు ఉన్నాయి. అయితే అందుకు ఆ వ్యక్తి సహకారం చాలా అవసరం. ఏదో ఒక విధంగా ఒప్పించి మీరు సైకి యాట్రిస్ట్ దగ్గరకు తీసుకెళ్ళే ప్రయత్నం చేయండి. మద్యం పైన తపన తగ్గించేందుకు ‘యాంటీ క్రేవింగ్ డ్రగ్స్’, మద్యం పై ఎవర్షన్ కలిగించేందుకు ‘డిటెరెంట్స్’ అనే మందులతో ΄ాటు, కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ, ఫ్యామిలీ కౌన్సెలింగ్ లాంటి మానసిక చికిత్సా పద్ధతులతో మీ వారిని ఆ అలవాటు నుంచి పూర్తిగా బయట పడేయవచ్చు.
– డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ. మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com
Comments
Please login to add a commentAdd a comment