psycologists
-
బెల్ట్‌లు, చెప్పులతో కొట్టేవారు: ఆయుష్మాన్ ఖురాన్! బాల్యం భారంగా మారకూడదంటే..
కొందరు తల్లిదండ్రులు క్రమశిక్షణ పేరుతో పిల్లల పట్ల చాలా కఠినంగా ప్రవర్తిస్తారు. అది వారిని సత్ప్రవర్తన వైపుకి మళ్లించకపోగా..చిన్న వయసులోనే తట్టుకోలేని బాధలకు లోనవ్వుతారు. అందరూ ఒకలా తీసుకోరు. ఒక్కో పిల్లవాడి ఆలోచనా తీరు వేరుగా ఉంటుంది. చెడు అలవాట్ల బారిన పడకూడదని కొంతమంది తల్లిదండ్రులు అతి జాగ్రత్తతో చిన్నారులను తిట్టడం, కొట్టడం వంటివి చేస్తారు. వాళ్లు మంచిగా మారడం అటుంచి ఇంటి నుంచి పారిపోయి.. ప్రమాదకరమైన వ్యక్తులుగా మారిపోయే అవకాశం లేకపోలేదని హెచ్చరిస్తున్నారు మానసిక నిపుణులు. ఇలా తానుకూడా బాల్యంలో వేధింపులకు గురయ్యానని బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురాన్ ఇంటర్యూలో చెప్పుకొచ్చారు. అంతపెద్ద స్టార్ కూడా ఒక్కసారిగా బాల్యం అనగానే వేధింపులే గుర్తుకొచ్చాయి. అంటే అవి నీలి నీడల్లా ఆయన్ను ఇంకా వెన్నాడుతూనే ఉన్నాయి. ఇలా చిన్నారుల బాల్యం చేదు జ్ఞాపకంగా మారకూడదంటే..నటుడు ఆయుష్మాన్ ఖురాన్ తన బాల్యాన్ని గుర్తు చేసుకుంటూ భావోద్వేగంగా మాట్లాడారు. తండ్రి తనని బెల్టులు, చెప్పులతో దారుణంగా కొట్టేవాడనంటూ.. చిన్నతనంలో తాను అనుభవించిన బాధను చెప్పుకొచ్చారు. చిన్ననాటి ఆ గాయం తానింకా మర్చిపోలేదన్నారు. అయితే తాను మాత్రం తన పిల్లలకు అలాంటి తండ్రిని కానని, చాలా భిన్నంగా ఉంటానని అన్నారు. ఆయుష్మాన్‌కి ఇద్దరు పిల్లలు. తన బాల్యంలా వేధనాభరితంగా గడిచిపోకూడదని వారితో ఫ్రెండ్లీ ఫాదర్‌గా ఉంటానన్నారు. ఇక్కడ ఆయుష్మాన్ తన బాల్యంలో కలిగిన చేదు జ్ఞాపకాలు అతడి మనుసులో చాలా బలంగా నాటుకుపోయాయి. కానీ ఆయన తాను మంచి తండ్రిగా ఉండాలని భావించడం హర్షణీయం. ఎందుకంటే తనలా తన పిల్లలు కాకూదని అనుకోవడమే గాక ఎవరి బాల్యం అలా గాయాలతో నిండిపోకూడదని కోరుకున్నారు ఆయుష్మాన్. ఇలా అందరూ సానుకూలంగా తీసుకునే యత్నం చేయరు.చిన్నారుల సైకాలజీ ప్రకారం..బాల్యంలో జరిగే ప్రతిదీ వారి మనుసులో బలంగా నాటుకుంటుంది. వారు ఎదిగే క్రమంలో చుట్టూ ఉండే వాతావరణం, పరిచయమై కొత్త వ్యక్తులు అంతా ఆకర్షణీయంగా అందంగా కనిపిస్తుంది. కాబట్టి ఈజీగా చెడు అలవాట్లు లేదా వ్యసనాల బారినపడే అవకాశం ఉంది. దీన్ని తల్లిదండ్రులు ఓ స్నేహితుడి మాదిరిగా దగ్గరకు తీసుకుని వివరించి..వాటి వల్ల ఎదురయ్యే నష్టాన్ని స్పష్టంగా తెలియజేయాలి. అంతే తప్ప భయబ్రాంతులకు గురిచేసేలా కొట్టడం, తిట్టడం, లేదా పనిష్మెంట్లు ఇవ్వడం చేయకూడదు. ఇలా ప్రపంచమంతటా బాల్యంలో వేధింపులకు గురైన వారెందరో ఉన్నారని మానసిక నిపుణులు చెబుతున్నారు.అలాంటి పిల్లలను వారి సన్నిహితులో, బంధువులో లేక తల్లిదండ్రులో ఎవరో ఒకరైనా దగ్గరకు తీసుకోవాలి. లేదంటే వారు నిరాశ నిస్ప్రుహలకు లోనై ఎందుకు పనికరాని వారుగా లేదా ప్రమాదకరమైన వ్యక్తులుగా మారిపోతారని చెబుతున్నారు నిపుణులు. వేధింపులకు గురయ్యే చిన్నారుల తీరు..చదువులో వెనుకబడటంచురుగ్గా లేకపోవడంఆత్మవిశ్వాసం లేకపోవడంవేలు నోట్లో పెట్టుకోవడం లేదా పక్కతడిపే అలవాటు వారి ముఖం ఆందోళన, బాధతో ఉండటంఏకాగ్రత లోపించటంనలుగురితో కలవకపోవడంతదితర లక్షణాలు కనిపంచగానే వారిని మానసిక నిపుణుల వద్దకు తీసుకొచ్చి కౌన్సిలింగ్ ఇప్పించాలి. అక్కడ వారికి ఆత్మవిశ్వాసం పెరిగేలే థెరపీలు ఇవ్వడం వంటివి చేస్తారు నిపుణులు. ఇక్కడ చిన్నారులు తల్లిదండ్రులు, టీచర్లు, బంధువులు ఇలా ఎవ్వరి వల్ల అయినా వేధింపులకు గురైతే.. వెంటనే తన తల్లిదండ్రులు లేదా తనను ప్రేమగా చూసేవారి వద్ద మనసు విప్పి మాట్లాడేలా చేయడం తదితర విషయాలను నేర్పించడమే గాక తల్లిదండ్రులతో పిల్లలకు సాన్నిహిత్యం ఏర్పడేలా ఇరువురు ఎలా వ్యవహరించాలో తెలియజేస్తారు. అలాగే మొండిగా ఉండే పిల్లలను కూడా దారిలో పెట్టాలని కొట్టడం చెయ్యకూడదు. ఓపికతో వ్యవహరించడం లేదా మానసిక నిపుణులను సంప్రదించి సరైన మార్గంలో పయనించేలా చేయాలి తల్లిదండ్రులు. అంతే తప్ప బాల్యం అంటే భారంగా గడిపిన బాధకరమైన క్షణాలుగా మిగలకూడదని అని చెబుతున్నారు నిపుణులు.(చదవండి: నేహా ధూపియా అనుసరించే గ్లూటెన్-ఫ్రీ డైట్ అంటే..!) -
అవును..! వారిది గుర్తింపు కోసం ఆరాటమే..
టీనేజర్లు ఎందుకు చిత్రంగా ప్రవర్తిస్తుంటారు? ఎందుకు చిత్ర విచిత్రమైన డ్రెస్‌లు వేస్తారు? ఎందుకు ప్రమాదకరమైన విన్యాసాలు చేస్తుంటారు? ఎందుకంటే, అదంతా గుర్తింపు నిర్మాణ (ఐడెంటిటీ ఫార్మేషన్) ప్రక్రియలో భాగం. తమకంటూ ఒక గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నంలో భాగం. అయితే ఐడెంటిటీ ఫార్మేషన్ అనేది అంత సులువుగా, సూటిగా జరగదు. స్వీయ భావన (సెల్ఫ్–కాన్సెప్ట్), స్వీయ గౌరవం (సెల్ఫ్–ఎస్టీమ్), సామాజిక గుర్తింపు (సోషల్ ఐడెంటిటీ)ల మధ్య సంక్లిష్ట చర్యల ద్వారా జరుగుతుంది.నేనెవరు? నేనేం కావాలనుకుంటున్నాను? సమాజంలో నా స్థానం ఏమిటి? వంటి ప్రశ్నలతో యువత తర్జన భర్జన పడుతుంది. అందుకోసం విభిన్న పాత్రలను, విలువలను, విశ్వాసాలను పరీక్షిస్తారు. ఈ ప్రక్రియ సజావుగా జరిగినప్పుడు సరైన ఐడెంటిటీ ఏర్పడుతుందని లేదా గందరగోళంలో పడతారని ప్రముఖ డెవలప్మెంటల్ సైకాలజిస్ట్ ఎరిక్ ఎరిక్సన్ చెప్పాడు. అందుకే దీన్ని Identity Vs Role confusion అని పేర్కొన్నాడు.నేనెవరు?ఒక వ్యక్తికి తన సామర్థ్యం, విలువలు, వ్యక్తిత్వ లక్షణాలపై ఉన్న అవగాహననే స్వీయభావన అంటారు. యవ్వనంలో ఇది వేగంగా మారుతూ ఉంటుంది. కొత్త కొత్త స్నేహాలు చేస్తారు, కొత్త హాబీలను స్వీకరిస్తారు, కొత్త కొత్త దుస్తులు ప్రయత్నిస్తారు. విరుద్ధమైన ప్రవర్తనలను ప్రదర్శిస్తుంటారు. ఇదంతా తనను తాను తెలుసుకునే ప్రయత్నంలో భాగమే. కానీ తల్లిదండ్రులు దీన్ని తప్పుగా అర్థం చేసుకుని నిలకడగా ఉండరంటూ విమర్శిస్తుంటారు.ఉదాహరణకు, 15 ఏళ్ల మాయ చదువుపై శ్రద్ధ పెట్టడమా లేక సింగింగ్ కాంపిటీషన్స్‌లో పాల్గొనడమా అనే విషయంలో తర్జన భర్జన పడుతోంది. కానీ తల్లిదండ్రులు చదువుపైనే దృష్టిపెట్టాలని చెప్పడంతో దానికి అనుగుణంగా ఆమె స్వీయ భావన రూపుదిద్దుకుంటుంది. గుర్తింపు నిర్మాణంలో ఇది ముఖ్యమైన అంశం. యవ్వనంలో ఇలా అన్వేషించడం, నచ్చినదానికి కట్టుబడి ఉండటం వలన సరైన ఐడెంటిటీ ఏర్పడుతుందని, లేదంటే గందరగోళంలో పడతారని మీయుస్, తదితరులు చేసిన దీర్ఘకాలిక అధ్యయనం పేర్కొంది.నా విలువేంటి? ఒక వ్యక్తి తన విలువను తానెలా చూస్తున్నారనేదే స్వీయగౌరవం. ఇతరులతో పోల్చుకోవడం, విద్యాపరమైన ఒత్తిళ్లు, బాడీ ఇమేజ్‌కు సంబంధించిన అంశాల వల్ల టీనేజ్‌లో ఇది తరచుగా మారుతూ ఉంటుంది. ఉదాహరణకు, పదహారేళ్ల రవి సోషల్ మీడియా ప్రభావం వల్ల ఇతరులతో పోల్చుకుని, తాను అంత అందంగా లేనని మథనపడుతున్నాడు. దానివల్ల అతని స్వీయగౌరవం తగ్గిపోతోంది. దాంతో బయటకు వెళ్లడానికి జంకుతున్నాడు. నిజానికి చదువులో అందరికంటే ముందుంటాడు. కానీ దాని విలువను అతను గుర్తించడంలేదు. స్వీయ–కరుణ (self&compassion) అనే భావనను అభివృద్ధి చేయడం వల్ల ఈ నష్టాన్ని తగ్గించవచ్చని నెఫ్ (2011) పరిశోధనలు తేల్చాయి. సామాజిక గుర్తింపు..వ్యక్తిగత గుర్తింపుతో పాటు సామాజిక గుర్తింపు కూడా యవ్వనంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అందుకే స్నేహ సమూహాలు, సాంస్కృతిక లేదా మత సంఘాలు వంటి వాటికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటారు. ఇలాంటి సమూహాలతో గుర్తింపును కలిగి ఉండటం యువతలో భద్రత భావనను పెంచుతుంది. ఉదాహరణకు, 17 ఏళ్ల కరణ్ కుటుంబం ఉత్తర భారతం నుంచి హైదరాబాద్ వలస వచ్చింది. తమ కుటుంబ సంప్రదాయ విలువలను పాటించాలని ఇంట్లో నొక్కి చెప్పినా, కళాశాలలో అందుకు భిన్నమైన వాతావరణాన్ని ఎదుర్కొంటున్నాడు. ఈ రెండింటిలో దేన్నీ అతను వదులుకోలేడు. వాటి మధ్య రాజీ కుదుర్చుకోవడం ద్వారా అతనికి సామాజిక గుర్తింపు ఏర్పడుతుంది. అంటే యవ్వనంలో చేసే తిక్క తిక్క పనులన్నీ గుర్తింపు నిర్మాణంలో భాగమేనని గుర్తించాలి.తల్లిదండ్రులు చేయాల్సినవి..– టీన్స్‌లో జరిగే మార్పులను తల్లిదండ్రులు అర్థం చేసుకుని, పిల్లలకు అండగా నిలబడినప్పుడు వారిలో సరైన గుర్తింపు ఏర్పడుతుంది. – పిల్లల ఆలోచనలు, భావాలు, సవాళ్లు పంచుకోవడానికి విమర్శలు లేని వాతావరణాన్ని సృష్టించాలి. – భిన్న ఆసక్తులు, స్నేహాలు అన్వేషించడానికి అవసరమైన స్వేచ్ఛ కల్పించాలి. వారి ఎంపికలను గౌరవించాలి.– స్వేచ్ఛంటే విచ్చలవిడితనం కాదని, సంపూర్ణ బాధ్యత అని చెప్పాలి. అవసరమైన నిబంధనలు విధించాలి. అవసరానుగుణంగా వాటిని సడలించాలి. – ఇతరులతో పోల్చకుండా, వారి బలాలను గుర్తించి, విజయాలను ప్రశంసించాలి.– వారి పరిశీలనను, సామాజిక సంబంధాలను ప్రోత్సహించాలి. – యువత తాము గమనిస్తున్న ప్రవర్తనల ద్వారా ఎక్కువ నేర్చుకుంటారు. అందువల్ల తల్లిదండ్రులు మంచి రోల్ మోడల్స్‌గా ఉండాలి. -
బిగ్‌బాస్ గెలవాలంటే ఈ ఐదు తప్పనిసరి!
తెలివితేటలు ఉంటే ప్రపంచాన్ని ఏలవచ్చని అందరూ చెప్తుంటారు. కానీ జీవితంలో గెలవాలంటే తెలివితేటలు (Intelligence Quotient) మాత్రమే ఉంటే సరిపోదని భావోద్వేగ ప్రజ్ఞ/ ఈక్యూ (Emotional Intelligence) అవసరమని అనేక అధ్యయనాలు చెప్తున్నాయి. ఐక్యూ వ్యక్తి మేధస్సును, విశ్లేషణా సామర్థ్యాలను, సమస్యలను పరిష్కరించే ప్రతిభను కొలుస్తుంది. ఈక్యూ భావోద్వేగాలను గుర్తించడం, నియంత్రించడం, ఇతరులతో సంబంధాలను మెరుగుపరచడంపై దృష్టి పెడుతుంది. ఐక్యూ ఉంటే విద్య, వృత్తి రంగాల్లో గొప్ప విజయాలు సాధించవచ్చేమో కాని సంతోషంగా జీవిస్తారన్న గ్యారంటీ లేదని టర్మన్ (1921) అధ్యయనంలో తెలిసింది. ఈక్యూ ఉంటే నాయకులుగా ఎదుగుతారని హార్వర్డ్ విశ్వవిద్యాలయం 2001లో నిర్వహించిన అధ్యయనం తెలిపింది. ఈక్యూ ఉన్న వ్యక్తులు వృత్తిలో నాలుగురెట్లు ఎక్కువ విజయం సాధిస్తారని గోల్మన్ పరిశోధన పేర్కొంది. ఉద్యోగుల విజయంలో ఈక్యూ 30శాతం ప్రభావం చూపగా, ఐక్యూ 20శాతం మాత్రమే ప్రభావం చూపుతుందని మరొక పరిశోధనలో వెల్లడైంది. అంటే, ఉద్యోగంలోనైనా, జీవితంలోనైనా, బిగ్ బాస్లోనైనా నిలవాలంటే, గెలవాలంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ముఖ్యం. ఇంకా చెప్పాలంటే ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేసినవారు సుఖంగా, సంతోషంగా జీవిస్తారు.ఈక్యూలో ఐదు ప్రధాన అంశాలు ఉంటాయని డేనియల్ గోల్మన్ తన ‘ఎమోషనల్ ఇంటెలిజెన్స్’ పుస్తకంలో ప్రతిపాదించాడు. 1. స్వీయ అవగాహన: వ్యక్తి తన భావోద్వేగాలను తెలుసుకోవడం.2. స్వీయ నియంత్రణ: కఠిన పరిస్థితుల్లో భావాలను నియంత్రించడం.3. ప్రేరణ: బాహ్య ప్రేరణ కంటే అంతర్గత విలువల ద్వారా ప్రేరేపించడం.4. సహానుభూతి: ఇతరుల భావాలను అర్థం చేసుకొని స్పందించడం.5. సామాజిక నైపుణ్యాలు: సంబంధాలను నిర్వహించడం, నెట్‌వర్క్‌లను బలోపేతం చేయడం.ఈక్యూ ఉన్నవారే బిగ్ బాస్..సరే, ఇక బిగ్ బాస్ షోలోకి వచ్చేద్దాం. బిగ్ బాస్ లాంటి రియాలిటీ షోలో తీవ్రమైన ఒత్తిడి ఉంటుందన్న విషయం తెలిసిందే. అలాంటి వాతావరణంలో పార్టిసిపెంట్స్ ప్రవర్తన, నిర్ణయాలు, మాటలు వారి భావోద్వేగ ప్రజ్నను ప్రతిబింబిస్తాయి. మూడో వారం జరిగిన సంఘటనల్లో గ్రూప్ డైనామిక్స్, నిర్ణయం తీసుకోవడం, గొడవల పరిష్కారంలో ఈక్యూ ఎలాంటి పాత్ర పోషించిందనే విషయం తెలుసుకుందాం.స్వీయ అవగాహన (Self-Awareness)మన చర్యలు ఇతరులపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో అర్థం చేసుకోవడమే స్వీయ అవగాహన. ఈ అవగాహన లేకనే విష్ణుప్రియ అనుమతి లేకుండా గుడ్లు తినేసింది. ఆ విషయంలో ప్రేరణతో గొడవకు దారితీసింది. యష్మి, మణికంఠల మధ్య గొడవలకు కూడా ఇదే కారణం. ఒక వ్యక్తి తన ఎమోషన్స్ ను అర్థం చేసుకుని, ఎలా స్పందించాలో తెలుసుకుంటే బిగ్ బాస్ షోలోనైనా, జీవితంలోనైనా గొడవలు తగ్గుతాయి.స్వీయ నియంత్రణ (Self-Regulation)పృథ్వి ప్రతి ఆటలోనూ ఆవేశంగా కనిపించాడు. అతని భావోద్వేగాలను నియంత్రించుకోవడంలో అతని ఫెయిల్యూర్ స్పష్టంగా కనిపిస్తోంది. ఒక్కోసారి అదుపుతప్పి బూతులు కూడా మాట్లాడుతున్నాడు. విష్ణుప్రియ ‘పతివ్రత’ అనే పదాన్ని మళ్లీ వాడేసింది. మరోవైపు మణికంఠ తరచూ ఎమోషన్స్ వాడి ప్రేక్షకులను ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నాడు. దీనివల్ల మొదట్లో కొంత సానుభూతి ఏర్పడినా, తరచూ ప్రదర్శించడం చిరాకుకు దారితీస్తుంది. ఇక అభయ్ నేరుగా ‘బిగ్‌బాస్ వరస్ట్’ అంటూ కామెంట్స్ చేయడం అతనికి ఎమోషనల్ రెగ్యులేషన్ లేదనే విషయాన్ని సూచిస్తుంది. అందుకే ఎమోషన్స్ ను నియంత్రించుకోవడం, సరైన స్థాయిలో, సరైన రీతిలో ప్రదర్శించడం అవసరం.సహానుభూతి (Empathy)నిఖిల్ తన ప్రతి నిర్ణయం కోసం సోనియాను సలహా అడగడం సహానుభూతిని సూచిస్తుంది. కానీ, దాన్ని బ్యాలెన్స్ చేయకపోవడం వల్ల సోనియాపట్ల పక్షపాతం చూపిస్తున్నాడనే అభిప్రాయం ఏర్పడుతోంది. మరోవైపు సోనియా గొడవలకు దూరంగా ఉండి సేఫ్ గేమ్ ఆడుతున్నప్పుడు, ఆమె ఎమోషనల్ బ్యాలెన్స్‌తో ఉన్నట్లు కనిపించినా, ప్రేక్షకులు ఆమెను బలహీనంగా భావించే ప్రమాదం ఉంది. ఇతరులపట్ల సహానుభూతి ఉండాలి, కానీ అది బలహీనతగా మారకూడదు.సామాజిక నైపుణ్యాలు (Social Skills)ప్రేరణ, విష్ణుప్రియల మధ్య వాగ్వాదంలో 'బ్రెయిన్లెస్', 'యూజ్లెస్' వంటి పదాలను ఉపయోగించడం సంఘర్షణలను మరింత పెంచుతుంది. మరోవైపు క్లాన్ లీడర్ కంటెస్టెంట్‌గా తనను పరిగణించనందుకు సీత బాధపడింది. కానీ ఆ విషయం నేరుగా నిఖిల్ కు చెప్పకుండా మరొకరితో చెప్పుకుని బాధపడింది. వ్యక్తి తన ఎమోషన్స్‌ను వ్యక్తీకరించాలి. కానీ వ్యక్తిగత దూషణలు లేకుండా. ఇదో ముఖ్యమైన సోషల్ స్కిల్. ఇది గొడవలు రాకుండా నిరోధిస్తుంది.ప్రేరణ (Motivation)అనేక నామినేషన్లు, విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ యష్మి తన నాయకత్వ శైలి సరైనదేనని కట్టుబడి ఉంది. ఇది తనలో మోటివేషన్ ఉందనే విషయాన్ని తెలియజేస్తుంది. కానీ తన మోటివేషన్ తో పాటు క్లాన్ ఎమోషనల్ ఫీలింగ్స్ ను పరిగణనలోకి తీసుకోకపోవడం వల్లనే అనేక నామినేషన్లు ఎదుర్కోవాల్సి వచ్చింది. పృథ్వి హై కాంపిటీటివ్ నైజం అతని తపనను చూపిస్తుంది. కానీ నియంత్రణ లేకపోవడం గ్రూప్ లో విభేదాలకు, గొడవలకు కారణమవుతుంది.ఎవరు ఎలిమినేట్ కావచ్చు? ప్రేక్షకులు సాధారణంగా భావోద్వేగ పరిపక్వత కలిగిన ఆటగాళ్లను కోరుకుంటారు. ఎక్కువ ఆవేశంగా ప్రవర్తించే పృథ్వి వంటి ఆటగాళ్లను నెగెటివ్‌గా పరిగణించే అవకాశం ఉంది. అదే విధంగా, మణికంఠ లాంటి ఆటగాళ్లు ఎమోషనల్ డ్రామాను ఉపయోగించడం వల్ల నమ్మకం కోల్పోతారు. ఇతరుల కేరక్టర్ పై తరచూ తప్పుడు కామెంట్స్ చేయడం విష్ణుప్రియకు నెగెటివ్ గా మారవచ్చు.నా పరిశీలన మేరకు నిఖిల్ లో మంచి ఐక్యూ కనిపిస్తోంది. షో చివరి వరకూ ఇలాగే ఉంటుందో లేదో పరిశీలించాలి. కోపం అందరికీ వస్తుంది. అయితే దాన్ని ఎప్పుడు, ఎక్కడ, ఎంత మోతాదులో ప్రదర్శించాలన్నది తెలుసుకున్నవారే సంతోషంగా జీవిస్తారు. అదే ఎమోషనల్ ఇంటెలిజెన్స్. జీవితంలోనైనా, బిగ్ బాస్ షోలోనైనా ఈక్యూ ఉన్నవారే విజేతగా నిలుస్తారు.సైకాలజిస్ట్ విశేష్+91 8019 000066www.psyvisesh.comబిగ్‌బాస్ ప్రత్యేక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఆయనకు స్త్రీ లాగా అలంకరించుకోవడం ఇష్టం!
మా ఆయన వయసు 27 ఏళ్లు. మా పెళ్లై ఏడాదయింది. ఒకరోజు రాత్రి నా దుస్తులు ధరించి అద్దంలో చూసుకుంటూ మురిసిపోవడం చూసి షాక్ తిన్నాను. ఏమిటిది అని అడిగితే అలా డ్రెస్ చేసుకుని ఆనందిస్తుంటానని చెప్పారు. నేనెంత గొడవ చేస్తున్నాన, ఆయన మాత్రం అప్పుడప్పుడు అలా చేస్తూనే ఉన్నాడు. రాత్రిపూట నా డ్రెస్ వేసుకుని, ఉదయం మార్చుకుని ఆఫీసుకు వెళుతున్నారు. ఇతరత్రా మేము హ్యాపీగానే ఉన్నాం కానీ ఈ అలవాటు ఇలాగే కొనసాగితే ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందోనని చాలా భయంగా ఉంది. మా వారి ఈ వింత ప్రవర్తనకు ఏదైనా పరిష్కారముందా?– సంధ్య, హన్మకొండమీ వారు ట్రాన్స్ వెస్టిజమ్ అనే ఒక అరుదైన సమస్యకు లోనయినట్లు అర్థమవుతోంది. పురుషుడు స్త్రీగాను, స్త్రీ– పురుషుడుగానూ అలంకరించుకుని లైంగికానందం పోందే ఈ వింత సమస్యకు ఒక ముఖ్య కారణం చిన్న వయసులో తల్లిదండ్రులు అమ్మాయిలు లేరని అబ్బాయిలకు గౌను, జడ వేసి పూలు పెట్టి అమ్మాయిలు లేని లోటును ఇలా తీర్చుకోవటం. మీ దాంపత్య జీవితం బాగానే ఉందన్నారు కాబట్టి కొంతవరకు నయం. మీరు ఆయనను ఎలాగైనా చికిత్సకు ఒప్పించగలిగితే సైకియాట్రిస్టుల పర్యవేక్షణలో బిహేవియర్ మాడిఫికేషన్, కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ లాంటి కొన్ని ప్రత్యేక మానసిక చికిత్సలు చేసి మీ వారిని ఆ ప్రవర్తన నుంచి బయట పడేయవచ్చు. కేవలం మందుల ద్వారా లేదా కౌన్సెలింగ్ ద్వారా ఇలాంటి వింత ప్రవర్తనను మార్చలేము. రెండూ అవసరమే.ప్రేమికుడు దూరమవుతాడేమో...నేను గత రెండు సంవత్సరాలనుండి ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను. ఇప్పటివరకు సంతోషంగానే ఉన్నాం కానీ ఈ మధ్య నాలో ఒక కొత్త భయం మొదలయింది. తను ఇంకెవరితో అయినా కొత్తగా బంధాన్ని ఏర్పరుచుకుంటాడేమో అని.. ఈ ఆలోచన నుంచి నేను బయట పడలేక΄ోతున్నాను. దీనికి కారణం ఏంటి? ఎలా ఈ ఆలోచన నుంచి బయటపడాలి?– రాణి, జనగామమీలో ఏర్పడిన ఈ భయం కేవలం మీ ఊహ కావచ్చు. అకారణంగా కొందరిలో ఇలాంటి అభద్రతా భావాలు రావడం సహజమే! ఈ అభద్రత రావడానికి మీ రిలేషన్లో ఇటీవల ఏమైనా ఆ మార్పులు వచ్చాయా? లేక మీరు ఇంకేదైనా ఒత్తిడిలో ఉండి ఇలా ఆలోచిస్తున్నారా అని స్వయం పరిశీలన చేసుకోండి. మీ ప్రేమికుడితో మీ భయాన్ని పంచుకోండి. అతణ్ణి నొప్పించకుండా, నిందించకుండా ఎలాంటి సందర్భాలలో మీకీ భావాలు కలుగుతున్నాయో చెప్పడం ద్వారా అతను కూడా మీ బాధను అర్థం చేసుకుని, మీలోని ఫీలింగ్స్‌ను తగ్గించేందుకు తప్పకుండా సహకరిస్తాడు. మీ అభద్రత భావాన్ని అధిగమించాలంటే ఇద్దరూ కలిసి సమయాన్ని గడపటం, ఇద్దరికీ ఇష్టమైన పనులు చేస్తూ ఉండాలి. దీనివల్ల మీ బంధం మరింత గట్టిపడుతుంది. మీలో ఆత్మవిశ్వాసం పెంచుకునేందుకు, ఏదైనా కొత్త హాబీ, ధ్యానం, వ్యాయామం లాంటివి చేయండి. ఇదే విషయం గురించి అతిగా ఆలోచించడం మానేసి, అతడిలో మీకు బాగా నచ్చిన విషయాలు లేదా అంశాలు ఏంటో ఒకసారి గుర్తుచేసుకోండి. దీర్ఘకాలం ΄ాటు ఉండే రిలేషన్షిప్స్లో అభద్రత కొంత సహజమే అయినప్పటికీ అది మిమ్మల్ని మరీ బాధించి, మనోవేదనకు గురి చేస్తుంటే మాత్రం ఒకసారి సైకియాట్రిస్ట్‌ను లేదా క్లినికల్ సైకాలజిస్టును మీ ఇద్దరూ కలిస్తే, మీలోని ఈ భయాన్ని, అభద్రతను తగ్గించి, మీ మధ్య సంబంధాన్ని మరింత బలపర్చేందుకు కౌన్సెలింగ్ ద్వారా తగిన సూచనలు, సలహాలు చేస్తారు. ఆల్ ద బెస్ట్!– డా. ఇండ్ల విశాల్ రెడ్డి సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ. మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com -
చిన్ననాటి గాయాలను సరిదిద్దే.. ఇన్నర్ చైల్డ్ హీలింగ్!
బాల్యం వ్యక్తిత్వానికి పునాదిలాంటిది. బాల్యంలో మన అనుభవాలు, భావోద్వేగాలు, జ్ఞాపకాలు సానుకూలంగా ఉండవచ్చు లేదా ప్రతికూలంగానూ ఉండవచ్చు. మనం పెరిగి పెద్దయ్యాక దైనందిన జీవితంలోని సంక్లిష్టతలను చాకచాక్యంగా మేనేజ్ చేస్తున్నప్పటికీ, బాల్యంలో అనుభవించిన నిర్లక్ష్యం, తగిలిన గాయాలు, అనుకున్నవి నెరవేరని బాధ నేటికీ అలాగే ఉండవచ్చు. ఆ గాయాలను నయం చేయకపోతే అవి యుక్తవయసు ప్రవర్తన, ఎమోషనల్ రియాక్ష¯Œ ్స, మానసిక సమస్యలుగా వ్యక్తమవుతాయి.ఉదాహరణకు.. బాల్యంలో నిర్లక్ష్యం, నిరాదరణ, తిరస్కరణకు లోనయినట్లయితే దాని ప్రభావం ఇప్పుడు మిమ్మల్ని మీరు ఎంత విలువైన వ్యక్తిగా చూసుకుంటున్నారు, మీ సంబంధ బాంధవ్యాలను ఎంతవరకు నమ్మతున్నారనే దానిపై ప్రభావం చూపించవచ్చు. మీకు తెలియకుండానే మీ జీవిత భాగస్వామితో, సహోద్యోగితో, ఉన్నతాధికారితో మీ సంబంధాలను ప్రభావితం చేయవచ్చు.ఇలాంటి సందర్భాల్లోనే ఇన్నర్ చైల్డ్ వర్క్ లేదా ఇన్నర్ చైల్డ్ హీలింగ్ అనే థెరపీ ఉపయోగపడుతుంది. దీని ద్వారా మీ లోలోపల దాగి ఉన్న భావోద్వేగ గాయాలను పరిష్కరించుకోవచ్చు. మీరు మరింత ఎమోషనల్ ఫ్రీడమ్‌తో ముందుకు సాగవచ్చు. కొంచెం సంక్లిష్టమైన ఈ ప్రక్రియను మొదట సైకాలజిస్ట్ పర్యవేక్షణలో నేర్చుకోవడం మంచిది.ఇన్నర్ చైల్డ్‌ను గుర్తించడంమీ లోపల బాల్యం అలాగే ఉందని, అది అప్పుడప్పుడూ మాట్లాడుతూంటుందని, దాని మాటలు వినాలని గుర్తించడం మొదటి అడుగు. ఈ దశలో మీ బాల్యంలోని అనుభవాలను, భావోద్వేగాలను, అవసరాలను గుర్తించాలి.ఇన్నర్ చైల్డ్‌తో కనెక్ట్ అవ్వడంవిజువలైజేషన్ ఎక్సర్సైజ్లు, డైరీ రాయం, డైలాగ్ టెక్నిక్స్ ద్వారా మీ ఇన్నర్చైల్డ్తో కనెక్ట్ అవ్వచ్చు. ఉదాహరణకు.. మీరు కళ్ళు మూసుకుని, చిన్నతనంలో మిమ్మల్ని మీరు ఊహించుకోవచ్చు, నిర్దిష్ట జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకోవచ్చు. లేదా మీ బాల్యం ఎలా ఉందో, ఎలా ఫీలయ్యేవారో ఊహించుకోవచ్చు. మీరెంత కరుణతో అర్థంచేసుకున్నారో మీ ఇన్నర్ చైల్డ్‌కు ఒక లేఖ రాయవచ్చు.ఇన్నర్ చైల్డ్ హీలింగ్ ఇలా...ఇన్నర్ చైల్డ్ చెప్పేది వినడం మీరు మీ ఇన్నర్ చైల్డ్‌తో కనెక్ట్ అయిన తర్వాత, తన భావాలు, భయాలు, అవగాహనను వినాలి. మీ ఇన్నర్ చైల్డ్‌ను ఎన్నో ఏళ్లుగా మీరు పట్టించుకుని ఉండరు. అందువల్ల తను మాట్లాడటానికి సిద్ధంగా ఉండకపోవచ్చు. అందువల్ల తనను జడ్జ్ చేస్తారనే భయం లేకుండా తన భావోద్వేగాలను స్వేచ్ఛగా వ్యక్తీకరించగలిగే అంతర్గత వాతావరణాన్ని కల్పించాలి. ఇందుకు చాలా ఓపిక, సహానుభూతి అవసరం.హీలింగ్ అండ్ రీపేరెంటింగ్ మీ చిన్నతనంలో లోపించిన ప్రేమ, సంరక్షణ, మద్దతు మీ యవ్వనానికి అందించడం ఇన్నర్ చైల్డ్ హీలింగ్ లక్ష్యం. ‘రీపేరెంటింగ్’ అనే ఈ ప్రక్రియ.. మీరు మీ ఇన్నర్ చైల్డ్‌కు నచ్చిన వ్యక్తిగా మారడానికి అనుమతిస్తుంది. ‘నువ్వు సురక్షితంగా ఉన్నావు’, ‘నీకు నచ్చినట్టుగా నువ్వు ఫీలవ్వచ్చు’, ‘నిన్ను అందరూ ప్రేమిస్తున్నారు’ అని మీ ఇన్నర్ చైల్డ్‌కు భరోసా ఇవ్వడం ద్వారా మీ బాల్యంలో అందుకోలేకపోయిన ధైర్యాన్ని, ప్రేమను, ప్రోత్సాహాన్ని అందించాలి.ఇన్నర్ చైల్డ్ని ఇంటిగ్రేట్ చేయడం..మీ ఇన్నర్ చైల్డ్‌ను అడల్ట్ సెల్ఫ్‌తో ఇంటిగ్రేట్ చేయడం చివరిదశ. అంటే మీ ఇన్నర్ చైల్డ్ మీలో ఒక భాగమని అంగీకరించడం. మీ బాల్యంలోని అనుభవాలు, భావోద్వేగాలు మీ ఇప్పటి ఐడెంటిటీని ప్రభావితం చేస్తున్నాయని, మీరిద్దరూ ఒకటేనని గుర్తించడం. ఇది సెల్ఫ్ కంపాషన్ను, ఎమోషనల్ బ్యాలెన్స్‌ను పెంచుతుంది. – సైకాలజిస్ట్ విశేష్ -
మా బాబు.. ఒకచోట కుదురుగా ఉండటం లేదు..!?
మా బాబు వసు 5 సంవత్సరాలు. ఒకచోట నిలకడగా ఉండMýంండా, ఎప్పుడూ అటూ ఇటూ తిరుగుతూ ఉంటాడు. ఇంట్లో, స్కూల్లో బయటా కూడా ఇలాగే చస్తుంటాడు. బయట ఫంక్షన్లకు తీసుకెళితే తనను పట్టుకోవడం, తన చుట్టూ తిరగడంతోటే సరిపోతుంది. అందువల్ల ఈ మధ్య బయటకు వెళ్లడం కూడా తగ్గించేశాం. వాళ్ల నానమ్మేమో, ఇది పిల్లల్లో మామూలే అంటుంది. ఈ మధ్య వాళ్ల స్కూల్ టీచర్ మమ్మల్ని పిలిచి, మా బాబు మీద అనేక కంప్లయింట్లు చెప్పింది. మాకు చాలా ఆందోళనగా ఉంది. – కె. మాధవి, సికింద్రాబాద్పిల్లల మెదడులో ఉండే సెల్ఫ్ కంట్రోల్ విభాగం లోని లోపాల వల్ల, వారసత్వ లక్షణాల రీత్యా, కొందరు పిల్లలకు మీరు చెప్పిన లక్షణాలు రావచ్చు. దీనిని హైపర్ యాక్టివిటీ లేదా ఏడీహెచ్‌డీ అంటారు. నిలకడ లేకపోవడం, చదువు మీద ఏకాగ్రత లేకపోవడం, వస్తువులు విసిరేయడం, సహనం లేకపోవడం, ఎప్పుడూ అటూ ఇటూ తిరుగుతూ ఉండటం, స్కూల్లో వస్తువులు మరచిపోవడం, ఈ సమస్య ముఖ్య లక్షణాలు. వీరికి తెలివితేటలు బాగానే ఉన్నప్పటికీ, ఏకాగ్రత లోపించడం వల్ల చదువులో వెనకబడతారు.ఇలాంటి వారిని ఎంత చిన్నవయసులో గుర్తించి, సరిౖయెన చికిత్స చేయిస్తే అంత తొందరగా దీంట్లోంచి బయట పడతారు. ఆక్యుపేషనల్ థెరపీ, బిహేవియర్ థెరపీ, అవసరమైతే కొద్ది మోతాదులో కొన్ని మందులు వాడటం ద్వారా వీరిని పూర్తిగా బాగు చెయ్యచ్చు. పేరెంట్స్, టీచర్లు ఇలాంటి వారిని త్వరగా గుర్తించగలిగితే తొందరగా బాగుపడతారు. మైకేల్ ఫిలిప్స్ అనే స్విమ్మర్ ఈ సమస్యతో బాధపడుతూ చికిత్స తీసుకుని బాగుపడి, ఒలింపిక్స్‌లో 20కి పైగా స్వర్ణ పతకాలు సాధించాడు. చైల్డ్ సైకియాట్రిస్ట్‌ల సూచనలు తీసుకోవడం, పాటించడం మేలు చేస్తుంది.– డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్, సైకియాట్రిస్ట్, విజయవాడ -
Health: ఒత్తిడి, ఆందోళనను తగ్గించే.. 5–4–3–2–1 టెక్నిక్!
అరుణ్ ఒక ఐటీ ప్రొఫెషనల్. 28 ఏళ్లుంటాయి అతనికి. ఈ మధ్య కాలంలో విపరీతంగా ఆందోళన పడుతున్నాడు. దాంతో పని మీద దృష్టి నిలపడం కష్టంగా మారింది అతనికి. కంప్యూటర్ ముందు కూర్చుంటే ఏవేవో ఆలోచనలు చికాకు పెడుతున్నాయి. ఆపాలని ప్రయత్నించినా ఆగడంలేదు. దానివల్ల గుండె వేగంగా కొట్టుకుంటోంది. ఊపిరి ఆడటం లేదు. చేతులు చెమటలు పడుతున్నాయి. ఒళ్లంతా బిగుసుకుపోయినట్లు అనిపిస్తోంది. ఈ సంకేతాలన్నీ తనకు ఏదైనా ఐపోతుందేమోనన్న భయాన్ని, ఆందోళనను మరింత పెంచుతున్నాయి. ఈ పరిస్థితి పని మీదా ప్రభావం చూపి మేనేజర్ నుంచి వార్నింగ్స్ అందుకునేలా చేస్తోంది. నలుగురితో కలవలేకపోతున్నాడు. ఫ్రెండ్స్‌కు, పార్టీలకు దూరమయ్యాడు. నిద్ర పట్టడం లేదు. పట్టినా తరచూ మెలకువ వస్తోంది.అరుణ్ ఆందోళనకు గల కారణాలను లోతుగా పరిశీలించినప్పుడు.. అతనికి ఇటీవల ప్రమోషన్ వచ్చింది. దాంతో పని, బాధ్యతలు పెరిగాయి. అన్నిటిలో పర్ఫెక్ట్గా ఉండాలని, అన్ని పనులూ పర్ఫెక్ట్గా చేయాలనే అతని తీరు ఒత్తిడిని పెంచింది. ఫలితంగా అతని జీవితంలోకి ఆందోళన ప్రవేశించి అతలాకుతలం చేస్తోంది. అరుణ్ యాంగ్జయిటీ డిజార్డర్‌తో బాధపడుతున్నాడని పరీక్షల ద్వారా నిర్ధారణ అయింది. కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ మొదలైంది. తాత్కాలిక ఉపశమనం కోసం 5–4–3–2–1 టెక్నిక్‌నీ ఫాలో అయ్యాడు. దాంతో అతను కొంత ఊరట పొందాడు. థెరపీ ద్వారా కొన్ని సెషన్లలోనే తన ఆందోళనను అధిగమించి హాయిగా పనిచేసుకోగలుగుతున్నాడు.5–4–3–2–1 గ్రౌండింగ్ టెక్నిక్..ఒత్తిడి, ఆందోళనను మేనేజ్ చేసేందుకు 5–4–3–2–1 గ్రౌండింగ్ ఒక పవర్ఫుల్ టెక్నిక్. మీరు ఎక్కడ ఉన్నా, ఏం చేస్తున్నా దీన్ని ప్రాక్టీస్ చేయవచ్చు. మీ పంచేంద్రియాలను నిమగ్నం చేయడం ద్వారా, ప్రస్తుత క్షణంపై దృష్టి పెట్టి.. మీకు బాధ కలిగించే ఆలోచనల నుంచి మీ దృష్టిని మళ్లించుకోవచ్చు. మీ ఆలోచనలపై కంట్రోల్, ఎమోషనల్ బ్యాలె¯Œ ్సను సాధించి ప్రశాంతతను పొందవచ్చు.మీరు చూడగలిగే 5 విషయాలను గుర్తించండి..మీ చుట్టూ ఒకసారి పరికించి ఐదు విభిన్న విషయాలను గమనించండి. అవి వస్తువులు, రంగులు, ఆకారాలు లాంటివి ఏవైనా కావచ్చు. వాటిని గమనించడానికి కొంత సమయం కేటాయించండి. ఇది మిమ్మల్ని బాధపెట్టే ఆలోచనల నుంచి మీ దృష్టిని బాహ్యప్రపంచంవైపు మళ్లించడానికి సహాయపడుతుంది.మీరు తాకగల 4 విషయాలను గుర్తించండి..మీ దుస్తులు, కుర్చీ, కంప్యూటర్ మౌస్ లాంటి మీరు తాకగల నాలుగు వస్తువులను గుర్తించండి. వాటిని తాకడం ద్వారా మీరు పొందుతున్న అనుభూతులపై దృష్టి పెట్టండి. ఇది మిమ్మల్ని మీ తక్షణ శారీరక అనుభూతులతో మళ్లీ కనెక్ట్ అవ్వడంలో సహాయపడుతుంది.మీరు వినగలిగే 3 విషయాలను గుర్తించండి..మీ చుట్టూ ఉన్న శబ్దాలను జాగ్రత్తగా వినండి. మీ కంప్యూటర్ శబ్దం, ట్రాఫిక్ ధ్వని, మీ శ్వాస శబ్దం లాంటివి ఏవైనా కావచ్చు. వాటిపై శ్రద్ధ చూపడం వల్ల మీ దృష్టిని అంతర్గత ఒత్తిళ్ల నుంచి∙దూరం చేసుకోవచ్చు.మీరు వాసన చూడగల 2 విషయాలను గుర్తించండి..మీ చుట్టూ ఉన్న వాతావరణంలో రెండు భిన్నమైన వాసనలను గుర్తించడంపై దృష్టి పెట్టండి. ఏవీ లేకుంటే అగర్బత్తి, కర్పూరం, డియోడరెంట్, పెర్ఫ్యూమ్ లాంటివి ఉపయోగించండి. ఆ పరిమళాలు మీ చుట్టూ ఉన్న వాతావరణంతో మీరు కనెక్ట్ అవ్వడానికి దోహదపడతాయి.మీరు రుచి చూడగలిగే ఒక విషయాన్ని గుర్తించండి..చివరగా, ఒక రుచిపై దృష్టి పెట్టండి. అది అంతకు ముందు మీరు తాగిన పానీయం లేదా తిన్న చాక్లెట్ లాంటిది ఏదైనా కావచ్చు. లేదంటే మీ నోటిలో ప్రస్తుతం ఎలాంటి రుచి ఉందో గమనించండి. ఇది మీ దృష్టిని రుచి ద్వారా ప్రస్తుత క్షణానికి తీసుకువస్తుంది.. ఇంద్రియ అనుభవాన్ని పూర్తి చేస్తుంది. -
పిల్లలు.. గర్భంలో ఉన్నప్పుడే తల్లి గొంతును గుర్తిస్తారు! అయితే ఈ సామర్థ్యం..
పద్మవ్యూహాన్ని ఎలా ఛేదించాలనే విషయాన్ని అర్జునుడు తన భార్య సుభద్రకు చెప్తుండగా గర్భంలో ఉన్న అభిమన్యుడు విని నేర్చుకున్నాడని మహాభారతంలో చదువుకున్నాం. అది నిజమేనని నమ్మేవాళ్లే ఎక్కువ. ఆ నమ్మకాన్ని వ్యాపారం చేసుకుంటూ, గర్భంలోని బిడ్డలకు కూడా పాఠాలు నేర్పిస్తున్నవారూ ఉన్నారు. అయితే అదంతా నిజమేనా? అనే సందేహం ఉంది. అందుకే తల్లిదండ్రులను, శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యపరచే శిశు సామర్థ్యాల గురించి తెలుసుకుందాం. పిల్లలను మరింత బాగా అర్థం చేసుకుని పెంచేందుకు ఇవి తల్లిదండ్రులకు ఉపయోగపడతాయి.శిశువులకు అసాధారణ వినికిడి సామర్థ్యాలు ఉన్న మాట నిజం. పెద్దలు నిమిషానికి 14 వేల వైబ్రేషన్స్‌ని స్వీకరిస్తే, పిల్లలు 20 వేల వైబ్రేషన్స్‌ని స్వీకరిస్తారు. గర్భం దాల్చిన 24వ వారం నుంచి పిండాలు బాహ్య వాతావరణం నుంచి శబ్దాలను గుర్తించగలవని అధ్యయనాలు చెబుతున్నాయి. గర్భంలో ఉన్నప్పుడే తల్లి గొంతును గుర్తిస్తారు. అయితే ఈ సామర్థ్యం స్వరాన్ని గుర్తించడానికి మాత్రమే పరిమితం. పద్మవ్యూహాన్ని అర్థం చేసుకునేటంత తెలివితేటలు ఉండవు. ఇక పుట్టిన వారం రోజుల నుంచే తల్లి గొంతును, ఇతరుల గొంతు నుంచి వేరు చేస్తారని డికాస్పర్, ఫీఫెర్(1980) చేసిన పరిశోధనలో వెల్లడైంది.శిశువులు అమ్మభాషకు, వేరే భాషలకు మధ్య తేడాను గుర్తించగలరంటే మీరు నమ్మగలరా? కానీ పెదవి కదలికలు, ముఖ కవళికలను గమనించడం ద్వారా ఆ తేడాను గుర్తించగలరని వీకమ్ ఎటేల్ (2007) అధ్యయనంలో వెల్లడైంది. దీన్నిబట్టి పిల్లల చూపు ఎంత చురుగ్గా ఉంటుందో అర్థమైంది కదా!శిశువుల పరిశీలనా సామర్థ్యం కేవలం భాషాభివృద్ధికే పరిమితం కాదు. 18 నెలల వయసు గల పిల్లలు.. ఇతరులు మాట్లాడటానికంటే ముందే ముఖకవళికలు, బాడీ లాంగ్వేజ్‌ను గమనించి వారి ఉద్దేశాలను, భావోద్వేగాలను అర్థం చేసుకోగలరని మెల్ట్జాఫ్ (1995) కనుగొన్నారు.పిల్లలు.. వాళ్లేం నేర్చుకుంటారని కొట్టిపడేయకండి. కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడానికి శిశువుల మెదళ్లు తయారుగా ఉంటాయని కుహ్ల్ (2004) నొక్కి చెప్పారు. భాషను నేర్చుకునే సామర్థ్యం.. బాల్యంలోనే గరిష్ఠ స్థాయికి చేరుకుంటుంది. ఐదేళ్ల లోపు ఐదు భాషలు ఏకకాలంలో నేర్చుకోగలరు.అమ్మ పోలికా? నాన్న పోలికా? ఇకపై గొడవ పడకండి. నవజాత శిశువులు ఎక్కువగా తండ్రులను పోలి ఉంటారని సూచించే ఆధారాలు ఉన్నాయి. జన్యు పరీక్షలనేవి రాకముందే తండ్రెవరో గుర్తించడానికి ప్రకృతి పరంగా ఈ సారూప్యత ఏర్పడి ఉండవచ్చని బ్రెస్సన్, గ్రాస్సీ (2004) పేర్కొన్నారు.పుట్టుకతోనే పిల్లలకు సంఖ్యల పట్ల సహజమైన ఇన్ట్యూషన్ ఉంటుంది. అంతేకాదు వివిధ పరిణామాల మధ్య తేడాను గుర్తించగలరు. కూడిక, తీసివేతల మధ్య ప్రాథమిక అవగాహన కలిగి ఉంటారని గిynn (1992) అధ్యయనంలో వెల్లడైంది.శిశువులు మనిషి ముఖాలనే కాదు, జంతువుల ముఖాల మధ్య తేడానూ గుర్తించగలరు. అయితే వయసుతో పాటు మనుషులతో ఎక్కువ సమయం గడపడం వల్ల, మనుషుల ముఖాలను గుర్తించే సామర్థ్యం పెరుగుతుంది. జంతువుల ముఖాల మధ్య తేడాను గుర్తించే సామర్థ్యం తగ్గిపోతుందని పాస్కాలిస్తోపాటు ఇతరులూ (2002) కనుగొన్నారు.నవజాత శిశువులు తల్లి పాలనే కాదు, తల్లి వాసనకూ ప్రాధాన్యాన్నిస్తారు. తల్లి వాసన తగిలినవెంటనే శిశువులు ప్రశాంతంగా ఉంటారని మాక్ఫర్లేన్ (1975) కనుగొన్నారు. ఇది తల్లితో బంధం బలపడటంలో, ఆహారాన్ని అందించడంలో సహాయపడుతుంది.మనిషి మనుగడ సాగించాలంటే కమ్యూనికేషన్ అవసరం. అది పిల్లలు పుట్టుకతోనే నేర్చుకుంటారు. శిశువులు ముఖకవళికలను అనుకరించగలరని, ముఖ సంజ్ఞలను పునరావృతం చేయగలరని మెల్ట్జాఫ్, మూర్ (1977) గమనించారు. కమ్యూనికేషన్ స్కిల్స్‌కు మూలం బాల్యంలోనే ఉంది.శిశువులు తమ అనుభవాలను జ్ఞాపకాలుగా గుర్తుంచుకుంటారు. ఈ జ్ఞాపకాలు జీవితంలో తర్వాత స్పష్టంగా గుర్తుకు రాకపోవచ్చు, కానీ అవి ప్రవర్తనను, ప్రాధాన్యాలను ప్రభావితం చేస్తాయి. అందుకే శిశువులకు అందమైన అనుభవాలను అందించడం తల్లిదండ్రుల బాధ్యత.– సైకాలజిస్ట్ విశేష్ -
అందంగా లేననే అనుమానం..!?
అంజలి సింగ్.. ఢిల్లీకి చెందిన విద్యార్థి. 21 ఏళ్లు. ఫ్యాషన్ డిజైనింగ్‌లో డిగ్రీ చదువుతోంది. ఆమె తల్లి తెలుగు, తండ్రి పంజాబీ. ఆమెకు తన బాడీ ఇమేజ్ గురించి అసంతృప్తి. అదెంతవరకు వెళ్లిందంటే.. 24 గంటలూ దాని గురించే ఆలోచించేంతగా. తను అట్రాక్టివ్‌గా లేననే మాట మనసులో తిరుగుతూనే ఉంటుంది. దాంతో ఒకటికి పదిసార్లు అద్దంలో చూసుకోవడం, కనిపించిన లోపాలను సరిచేసుకోవడానికి గంటలు గంటలు వెచ్చించడం ఆమెకు అలవాటుగా మారిపోయింది.సోషల్ మీడియా ప్రభావం..తన డిజైనర్ పనికోసం ప్రేరణ పొందేందుకు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ను స్క్రోల్ చేయడం ఆమె ఆందోళనకు మూలంగా మారింది. పూర్తిగా మేకప్ వేసుకున్న, భారీగా ఎడిట్ చేసిన మోడల్స్, ఇన్ఫ్లుయెన్సర్ల పిక్స్ చూసి, వాళ్లతో పోల్చుకుంటుంది. తను వాళ్లలా స్లిమ్‌గా లేనని, అందుకే తాను ఆకర్షణీయంగా లేనని బాధపడుతుంది.కేలరీల కొలత..స్లిమ్ అవ్వడం కోసం కేలరీలను నిశితంగా ట్రాక్ చేస్తుంది. ఏది తిన్నా, తాగినా కేలరీలు లెక్కేసుకుంటుంది. త్వరగా బరువు తగ్గుతారని ట్రెండ్ అయిన కీటో డైట్ కూడా పాటించింది. యాంగ్జయిటీ ఎక్కువైనప్పుడు విపరీతంగా తినేసి, ఆ వెంటనే గిల్టీగా ఫీలై కొన్ని రోజులపాటు భోజనం పూర్తిగా మానేస్తోంది. ఇవన్నీ కలసి తనకు మరిన్ని ఆరోగ్య సమస్యలను తెచ్చిపెట్టాయి.సామాజిక ఒత్తిడి..అంజలి నాన్న తరఫు బంధువులందరూ తెల్లగా, ఫిట్‌గా ఉంటారు. దాంతో వాళ్లు అంజలిని కలసినప్పుడల్లా ‘కొంచెం స్లిమ్‌గా, కాస్త ఛాయ మెరుగ్గా ఉంటే అందంగా ఉండేదానివి’ అని కామెంట్ చేస్తుంటారట. వాస్తవానికి అంజలి అందంగానే ఉంటుంది. కానీ బంధువుల మాటలు, సోషల్ మీడియాలో కనిపించే జీరోసైజ్ మోడల్స్, ఇన్‌ఫ్లూయెన్సర్లతో పోల్చుకోవడం ఆమె అభద్రతాభావానికి కారణమయ్యాయి. వాటికి తోడు ఫ్రెండ్స్ కూడా బరువు తగ్గడం గురించి, డైటింగ్ గురించి తరచూ మాట్లాడటం తన ఆందోళనను మరింత తీవ్రం చేసింది. తాను అట్రాక్టివ్‌గా లేననే ఆలోచనతో పార్టీలకు, ఫంక్షన్లకు వెళ్లడం మానేసింది. ఎలాగైనా స్లిమ్‌గా, ఫిట్‌గా కావాలనే కోరిక తనపై ఒత్తిడిని పెంచుతోంది. అన్నీ కలసి ఫ్యాషన్ డిజైనింగ్‌లో ఉన్నతస్థాయికి చేరాలనే కోరికను అడ్డుకుంటున్నాయి.థెరపీతో పరిష్కారం..అంజలిలాగే చాలామంది యువతులు జీరోసైజ్ కోసం కష్టపడుతుంటే, యువకులు సిక్స్ ప్యాక్ బాడీ కోసం జిమ్‌లలో చెమటోడుస్తున్నారు. ఇలాంటివారు ముందుగా చేయాల్సింది అమితాభ్బచ్చన్, రజనీకాంత్లకు సిక్స్ ప్యాక్‌లు లేవని.. అందరూ ఐశ్వర్యారాయ్‌లా ఉండలేరని గుర్తించాలి. కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ, న్యూరో లింగ్విస్టిక్ సైకోథెరపీ ద్వారా బాడీ ఇమేజ్ పట్ల అంజలి.. తనకున్న నెగెటివ్ భావనలను, వాటికి మూలకారణాలను అర్థం చేసుకుంది. ఐదు సెషన్లలోనే తన సమస్యను అధిగమించింది.పాజిటివ్ బాడీ ఇమేజ్ కోసం..మీ బాడీ ఇమేజ్ పట్ల మీకున్న ప్రతికూల, విమర్శనాత్మక ఆలోచనలను గుర్తించండి. అవి వాస్తవికతపై ఆధారపడి ఉన్నాయా లేక సోషల్ స్టాండర్డ్స్ ద్వారా వక్రీకరించబడ్డాయా? అనేది గమనించండి.– మీ ప్రతికూల ఆలోచనలను గుర్తించాక, ‘నా ఫ్రెండ్‌తో నేనిలాగే మాట్లాడతానా? ఇలాగే విమర్శిస్తానా?’ అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి.– అవాస్తవికమైన బాడీ ఇమేజ్ ప్రమాణాలను ప్రోత్సహించే సోషల్ మీడియా అకౌంట్స్‌కు దూరంగా ఉండండి.– ఆకారం కంటే ఆరోగ్యం ముఖ్యమని గ్రహించండి. డా¯Œ ్స, యోగా లేదా ఈత వంటి వాటిని రోజూ ప్రాక్టీస్ చేయండి.– అద్దం ముందు నిలబడి మీ సానుకూల లక్షణాలపై దృష్టి పెట్టండి. ‘ఎవరి అందం వారిదే’, ‘నేను ప్రత్యేకం’, ‘నేను అందంగా, ఆకర్షణీయంగా ఉన్నాను’ అని చెప్పుకోండి.– బాడీ ఇమేజ్‌తో కాకుండా టాలెంట్‌తో స్ఫూర్తి పంచే కళాకారులు, డిజైనర్లు, క్రియేటర్లను అనుసరించండి. మీరు ఎలా ఉన్నారనేది కాకుండా, మిమ్మల్ని మీరుగా అంగీకరించే స్నేహితులతో కనెక్ట్ అవ్వండి.– ఈ సెల్ఫ్–హెల్ప్ టిప్స్ సరిపోవనిపిస్తే ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోండి. – డా. సైకాలజిస్ట్ విశేష్ -
ఈ తరానికి అవసరమైన సప్తపది..
‘పెళ్లంటే నూరేళ్ల పంట, అది పండాలి కోరుకున్న వారి ఇంట పండాలి’... అనే పాట ఒకప్పుడు చాలా పాపులర్. ఈతరం ఒక్కసారి కూడా విని ఉండదు. ఈ పాటలాగే పెళ్లి కూడా పాతబడిపోతోంది. ఈ మాట అంటే చాలామందికి కోపం రావచ్చు. కానీ పెళ్లి స్వరూపం మారిపోతోందనే విషయాన్ని గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పెళ్లి స్థానంలో లివ్ ఇన్ రిలేషన్షిప్ వచ్చేస్తోంది. పెళ్లికి ముందే ఒకే ఇంట్లో కలిసి ఉండే జంటల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.ఇది ఎక్కడకు వెళ్తుందో ఎవ్వరికీ తెలియదు. అయితే పెళ్లయినా, లివ్ ఇన్ అయినా మరెలాంటి బంధమైనా నిలబడాలంటే ఏడు సూత్రాలు పాటించాలని ‘ఫ్యామిలీ జర్నల్’ జరిపిన సైకాలజికల్ రీసెర్చ్‌లో వెల్లడైంది. ఈ ఏడు సూత్రాలు పాటించడం ద్వారా జీవిత భాగస్వాముల మధ్య ప్రేమ, సామరస్యం వెల్లివిరుస్తుందని ఆ అధ్యయనం చెబుతోంది. అవేమిటో ఈరోజు తెలుసుకుందాం.లోపాలను బలాలుగా మార్చుకోగల సామర్థ్యం..పెళ్లంటే చాలా సవాళ్లు ఉంటాయి. భార్యాభర్తల్లో లోపాలుంటాయి, దిగులుపడే సందర్భాలు ఉంటాయి. ఆ సవాళ్లను ఎలా పరిష్కరించుకుంటారు, వారి లోపాలను ఎలా మార్చుకుంటారనేదే వారి బంధంలోని బలాన్ని నిర్ణయిస్తుం దని ఈ అధ్యయనంలో వెల్లడైంది. కష్టసమయాల్లో ఒకరికొకరు ఓదార్పు, మద్దతు, ప్రోత్సాహం అందిస్తూ కలిసి సమస్యలు ఎదుర్కోవడమే తొలిమెట్టు.కలిసి పంచుకోవడం కీలకం..‘నా స్పేస్ నాకు కావాలి’ అంటూ గొడవపడే జంటలు మన చుట్టూ కనిపిస్తూ ఉంటారు. పెళ్లంటేనే కలిసి జీవితాన్ని పంచుకోవడం. ఇద్దరూ కలిసి ఆనందించే చర్యల ద్వారా తమదైన ప్రపంచాన్ని సృష్టించుకోవడం అవసరమని ఈ అధ్యయనం హైలైట్ చేస్తుంది. ఇలా చేయడం జంట మధ్య భావోద్వేగ సాన్నిహిత్యాన్ని పెంచుతుంది. అందువల్ల తరచుగా కలిసి నడవడం, వంటచేయడం, పరస్పర హాబీలను ప్రోత్సహించుకోవడం లాంటి పనులు చేయాలి.విభేదాలు, మార్పును సహించడం..పెళ్లంటే భిన్న వ్యక్తిత్వాలున్న ఇద్దరు కలిసి ఒకటిగా జీవించడం. అంటే వారిద్దరి మధ్య విభేదాలు సహజం. వాటిని అంగీకరించడం, సహించడం అవసరం. అలాగే బంధంలో, భాగస్వామిలో వచ్చే మార్పును ముప్పుగా భావించకుండా, దాన్ని పరిణామానికి ఒక అవకాశంగా చూడాలి. విభేదాలతో విడిపోకుండా, అవి ఒకరి గురించి మరొకరు మరింత తెలుసుకోవడానికి అమూల్యమైన అవకాశాలుగా వినియోగించుకోవాలి.రాజీతోనే విభేదాలు పరిష్కారం..వైవాహిక జీవితంలో విభేదాలు సహజం. తప్పెవరిదైనా విభేదాలను పరిష్కరించు కోవడానికి రాజీ పడటం అవసరం. అలా రాజీపడి విభేదాలను పరిష్కరించుకోగల జంటలు ఎక్కువ సంతృప్తికరమైన జీవితాన్ని అనుభవిస్తారని అధ్యయనం చెబుతోంది. అందువల్ల లోపాల గురించి విమర్శించుకునే బదులు బలాలు, సానుకూల లక్షణాలను ప్రశంసించడంపై దృష్టి పెట్టండి. ఒకరిపట్ల మరొకరికి అవగాహన, కృతజ్ఞత కలిగి ఉండటం సామరస్య వాతావరణాన్ని ఏర్పరుస్తుంది.అప్పుడప్పుడైనా మెచ్చుకోవాలి..భార్య వంట చేస్తే లొట్టలేసుకుంటూ తినడం, భర్త బంగారం కొనిస్తే తీసుకోవడమే కాదు.. వారికెప్పుడైనా థ్యాంక్స్ చెప్పారా? చిన్న చిన్న విషయాలకు కూడా థాంక్స్ చెప్పడం అవసరమని అధ్యయనం నొక్కి చెబుతుంది. అలా చేయడం జంట మధ్య ప్రేమ, అనుబంధాన్ని పెంపొందిస్తుంది. అందుకే మీ పార్ట్నర్ సహకారాన్ని, లవ్ సిగ్నల్స్‌ను గుర్తించి అభినందించేందుకు ప్రయత్నించండి.బంధంలో నిబద్ధత..భారతదేశంలో పెళ్లంటేనే జీవితకాల బంధం. అది విజయవంతం కావాలంటే నిబద్ధత కీలకం. జీవితంలో వచ్చే చెడు కాలాలను దాటి బంధం నిలబడాలంటే జంటలో అంకితభావం, పట్టుదల అవసరం. అన్నింటికంటే వైవాహిక బంధమే ముఖ్యమైనదని గుర్తించి, దాన్ని కాపాడుకోవడానికి సమయం వెచ్చించాలి. అలా కాల పరీక్షను తట్టుకుని నిలబడే ప్రేమ, విశ్వాసాలకు పునాదిని నిర్మించుకోవచ్చు.తనను తాను గౌరవించుకోవాలి..ఆరోగ్యకరమైన సంబంధాలకు ఆత్మగౌరవం ఆధారం. అది మీరు మీ భాగస్వామితో వ్యవహరించే విధానాన్ని ప్రభావితం చేస్తుంది. బలమైన ఆత్మగౌరవం ఉన్నవారు సంతృప్తికరమైన సంబంధాలను కొనసాగించడానికి మెరుగ్గా సన్నద్ధమవుతారని అధ్యయనం సూచిస్తోంది. ఆత్మగౌరవం లేనివారు చిన్నచిన్న విషయాలకు కూడా నొచ్చుకుని గొడవపడుతుంటారు. అందుకే ముందుగా మిమ్మల్ని మీరు గౌరవించుకోండి, ప్రేమించుకోండి. అది మీ వైవాహిక బంధానికి పునాదిగా నిలుస్తుంది.ఇవి చదవండి: Father's Day 2024: హాయ్..! నాన్న..!! -
బుల్లీయింగ్‌ను నిర్లక్ష్యం చేయొద్దు..
రేచల్ చురుకైన విద్యార్థిని. ఆటల్లో, పాటల్లో, చదువులో, సాంస్కృతిక కార్యక్రమాల్లో ముందుంటుంది. స్కూల్లో ఏ ఫంక్షన్ ఉన్నా తనే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. అయితే గత ఏడాదిగా తన ప్రవర్తన ఒక్కసారిగా మారిపోయింది. 15ఏళ్ల టీనేజర్లో ఉండే చురుకుదనం కనిపించడంలేదు. టీచర్లు గుర్తించి అడిగారు, ఏమీ చెప్పలేదు. దాంతో పేరెంట్స్‌ను పిలిపించి చెప్పారు. వాళ్లు అడిగినా ఏమీ చెప్పలేదు. మరోవైపు టెస్టుల్లో మార్కులు తగ్గుతున్నాయి. ఏం చేయాలో అర్థంకాక కౌన్సెలింగ్‌కు తీసుకువచ్చారు.రేచల్ ఆందోళగా కనిపించింది. ఐ కాంటాక్ట్ ఇవ్వడంలేదు. వినిపించీ వినిపించకుండా మాట్లాడుతోంది. నెమ్మదిగా తనను మాటల్లో పెట్టాను. ఫాదర్‌కు ట్రాన్స్ఫర్ కావడంతో రెండేళ్ల కిందటే ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వచ్చామని చెప్పింది. సిటీకి రావడం మొదట్లో తనకు ఉత్సాహంగా ఉన్నా పాత స్నేహితులకు, సుపరిచితమైన వాతావరణానికి దూరంకావడం తనకు బాధగా ఉందని, తరచుగా కడుపునొప్పి కూడా వస్తోందని చెప్పింది. అది యాంగ్జయిటీ వల్ల వచ్చే సొమాటిక్ సింప్టమ్ అని అర్థమైంది. సైకోడయాగ్నసిస్ ద్వారా ఆమె తీవ్ర ఆందోళన, డిప్రెషన్‌తో బాధపడుతోందని నిర్ధారణైంది.కొత్త స్కూల్లో ఒక బ్యాచ్ తన మాటలు, ఉచ్చారణ, డ్రెస్సుల గురించి ఎగతాళి చేస్తోందని ఆ తరువాతి సెషన్లో చెప్పింది. ఆమె గురించి పుకార్లు వ్యాప్తి చేస్తున్నారని, తన సోషల్ మీడియా పోస్టులను అపహాస్యం చేస్తున్నారని చెప్పింది. ఇటీవల నేరుగానే బెదిరిస్తున్నారని, ఏం చేయాలో అర్థం కావడంలేదని కంటనీరు పెట్టుకుంది. రేచెల్లానే దాదాపు 20 శాతం మంది విద్యార్థులు, విద్యార్థినులు బుల్లీయింగ్ బాధితులవుతున్నారు. అది వారిని మానసికంగా, విద్యాపరంగా చాలా దెబ్బతీస్తుంది. కొన్ని సెషన్ల థెరపీ అనంతరం రేచల్ బుల్లీయింగ్ నుంచి బయటపడి, తిరిగి తన సంతోషాన్ని వెనక్కు తెచ్చుకోగలిగింది.ఎలా ఎదుర్కోవాలి?బుల్లీయింగ్ ఎదురైనప్పుడు పిల్లలు కొన్ని చిట్కాలు పాటించాలి. పేరెంట్స్ అండగా నిలవాలి. అవసరమైతే సైకాలజిస్టుల సహాయం తీసుకోవాలి. – మీ బలాలు, ప్రతిభను గుర్తించండి. పాజిటివ్ సెల్ఫ్ టాక్‌ను ప్రాక్టీస్ చేయండి. అవి మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. – ఒత్తిడి, ఆందోళనను నియంత్రించుకునేందుకు బ్రీతింగ్, రిలాక్సేషన్, మైండ్ ఫుల్నెస్ టెక్నిక్స్‌ను ప్రాక్టీస్ చేయండి. – మీ భావాలను, అవసరాలను స్పష్టంగా వ్యక్తపరచడం నేర్చుకోండి. – మీకు మద్దతుగా ఉండే స్నేహితుల సహాయం తీసుకోండి. – బుల్లీయింగ్ జరిగే అవకాశం ఉన్న ప్రదేశాలు, పరిస్థితులకు దూరంగా ఉండండి. – తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా సైకాలజిస్ట్ సహాయం తీసుకోండి.పేరెంట్స్ ఏం చేయాలి?– మీ పిల్లలు అన్ని ఫీలింగ్స్, అభిప్రాయాలు స్వేచ్ఛగా మాట్లాడేలా, పంచుకునేలా ప్రోత్సహించండి.– శారీరక, మౌఖిక, సైబర్ బుల్లీయింగ్ గురించి అవగాహన కల్పించండి. – బుల్లీయింగ్ జరిగినప్పుడు ఎలా స్పందించాలో పిల్లలతో ప్రాక్టీస్ చేయించండి. – కాన్ఫ్లిక్ట్ మేనేజ్ మెంట్ టెక్నిక్ట్స్ ప్రాక్టీస్ చేయించండి. – తమ సమస్యలను తామే పరిష్కరించుకునేలా ప్రోత్సహించండి. – బుల్లీయింగ్ గురించి టీచర్స్‌తో, స్కూల్ మేనేజ్మెంట్తో మాట్లాడండి. – బుల్లీయింగ్ వల్ల మీ బిడ్డ ఎమోషనల్‌గా బాధపడుతుంటే వెంటనే సైకాలజిస్ట్ సహాయం తీసుకోండి. – కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ (సీబీటీ), ఫ్యామిలీ థెరపీ ద్వారా సైకాలజిస్ట్ మీకు సహాయం చేస్తారు.ఎందుకు బెదిరిస్తారు? ప్రతి వ్యక్తీ గుర్తింపును కోరుకుంటారు. ఆటలు, మాటలు, పాటలు, ప్రవర్తన లేదా ప్రతిభ ద్వారా గుర్తింపును సాధించుకుంటారు. అవేమీ లేనివారు ఇతరులను ఏడిపించడం ద్వారా గుర్తింపును సాధించాలనుకుంటారు. అయితే ఎవ్వరూ అలా పుట్టరు. రెండు మూడేళ్ల వయసులో పిల్లల దూకుడు ప్రవర్తనను నియంత్రించకపోతే వారు పెద్దయ్యాక ఇతరులను బెదిరించేవారిగా మారవచ్చు. వారిని అలాగే వదిలేస్తే వారిలో నేరప్రవృత్తి పెరిగి భార్యాపిల్లలను కొట్టడం, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటం చేస్తారని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇలాంటి పిల్లలకు కూడా ప్రొఫెషనల్ హెల్ప్ అవసరం.ఎందుకు ఆపరు?బుల్లీయింగ్‌ను చాలామంది గమనించినా ఆపే ప్రయత్నం చేయరు. ఆపితే తమను కూడా టార్గెట్ చేస్తారని భయపడతారు. కొందరు తాము చేయలేనిదాన్ని వాళ్లు చేస్తున్నారని చూసి ఆనందిస్తారు. మరికొందరు దాన్ని ఫన్‌లా తీసుకుని నవ్వుతారు. ఈ మౌనం, నవ్వు ఎగతాళి చేసేవారికి ప్రోత్సాహకంగా మారుతుంది. ఇక సైబర్ బుల్లీయింగ్ పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారింది. ట్రోల్ చేయడమే ప్రధానంగా సోషల్ మీడియా పేజీలు, వీడియోలు రావడం, వాటిని పలువురు షేర్ చేయడం గమనించవచ్చు.– సైకాలజిస్ట్ విశేష్ (psy.vishesh@gmail.com) -
అతిగా తినడం.. వాంతి చేసుకోవడమా? అయితే ఇలా చేయండి!
రాధ డిగ్రీ చదువుతోంది. చూడ్డానికి చక్కగా ఉంటుంది. బాగా చదువుతుంది. అందరితో కలివిడిగా మాట్లాడుతుంది. కానీ కొన్ని నెలలుగా ఆమె అతిగా తింటోంది. అక్కడితో ఆగడంలేదు. అతిగా తినడంవల్ల లావయిపోతాననే భయంతో భోజనం కాగానే వాష్ రూమ్‌లోకి వెళ్లి బలవంతంగా వాంతి చేసుకుంటోంది. అలా చేయడం నేరంగా, అవమానకరంగా భావిస్తోంది. క్లాసులో కూర్చున్నా ఆలోచన మాత్రం బరువుపైనే ఉంటోంది. తన శరీరాకృతి సరిగా ఉందో లేదోనని తరచూ అద్దంలో చూసుకుంటోంది. బరువు తగ్గించుకునేందుకు విపరీతంగా వ్యాయామం చేస్తోంది.రాధ ప్రవర్తనలో మార్పు గమనించిన తల్లి గీతాదేవి ఏం జరుగుతోందని ఆరా తీసింది. అలా తిని, బలవంతంగా వాంతి చేసుకోవడం లేదా అతిగా వ్యాయామం చేయడం ఆరోగ్యానికి మంచిది కాదని చెప్పి చూసింది. రాధ వయసుకు తగ్గ బరువే ఉందని వెయింగ్ మెషిన్లో చూపించింది. కానీ రాధ ప్రవర్తనలో ఎలాంటి మార్పు లేదు. దాంతో ఏం చేయాలో అర్థంకాక తమ ఫ్యామిలీ డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లింది. ఆయన సలహా మేరకు రక్త, మూత్ర పరీక్షలు, ఈసీజీ చేయించారు. న్యూట్రిషనిస్ట్‌ను కలసి ఆహారపు అలవాట్లు, బరువు తగ్గే మార్గాలపై కౌన్సెలింగ్ తీసుకున్నారు.ఫ్యామిలీ డాక్డర్ సలహా మేరకు సైకోడయాగ్నసిస్కి తీసుకొచ్చారు. రాధతో మాట్లాడాక ఆమె బులీమియా నెర్వోసా అనే మానసిక రుగ్మతతో బాఢపడుతోందని అర్థమైంది. అతిగా తినడం, వెంటనే బలవంతంగా వాంతి చేసుకోవడం దీని ప్రధాన లక్షణం. వారానికి ఒకసారి అతిగా తిని, వాంతి చేసుకుంటే బులీమియా ఉందని నిర్ధారణ చేసుకోవచ్చు.పలురకాల చికిత్సలు అవసరం..బులీమియాకు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ రకాల చికిత్సలు అవసరం కావచ్చు. అంటే సైకాలజిస్ట్, ఫ్యామిలీ డాక్టర్, డైటీషియన్లతో కూడిన బృందం అవసరం ఉండవచ్చు. ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోవడంతోపాటు లైఫ్ స్టయిల్లోనూ మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది.– బులీమియా గురించి తెలుసుకోవాలి. థెరపీ సెషన్లను దాటవేయవద్దు.– ఆహారం, వ్యాయామం ప్రొఫెషనల్స్ సలహాతోనే తీసుకోవాలి.. చేయాలి.– అదే పనిగా బరువు చెక్ చేసుకోవద్దు, అద్దంలో చూసుకోవద్దు. ఈ తరహా ధోరణి అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లను ప్రేరేపించే ప్రమాదం ఉంది.– ఆకలిని తగ్గించే లేదా బరువును తగ్గించే సప్లిమెంట్లు లేదా మూలికల వల్ల దుష్ప్రభావాలు ఉండవచ్చు. అందువల్ల వాటికి దూరంగా ఉండాలి.– Enhanced cognitive behavior therapy ద్వారా తిండి గురించిన అనారోగ్యకరమైన నమ్మకాలు, ప్రవర్తన స్థానంలో ఆరోగ్యకరమైన నమ్మకాలు, ప్రవర్తనను పెంపొందించవచ్చు.– బులీమియాతో బాధపడుతున్న పిల్లలు, టీనేజర్ల పేరెంట్స్ ఏం చేయాలో తెలుసుకోవడానికి, పిల్లలు తినే వాటిపై నియంత్రణ తీసుకురావడానికి Family based therapy సహాయపడుతుంది.– ఒత్తిడిని తట్టుకోవడానికి, ఎమోషనల్ బ్యాలెన్స్సకి, ఇతరులతో సర్దుకుపోవడానికి డైలెక్టికల్ బిహేవియరల్ థెరపీ ఉపయోగపడుతుంది.– యాంటీడిప్రెసెంట్స్తో బులీమియా లక్షణాలను తగ్గించవచ్చు. టాక్ థెరపీతో పాటు దీన్ని ఉపయోగించినప్పుడు మెరుగైన ఫలితాలు ఉంటాయి.– బులీమియాకు చికిత్స చేయడంలో ప్రత్యేక శిక్షణ పొందిన డైటీషియన్లు సహాయపడతారు.– బులీమియా తీవ్రంగా ఉండి.. ఇతరత్రా తీవ్రమైన ఆరోగ్య సమస్యలూ ఉంటే ఆస్పత్రిలో చేరాల్సి రావచ్చు.బులీమియా లక్షణాలు...– ఒకే సిట్టింగ్‌లో అసాధారణ రీతిలో ఆహారాన్ని అతిగా తినడం– అతిగా తినడాన్ని నియంత్రించలేకపోతున్నామని అనిపించడం– బరువు పెరగకుండా ఉండటానికి ఉద్దేశపూర్వకంగా వాంతులు చేసుకోవడం లేదా అతిగా తిన్న తర్వాత విపరీతంగా వ్యాయామం చేయడం– బరువు పెరుగుతుందనే భయంతో, అనారోగ్యకరమైన మార్గాల్లో బరువు తగ్గడానికి ప్రయత్నించడం– విరేచనాల కోసం మందులు ఉపయోగించడం– శరీర ఆకృతి, బరువు విషయంలో చాలా అసంతృప్తిగా ఉండటం– విపరీతమైన మూడ్ స్వింగ్స్‌ని కలిగి ఉండటం.బులీమియా నెర్వోసాకు బింజ్ ఈటింగ్ డిజార్డర్‌కు మధ్య తేడా.. బులీమియా నెర్వోసా ఉన్న వ్యక్తులు అతిగా తిని, ఆ తర్వాత బలవంతంగా వాంతి చేసుకుని ఆహారాన్ని వదిలించుకోవడానికి ప్రయత్నిస్తారు. బింజ్ ఈటింగ్ రుగ్మత ఉన్న వ్యక్తులు కూడా అతిగా తింటారు, కానీ వాంతి చేసుకోరు. అలాగే, బులీమియాతో బాధపడుతున్న వ్యక్తులు సాధారణంగా ఆరోగ్యకరమైన బరువుతో ఉంటారు. బింజ్ ఈటింగ్ రుగ్మత ఉన్న వ్యక్తులు సాధారణంగా అధిక బరువు/ఊబకాయం కలిగి ఉంటారు.– సైకాలజిస్ట్ విశేష్ -
ఫోన్ కనపడకపోతే.. ప్రాణం పోతోందా? అయితే మీకీ వ్యాధి ఉన్నట్లే!
ఒక్క నిమిషం.. ఫోన్ కనపడదు. చాలా భయం. చాలా ఆందోళన. చాలా కోపం. చాలా వణుకు. ఈ లక్షణాలన్నీ ఉంటే మీకు ‘నో మొబైల్ ఫోన్ ఫోబియా’ లేదా ‘నోమొఫోబియా’ ఉన్నట్టే. ఇది మీకు చేటు చేస్తుంది. దీన్నుంచి బయటపడమని సైకియాట్రిస్ట్‌లు సూచిస్తున్నారు.ఇంతకుముందు మనిషి రెండు చేతులు రెండు కాళ్లతో ఉండేవాడు. ఇప్పుడు అతని చేతికి అదనపు అంగం మొలుచుకుని వచ్చింది – మొబైల్ ఫోన్. అది లేకుండా గతంలో మనిషి బతికాడు. ఇప్పుడూ బతకొచ్చు. కాని మొబైల్ ఫోన్‌తో మన వ్యక్తిగత, కుటుంబ, వృత్తిగత, స్నేహ, సాంఘిక సమాచార సంబంధాలన్నీ ముడి పడి ఉన్నాయి కాబట్టి అది కలిగి ఉండక తప్పదు. అలాగని అదే జీవితంగా మారితే నష్టాలూ తప్పవు. ఐదు నిమిషాల సేపు ఫోన్ కనిపించకపోతే తీవ్ర ఆందోళన చెందుతూ ఉన్నా, సినిమాకు వెళ్లినప్పుడైనా మూడు గంటల సేపు ఫోన్ స్విచ్చాఫ్ చేయలేకపోయినా, రాత్రి ఫోన్ ఎక్కడో పడేసి మీరు మరెక్కడో నిద్రపోలేకపోయినా, ఎంత ఆత్మీయులొచ్చినా ఫోన్ వైపు చూడకుండా దానిని చేతిలో పెట్టుకోకుండా వారితో గడపలేకపోయినా మీకు ‘నోమొ ఫోబియా’ ఉన్నట్టు.కేస్‌స్టడీ.. 1ఆఫీస్ నుంచి హుషారుగా ఇల్లు చేరుకున్న సుందర్ కాసేపటికి బట్టలు మార్చుకుని ముఖం కడుక్కుని రిలాక్స్ అయ్యాడు. ఫోన్ గుర్తొచ్చింది. టీ పాయ్ మీద లేదు. టీవీ ర్యాక్ దగ్గర లేదు. కంగారుగా భార్యను పిలిచి ఆమె ఫోన్‌తో రింగ్ చేయించాడు. రింగ్ వస్తోంది కాని ఇంట్లో ఆ రింగ్ వినపడలేదు. సుందర్‌కు చెమటలు పట్టాయి. మైండ్ పని చేయలేదు. ఎక్కడ మర్చిపోయాడు. కారు తాళాలు తీసుకుని కిందకు వెళ్లి కారులో వెతికాడు. లేదు. మళ్లీ పైకి వచ్చి ఇల్లంతా వెతికాడు. దారిలో పెట్రోలు పోయించుకున్నాడు... అక్కడేమైనాపోయిందా? మరోచోట ఫ్రూట్స్ కొని ఫోన్‌పే చేశాడు. అక్కడ పడేసుకున్నాడా? ఫోన్.. మొబైల్ ఫోన్.. అదిపోతే... అదిపోతే... మైండ్ దిమ్మెక్కిపోతోంది. సరిగ్గా అప్పుడే అతని కూతురు వచ్చి రక్షించింది. ‘నాన్నా.. ప్యాంట్ జేబులో మర్చిపోయావు. వాల్యూమ్ లో అయి ఉంది’ అని. ఫోన్ కనపడకపోతే ప్రాణంపోతుంది ఇతనికి. అంటే నోమొ ఫోబియా ఉన్నట్టే.కేస్ స్టడీ.. 2ఇంటికి చాలా రోజుల తర్వాత గెస్ట్‌లు వచ్చారు. వారు ఎదురుగా కూచుని మాట్లాడుతున్నారు. ఇంటి యజమాని విజయ్ ఫోన్ చేతిలో పట్టుకుని వారితో మాట్లాడుతున్నాడు. ప్రతి నిమిషానికి ఒకసారి ఫోన్ చూస్తున్నాడు. వాళ్లతో మాట్లాడుతూనే ఫేస్బుక్ స్క్రోల్ చేస్తున్నాడు. వాళ్లతో మాట్లాడుతూనే వాట్సప్ చెక్ చేస్తున్నాడు. వాళ్ల వైపు ఒక నిమిషం ఫోన్ వైపు ఒక నిమిషం చూస్తున్నాడు. వాళ్లకు విసుగొచ్చి కాసేపటికి లేచి వెళ్లిపోయారు. విజయ్‌కు నోమొ ఫోబియా ఉంది.కేస్ స్టడీ.. 3దుర్గారావు ఆఫీస్ పని మీద వేరే ఊరు వెళ్లి హోటల్లో దిగాడు. దిగాక గాని తెలియలేదు అక్కడ ఫోన్ సిగ్నల్స్ అందవని. కాల్స్ ఏమీ రావడం లేదు. డేటా కూడా సరిగ్గా పని చేయడం లేదు. ఆ ఊళ్లో వేరే మంచి హోటళ్లు లేవు. సిగ్నల్ కోసం హోటల్ నుంచి గంట గంటకూ బయటకు వెళ్లాల్సి వస్తోంది. ఇక అక్కడ ఉన్నంత సేపు దుర్గారావుకు అస్థిమితమే. చిరాకే. ఏ కాల్ మిస్సవుతున్నానో అన్న బెంగే. ఏ మెసేజ్ అందడం లేదో అన్న ఆందోళనే. ఇదీ నోమొ ఫోబియానే.నష్టాలు..1. నోమొఫోబియా ఉంటే మీ అనుబంధాలు దెబ్బ తింటాయి. ఎందుకంటే అనుబంధాల కంటే ఫోన్‌తో బంధం ముఖ్యమని భావిస్తారు కాబట్టి.2. నోమొ ఫోబియా మీ లక్ష్యాలపై మీ ఫోకస్‌ను తప్పిస్తుంది. మీరు ఎక్కువసేపు ఒక పని మీద మనసు లగ్నం చేయరు. దీనివల్ల చదువుకునే విద్యార్థి, పని చేయాల్సిన ఉద్యోగి, ఇంటిని చక్కదిద్దే గృహిణి అందరూ క్వాలిటీ వర్క్‌ను నష్టపోతారు. పనులు పెండింగ్‌లో పడతాయి.3. నోమొ ఫోబియా కలిగిన వారు తమను తాము నమ్ముకోవడం కన్నా ఫోన్‌ను నమ్ముకుంటారు. చివరకు ఫోన్ లేకుండా ఇంట్లో నుంచి అడుగు బయటపెట్టడానికి కూడా ఇష్టపడరు.4. సోషల్ మీడియా సంబంధాలే అసలు సంబంధాలుగా భావించి అసలు సంబంధాలు కోల్పోతారు.5. ఫోన్ ఇతరుల చేతుల్లో పడితే వారు ఏమి ఆరా తీస్తారోనని అనుక్షణం ఫోన్‌ని కనిపెట్టుకుని ఉంటారు.ఎలా బయటపడాలి?1. ఖాళీ సమయాల్లో మెల్లమెల్లగా ఫోన్‌ను పక్కన పడేయడంప్రాక్టీస్ చేయండి.2. రోజులో ఒక గంటైనా ఏదో ఒక సమయాన ఫోన్ స్విచ్చాఫ్ చేయడం మొదలుపెట్టండి.3. సినిమాలకు, శుభకార్యాలకు వెళ్లినప్పుడు ఫోన్ ఇంట్లో పడేయడమో, మ్యూట్ చేసి జేబులో పడేయడమో చేయండి.4. ఫోన్ నుంచి దృష్టి మరల్చే ఆటలు, పుస్తక పఠనం, ఇతర హాబీలపై దృష్టి పెట్టండి.5. యోగా, ప్రాణాయామం చేయడం మంచిది.6. ఫోన్లో మీ కాంటాక్ట్స్, ముఖ్యమైన ఫొటోలు, ఇతర ముఖ్య సమాచారం పర్సనల్ కంప్యూటర్లోనో మెయిల్స్లోనో నిక్షిప్తం చేసుకుని ఫోన్ ఎప్పుడుపోయినా మరో సిమ్ కొనుక్కోవచ్చు అనే అవగాహన కలిగి ఉంటే నోమొఫోబియాను దాదాపుగా వదిలించుకోవచ్చు.ఇవి చదవండి: Fauzia Arshi - ఆకాశమే హద్దు! -
'విడిపోతామని విపరీతమైన భయం'! అసలు కారణమేంటి?
భారతికి ఇద్దరు పిల్లలు. భర్త భరత్ సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. భారతి గతంలో పనిచేసినప్పటికీ, ప్రస్తుతం పిల్లలకోసం ఇంట్లోనే ఉంటోంది. కానీ పిల్లలను స్కూల్‌కు పంపాలంటే విపరీతంగా భయపడుతోంది. వాళ్లు తనకు దూరమవుతారేమోనని ఆందోళన చెందుతోంది. స్కూలుకెళ్తే పిల్లలు దూరమవుతారనే భయమేంటోయ్ అని భరత్ జోక్ చేసినా ఆమె ఆందోళన తగ్గకపోగా, భర్త ఎక్కడ దూరమవుతాడోననే భయమూ మొదలైంది. నీవన్నీ పిచ్చి భయాలని భర్త ఎంత చెప్పినా ఆమెకు ధైర్యం రావడం లేదు. ఏం చేయాలో అర్థంకాని పరిస్థితుల్లో కౌన్సెలింగ్‌కి అటెండ్ అయింది.భారతితో మాట్లాడుతున్న క్రమంలో ఆమె చిన్నప్పుడు తల్లిదండ్రులకు దూరంగా హాస్టల్లో పెరిగిందనే విషయం తెలిసింది. తల్లిదండ్రుల మధ్య గొడవల వల్ల ఆమెను హాస్టల్లో ఉంచారని చెప్పింది. పేరెంట్స్ ఎక్కడ విడిపోతారోనని రోజూ భయపడేదాన్నని, తాను భయపడినట్లు వాళ్లు విడిపోయారని బాధపడింది. అప్పటినుంచీ ఒంటరిగానే ఉంటున్నానని, కానీ ఒంటరితనం విపరీతమైన ఆందోళనను పెంచిందని చెప్పింది. భారతి గురించి పూర్తిగా తెలుసుకున్నాక ఆమె సెపరేషన్ యాంగ్జయిటీ డిజార్డర్‌తో బాధపడుతోందని అర్థమైంది. ఇష్టమైన వ్యక్తి నుంచి విడిపోతామనే భయమే ఈ డిజార్డర్. ఇది పిల్లల్లో సహజం. అయితే భారతిలానే కొందరు పెద్దల్లో కూడా ఉంటుంది.ఎప్పడు మొదలవుతుంది?విడిపోతామనే ఆందోళన సాధారణంగా ఎనిమిది నెలల వయసు నుంచి ప్రారంభమవుతుంది. ఈ వయస్సులో పిల్లలను విడిచిపెట్టి తల్లిదండ్రులు పక్కకు వెళ్లినప్పడు ఆందోళన చెందుతారు. రెండేళ్ల వయసు వచ్చేసరికి తల్లిదండ్రులు తమను వదిలి వెళ్లరని, తిరిగి వస్తారని అర్థం చేసుకోవడం మొదలుపెడ్తారు. అయితే కొందరిలో ఇది ఆ తర్వాత కూడా కొనసాగుతుంది. జీవిత భాగస్వామితో లేదా రక్తసంబంధీకులు, స్నేహితులతో విడిపోతామని ఆందోళన చెందుతుంటారు.పిల్లల్లో సెపరేషన్ యాంగ్జయిటీకి కారణాలు..సెపరేషన్ యాంగ్జయిటీ డిజార్డర్ జన్యుపరమైనది కావచ్చు. ఇది కుటుంబ పరంగానూ రావచ్చు. జీవితంలో జరిగే సంఘటనలూ కారణం కావచ్చు. ఉదాహరణకు..కుటుంబ సభ్యుల మరణంతల్లిదండ్రులు విడిపోవడం తల్లిదండ్రులు లేకపోవడంవలస వెళ్లాల్సి రావడంపాఠశాల మార్పుతల్లిదండ్రుల్లో ఆందోళనతల్లిదండ్రుల మద్య వ్యసనందత్తతకు వెళ్లడంపెద్దల్లో కారకాలు..ప్రియమైన వ్యక్తిని కోల్పోవడంకఠినమైన పెంపకంజీవితంలో నిత్యం సవాళ్లు, ఒత్తిళ్లుచిన్నతనంలో ఆందోళన రుగ్మతపిల్లల్లో కనిపించే లక్షణాలు..పిల్లల్లో తరచుగా ప్రీస్కూల్, డేకేర్ సమయంలో ఇది ప్రారంభమవుతుంది. మిమ్మల్ని వదిలివెళ్లడానికి బిడ్డ నిరాకరించవచ్చు, కోపం ప్రదర్శించవచ్చు. · కుటుంబ సభ్యులకు ఏదైనా చెడు జరుగుతుందనే భయం· ఒంటరిగా మిగిలిపోతానేమోనని భయం· తప్పిపోతామేమో, ఎవరైనా ఎత్తుకెళ్తారేమోననే భయం· పీడ కలలు· నిద్రలో మూత్రం పోయడంపెద్దల్లో కనిపించే ఇతర లక్షణాలు..· ఇష్టమైన వారు దగ్గర లేనప్పుడు భయాందోళనలు · ప్రియమైన వ్యక్తి గాయపడతారనే భయం · ఎవరితోనూ కలవకపోవడం · ఏకాగ్రత కోల్పోవడం.జీవితంపై తీవ్ర ప్రభావం..సెపరేషన్ యాంగ్జయిటీ డిజార్డర్ జీవన నాణ్యతను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. అది పాఠశాల, ఉద్యోగ జీవితం పై తీవ్ర ప్రభావం చూపుతుంది. కడుపు నొప్పి, తలనొప్పి, తల తిరగడం, వికారం, వాంతులు, అతిసారం, ఛాతీ నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి ఆరోగ్య సమస్యలు రావచ్చు. వీటితో పాటు డిప్రెషన్, ఇతర యాంగ్జయిటీ డిజార్డర్స్, అబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్లూ తలెత్తవచ్చు.నివారించడమెలా?సెపరేషన్ యాంగ్జయిటీ డిజార్డర్‌ను నివారించడానికి ఎలాంటి మార్గాలూ లేవు. అయితే పిల్లల్లో ఈ సమస్య రాకుండా ఉండేందుకు తల్లిదండ్రులు కొన్ని చర్యలు తీసుకోవచ్చు. · నమ్మకమైన బేబీ సిట్టర్‌ను ఏర్పాటు చేయడం ద్వారా వేరుగా ఉండటం ప్రాక్టీస్ చేయాలి..· కొద్ది సమయంపాటు విడిగా ఉండటం పిల్లలకు అలవాటు చేయాలి..· ఎక్కడైనా వదిలివెళ్లినప్పుడు, చెప్పిన సమయానికి రావడం ద్వారా నమ్మకాన్ని పెంచాలి.. · అయినప్పటికీ పిల్లల్లో ఆందోళన కనిపిస్తుంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా సైకాలజిస్ట్‌ను కలవాలి..· కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ ద్వారా ఈ రుగ్మతకు చికిత్సను అందించొచ్చు. · డయలెక్టికల్ బిహేవియరల్ థెరపీతో పాటు ఫ్యామిలీ థెరపీ, గ్రూప్ థెరపీ కూడా ఎమోషనల్ మేనేజ్మెంట్లో సహాయపడతాయి. · అవసరమైతే సైకియాట్రిస్ట్‌ను కలసి మందులు తీసుకోవాల్సి ఉంటుంది.— సైకాలజిస్ట్ విశేష్ -
Health: మీరు ఈ తొమ్మిది అలవాట్లు వదులుకుంటే.. సక్సెస్ గ్యారంటీ!
‘పదే పదే ఏం చేస్తామో అదే మనం. ఎక్సలెన్స్ అనేది ఒక పని కాదు, ఒక అలవాటు’ అంటాడు అరిస్టాటిల్. ఉదయం లేచిన దగ్గర్నుంచీ మనం చేసే పనులే మన అలవాట్లుగా మారతాయి. అవే మన విజయాన్ని నిర్ణయిస్తాయి. తొమ్మిది అలవాట్లు 90శాతం సమయాన్ని వృథా చేస్తాయని సైకాలజిస్టులు గుర్తించారు. వాటిని మార్చుకునే మార్గాలు కూడా సూచించారు. వాటిని తెలుసుకుని ఆచరించడం ద్వారా మీరు జీవితంలో అనుకున్నది సాధించవచ్చు. అవేమిటో ఈరోజు తెలుసుకుందాం.1. అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలనుకోవడం..అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలనుకోవడం ఒక కాగ్నిటివ్ డిస్టార్షన్. అలా అనుకోవడం వల్ల ఏ చిన్న తప్పు జరిగినా మొత్తం నాశనమైందంటూ బాధపడుతుంటారు. అందుకే అందరిలోనూ, అన్నిటిలోనూ.. చిన్నవో, పెద్దవో లోపాలు ఉంటాయనే విషయాన్ని అంగీకరించాలి. పాజిటివ్స్‌ను చూస్తూ ముందుకు సాగాలి.2. మల్టీ టాస్కింగ్..ఒకేసారి పలు పనులు చేయడం గొప్ప విషయంగా భావిస్తుంటారు. కానీ నిజానికి మెదడు ఒకసారి ఒక అంశంపైనే ఫోకస్ చేయగలదు. ఈ విషయం అర్థంకాక మల్టీ టాస్కింగ్ చేయలేకపోతున్నామని బాధపడుతుంటారు. దీన్ని అధిగమించేందుకు ‘పోమోడోరో టెక్నిక్’ ఉపయోగించండి. అంటే, ఒక పని మొదలుపెట్టాక 20 నిమిషాల పాటు ఎలాంటి డిస్ట్రాక్షన్ లేకుండా ధ్యాస పెట్టడం. ఆ పని పూర్తయ్యాకనే మరో పని ప్రారంభించడం.3. చేసిందే చేస్తూ భిన్నమైన ఫలితాలను ఆశించండి..చేసిన పనే చేస్తుంటే వచ్చిన ఫలితాలే వస్తాయి. భిన్నమైన ఫలితాలు రావాలంటే భిన్నంగా ప్రయత్నించాలి. అందుకే మీ అలవాట్లను ట్రాక్ చేయండి. అందులో ఏవి పునరావృతం అవుతున్నాయో గుర్తించండి. అవసరమైతే వాటిని మార్చుకోండి. 4. ప్రతిదానికీ ‘అవును‘ అని చెప్పడం..కొందరికి మొహమాటం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎవరేం అడిగినా ‘నో’ చెప్పలేక, ‘ఎస్’ చెప్పేస్తుంటారు. దానివల్ల ఒత్తిడి పెరుగుతుంది. అందువల్ల ‘నో’ చెప్పడం నేర్చుకోండి. ఎందువల్ల మీరు ఆ పని లేదా సహాయం చేయలేరో వివరించడం నేర్చుకోండి. 5. వాయిదా వేయడం..ఎప్పటిపని అప్పుడు చేయకుండా ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ ఉండటం మిమ్మల్ని విజయానికి దూరం చేస్తుంది. మీ కలలను నాశనం చేస్తుంది. మిమ్మల్నో పరాజితుడిగా నిలుపుతుంది. అందుకే నిద్ర లేవగానే, ఉదయాన్నే ముఖ్యమైన పనిని చేయడం అలవాటుగా మార్చుకోండి. అలా చేయడం ఈ రోజే మొదలుపెట్టండి. నెల రోజుల్లో అది అలవాటుగా మారుతుంది. 6. అతిగా ఆలోచించడం..వర్తమానం కంటే ఎప్పడో జరిగిన వాటి గురించో లేదా ఏదో జరుతుందనో అతిగా ఆలోచిస్తూ ఎక్కువ బాధపడతాం. అందుకే మీ ఆలోచనలను ఎప్పటికప్పుడు పుస్తకంలో లేదా డైరీలో రాసుకోండి. నాలుగు రోజుల తర్వాత అందులో ఎన్ని నిజమయ్యాయో, ఎన్ని నిజం కాలేదో పరిశీలించండి. ఆలోచనలన్నీ నిజం కావని, అతిగా ఆలోచించడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని మీకే అర్థమవుతుంది. 7. క్లోజ్డ్ మైండ్ సెట్..చాలామంది ‘నాకు లెక్కలు రావు’, ‘నాకు ఇంగ్లిష్ రాదు’ అని క్లోజ్డ్ మైండ్ సెట్‌తో ఉంటారు. కానీ మనందరం ఒకే రకమైన మెదడుతో పుట్టాం. ఆ తర్వాతే అన్నీ నేర్చుకుంటాం. అంటే, మనందరం లెర్నింగ్ మెషి¯Œ లా పుట్టాం. అందువల్ల ఏదైనా నేర్చుకోవచ్చనే ‘గ్రోత్ మైండ్ సెట్’ను అలవరచుకోండి. జీవితాంతం నేర్చుకుంటూనే ఉండండి. 8. నెగెటివ్ వ్యక్తులు..కొంతమంది మీ పక్కనే ఉంటూ మిమ్మల్ని నిరంతరం నిరాశపరుస్తూ ఉంటారు, మీ ఉత్సాహాన్ని తమ మాటలతో నీరు కారుస్తుంటారు. అలాంటి వారిని గుర్తించి దూరంగా ఉండండి. మీ లక్ష్యసాధనను ప్రోత్సహించే వ్యక్తులకు దగ్గరవ్వండి. వారితో స్నేహం చేయండి. 9. బాధిత మనస్తత్వం..ప్రపంచమంతా అన్యాయంగా ఉందని, అందరూ ద్రోహమే చేస్తారని కొందరు నిత్యం ఏడుస్తూనే ఉంటారు. అది విక్టిమ్ మైండ్ సెట్. అలా ఆలోచిస్తూ ఉండటం వల్ల ఎలాంటి ప్రయోజనం లేకపోగా, మానసిక సమస్యల పాలవుతారు. అందుకే తక్షణం ఆ మైండ్ సెట్ నుంచి బయటపడండి. ఇతరులపై నిందలు వేయడం ఆపండి. మీ చర్యలకు, మీ జయాపజయాలకు మీరే బాధ్యత తీసుకుని ముందుకు సాగండి.— సైకాలజిస్ట్ విశేష్ -
'అతిగా దాచుకోవడం కూడా జబ్బే..' అని మీకు తెలుసా!?
రాజీవ్ ఒక ప్రభుత్వ ఉద్యోగి. పెళ్లయి ఇద్దరు పిల్లలు. భార్య కూడా ప్రభుత్వోద్యోగి. ఇటీవల కాలంలో వారిద్దరూ తరచూ గొడవపడుతున్నారు. కారణం ఆర్థిక ఇబ్బందులో లేక అభిప్రాయభేదాలో కాదు. రాజీవ్‌కున్న వింత అలవాటు. అది దినపత్రికల్లో, మ్యాగజై¯Œ్సలో వచ్చే నచ్చిన స్టోరీలను దాచుకునే అలవాటు. అందులో వింతేముంది? నచ్చిన పుస్తకాలు దాచుకున్నట్లే అదికూడా.. అని మీరు అనుకోవచ్చు. కానీ ఇల్లంతా ఆ ఫైల్స్‌తోనే నిండిపోతే? వాటినుంచి వచ్చే దుమ్ము వల్ల పిల్లలు తరచూ అనారోగ్యానికి గురవుతుంటే? ఆ విషయం తెలిసినా ఆ ఫైల్స్ పడేయడానికి ఒప్పుకోకుంటే? వాటిని బయట పడేయడానికి ప్రయత్నించే భార్యతో గొడవ పడుతుంటే? ఆమె వెళ్లిపోతానని బెదిరించినా పట్టించుకోకపోతే? భార్యాపిల్లల కంటే ఫైల్సే ముఖ్యమనుకుంటే? దాన్నే హోర్డింగ్ డిజార్డర్ అంటారు. అంటే అవసరం లేని వస్తువులను అతిగా దాచుకునే మానసిక వ్యాధి. పేపర్ క్లిపింగ్సే కాదు పెన్నులు, పిన్నులు, రబ్బర్ బ్యాండ్లు, కర్చీఫ్‌లు.. ఇలా ఏదైనా సరే అతిగా దాచుకుంటున్నారంటే ఈ వ్యాధి బారిన పడినట్లే. వస్తువులను దాచుకోవడమే కాదు, అతిగా జంతువులను పెంచుకోవడం కూడా ఈ రుగ్మత కిందకే వస్తుంది. అతిగా ఆస్తులు కూడగట్టుకోవడం, వాటిని ఎవరికీ ఇవ్వకుండా దాచుకోవడం కూడా ఈ రుగ్మత పరిధిలోనిదే. హాబీ, హోర్డింగ్ డిజార్డర్ వేర్వేరు.. హాబీలకు, హోర్డింగ్ డిజార్డర్‌కు తేడా ఉంది. స్టాంపుల సేకరణ, నాణేల సేకరణ వంటి హాబీలున్నవారు అనేక అంశాలు శోధించి, సేకరిస్తారు. వాటిని ప్రదర్శిస్తారు. ఈ సేకరణలు భారీ స్థాయిలో ఉండవచ్చు. కానీ అవి చిందరవందరగా ఉండవు. చక్కగా, ఒక పద్ధతిలో అమర్చి ఉంటాయి. కానీ హోర్డింగ్ డిజార్డర్‌లో ఇందుకు భిన్నంగా చిందరవందరగా ఉంటాయి. అందువల్ల ఇవి రెండూ వేర్వేరు. టీనేజ్ లో మొదలు.. హోర్డింగ్ సాధారణంగా 15 నుంచి 19 సంవత్సరాల వయస్సులో ప్రారంభమవుతుంది. వయసుతో పాటు సమస్య కూడా పెరుగుతుంది. చివరకు భరించలేనిదిగా తయారవుతుంది. ఈ డిజార్డర్ ఉన్నవారిలో కనిపించే లక్షణాలు.. తమకు నచ్చిన వస్తువులు ప్రత్యేకమైనవని లేదా భవిష్యత్తులో ఏదో ఒక సమయంలో అవసరమని నమ్మడం వాటితో మానసికంగా కనెక్ట్ అయినట్లు అనిపించడం.. అవి చుట్టూ ఉన్నప్పుడు సురక్షితంగా ఫీలవ్వడం, ఓదార్పును అనుభవించడం.. అవసరం లేకపోయినా దాచుకోవడం, విలువ లేకపోయినా విసిరేయ లేకపోవడం.. వస్తువులను భద్రపరచాలని భావించడం, వదిలించుకోవాలంటే కలత చెందడం.. మీ గదులను ఉపయోగించలేని స్థాయిలో వస్తువులను నింపడం.. అపరిశుభ్రమైన స్థాయిలకు ఆహారం లేదా చెత్తను దాచడం.. దాచుకున్న వస్తువుల కోసం ఇతరులతో విభేదాలు.. అస్పష్టమైన కారణాలు.. హోర్డింగ్ డిజార్డర్‌కు కారణమేమిటో స్పష్టంగా తెలియలేదు. జన్యుశాస్త్రం, మెదడు పనితీరు, ఒత్తిడితో కూడిన సంఘటనలు సాధ్యమయ్యే కారణాలుగా అధ్యయనాల్లో వెల్లడైంది. ఈ డిజార్డర్ ఉన్న కుటుంబ సభ్యుడిని కలిగి ఉండటం కూడా బలమైన కారణమని తెలుస్తోంది. ప్రేమించిన వ్యక్తి మరణం, విడాకులు తీసుకోవడం లేదా అగ్నిప్రమాదంలో ఆస్తులను కోల్పోవడం వంటి ఒత్తిడితో కూడిన సంఘటనను ఎదుర్కొన్న తర్వాత కొందరిలో ఈ డిజార్డర్ మొదలవుతుంది. తక్షణ చికిత్స అవసరం.. కొందరు తమ జీవితాలపై హోర్డింగ్ డిజార్డర్ చూపించే ప్రతికూల ప్రభావాన్ని గుర్తించరు, చికిత్స అవసరమని భావించరు. ఈ డిజార్డర్‌ను అధిగమించేందుకు సైకోథెరపీ అవసరం. దాంతో పాటు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. దాచుకోవడానికి కారణమైన నమ్మకాలను గుర్తించాలి , వాటిని సవాలు చేయాలి. మరిన్ని వస్తువులను పొందాలనే కోరికల నియంత్రణ అలవరచుకోవాలి. ఏయే వస్తువులను వదిలించుకోవచ్చో వాటిని వదిలించుకోవాలి. డెసిషన్ మేకింగ్‌ను.. కోపింగ్ మెకానిజాన్ని మెరుగుపరచుకోవాలి. గందరగోళాన్ని తగ్గించుకోవడానికి రోజువారీ పనులను షెడ్యూల్ చేసుకోవాలి. ఇంటిని చక్కగా నిర్వహించుకునేందుకు సాయం తీసుకోవాలి. హోర్డింగ్ ఒంటరితనానికి దారితీస్తుంది కాబట్టి ఇతరులకు చేరువవ్వాలి. ఇంటికి సందర్శకుల హడావిడిని వద్దనుకుంటే మీరే బయటకు వెళ్లొచ్చు. హోర్డింగ్ డిజార్డర్ సపోర్ట్ గ్రూప్‌లో చేరాలి. ఆలస్యం చేయకుండా సైకాలజిస్ట్ సహాయం తీసుకోవాలి. హోర్డింగ్ డిజార్డర్‌కి సిఫారసు అయిన మొదటి చికిత్స.. కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ. ఈ రుగ్మత వల్ల వచ్చే ఆందోళన, నిరాశ వంటి వాటికి మందులు ఇస్తారు. థెరపీ షెడ్యూల్‌ను క్రమం తప్పకుండా అనుసరించాలి. దాచుకోవాలనే కోరికను తగ్గించుకోవడానికి ఇది సహాయపడుతుంది. — సైకాలజిస్ట్ విశేష్ (psy.vishesh@gmail.com) ఇవి చదవండి: హెల్త్: 'గుండె' పెరగడమా..? అవును ఇదొక సమస్యే..! -
పండంటి కాపురానికి ఏడడుగులు!
పెళ్లంటే.. రెండు మనసుల కలయిక మాత్రమే కాదు.. రెండు కుటుంబాల కలయిక. కాపురం చక్కగా సాగాలని కోరుతూ పెళ్లిలో ఏడు అడుగులు నడిపిస్తారు. ఇందులో ఒక్కో అడుగుకు ఒక్కో అర్థం ఉంది. మొత్తంగా కాపురం సుఖంగా సాగేందుకు దేవతలందరూ కరుణించాలని ప్రార్థన. స్నేహంగా, పరస్పరం గౌరవించుకుంటూ, కష్టసుఖాల్లో పాలు పంచుకుంటూ అన్యోన్యంగా జీవించాలని ప్రమాణాలు చేస్తారు. ఆ ప్రమాణాలను త్రికరణ శుద్ధిగా ఆచరించిన దంపతుల సంసారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా వర్ధిల్లుతుంది. లేదంటే మూడు వాదనలు, ఆరు గొడవలుగా రచ్చకెక్కుతుంది. పెద్దల పంచాయతీకి చేరుతుంది. చివరకు విడాకులుగా తేలుతుంది. వైవాహిక బంధాన్ని కాపాడుకోవాలంటే ఏం చేయాలనే విషయంపై సైకాలజిస్టులు విస్తృతంగా పరిశోధనలు, అధ్యయనాలు చేశారు. వైవాహిక జీవితాలను నాలుగు దశాబ్దాల పాటు అధ్యయనం చేసిన డాక్టర్ జాన్ గాట్మన్, నాన్ సిల్వర్.. వైవాహిక బంధం బలపడటానికి ఏడు సూత్రాలను చెప్పారు. అవేమిటో ఈరోజు తెలుసుకుందాం. 1. పరస్పర అవగాహనే ప్రేమకు మూలం పెళ్లంటే వేర్వేరు ప్రపంచాల్లో పెరిగిన ఇద్దరు వ్యక్తులు ఒకటిగా జీవించడం. ఆ జీవితం సుఖంగా సాగాలంటే ఒకరి అనుభవాలను మరొకరు తెలుసుకోవాలి. వారి జీవితంలో ముఖ్యమైన సంఘటనలను పంచుకోవాలి, గుర్తుంచుకోవాలి. పరస్పర అవగాహన ఒకరి పట్ల మరొకరికి శ్రద్ధను కలిగిస్తుంది, బంధాన్ని పెంచుతుంది. మీ భాగస్వామికి ఇష్టమైన మూడు పాటలేవి? ఎందుకిష్టం? వారి అతిపెద్ద భయం ఏమిటి? భవిష్యత్తు కోసం వారు కంటున్న కలలు ఏమిటి? వారు దేనికి ఒత్తిడి చెందుతారు? వారి జీవితంలో జరిగిన కొన్ని ప్రధాన సంఘటనలు ఏమిటి? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం ఉంటే మీకు పరస్పర అవగాహన ఉందని అర్థం. లేదంటే, పెంచుకోవడానికి ప్రయత్నించాలి. 2. మీ అభిమానాన్ని పంచుకోండి, పెంచుకోండి వైవాహిక బంధం బలపడటంలో ప్రేమ, అభిమానాలది ప్రధానపాత్ర. అవి లోపించినప్పుడు ఆ బంధం నిలిచే అవకాశాలు తక్కువ. మీ వైవాహిక బంధంలో అభిమానం ఉందో లేదో అంచనా వేయడానికి మీ తొలి పరిచయం రోజులను వివరించడం మంచి మార్గం. బంధాన్ని బలపరచుకోవడానికి చేయాల్సిన పనులు.. కలసి గడపడానికి ప్లాన్ చేయలి ఇద్దరూ కలసి కొత్త హాబీ నేర్చుకోవాలి భాగస్వామికి కృతజ్ఞతలు తెలపాలి భాగస్వామిని అభినందించాలి అభిమానాన్ని పెంపొందించుకోవడంలో సమస్యలుంటే కపుల్ థెరపీకి వెళ్లాలి 3. కలసి మెలసి నడవండి ఆరోగ్యకరమైన సంబంధంలో భాగస్వాములు తరచుగా ఒకరినొకరు చూసుకుంటారు. ఒకరినొకరు చూసుకోవడం వారి ప్రేమ ట్యాంక్‌ను నింపుతుంది. ఇరువురి మధ్య ఎమోషనల్ కనెక్షన్ పెరిగేందుకు తోడ్పడుతుంది. లైంగిక జీవితాన్ని ప్రోత్సహిస్తుంది. దీర్ఘకాలం మాట్లాడుకోకపోవడం, చూసుకోకపోవడం జంటను దూరం చేస్తుంది. 4. భాగస్వామి మాటకు విలువనివ్వండి దంపతులు జట్టుగా పనిచేసినప్పుడు కలసి ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పెద్ద నిర్ణయాలు తీసుకునేటప్పుడు, అభిప్రాయాలను పంచుకునేటప్పుడు లేదా ఆలోచనా విధానంలో జీవిత భాగస్వామి అభిప్రాయాలకు విలువనివ్వాలి. ఏకీభవించనప్పుడు గౌరవంగా, ప్రశాంతంగా, హేతుబద్ధమైన చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి. 5. పరిష్కరించగల సమస్యలను పరిష్కరించుకోండి వివాహంలో రెండు రకాల సమస్యలు ఉత్పన్నమవుతాయి: శాశ్వతమైనవి, పరిష్కరించదగినవి. పరిష్కరించగల సమస్యల్లో వైరుధ్యం, ఆగ్రహం ఉండవు. కేవలం సవాలు మాత్రమే ఉంటుంది. ఐదు దశల్లో వాటిని పరిష్కరించుకోవచ్చు. ఇద్దరూ ప్రశాంతంగా ఉన్న సమయంలో చర్చ ప్రారంభించాలి · మాటలు, చేతల వల్ల సంఘర్షణ పెరగకుండా చూసుకోవాలి అవసరమనిపించినప్పుడు 20 నిమిషాల విరామం తీసుకోవాలి· ఇద్దరూ కలసి బతికేందుకు అవసరమైతే రాజీ పడాలి ఒకరి తప్పులను ఒకరు సహించాలి 6. పీటముడిని అధిగమించండి నిరంతర విభేదాలు సంఘర్షణకు కారణమైనప్పుడు పీటముడి పడుతుంది. మాటలు ఆగిపోతాయి. ఒకరినొకరు ద్వేషించుకోవడం మొదలవుతుంది. దీన్ని అధిగమించడానికి.. సమస్య మూలాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి ప్రశాంతంగా కమ్యూనికేట్ చేయాలి · చర్చించలేని వివాదాలను అంచనా వేయడానికి మార్గాన్ని కనుగొనాలి భాగస్వామికి కృతజ్ఞతలు, ప్రశంసలు తెలుపుతూ ప్రశాంతంగా చర్చను ముగించాలి 7. భాగస్వామ్యానికి సరైన అర్థాన్ని సృష్టించాలి జీవన భాగస్వామ్యమంటే.. కేవలం పెళ్లి చేసుకోవడం మాత్రమే కాదు. మీ లక్ష్యాలు, పాత్రలు, ఆచారాలను కలపడం పరస్పర అవసరాలు, కోరికలు, కలలను గుర్తించడానికి అనుమతించడం అన్ని రకాల సాన్నిహిత్యాన్ని పంచుకోవడం అర్థవంతమైన అనుభవాలను సృష్టించుకోవడం --సైకాలజిస్ట్ విశేష్ psy.vishesh@gmail.com (చదవండి: భూమికే గొడుగు పట్టనున్న శాస్త్రేవత్తలు! ఏకంగా లక్షల కోట్లు..) -
విచిత్రమైన మాటలు, దుస్తులు, ప్రవర్తన.. A సినిమాలో ఉపేంద్ర గుర్తున్నాడా?
అంకిత్ ఒక ఫ్రీలాన్స్ గ్రాఫిక్ డిజైనర్. చిన్న అపార్ట్మెంట్లో ఒంటరిగా ఉంటున్నాడు. ఎవరితోనూ మాట్లాడడు, కలవడు. చిన్నప్పటి నుంచీ పదిమందిలోకి వెళ్లాలంటే విపరీతమైన ఆందోళన, భయం. ఎలాగోలా పదోతరగతి పూర్తయిందనిపించాడు. ఆ తర్వాత ఇంట్లోనే కూర్చుని గ్రాఫిక్ డిజైనింగ్ నేర్చుకున్నాడు. మంచి పేరు సంపాదించుకున్నాడు. కానీ కస్టమర్లతో మాట్లాడాలంటే చాలా ఇబ్బంది పడుతుంటాడు. బయటకు వెళ్తే తన గురించి తప్పుగా అనుకుంటారేమో, ఎగతాళి చేస్తారేమోనని భయపడుతుంటాడు. తనపై ఇతరులు కుట్రలు చేస్తున్నారని నమ్ముతుంటాడు. ఇటీవల.. తాను ఎదుటివారి మనసులోని మాటలను ఎంతదూరం నుంచైనా వినగలనని, తాను ఆత్మలతో మాట్లాడగలనని చెప్పడం మొదలుపెట్టాడు. ఇలాగే వదిలేస్తే ఏమైపోతాడోననే భయంతో సన్నిహితుల అతన్ని సైకాలజిస్ట్ దగ్గరకు తీసుకెళ్లారు. అంకిత్ డ్రెస్.. పలు రంగులతో ముక్కలు ముక్కలుగా విచిత్రంగా ఉంది. ప్రవర్తన కూడా అసాధారణంగా ఉంది. మాట్లాడేటప్పుడు ఎలాంటి భావోద్వేగాలు ప్రదర్శించలేదు. మాటల్లో క్లారిటీ లేదు. చెప్పేది పూర్తి చేయకుండానే మరో అంశంలోకి వెళ్లి పోతున్నాడు. సైకోడయాగ్నసిస్ అనంతరం అతను స్కిజోటైపల్ పర్సనాలిటీ డిజార్డర్‌తో బాధపడుతున్నట్లు నిర్ధారణైంది. ఈ డిజార్డర్ ఉన్న వ్యక్తులను అందరూ విచిత్ర వ్యక్తులని పిలుస్తుంటారు. ఇది సాధారణంగా టీనేజ్‌లో బయటపడుతుంది. దీర్ఘకాలిక సైకోథెరపీ అవసరం.. పర్సనాలిటీ డిజార్డర్స్కు మందులు లేవు. దీర్ఘకాలిక సైకోథెరపీ అవసరమవుతుంది. దాంతోపాటు డిజార్డర్ ఉన్నవారు తమ జీవనశైలిలో, కోపింగ్ స్ట్రాటజీస్లో మార్పులు చేసుకోవడం ద్వారా కొంత ప్రయోజనం పొందవచ్చు. ► స్కిజోటైపల్ వ్యక్తిత్వ లక్షణాలు, ఆలోచనలు, భావోద్వేగాలు, ప్రవర్తన, వాటి ప్రభావాన్ని అర్థం చేసుకోవడం మొదటి అడుగు. ► పరిచయస్తులతో కొద్దికొద్దిగా మాట్లాడాలి. మాట్లాడేటప్పుడు చూపు కలిపేందుకు, పదిమందిలోకి వెళ్లేందుకు ప్రయత్నించాలి ► పెద్ద లక్ష్యాలను చిన్నవిగా, సాధించగలిగేవిగా విభజించుకోవాలి ► ధ్యానం, యోగా, రిలాక్సేషన్ టెక్నిక్స్‌ను దినచర్యలో భాగం చేసుకోవాలి ► ఎమోషనల్ సపోర్ట్ ఇచ్చే స్నేహితులు, కుటుంబ సభ్యులతో అనుభవాలను పంచుకోవాలి ► క్రమం తప్పకుండా వ్యాయామం, పోషకాహారం, తగినంత నిద్రతో ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరచుకోవాలి ► మానసిక ఆరోగ్యం మీద శారీరక ఆరోగ్యం సానుకూలమైన ప్రభావాన్ని చూపిస్తుంది ► ఆల్కహాల్ లేదా మాదకద్రవ్యాల వినియోగాన్ని వెంటనే ఆపేయాలి. అవి లక్షణాలను మరింత తీవ్రతరం చేస్తాయి. చికిత్స ప్రభావానికి అంతరాయం కలిగిస్తాయి ► ఇవన్నీ ప్రయోజనకరంగా ఉన్నప్పటికీ పూర్తి అంచనా, పర్సనల్ ట్రీట్మెంట్ ప్లాన్ కోసం సైకాలజిస్ట్‌ను సంప్రదించాలి ► వక్రీకరించిన ఆలోచనా విధానాలను సవరించడం, ఆందోళనను తగ్గించడం, సామాజిక నైపుణ్యాలను మెరుగుపరచడంలో CBT ప్రభావవంతంగా ఉంటుంది ► SPDకి సంబంధించిన ఇతర లక్షణాలను తగ్గించడానికి అవసరమైతే సైకియాట్రిస్ట్ సూచించిన మందులను వాడాల్సి ఉంటుంది. భావోద్వేగాలు కనిపించవు.. PD ఉన్నవారు బాల్యంలో ఎవరితోనూ కలవకపోవడం, స్కూల్లో అండర్ పెర్పార్మెన్స్ ఉండవచ్చు. దీన్ని ఆసరాగా చేసుకొని ఇతరులు బెదిరించవచ్చు, ఆటపట్టించవచ్చు. టీనేజ్‌లో ఒంటరితనం, సామాజిక ఆందోళన అధికస్థాయిలో ఉంటుంది. ఈ కింది లక్షణాల్లో ఐదు, అంతకంటే ఎక్కువ లక్షణాలు ఉంటాయి. ► ఒంటరిగా ఉండటం, కుటుంబ సభ్యులు తప్ప సన్నిహితులు లేకపోవడం.. ► అసలు ఎమోషన్స్ లేకపోవడం లేదా పరిమిత, అనుచితమైన భావోద్వేగ ప్రతిస్పందనలుండటం.. ► పదిమందిలోకి వెళ్లాలంటే విపరీతమైన ఆందోళన.. ► ప్రమాదంకాని.. లేని పరిస్థితులను, సందర్భాలను కూడా తప్పుగా అర్థం చేసుకోవడం.. ► విచిత్రమైన, అసాధారణమైన ఆలోచనలు, నమ్మకాలు లేదా ప్రవర్తన.. ► ఇతరుల విధేయత గురించి నిరంతరం సందేహాలు, అనుమానాస్పద లేదా మతిస్థిమితం లేని ఆలోచనలు.. ► టెలిపతి వంటి ప్రత్యేక శక్తులపై నమ్మకం.. ► ఎదురుగా లేని వ్యక్తులు కూడా ఉన్నట్లుగా భ్రమలు.. ► చిత్రవిచిత్రంగా దుస్తులు ధరించడం, చిందరవందరగా కనిపించడం.. ► అస్పష్టంగా, అసాధారణంగా మాట్లాడటం, విచిత్రమైన ప్రసంగశైలి.. స్కిజోఫ్రెనియా అని పొరపాటు వ్యక్తిత్వం మనల్ని ప్రత్యేకంగా నిలిపే ఆలోచనలు, భావోద్వేగాలు, ప్రవర్తనల కలయిక. మెదడు పనితీరు, జన్యుశాస్త్రం, పర్యావరణ ప్రభావాలు, చూసి నేర్చుకున్న ప్రవర్తనల వల్ల వ్యక్తిత్వంలో లోపాలు ఏర్పడవచ్చు. PD ఉన్నవారిని స్కిజోఫ్రేనియా అని అనుకునే ప్రమాదం ఉంది. కానీ PDలో భ్రమలు లేదా భ్రాంతులతో సైకోటిక్ ఎపిసోడ్లు క్లుప్తంగా ఉంటాయి. భ్రమలు, వాస్తవానికి మధ్య వ్యత్యాసం తెలుసుకోగలరు. స్కిజో ఫ్రేనియా లాంటి మానసిక రుగ్మత ఉన్న బంధువు ఉంటే PD వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉండవచ్చు. ఈ డిజార్డర్ ఉన్న వ్యక్తుల్లో డిప్రెషన్, యాంగ్జయిటీ, ఆత్మహత్య ఆలోచనలు, పని, పాఠశాల, సంబంధబాంధవ్యాలకు సంబంధించిన సమస్యలు, సామాజిక సమస్యలు ఉంటాయి. సైకాలజిస్ట్ విశేష్, psy.vishesh@gmail.com -
పేకాట కూడా మానసిక జబ్బేనా!
విజయ్ ఒక సేల్స్ రిప్రజెంటేటివ్. 35 సంవత్సరాల వయసు. పెళ్లయి ఇద్దరు పిల్లలు ఉన్నారు. గత రెండేళ్లుగా విపరీతంగా పేక ఆడుతున్నాడు. దానివల్ల ఆర్థిక సమస్యలతో పాటు, కుటుంబంలో గొడవలూ వస్తున్నాయి. భార్య ఎంత వారించినా పట్టించుకోవడం లేదు. విడాకుల వరకూ వచ్చింది. చివరకు భార్య, కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకు కౌన్సెలింగ్ కోసం వచ్చాడు. విజయ్ బాల్యం నుంచీ అతని తల్లిదండ్రులు వీకెండ్లో సరదాగా పేక ఆడతారని అతనితో మాట్లాడినప్పుడు తెలిసింది. విజయ్, అతని సోదరుడు పెద్దయ్యాక నలుగురూ కలసి ఆడేవారు. అలా పేకాట అలవాటుగా మారింది. అన్నదమ్ములిద్దరూ అప్పుడప్పుడూ క్రికెట్ బెట్టింగ్ కూడా చేసేవారు. సేల్స్ రిప్రజేంటేటివ్గా మారాక ప్రతి నెలా టార్గెట్‌ను అందుకోవడం, కొలీగ్స్‌తో పోటీపడాల్సి రావడంతో విజయ్ జీవితంలోకి ఒత్తిడి చేరింది. పెళ్లి చేసుకుని, పిల్లలు పుట్టాక కుటుంబ బాధ్యతలతో ఒత్తిడి మరింత పెరిగింది. వీటన్నిటినీ తట్టుకోవడానికి అతను పేకాటను ఒక మార్గంగా మార్చుకున్నాడు. ఏ ఏటికి ఆ ఏడు అందులో కూరుకుపోసాగాడు. చివరకు పేక ఆడకుండా ఉండలేని స్థితికి చేరుకున్నాడు. దీన్ని గాంబ్లింగ్ డిజార్డర్ లేదా కంపల్సివ్ గాంబ్లింగ్ అంటారు. ఇదో మానసిక రుగ్మత. అదొక సంక్లిష్ట పరిస్థితి గాంబ్లింగ్ డిజార్డర్ అనేది జీవ, మానసిక, పర్యావరణ కారకాల కలయికతో ప్రభావితమైన సంక్లిష్ట పరిస్థితి. డోపమైన్, సెరటోనిన్, నోర్ ఎపినెఫ్రిన్ వంటి కొన్ని న్యూరోట్రాన్స్మిటర్లలో అసాధారణతలు దీనికి కారణం కావచ్చు. జన్యువులు కూడా కారణమని అధ్యయనాలు సూచిస్తున్నాయి జూదం ఆడే వాతావరణంలో పెరగడం దానిపట్ల సానుకూల ధోరణికి దోహదపడవచ్చు. విజయ్ విషయంలో అదే జరిగింది విజయ్ జీవితంలోలా అధిక స్థాయి ఒత్తిడి, ప్రధాన జీవన మార్పులు లేదా బాధాకరమైన సంఘటనలు జూదం రుగ్మతలను ప్రేరేపించవచ్చు డిప్రెషన్, యాంగ్జయిటీ లేదా అఈఏఈ వంటి మానసిక ఆరోగ్య పరిస్థితులున్న వ్యక్తులు వారి లక్షణాలను ఎదుర్కోవడానికి జూదానికి అలవాటు పడవచ్చు రిస్క్ తీసుకునే ధోరణి, ఇంపల్సివిటీ, సెన్సేషన్ సీకింగ్ లాంటి వ్యక్తిత్వ లక్షణాలు జూదానికి అలవాటు చేయవచ్చు క్లబ్బులు, కాసినోలు, ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లు అందుబాటులో ఉండటం కూడా కారణమవుతుంది ఒత్తిళ్లకు ప్రతిస్పందనగా జూదం ఒక దుర్వినియోగమైన కోపింగ్ మెకానిజంగా మారుతుంది అప్పుడప్పుడూ గెలుపొందడం వల్ల వచ్చే ఆనందం మెదడులో డోపమైన్‌ను విడుదల చేస్తుంది. దానికోసం మళ్లీ మళ్లీ ఆడతారు. ఆడకుండా ఉండలేరు గాంబ్లింగ్ డిజార్డర్ ఒక బిహేవియరల్ అడిక్షన్. జూదం ఆడకుండా ఉండలేకపోవడం దీని ప్రధాన లక్షణం. నిరంతరం జూదం గురించి లేదా జూదానికి డబ్బు ఎలా సంపాదించాలనే దానిగురించి ఆలోచిస్తుంటారు. ఈ రుగ్మత ఉన్న వ్యక్తులు... తమకు కావల్సిన స్థాయి ఎగ్జయిట్మెంట్ కోసం పెద్ద మొత్తంలో పందేలు కాస్తుంటారు. జూదం వల్ల సమస్యలు వస్తున్నాయని తెలిసి ఆపేయాలని ప్రయత్నించినా ఆపలేకపోతారు. జూదం తగ్గించినప్పుడు లేదా ఆపేసినప్పుడు చిరాకు, అసౌకర్యం, ఉద్రిక్తత.. జూదం వల్ల గతంలో వచ్చిన నష్టాలను మళ్లీ జూదంతోనే భర్తీ చేయాలనే ప్రయత్నం.. జూదం ఆడుతున్నామనే విషయాన్ని దాచడానికి అబద్ధాలు చెప్పడం, మోసం చెయ్యడం.. విద్య, ఉపాధి అవకాశాలు కోల్పోతున్నా.. జీవితంలో, కెరీర్లో సమస్యలు ఎదురవుతున్నా గుర్తించలేకపోవడం.. జూదం వల్ల వచ్చే నష్టాల నుంచి బయటపడేందుకు అప్పులు చేయడం, ఆస్తులు అమ్మడం.. జూదం రుణాలను చెల్లించడానికి మోసం, దొంగతనం లాంటి చట్టవిరుద్ధమైన కార్యకలాపాలలో పాల్గొనడం.. ఆర్థిక, మానసిక, వైవాహిక సమస్యలు వచ్చినా జూదం కొనసాగించడం.. సీబీటీతో తప్పించుకోవచ్చు.. జూదం వ్యసనం వల్ల ఏర్పడిన ఆర్థిక సమస్యలను పరిష్కరించుకోవడానికి బాధ్యతాయుతమైన ఆర్థిక నిర్వహణ నేర్చుకోవడం అవసరం. వాస్తవిక బడ్జెట్ వేసుకోవడానికి, జూదం వల్ల వచ్చిన అప్పులు తీర్చడానికి ఆర్థిక సలహాదారుతో కలసి ప్రణాళిక రూపొందించుకోవాలి. గాంబ్లర్స్ అనానిమస్, సపోర్ట్ గ్రూపుల్లో చేరడం ద్వారా సమస్యను మరింత లోతుగా అర్థం చేసుకోవచ్చు · ఒత్తిడిని తప్పించుకోవడానికి జూదం వైపు వెళ్లకుండా మైండ్‌ఫుల్‌నెస్, వ్యాయామం, హాబీస్ లాంటి ప్రత్యామ్నాయ కోపింగ్ మెకానిజమ్స్‌ను ప్రాక్టీస్ చేయాలి ·గుర్తించడం, అభ్యాసం చేయడం, జూదాన్ని ఆశ్రయించకుండా ఒత్తిడిని జయించడానికి సహాయపడుతుంది జూదానికి సంబంధించిన అహేతుక ఆలోచనలు, నమ్మకాలను గుర్తించడానికి, సవాలు చేయడానికి కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ ఉపయోగపడుతుంది కోపింగ్ స్ట్రాటజీస్‌ను అభివృద్ధి చేయడంలో, కోరికలను నియంత్రించుకోవడానికి సీబీటీ సహాయపడుతుంది కమ్యూనికేషన్‌ను మెరుగుపరచడం, నమ్మకాన్ని పునర్నిర్మించడం, కుటుంబ మద్దతును పొందడానికి ఫ్యామిలీ థెరపీ ఉపయోగపడుతుంది · జూదం వల్ల వచ్చే మానసిక రుగ్మతలను తగ్గించడానికి మందులు సహాయపడతాయి. --సైకాలజిస్ట్ విశేష్, psy.vishesh@gmail.com (చదవండి: ఏళ్ల తరబడి వదలని దిగులు.. పరిష్కారం ఏమిటి?) -
ప్రముఖుల విడాకులు.. మానసిక కారణాలు..!
ప్రముఖుల రొమాన్సులు, వివాహాలే కాదు విడాకులు కూడా మీడియాలో ప్రముఖ స్థానాన్ని ఆక్రమించుకుంటాయి. అందరూ దాని గురించి చర్చించుకుంటారు. గతంలో ఆమీర్ ఖాన్-కిరణ్ రావు, అర్జున్ రాంపాల్-మెహర్ జెసియా, సమంతా రూత్ ప్రభు-నాగ చైతన్య, తాజాగా సానియా మీర్జా-షోయబ్ మాలిక్ విడాకులు చర్చనీయాంశాలయ్యాయి. అసలు కారణాలు ఎవరికీ తెలియకున్నా ఎవరి కారణాలు వారు వెతుక్కున్నారు. అయితే ఈ విడాకులను గాసిప్ లెన్స్ ద్వారా కాకుండా సైకాలజీ లెన్స్ ద్వారా పరిశీలిస్తే, వాటి నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు దొరుకుతాయి. ఫేమ్ వల్ల వచ్చే మానసిక ఒత్తిడి నిరంతరం ప్రజల దృష్టిలో ఉండటం ఏ సెలబ్రిటీ జీవితానికైనా కష్టమైన, నష్టం కలిగించే విషయం. వారు చేసే చిన్న పొరపాటు కూడా భూతద్దంలో చూస్తారు, ఘోరమైన తప్పిదంగా మీడియాలో ప్రొజెక్ట్ చేస్తారు. దీంతో ప్రజల్లో ఉన్న ఇమేజ్ ను కాపాడుకోవడానికి వారు నిరంతరం ఒత్తిడి అనుభవిస్తారు. ఈ ఒత్తిడి ఇద్దరి మధ్య ఉన్న ఇబ్బందులను, విభేదాలను తీవ్రతరం చేస్తుంది. బంధం, అనుబంధం డీప్‌గా మారడానికి ఆటంకం కలిగిస్తుంది. పాపులారిటీతో పెరిగే అహంభావం కీర్తి, సంపద, నిరంతర పాపులారిటీ వ్యక్తిలో అహంభావాన్ని, తద్వారా నార్సిసిజంను పెంచుతాయి. అంటే తనను తాను ప్రేమించుకోవడం పెరిగిపోతుంది. ఫలితంగా భాగస్వామి పట్ల సహానుభూతి, రాజీపడే తత్వం తగ్గిపోతాయి. భాగస్వాములను పాపులారిటీలో తనతో పోటీపడే కాంపిటీటర్‌గా మారుస్తుంది. పరస్పర విశ్వాసం, సాన్నిహిత్యాన్ని దెబ్బతీస్తుంది. బిజీ జీవితంతో బలహీనపడే బంధాలు సెలబ్రిటీల జీవితం ఎడతెగని షెడ్యూల్లు, చాలాకాలం పాటు విడివిడిగా ఉండాల్సి రావడంతో పరస్సర భావోద్వేగ సంబంధాన్ని కొనసాగించడంలో, విశ్వాసాన్ని పెంపొందించడంలో సవాళ్లుగా మారతాయి. భౌతికంగా, మానసికంగా అధిగమించలేని దూరాలను సృష్టిస్తాయి. చివరికి ఒకరితో ఒకరు డిస్ కనెక్ట్ అవుతారు. ఆర్థిక భద్రత పెంచే స్వాతంత్య్ర భావం సెలబ్రిటీలకు ఉండే ఆర్థిక భద్రత ఒక గిఫ్ట్‌లా కనిపించినప్పటికీ, సాంప్రదాయిక నిబద్ధతలను చెరిపేసే స్వాతంత్య్ర భావాన్ని కూడా పెంపొందిస్తుంది. ఫలితంగా సెలబ్రిటీ జంటలు వారి కాపురంలో ఎదుర్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు, సయోధ్యకోసం తక్కువ మొగ్గు చూపుతారు. ఎవరిదారి వారు చూసుకుంటారు. కరిష్మా కపూర్, సంజయ్ కపూర్ల న్యాయ పోరాటంలో హైలైట్ కావడం గమనార్హం. అయితే ఇవన్నీ సాధారణ మానసిక కారణాలు మాత్రమే. ప్రతి సెలబ్రిటీ విడాకుల వెనుక దానివైన ప్రత్యేక కారణాలు ఉంటాయని గుర్తించడం చాలా ముఖ్యం. పాపులారిటీకే ప్రాధాన్యం ఇవ్వడం, వైవాహికేతర సంబంధాలు, మానసిక ఒత్తిళ్లు, అహంకారం, అననుకూలత లాంటి అనేక అంశాలు అనేకం ఉండవచ్చు. తెరపై మెరిసే తారల జీవితాల్లో కూడా మనకు తెలియని అనేకానేక చీకటి గాధలు, బాధలు ఉండవచ్చు. వాటిని పరిష్కరించుకునే క్రమంలో అహానికి పోకుండా, ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకుంటే మెరుగైన ఫలితం ఉండవచ్చు. --సైకాలజిస్ట్ విశేష్ ఫోన్ నెం: 8019 000066 psy.vishesh@gmail.com (చదవండి: పేరెంట్స్ నిర్లక్ష్యం చేస్తే Animal లా మారతారా? ) -
అతిగా ఆలోచిస్తున్నారా?
మిత్ర ఒక ప్రముఖ ఎంఎన్సీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్. తన పనితీరుతో రెండేళ్లలోనే టీమ్ లీడర్‌గా, నాలుగేళ్లలో ప్రాజెక్ట్ మేనేజర్‌గా ఎదిగాడు. ఆ తర్వాతే అసలు సమస్య మొదలైంది. ప్రతి ప్రాజెక్ట్ గురించీ ఒకటికి పదిసార్లు ఆలోచించేవాడు. పదే పదే మీటింగ్‌లు పెట్టేవాడు. కానీ ఏ నిర్ణయమూ తీసుకునేవాడు కాదు. దాంతో ప్రాజెక్టులు ఆలస్యమయ్యేవి. దీంతో మేనేజ్మెంట్ అతని పనితీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేయసాగింది. ఆలోచనల నుంచి తప్పించుకోవాలని ఎంత ప్రయత్నించినా మిత్రకు సాద్యం కావడంలేదు. ఆఖరుకు కాఫీ తాగాలా, టీ తాగాలా అనే విషయం మీద కూడా అతిగా ఆలోచించడం అతనికే చిరాకు కలిగిస్తోంది.మిత్రలా అతిగా ఆలోచించడం ఎవరినైనా ఇబ్బంది పెడుతుంది ఎప్పుడో ఒకసారి! ఆ సమయంలో ఎంత ప్రయత్నించినా మనసు చేసే ఆ అతి వాగుడును ఆపలేం. అది అప్పుడప్పుడయితే ఫర్వాలేదు. కానీ అది అలవాటుగా మారితేనే సమస్య. ఆ అతి ఆలోచన.. పనులకు అడ్డుపడుతుంది, మానసిక ప్రశాంతతను దెబ్బతీస్తుంది. ఇంకా చాలారకాలుగా చికాకు పెడుతుంది. ఎందుకలా ఆలోచిస్తారు?అతిగా ఆలోచించడానికి అనేక కారణాలున్నాయి. అందులో ప్రధానమైనవి.. తప్పులు చేయకూడదనే భయం, అన్నీ పర్ఫెక్ట్గా చేయాలనే తపన, ఆత్మవిశ్వాసం లోపించడం. ఇంకా ఆందోళన (యాంగ్జయిటీ), ఆత్మగౌరవలోపం (లో సెల్ఫ్ ఎస్టీమ్), గతకాలపు గాయాలు కూడా.ప్రాక్టికాలిటీకి అతీతంగా ఉన్నత ప్రమాణాలను సెట్ చేసుకున్నప్పుడు ప్రతి నిర్ణయం ఒత్తిడికి కారణమవుతుంది.అది ఎప్పటికీ అంతంకాని ఆలోచనలతో అనాలసిస్ పెరాలసిస్‌కు కారణమవుతుంది. మిత్ర చేస్తున్న తప్పు ఇదే. తప్పులు చేయకూడదనే, ఫెయిల్యూర్ కాకూడదనే భయమే మిత్ర ఎక్కువగా ఆలోచించడానికి కారణం. అలాగే ప్రతికూల ఫలితాలు వస్తాయేమోననే ఆందోళనా అతను అతిగా ఆలోచించేలా చేస్తోంది. ఆత్మవిశ్వాసం లోపించించడం, ఆత్మగౌరవం తగ్గడం అతిగా ఆలోచించడానికి ఆజ్యం పోస్తుంది. తన సామర్థ్యం, నిర్ణయాలను సందేహిస్తూ అతిగా ఆలోచించేలా చేస్తాయి.ఆందోళన చెందేటప్పుడు మన చింతలను నియంత్రించుకునేందుకు కొంచెం అతిగా ఆలోచించడం సహజం. కానీ అది పరిస్థితిని మరింత దిగజారుస్తుంది. గతంలో తీవ్రమైన.. బాధాకరమైన అనుభవాలకు లోనైనవారు దానికి సంబంధించిన మానసిక వ్యథను ఎదుర్కోవడానికి అతిగా ఆలోచిస్తుంటారు. నష్టాలు.. కష్టాలు..ఎవరైనా చెవి పక్కన చేరి నసపెడుతుంటే మీరు భోజనాన్ని ఎంజాయ్ చేయగలరా? అతిగా ఆలోచించడం కూడా అలాంటిదే. అది మనసుకు మాత్రమే పరిమితం కాదు. జీవితంలోని ప్రతి అంశాన్నీ ప్రభావితం చేస్తుంది. నిరంతరం నెగెటివ్‌గా ఆలోచించడం మన ఎమోషనల్ వెల్–బీయింగ్‌ను దెబ్బతీస్తుంది. మన శక్తిని హరించివేస్తుంది. మానసిక ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్‌కు కారణమవుతుంది. గత సంఘటనలకు సంబంధించిన ఆలోచనలు, విశ్లేషణలు పదే పదే మనసులో పరుగెడుతున్నప్పుడు, భవిష్యత్తు గురించి పదే పదే భయపడుతున్నప్పుడు చేతిలో ఉన్న పనిపై లేదా చదువుపై దృష్టిపెట్టడం కష్టం. దాంతో వాయిదా వేస్తారు. అలా అలా చదువులు రోడ్డున పడతాయి. ఉద్యోగం అటకెక్కుతుంది. వ్యాపారం నష్టాల పాలవుతుంది. మానవ సంబంధాలూ దెబ్బతింటాయి. విముక్తి పొందడం ఇలా..మిత్రలా అతిగా ఆలోచించేవారు అతనిలాగే బాధపడాల్సిన అవసరం లేదు. ఆలోచనలపై నియంత్రణ సాధించేందుకు చేయగలిగేవి చాలా ఉన్నాయి. అంకితభావంతో ప్రయత్నిస్తే మనసులోని చాటర్ బాక్స్ నోరు మూయించవచ్చు. మితిమీరిన ఆలోచనలు మనసును కమ్మేసినప్పుడు మీరు నెగెటివ్ ట్రాప్‌లో పడ్డారని గుర్తించండి. ఇదే మీరు వేయాల్సిన తొలి అడుగు. ఆ తర్వాత నెగెటివ్ ఆలోచనలను సవాలు చేయండి. వాటిలో వాస్తవావాస్తవాలను విశ్లేషించండి.ఆలోచిస్తూ ఉండటం వల్ల ఎలాంటి ప్రయోజనమూ ఉండదని గుర్తించి, వాస్తవిక లక్ష్యాలను నిర్దేశించుకుని అడుగు వేయండి. మనసును ఇబ్బంది పెడుతున్న పని లేదా చదువులకు దూరంగా ఉండండి. మనసుకు ఆహ్లాదం లేదా విశ్రాంతి కలిగించే కార్యకలాపాలలో పాల్గొనండి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. ప్రతి రాత్రి 7–8 గంటలనిద్రను లక్ష్యంగా పెట్టుకోండి.మీ ఆందోళనల గురించి స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో మాట్లాడండి. శ్వాసను లేదా ఆలోచనలను గమనించడం, ధ్యానం ద్వారా మనసును మళ్లించవచ్చు. ఇవన్నీ చేసినా ఆలోచనలు తగ్గకపోతే ఆలస్యం చేయకుండా సైకాలజిస్టును కలవండి.కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీలోని కాగ్నిటివ్ రీస్ట్రక్చరింగ్ ద్వారా సైకాలజిస్ట్ మీకు సహాయపడగలరు.దీని ద్వారా అతిగా ఆలోచించడానికి ఆజ్యం పోసే కాగ్నిటివ్ డిస్టార్షన్స్‌ను గుర్తించవచ్చు, వాటిని సవాలు చేసి మరింత వాస్తవిక, సానుకూల ఆలోచనలతో భర్తీ చేయవచ్చు. దీనివల్ల చీకటి నుంచి కాంతికి మారినట్లు మనం విషయాలను మరింత స్పష్టంగా చూడగలం. సైకాలజిస్ట్ విశేష్, psy.vishesh@gmail.com -
భయాందోళనకు గురిచేసే జబ్బు.. మరి పరిష్కారం?
శివానీ మధ్య తరగతి మహిళ. గతంలో ఒక కంపెనీలో ఉద్యోగం చేసింది. కానీ బస్సు లేదా మెట్రోలో వెళ్లాలంటే భయం ఏర్పడటంతో ఏడాది కిందట ఉద్యోగానికి రాజీనామా చేసింది. భర్త శివాజీ కూడా ఆమె సమస్యను అర్థం చేసుకుని మద్దతుగా నిలిచాడు. అయితే ఆమె ఆందోళన రోజురోజుకూ పెరిగిపోసాగింది. తోడు లేకుండా కనీసం పక్క వీథిలోని కొట్టుకి కూడా వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. అగ్రోఫోబియా లక్షణాలు ఒంటరిగా ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటేభయం జనం మధ్య ఉండాలన్నా లేదా క్యూలో వేచి ఉండాలన్నా భయం సినిమా థియేటర్లు, ఎలివేటర్లు, చిన్న దుకాణాలు వంటి మూసి ఉన్న ప్రదేశాలంటే భయం పార్కింగ్ స్థలాలు, వంతెనలు, మాల్స్ వంటి బహిరంగ ప్రదేశాలంటే భయం బస్సు, విమానం, రైలు వంటి ప్రజా రవాణాను ఉపయోగించాలన్నా భయం బయటకు వెళ్లాలంటే ఎవరైనా తోడు రావాలని కోరుకోవడం భయాందోళనల నుంచి తప్పించుకునేందుకు బయటకు వెళ్లకుండా ఇంటికే పరిమితం కావడం ఆరు నెలలు లేదా అంతకంటే ఎక్కువ కాలం ఈ లక్షణాలతో బాధపడటం. అనేక కారణాలు అగ్రోఫోబియాకు కారణమేమిటో కచ్చితంగా తెలియదు. అనువంశికంగా వస్తుందని వైద్యులు భావిస్తారు. జెనెటిక్స్, హెల్త్ కండిషన్, పర్సనాలిటీ, స్ట్రెస్, అనుభవాలు.. అన్నీ ఈ రుగ్మత అభివృద్ధిలో పాత్ర పోషిస్తాయి. సాధారణ జనాభాలో ఒక శాతం కంటే తక్కువమందిలో ఇది కనిపిస్తుంది. పురుషులకంటే స్త్రీలలో రెండు నుంచి∙ మూడు రెట్లు ఎక్కువగా ఉంటుంది. యువతలో ఇది సర్వసాధారణం. పానిక్ డిజార్డర్, ఇతర ఫోబియాలు ఉన్నవారిలో, అగ్రోఫోబియాతో బాధపడుతున్న కుటుంబ సభ్యులు, బాధాకరమైన అనుభవాలు ఉన్నవారిలో ఇది వచ్చే అవకాశం ఉంది. దీనికి చికిత్స తీసుకోకుండా తాత్సారం చేస్తే.. డిప్రెషన్, ఆత్మహత్య ఆలోచనలకు, ఆత్మహత్య ప్రయత్నాలకు దారితీస్తుంది. ఒకరోజు ధైర్యం చేసి బయటకు వెళ్లి.. అక్కడే కుప్పకూలింది. పక్కింటివారు చూసి ఇంటికి తీసుకువచ్చారు. ఏమైందని భర్త ప్రశ్నిస్తే.. ఒళ్లంతా వణుకు వచ్చిందని, శ్వాస ఆడలేదని, ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదని చెప్పింది. ఒక్కోసారి గుండె పట్టేసినట్టుగా ఉంటోందనీ చెప్పింది. శివాజీ వెంటనే ఆమెను హాస్పిటల్‌కి తీసుకువెళ్లి అన్నిరకాల వైద్య పరీక్షలు చేయించాడు. ఆరోగ్యపరంగా అంతా బాగానే ఉందని వైద్యుడు చెప్పాడు. శివానీ మానసికంగా భయపడుతోందని, వెంటనే సైకాలజిస్ట్‌ను సంప్రదించమని సూచించడంతో మా సెంటర్‌కి వచ్చారు. ఇంటికే పరిమితం చేసే జబ్బు శివానీతో అరగంట మాట్లాడాక ఆమె యాంగ్జయిటీ డిజార్డర్‌తో సతమతమవుతోందని అర్థమైంది. దాన్ని నిర్ధారించుకునేందుకు కొన్ని టెస్టులు ఇచ్చాను. వాటి ద్వారా ఆమె అగ్రోఫోబియాతో బాధపడుతోందని తేలింది. ఇది ఒక రకమైన ఆందోళన రుగ్మత. కొన్ని ప్రదేశాలకు వెళ్తే మైకం, మూర్ఛ, పడిపోవడం లేదా అతిసార వంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతాయని భయపడుతుంటారు. ఆయా ప్రదేశాలకు వెళ్తే గుండె వేగంగా కొట్టుకుంటుంది. చేతులు చెమట పట్టడం, వణుకు, శ్వాస సమస్యలు, ఛాతీ నొప్పి రావచ్చు. వీటన్నింటి నుంచి తప్పించుకునేందుకు అడుగు బయట పెట్టకుండా ఇంటికే పరిమితమవుతారు. సాధన, సహాయమే మార్గం.. అగ్రోఫోబియాను నివారించడానికి కచ్చితమైన మార్గం లేదు. భయపడే పరిస్థితులను తప్పించుకునే కొద్దీ ఆందోళన పెరుగుతుంది. జీవితం కష్టంగా మారుతుంది. దాన్నుంచి బయటపడాలంటే ముందుగా మీ ప్రయత్నాలు మీరు చేయాలి. వాటివల్ల ఫలితం కనిపించకపోతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా సైకాలజిస్ట్‌ను కలవాలి. మీరు భయపడే ప్రదేశాలకు మళ్లీ మళ్లీ వెళ్లడం సాధన చేయాలి. దానివల్ల ఆయా ప్రదేశాల్లో మీకు సౌకర్యం పెరుగుతుంది. ఇలా స్వంతంగా చేయడం కష్టమైతే, కుటుంబ సభ్యులు లేదా స్నేహితుల సహాయం తీసుకోవాలి· యోగా, ప్రాణాయామం, జాకబ్ సన్, మసాజ్, విజువలైజేషన్ లాంటి రిలాక్సేషన్ టెక్నిక్స్ సాధన చేయాలి· మద్యం, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి. అలాగే కాఫీని కూడా మితంగానే సేవించడం మంచిది · తగినంత నిద్ర పోవాలి. ప్రతిరోజూ శారీరకంగా చురుకుగా ఉండేందుకు ప్రయత్నించాలి. కూరగాయలు, పండ్లతో సహా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి· యాంగ్జయిటీ డిజార్డర్స్ ఉన్న వ్యక్తుల కోసం ఏర్పాటు చేసిన సపోర్ట్ గ్రూప్స్‌లో చేరడం వలన.. ఇలాంటి సవాళ్లను ఎదుర్కొంటున్న ఇతరులతో కనెక్ట్ అవ్వడానికి, అనుభవాలను పంచుకోవడానికీ ఆ గ్రూప్స్ సహాయపడతాయి· అప్పటికీ సమస్య తగ్గకపోతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా సైకియాట్రిస్ట్‌ను కలవాలి. కన్సల్టెంట్.. కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ ద్వారా మీకు సహాయపడతారు· క్రమం తప్పకుండా థెరపీ సెషన్ ్సకు హాజరవ్వాలి. థెరపిస్ట్‌తో మాట్లాడాలి. చికిత్సలో నేర్చుకున్న టెక్నిక్స్‌ను ప్రాక్టీస్ చేయాలి· ఆందోళన తీవ్రంగా ఉంటే సైకియాట్రిస్ట్ సూచించిన మందులు క్రమం తప్పకుండా వాడాలి. --సైకాలజిస్ట్ విశేష్ (చదవండి: French Bubble Palace Facts: బుడగల మాదిరి భవనం..కట్టడానికే 14 ఏళ్లు..కానీ.. ) -
ఫాన్స్‌తో వ్యవహారం మామూలుగా ఉండదు..అదొక మనస్తత్వ శాస్త్రం!
అది న్యూస్ రిపోర్టర్ల వాట్సాప్ గ్రూప్. అందులో ఒక వీడియో. ఆ వీడియోలో.. కొత్తగా రిలీజ్ అయిన సినిమా థియేటర్ ముందు సినిమా హాల్ నుంచి బయటకు వచ్చిన వారిని "సినిమా ఎలా వుంది ? అని అడుగుతున్నారు . సాధారణంగా " సూపర్ " " హండ్రెడ్ డేస్ " వెయ్యి రోజులు ఖాయం " కలియుగాంతం దాకా ఈ సినిమా ఆడుతుంది " అని ఇలాంటి సందర్బాల్లో సమాధానాలు వస్తుంటాయి . అది అభిమానులు చెప్పే మాటలో లేక మానేజ్ చేసినవో తెలియదు. లోతుగా పరిశీలించి తెలుసుకోవాల్సినంత సీన్ లేదు. ఇలాంటి వీడియో ఒకటి ఉంటుంది అనుకొని దాన్ని చూడలేదు. ఆ గ్రూప్‌లో వచ్చిన కామెంట్స్ చూసి అసలు వీడియోలో ఏముందో అని క్లిక్ చేసి డౌన్ లోడ్ అయ్యాక చూసా. ఎవరో వ్యక్తి సినిమా బాగోలేదు అని కామెంట్ కామెంట్ చేసాడు. దానితో అక్కడ ఉన్న అభిమానులు అతనిపై దాడి చేసారు. చూడగానే మనసు చివుక్కు మంది. ఆ వ్యక్తి తన మనసులోని ఫీలింగ్స్ చెప్పాడో లేదా కావాలనే దుష్ప్రచారం చేసాడో .. తరువాతి మాట . సినిమా బాగా లేదు అనగానే దాడి చేస్తారా ? మనం ఏమైనా తాలిబన్ల రాజ్యంలో ఉన్నామా? అనిపించింది. హీరోల అభిమానులు అలాగే ఉంటారని మా బాల్యంలో చెప్పుకునేవారు. ఒకప్పుడూ ఎంజీఆర్ సినిమా తొలి రోజు సినిమాకు వెళితే అయన అభిమానులు తలతో ఫైట్ చేసేవారట. అమాయకుడు ఎవరైనా వెళితే తలపగలడం ఖాయం అట. అది ఎంత వరకు నిజమో కానీ ఫాన్స్ వ్యవహారం మామూలుగా ఉండదు . అదొక సామాజిక- మనస్తత్వ శాస్త్ర టాపిక్. ఒక్క మాటలో చెప్పాలంటే ఒక రకమయిన మానసిక రుగ్మత. కాలం మారినా దక్షిణాదిన ఈ ధోరణి మారలేదు. అభిమానులు తమకు అసెట్ అని చాలా మంది సో కాల్డ్ హీరోస్ అనుకొంటారు. అభిమానులు వీరి మెడకు వేలాడే గుదిబండలు అని .. పాపం గ్రహించలేరు. అంత తెలివితేటలు ఉండే అవకాశం తక్కువ. భ్రమల లోకంలో బతికేస్తుంటారు . సాగినన్నాళ్లు సాగుతుంది. ఒక్కోసారి ఆకాశం నుంచి నేలకు పడిపోతారు. నిన్నటి హీరో.. పాపం తీవ్ర డిప్రెషన్ తో బాధ పడుతున్నాడు . ఇంకా ఎంతో మంది ఇలాంటి కోవలో ఉన్నారో లేదా కాస్త తక్కువ స్థాయిలో డిప్రెషన్లో ఉన్నారు అనేదాని గురించి మాట్లాడడం .. విశ్లేషించడం టైం వేస్ట్. చిత్రమయిన విషయం ఏమిటంటే అంత బహిరంగంగా దాడి చేయడం. నిజానికి ఇది తప్పు .. మీకు అభిమానం ఉంటే సినిమా ఎందుకు బాగోలేదో చెప్పుమని అడగొచ్చు అంతే గాని దాడి చెయ్యడం ఏంటి ? అని ఎవరూ అడిగినట్లు లేరు . పోలీస్‌లు ఏమి చేసారో తెలియదు. అటుపై ఇంకో వీడియో చూసా. దాడి జరిగిన వ్యక్తి .. హీరో నన్ను ఇంటికి పిలిస్తే సంతోష పడుతాను అంటున్నాడు . అలాంటివి జరగవు అని నాకు తెలుసు. ఒక వేళా హీరో జరిగిన దానికి సారీ చెప్పాలనుకున్నా అభిమానులు .. సలహాదారులు చెప్పనివ్వరు. నెక్స్ట్ సీన్.. ఫేస్బుక్ ఫ్రెండ్ .. ఓ మహిళ. ఆ మధ్యలో మెసెంజర్లో లండన్ గురించి సమాచారం ఇచ్చారనుకొంటా! నా పోస్ట్‌ల పై కామెంట్స్ పెడుతుంటారు . నేను లోతుగా పరిశీలించలేదు. ఆమెకు దేవుడంటే భక్తి . విదేశాల్లో ఉన్నా భారతీయ సంస్కృతి సంప్రదాయాలు అంటే అమితంగా ఇష్ట పడే వ్యక్తి. ఆమె ఆ సినిమా నచ్చలేదని పోస్ట్ పెట్టినట్టున్నారు . దాని పై కొంత మంది తనని టార్గెట్ చేసుకొంటూ ఎలా మాట్లాడింది అంటూ.. పోస్ట్‌లు పెట్టారు . నేను ఎప్పుడో కానీ ఫేస్‌బుక్‌లోకి వెళ్లి ఇతరుల పోస్ట్‌లు చూడను. అనుకోకుండా ఈ పోస్ట్ కనిపించింది. ఆ సినిమాను విమర్శించింది కాబట్టి ఆమె హిందువు కాదు అని.. ఇంకా రకరకాలుగా కామెంట్స్ చేసారని అర్థం అయ్యింది. సినిమా సినిమానే . జీవితం కాదు. ఒకే ఇంట్లో ఒకరికి సినిమా నచ్చోచ్చు. ఇంకొరికి నచ్చక పోవచ్చు. అదేమీ అసాధారణం కాదు. సినిమా నచ్చకపొతే ఆమె తన అభిప్రాయాన్ని పోస్ట్ చేసారు . ఒకవేళ..లేదు సినిమా బాగుంది .. ఈ కోణం లో చూడాలి" అని కామెంట్ చెయ్యడం సమంజసం. తప్పు లేదు. కానీ వ్యక్తిగత దాడి చేయడానికి అసలు ఎవరు మీరు ? సినిమా అభిమానులా ? హీరో అభిమానులా? అంటే కాదు. నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం ఏమిటంటే ఒక పార్టీ అభిమానులు (అందరూ కాదు .. కొందరు ) ఇలా పోస్ట్ లు పెట్టడాన్ని చూసాను. ఇదేమి పార్టీ వ్యవహారం కాదు. పార్టీ అధికారికంగా ఎలాంటి ప్రకటన ఇవ్వదు . వీరికి సినిమా నచ్చితే దాన్ని పోస్ట్ చేసుకోవచ్చు. సినిమాపై వస్తున్న విమర్శల్ని కూడా తిప్పి కొట్టొచ్చు. కానీ ఆ క్రమం లో వ్యక్తిగత కామెంట్స్ చేయడం .. పిచ్చి పిచ్చి లాజిక్‌లు తియ్యడం .. సినిమాను విమర్శించిన వారందరూ సంఘ వ్యతిరేఖ శక్తులు వీరికి భక్తి లేదు .. దేవుడంటే నమ్మకం లేదు అని కామెంట్స్ చెయ్యడం .. ఈ పనులు వల్ల వీరు ఏమి సాధించారో నాకైతే అర్థం కాలేదు. మొదట్లో సదరు హీరోపై నాకు సధాభిప్రాయం ఉండేది. కష్టపడుతాడు, అనుకొన్నది సాధించాలన్న పట్టుదల ఉంది అనుకొనే వాడిని. ఆ సినిమాపై, ప్రారంభంలో నాకు ఎలాంటి అభిప్రాయం లేదు . కానీ ఈ అభిమానులు చేసిన రచ్చ తరువాత ఒక నెగటివ్ ఫీలింగ్ వచ్చింది. నాలా నెగటివ్ ఫీలింగ్స్ తెచ్చుకొన్నవారు కచ్చితంగా వేలల్లో/లక్షల్లో వుంటారు. చాలా మంది అన్నీ గమనిస్తుంటారు. జరుగుతున్న దాన్ని బట్టి ఒక అభిప్రాయాన్ని ఏర్పర్చుకుంటారు. అభిమానం అంటే నిర్మాణాత్మక విమర్శలను ఆహ్వానించడం. అంతే కానీ తనకు నచ్చనిది అవతలి వారు చెప్పారు కనుక వారిపై మాటలతో దాడికి రెడీ అవ్వడం కాదు. అత్యుత్సాహంతో ఎవరో ఇద్దరు ముగ్గురు కామెంట్ చెయ్యడంతో నొచ్చుకొన్న ఆమె " ఛీ .. మీరు ఇలాంటి వారా?" అంటూ మొత్తం ఆ ఐడియాలజీ వర్గాన్ని అసహ్యించుకొంటూ పోస్ట్ పెట్టారు . సెల్ఫ్ గోల్ వేసుకోవడం అని దీన్నే అంటారని చెబుతున్నారు.మానసిక శాస్త్ర పరిశోధకులు, - వాసిరెడ్డి అమర్ నాథ్, మానసిక శాస్త్ర పరిశోధకులు, సీనియర్ విద్యావేత్త. (చదవండి: పేద విద్యార్థులకు అండగా నాట్స్ అధ్యక్షుడు) -
మీకంటే తోపు లేడనుకుంటున్నారా? అయితే సమస్యే..!
హరిప్రసాద్ ఒక వైద్యుడు. ఎంబీబీఎస్ చదివాక వైజాగ్‌లో ప్రాక్టీస్ ప్రారంభించాడు. ఆదాయం అంతంతమాత్రంగా ఉండేది. దాంతో డిస్టెన్స్‌లో సైకాలజీ చదివి, ఒక డాక్టరేట్ కొనుక్కొని సైకాలజిస్ట్ అవతారమెత్తాడు. తానో కొత్త మనోవైద్య విధానాన్ని కనిపెట్టానని, మాట్లాడకుండానే ఎలాంటి మానసిక సమస్యలనైనా సులువుగా నయం చేస్తానని పత్రికల్లో ప్రకటనలిచ్చేవాడు. ప్రపంచంలో ఏ సైకాలజిస్ట్, సైకియాట్రిస్ట్ నయం చేయని కేసులను తాను నయం చేశానని గొప్పలు చెప్పుకునేవాడు. అతని మాటలు, ప్రకటనలు నమ్మి వచ్చిన వ్యక్తులను తన వాక్చాతుర్యంతో ప్రభావితం చేసేవాడు. లక్షలకు లక్షలు ఫీజు తీసుకునేవాడు. అలా చేయడం ప్రొఫెషనల్ ఎథిక్స్‌కి భిన్నమని తెలిసినా ఏమాత్రం గిల్టీగా ఫీలయ్యేవాడు కాదు. తన క్లయింట్లందరినీ ఒక కల్ట్‌గా మార్చి, వాళ్లు తనను ప్రశంసిస్తుంటే పొంగిపోతుండేవాడు. ఇక ఇంట్లో హరిప్రసాద్ ప్రవర్తన మరింత ఘోరంగా ఉండేది. ‘నేనొక మోనార్క్‌ని, నా మాటే అందరూ వినాలి’ టైపులో ఉండేవాడు. భార్య లత ఏం చేసినా తప్పులు పట్టడం, నీకేం తెలియదంటూ విమర్శించడం, ఇల్లు దాటి అడుగు బయటకు పెట్టనీయకపోవడం, తనను అసలు మనిషిలా గౌరవించకపోవడం ఆమె మనసును విపరీతంగా గాయపరచింది. దాంతో ఆమె డిప్రెషన్‌కి లోనై, భర్తకు తెలియకుండా కౌన్సెలింగ్‌కి వచ్చింది. నేనే గొప్పనుకోవడం కూడా సమస్యే లత మాటలను బట్టి హరిప్రసాద్ నార్సిసిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్(NPD) తో బాధపడుతున్నాడని అర్థమైంది. ఇది ఉన్నవారికి తనకు తానే ముఖ్యం. నిత్యం తమ గురించే ఆలోచించుకుంటూ, తనకంటే గొప్పవారు లేరనుకుంటారు. రోజూ తమ విజయాల గురించి మాట్లాడతారే తప్ప ఇతరులు తన గురించి ఏమనుకుంటున్నారనే విషయాన్ని అస్సలు అర్థం చేసుకోరు. ఏ మాత్రం గిల్టీ ఫీలింగ్ లేకుండా ఇతరులను దోపిడీ చేస్తారు. ఇతరుల అవసరాలను పణంగా పెట్టి తాము అనుకున్నది సాధిస్తారు. తానే అధికుడననే దృష్టి ఉండటం వల్ల ఇతరులను వస్తువులుగా చూస్తారు, మానవత్వాన్ని కోల్పోతారు. ఏకపక్ష దృక్పథాన్ని కలిగి ఉండటం, భాగస్వామి నుంచి అమితంగా ఆశించడం వల్ల వైవాహిక జీవితంలో సమస్యలుంటాయి. ఈ డిజార్డర్ మహిళల కన్నా పురుషుల్లో ఎక్కువ. కొందరు రాజకీయ నాయకుల్లోనూ, మత గురువుల్లోనూ, కల్ట్ లీడర్స్లోనూ ఈ లక్షణాలుంటాయి. NPD లక్షణాలు.. ఈ వ్యక్తిత్వ రుగ్మత యుక్తవయస్సులో ప్రారంభమై వివిధ సందర్భాల్లో కనిపిస్తుంది. తాను గొప్పవాడిననే ఫాంటసీ, ప్రవర్తన, నిత్యం ప్రశంసలు కోరుకోవడం, సహానుభూతి లేకపోవడం ఈ రుగ్మత ప్రధాన లక్షణాలు. ఈ కింది లక్షణాల్లో ఐదు లేదా అంతకంటే ఎక్కువ ఉంటే NPD ఉన్నట్లే. గోరంత ప్రతిభను, విజయాలను కొండంతగా చేసి చెప్పుకోవడం.. తన విజయం, శక్తి, తేజస్సు, అందం, ప్రేమ అపరిమితమనే భారీ ఊహలు.. తానో ప్రత్యేకమైన వ్యక్తినని, తనను, తన సిద్ధాంతాలను సాధారణ వ్యక్తులు అర్థం చేసుకోలేరని భావించడం.. మితిమీరిన అభిమానాన్ని కోరుకోవడం.. దానికోసం అబద్ధాలు చెప్పడం లేదా రాయడం.. అసమంజసమైన అంచనాలు.. తన లక్ష్యాలను సాధించుకోవడానికి ఇతరులను మోసం చేయడం లేదా వాడుకోవడం.. ఇతరుల భావాలు, అవసరాలను గుర్తించడానికి ఇష్టపడకపోవడం.. తరచుగా ఇతరులపై అసూయపడటం లేదా ఇతరులు తన పట్ల అసూయపడుతున్నారని నమ్మడం.. అహంకార ప్రవర్తనతో ఇతరులను ప్రతికూలంగా అంచనా వేయడం.. విమర్శను ఎదుర్కోవడంలో తీవ్ర ఇబ్బంది.. తన లోపలి అభద్రత, అసమర్థత, వైఫల్యం బయటపడతాయేమోననే భయం. ఎందుకు వస్తుంది? • వారసత్వంగా వచ్చిన గుణాలు.. • మితిమీరిన విమర్శలు లేదా మితిమీరిన ప్రేమతో ముంచెత్తే తల్లిదండ్రులను కలిగి ఉండటం.. • కఠినమైన పేరెంటింగ్, పేరెంట్స్ నిర్లక్ష్యం.. • భారీ అంచనాలను సెట్ చేసుకోవడం.. ∙ • లైంగిక సమస్యలు, సాంస్కృతిక ప్రభావాలు.. ∙ • న్యూరోబయాలజీ వల్ల! పరిష్కారమేమిటి? NPD ఉన్న వ్యక్తులు తాము చేసేదంతా సరైనదే అనుకుంటారు. కాబట్టి వారికి వారుగా చికిత్స పొందే అవకాశం ఉండదు. అందుకని కుటుంబ సభ్యులే గుర్తించి తీసుకురావాల్సి ఉంటుంది. దీనికి ఎలాంటి మందులూ లేవు. ప్రోగ్రెసివ్ రిలాక్సేషన్, మెడిటేషన్ కొంత ఉపయోగపడతాయి. సీబీటీ, డీబీటీ, సిస్టమాటిక్ డీసెన్సిటైజేషన్ వంటి థెరపీల ద్వారా మరింత సహాయం చేయవచ్చు. వ్యక్తి ఆత్మగౌరవాన్ని పెంచడం, వాస్తవిక అంచనాలను అందించడం లక్ష్యంగా థెరపీ సాగుతుంది. ఇతరులను సహానుభూతితో అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. సొంత బలాలు, బలహీనతలను గుర్తించేలా, విమర్శలు అంగీకరించేలా సిద్ధం చేస్తుంది. బాల్యంలోని సంఘర్షణలను, వాటిని ఎదుర్కోవడానికి ఉపయోగించిన డిఫెన్స్ మెకానిజాన్ని అర్థంచేసుకుని, కొత్త డిఫెన్స్ మెకానిజాన్ని అలవాటు చేయిస్తుంది. NPD ఉన్నవారిని అర్థం చేసుకుని, కలసి జీవించేలా కుటుంబ సభ్యులను ఎడ్యుకేట్ చేస్తుంది. వారితో సర్దుకుపోవడం అసాధ్యమని భావిస్తే విడిపోయేందుకు సిద్ధం చేయిస్తుంది. -సైకాలజిస్ట్ విశేష్ psy.vishesh@gmail.com -
అనుమానిస్తున్నారని వేరేలా చూడకండి.. అది కూడా ఓ లాంటి జబ్బే..!
డాక్టర్ మాధవ్ యూనివర్సిటీలో మాథ్స్ ప్రొఫెసర్. ఇల్లు, కాలేజీ, లైబ్రరీ తప్ప మరో లోకం తెలియదు. ఎలాంటి దురలవాట్లు లేవు. కానీ తన భార్యను నిరంతరం అనుమానిస్తుంటాడు. ఆమె మొబైల్ ఫోన్, మెయిల్స్, వాట్సప్ చాట్స్ ఎప్పటికప్పుడు చెక్ చేస్తుంటాడు. దాంతో ఇంట్లో రోజూ గొడవలే. ఇరువైపుల పెద్దలు సర్దిచెప్పినా ఫలితం లేకపోయింది. అతను తన ప్రవర్తనను మార్చుకోవాలని ప్రయత్నించినా సఫలం కాలేదు. దాంతో మాధవ్ భార్య విడాకులు కోరుకుంటోంది. యూనివర్సిటీలో మాధవ్ టాలెంట్‌పై అందరికీ అపారమైన గౌరవం. క్లాస్ మొదలుపెట్టాడంటే స్టూడెంట్స్ అందరూ మొబైల్ చూడకుండా వింటారు. తన ఆధ్వర్యంలో పదిమంది పీహెచ్డీ అందుకున్నారు. ప్రస్తుతం రెండు ప్రతిష్ఠాత్మకమైన అంతర్జాతీయ ప్రాజెక్టుల్లో పదిమంది రీసెర్చ్ స్కాలర్స్‌తో పనిచేయిస్తున్నాడు. కానీ అతనితో పనిచేయడమంటే నరకమని అందరూ భయపడుతుంటారు. ఎందుకంటే అతను ఎవ్వరినీ నమ్మడు. రీసెర్చ్ పేపర్స్ తీసుకెళ్తారేమోనని నిత్యం అనుమానిస్తుంటాడు. ఆయన ఎవ్వరితో కలవడని, రీసెర్చ్ స్కాలర్స్నే కాదు సహోద్యోగులను కూడా ఏ మాత్రం నమ్మడని చెప్పారు. అందరినీ అనుమానించే మాధవ్ తన కారు డ్రైవర్‌ను మాత్రం గుడ్డిగా నమ్మేస్తాడు. అదెందుకో ఎవ్వరికీ అర్థం కాలేదు. వ్యక్తిత్వంలోనూ రుగ్మతలుంటాయి ప్రొఫెసర్ మాధవ్ లాంటి వ్యక్తులు జీవితంలో ఎదురైనప్పుడు ‘అనుమానపు పక్షి’ అని ముద్ర వేసి అందరూ తప్పుకుంటారు. కానీ అలా అనుమానించడం కూడా ఒక మానసిక రుగ్మతేనని, దానికి చికిత్స ఉందని గుర్తించరు. మాధవ్‌కు ఉన్న సమస్యను పారనాయిడ్ పర్సనాలిటీ డిజార్డర్ (పీపీడీ) అంటారు. అయితే ఇది డిప్రెషన్, యాంగ్జయిటీ లాంటి మానసిక రుగ్మత కాదు, వ్యక్తిత్వ రుగ్మత. అంటే అనుమానించడం అతని మనస్తత్వంలో భాగంగా ఉంటుంది. అందువల్లనే దీన్ని గుర్తించడం కష్టం. ప్రతి వ్యక్తికీ ఒక వ్యక్తిత్వం ఉంటుంది. జీన్స్‌తో పాటు, పుట్టి పెరిగిన పరిసరాలు, ఎదురైన అనుభవాలు, ఎదుర్కొన్న కష్టాలు, స్నేహాలు వ్యక్తిత్వ నిర్మాణంలో ప్రధానపాత్ర పోషిస్తాయి. ఈ క్రమంలో కొందరికి ఎదురైన అనుభవాలు వారి వ్యక్తిత్వంలో లోపాలు తీసుకొస్తాయి. ఆ వ్యక్తిత్వ లోపాలు తీవ్రమైనప్పుడు వ్యక్తిత్వ రుగ్మతలుగా మారతాయి. అలాంటి వ్యక్తిత్వ రుగ్మతలు పది రకాలున్నట్లు గుర్తించారు. అందులో పీపీడీ ఒకటి. అందరినీ అనుమానించడం దీని ప్రధాన లక్షణం. బాల్యంలో ఏర్పడిన గాయాలే కారణం పీపీడీ ఎందుకు వస్తుందనేది తెలియదు. ఆనువంశింకంగా వచ్చే జీన్స్‌తో పాటు, పుట్టి పెరిగిన పరిసరాలు ఇందుకు కారణమవుతాయని గుర్తించారు. ముఖ్యంగా బాల్యంలో తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయడం, నిరంతరం అనుమానించడం లేదా శారీరక, లైంగిక వేధింపులకు గురవ్వడం, తన భావోద్వేగాలను ఎవ్వరూ పట్టించుకోకపోవడం, ఒంటరిగా ఉండాల్సి రావడం, సోషల్ యాంగ్జయిటీ, హైపర్ సెన్సిటివిటీ ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని పరిశోధకులు గుర్తించారు. ఇలా బాల్యంలో ఎదురైన అనుభవాలు, ఏర్పరచిన గాయాలు మనస్తత్వంలో లోపాలుగా మారి 18 ఏళ్ల వయస్సు తర్వాత వ్యక్తిత్వ రుగ్మతలుగా బయటపడతాయి. దాదాపు 0.5 నుంచి 4.5 శాతం మందిలో ఈ రుగ్మత ఉంటుంది. స్కిజోఫ్రీనియా లేదా డెల్యూజనల్ డిజార్డర్ ఉన్నవారి బంధువుల్లో పీపీడీ కనిపిస్తుందని ఆధారాలున్నాయి. పారనాయిడ్ పర్సనాలిటీ డిజార్డర్ లక్షణాలు.. అందరూ తనకు ద్రోహం చేయడానికి ప్రయత్నిస్తుంటారని భావించడం, అందరినీ అనుమానించడం ఎవ్వరినీ తేలిగ్గా నమ్మరు. స్నేహితులు, సహచరులు, భాగస్వామి... ప్రతివారినీ అనుమానంగా చూస్తారు ఎలాంటి ఆధారాలు లేకుండానే, జీవిత భాగస్వామి నమ్మకద్రోహం చేస్తున్నారని అనుమానిస్తుంటారు వారి అనుమానాస్పద ధోరణిని సమర్థించుకునేందుకు ఆధారాలను వెతుకుతూ ఉంటారు ఈ తరహా వ్యక్తిత్వం ఉన్నవారు రిలేషన్‌షిప్‌ను సరిగా నెరపలేరు ఏదైనా అంశంలో ఫెయిల్ అయినప్పుడు చాలా సెన్సెటివ్‌గా ఫీలవుతూ తాము అవమానానికి గురైనట్లు భావిస్తుంటారు. తీవ్రంగా పగబడతారు తాను ఏదైనా చెప్తే తనకు వ్యతిరేకంగా ఉపయోగిస్తారనే భయంతో ఇతరులతో సమాచారం పంచుకోవడాన్ని ఇష్టపడరు విశ్రాంతి తీసుకోవడం కష్టంగా ఉంటుంది ∙ శత్రుత్వం, మొండితనం, వాగ్వివాదం కలిగి ఉంటారు ∙కుటుంబ సభ్యులే బాధ్యత తీసుకోవాలి ∙పీపీడీని నిరోధించడం సాధ్యం కానప్పటికీ, దాన్ని గుర్తించి చికిత్స తీసుకోవడం ద్వారా ఆలోచనలను నియంత్రించుకుని సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు పీపీడీ ఉన్నవారు సాధారణంగా చికిత్సకు అంగీకరించరు. కాబట్టి కుటుంబసభ్యులే ఒప్పించి చికిత్స ఇప్పించాల్సి ఉంటుంది కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ లేదా డయలెక్టిక్ బిహేవియర్ థెరపీ వంటివి కమ్యూనికేషన్, కాన్ఫిడెన్స్‌ను పెంచుకోవడానికి సహాయపడతాయి సైకోథెరపీ ద్వారా ఇతరులను అర్థం చేసుకోవడం, నమ్మకం పెంచుకోవడం, సరైన సంబంధాలను పెంచుకోవడం సాధ్యమవుతుంది పీపీడీకి దీర్ఘకాలిక చికిత్స అవసరం ఉంటుంది. అదంతా ఫీజు కోసమేనని థెరపిస్ట్ ఉద్దేశాలను కూడా అనుమానించే అవకాశం ఉంది. కాబట్టి కుటుంబ సభ్యులే బాధ్యత తీసుకుని థెరపీకి తీసుకురావాల్సి ఉంటుంది. -సైకాలజిస్ట్ విశేష్