కిడ్నాపర్కు సినిమా చూపించిన బుడతడు | Kidnapped boy escapes using tricks learned from crime films | Sakshi
Sakshi News home page

కిడ్నాపర్కు సినిమా చూపించిన బుడతడు

Published Sun, Oct 18 2015 7:20 PM | Last Updated on Thu, Jul 11 2019 7:49 PM

కిడ్నాపర్కు సినిమా చూపించిన బుడతడు - Sakshi

కిడ్నాపర్కు సినిమా చూపించిన బుడతడు

సిచుహాన్(చైనా):  సినిమాల్లో చూసిన సీన్ల ఆధారంగా ఓ బుడతడు కిడ్నాపర్ ను బోల్తా కొట్టించాడు. కిడ్నాపర్ నుంచి తనను తాను రక్షించుకోవడమే కాకుండా.. ఆ దుండగుడిని పోలీసులు పట్టుకునేలా చేసి.. భేష్ అనిపించుకున్నాడు. ఈ సంఘటన చైనాలోని సిచుహాన్ ప్రాంతంలో చోటు చేసుకుంది.

స్కూల్ వెళుతున్న సమయంలో క్సియోహీ(13) అనే బాలుడు సెప్టెంబర్ 24న కిడ్నాప్ కు గురయ్యాడు. అతన్ని అపహరించిన దుండగుడు ఒక మారుమూల గ్రామంలోని ఒక పాడుబడ్డ ఇంట్లో బంధించాడు. ఆ ఇంట్లో క్సియోహీని తాళ్లతో కట్టేసి, కళ్లకి గంతలు కట్టి, మాట్లాడకుండా మూతికి టేప్ అతికించాడు. కొన్ని రోజుల తర్వాత కిడ్నాపర్ బాలుని తండ్రికి ఫోన్ చేసి.. మీ కొడుకు మీకు దక్కాలంటే డబ్బులు కావాలని డిమాండ్ చేశాడు. అదే సమయంలో బాలుడు కిడ్నాపర్ బయటికి వెళ్లాడేమోనని భావించి తాళ్లను విప్పుకొని తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. అయితే బయటే ఉన్న కిడ్నాపర్ కంట పడ్డాడు. ఏముంది అతన్ని మళ్లీ తీసుకువచ్చి మరింత పటిష్టంగా తాళ్లతో బంధించి బయటకు వెళ్లాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు బాలుడు తప్పించుకోవడానికి మరో పక్కా ప్లాన్ వేశాడు.

ఈసారి అతడు తప్పించుకోవడానికి ముందు రెండు సార్లు బిగ్గరగా అరిచాడు. ఎలాంటి బదులు రాకపోవడంతో అతను అక్కడినుంచి వెళ్లాడని భావించాడు. కుర్చీకి కట్టిన తాళ్లని విప్పుకొని ఎలాగోలా రోడ్డు పైకి వచ్చాడు. అయితే అతని రెండు చేతులు తాళ్లతో గట్టిగా కట్టి, మోహానికి ప్లాస్లిక్ బ్యాగు చుట్టి ఉంది. ఆ అవతారంలో అగమ్యగోచరంగా రోడ్డుపై ఉన్న ఆ బాలున్ని అదృష్టం కొద్ది స్థానికుడొకరు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో బాలుని తండ్రి దగ్గర డబ్బు వసూలు చేసే పనిలో ఉన్న కిడ్నాపర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

క్రైం సినిమాల్లో హీరోలు దుండగులనుంచి తప్పించుకోవడాన్ని చూసి ఆ ట్రిక్స్ ను ఇక్కడ అప్లై చేశానని బాలుడు చెప్పాడు. కిడ్నాపర్ కు సహకరించినట్టే ఉండి..అతన్ని నమ్మించి సమయం దొరికితే టక్కున తప్పించుకోవాలని సినిమాల ద్వారానే నేర్చుకున్నానని.. 22 రోజులు కిడ్నాపర్ చెరలో ఉండి తప్పించుకున్న ఆ బాలుడు తెగ సంబరంతో చెబుతున్నాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement