మిర్పూర్: సిరీస్‌లో నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో భారత మహిళల జట్టు మెరిసింది. బంగ్లాదేశ్‌తో బుధవారం జరిగిన రెండో వన్డేలో హర్మన్‌ప్రీత్ కౌర్ బృందం 108 పరుగులతో ఘనవిజయం సాధించింది. జెమీమా రోడ్రిగ్స్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో భారత జట్టు విజయంలో కీలకపాత్ర పోషించింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు గెల్చుకున్న జెమీమా 86 పరుగులు చేయడంతో పాటు బంతితో రాణించి 3 పరుగులిచ్చి 4 వికెట్లు తీసింది.
తాజా ఫలితంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ప్రస్తుతం రెండు జట్లు 1–1తో సమంగా ఉన్నాయి. నిర్ణయాత్మక మూడో వన్డే శనివారం జరుగుతుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 228 పరుగులు సాధించింది. జెమీమా రోడ్రిగ్స్ (78 బంతుల్లో 86; 9 ఫోర్లు), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (88 బంతుల్లో 52; 3 ఫోర్లు) అర్ధ సెంచరీలతో భారత్‌ను ఆదుకున్నారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 131 పరుగుల భాగస్వామ్యం జోడించారు. వన్డేల్లో తన అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన 22 ఏళ్ల జెమీమా 2019 తర్వాత మళ్లీ వన్డేల్లో అర్ధ సెంచరీ చేసింది.
వైస్ కెప్టెన్ స్మృతి మంధాన (58 బంతుల్లో 36; 4 ఫోర్లు), హర్లీన్ (36 బంతుల్లో 25) కూడా రాణించారు. బంగ్లాదేశ్ బౌలర్లలో సుల్తానా ఖాతూన్, నహీదా అక్తర్ రెండు వికెట్ల చొప్పున తీశారు. 229 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 35.1 ఓవర్లలో 120 పరుగులకు ఆలౌటైంది. ఫర్జానా హఖ్ (47; 5 ఫోర్లు), రీతూ మోని (27; 3 ఫోర్లు), ముర్షిదా ఖాతూన్ (12; 3 ఫోర్లు) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. జెమీమా తన ఆఫ్ స్పిన్ మాయాజాలంతో 3.1 ఓవర్లు వేసి కేవలం 3 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టింది. లెగ్ స్పిన్నర్ దేవిక వైద్య 30 పరుగులిచ్చి 3 వికెట్లు తీసింది. మేఘన సింగ్, స్నేహ్ రాణా, దీప్తి శర్మలకు ఒక్కో వికెట్ లభించింది.
8⃣6⃣ runs with the bat 👏
— BCCI Women (@BCCIWomen) July 19, 2023
4️⃣ wickets with the ball 😎@JemiRodrigues' all-round performance makes her the Player of the Match 👌🏻#TeamIndia win by 108 runs in the second ODI 👏
Scorecard - https://t.co/6vaHiS9Qad #BANvIND pic.twitter.com/CuUNtJpFOo
చదవండి: Stuart Broad: 600 వికెట్ల క్లబ్‌లో.. టెస్టు క్రికెట్ చరిత్రలో నాలుగో బౌలర్‌గా
Comments
Please login to add a commentAdd a comment