టీమిండియా మహిళా జట్టు ప్రస్తుతం హెడ్‌కోచ్ లేకుండానే సిరీస్‌లు ఆడుతోంది. గతేడాది డిసెంబర్‌లో రమేశ్ పవార్‌ను ఎన్‌సీఏకు పంపించినప్పటి నుంచి మహిళల హెడ్‌కోచ్ పదవి ఖాళీగానే ఉంది. ఈ మధ్యలో భారత మహిళల జట్టు కోచ్ లేకుండానే టి20 వరల్డ్‌కప్ ఆడింది. తాజాగా బంగ్లాదేశ్‌తో సిరీస్‌ను కూడా కోచ్ లేకుండానే ఆడుతుంది. సరైన వ్యక్తి కోసం బీసీసీఐ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే మహిళల జట్టుకు కొత్త కోచ్ వచ్చే అవకాశముంది.
ఈ నేపథ్యంలో టీమిండియా వుమెన్స్ వైస్‌కెప్టెన్ స్మృతి మంధాన ప్రధాన కోచ్ వ్యవహారంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో ఇప్పటివరకు 1-1తో ఇరుజట్లు సమానంగా ఉన్నాయి. కీలకమైన మూడో వన్డే ఇవాళ జరుగుతుంది. అయితే మ్యాచ్‌కు ముందు స్మృతి మంధాన మీడియా సమావేశంలో పాల్గొంది.
మంధాన మాట్లాడుతూ.. ''సరైన ప్రధాన కోచ్‌ను నియమించేందుకు బీసీసీఐ కసరత్తు చేస్తోంది. జట్టు కోసం సుధీర్ఘంగా సేవలు అందించే కోచ్‌ను ఎంపిక చేయాలనేది బోర్డు ఉద్దేశం. ఆటగాళ్ల నుంచి చూస్తే మాకు కోచ్ లేకపోవడం వల్ల ఇప్పటికైతే ఎలాంటి ఇబ్బంది లేదు. నాణ్యమైన క్రికెట్ ఆడినంత కాలం కోచ్ లేకపోయినా టీమిండియా మహిళా జట్టుకు గెలిచే సత్తా ఉంటుంది. ప్రధాన కోచ్ లేకపోయినప్పటికి ఇతర కోచింగ్ సిబ్బంది అందుబాటులో ఉన్నారు.
వారి సూచనలు తీసుకుంటూ ముందు సాగుతున్నాం. వారిచ్చే సూచనలు మాకు ఉపయోగపడుతున్నాయి. మా చుట్టూ ఏం జరుగుతుందనేది జట్టుగా మాకు ముఖ్యం కాదు. మైదానంలో ఎలా ఆడుతున్నామన్నదే కీలకం. ఈ సిరీస్ ముగిసేలోగా జట్టు ప్రధాన కోచ్ విషయమై బీసీసీఐ నుంచి నిర్ణయం వచ్చే అవకాశం ఉంది. ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే వేచి చూడాలి. ప్రధాన కోచ్‌గా ఎవరొచ్చినా వారి సూచనలు, సలహాలు తీసుకొని జట్టును మరింత ఉన్నతంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకున్నాం'' అంటూ తెలిపింది.
చదవండి: Emerging Asia Cup:'నువ్వు మొదలెట్టావ్.. నేను పూర్తి చేశా; లెక్క సరిపోయింది'
Comments
Please login to add a commentAdd a comment