బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో వన్డేలో టీమిండియా 227 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. 410 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా జట్టు టీమిండియా బౌలర్ల దాటికి 182 పరుగులకే కుప్పకూలింది. షకీబ్ అల్ హసన్ 43 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. లిటన్ దాస్ 29, యాసిర్ అలీ 25, మహ్మదుల్లా 20 పరుగులు చేశారు. టీమిండియా బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ మూడు వికెట్లు తీయగా.. అక్షర్ పటేల్, ఉమ్రాన్ మాలిక్‌లు చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. కుల్దీప్, సుందర్, సిరాజ్‌లు తలా ఒక వికెట్ తీశారు.
అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ, కోహ్లి సెంచరీతో కదం తొక్కడంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 409 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్(131 బంతుల్లో 210, 24 ఫోర్లు, 10 సిక్సర్లు), విరాట్ కోహ్లి(91 బంతుల్లో 113).. చివర్లో వాషింగ్టన్ సుందర్ 37 పరుగులు చేయడంతో భారత్ 400 పరుగుల మార్క్‌ను అధిగమించింది.
ఇక వన్డేల్లో టీమిండియా 418గా ఉంది. 2007 వన్డే ప్రపంచకప్‌లో బెర్ముడాపై భారత్ 418 పరుగులు చేసింది. కొద్దిలో ఆ రికార్డు మిస్ అయింది. ఇక బంగ్లాదేశ్ బౌలర్లలో షకీబ్ అల్ హసన్, ఇబాదత్ హొసెన్, తస్కిన్ అహ్మద్‌లు తలా రెండు వికెట్లు తీయగా.. ముస్తాఫిజుర్ రహ్మాన్, మెహదీ హసన్‌లు చెరొక వికెట్ తీశారు. ఈ మ్యాచ్‌లో విజయం సాధించినప్పటికి టీమిండియా బంగ్లాకు సిరీస్‌ను కోల్పోయింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైన టీమిండియా ఆధిక్యాన్ని 2-1కి మాత్రమే తగ్గించగలిగింది. ఇక ఇరుజట్ల మధ్య రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు డిసెంబర్ 14 నుంచి మొదలుకానుంది.
Comments
Please login to add a commentAdd a comment