బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి రెండు వన్డేల్లో వరుసగా ఓటములు మూటగట్టుకొని సిరీస్ కోల్పోయిన టీమిండియా నామమాత్రమైన చివరి వన్డేలో మాత్రం జూలు విదిల్చింది. కెప్టెన్ రోహిత్ శర్మ స్థానంలో జట్టులోకి వచ్చిన యువ బ్యాట్స్‌మన్ ఇషాన్ కిషన్ తన వన్డే కెరీర్‌లోనే బెస్ట్ ఇన్నింగ్స్ ఆడగా.. వెటరన్ ప్లేయర్ విరాట్ కోహ్లి తన విలువేంటో చూపించాడు. వెరసి టీమిండియా బంగ్లాదేశ్‌తో మూడో వన్డేలో భారీ స్కోరు సాధించింది.
ఒక దశలో ఇషాన్ కిషన్, కోహ్లి జోరు చూసి టీమిండియా 450 మార్క్‌ను కచ్చితంగా దాటుతుందనిపించింది. కానీ వీళ్లద్దరు ఔటయ్యాకా స్కోరు నెమ్మదించింది. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో టీమిండియా 8 వికెట్ల నష్టానికి 409 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్(131 బంతుల్లో 210, 24 ఫోర్లు, 10 సిక్సర్లు), విరాట్ కోహ్లి(91 బంతుల్లో 113).. చివర్లో వాషింగ్టన్ సుందర్ 37 పరుగులు చేయడంతో భారత్ 400 పరుగుల మార్క్‌ను అధిగమించింది.
ఇక వన్డేల్లో టీమిండియా 418గా ఉంది. 2007 వన్డే ప్రపంచకప్‌లో బెర్ముడాపై భారత్ 418 పరుగులు చేసింది. కొద్దిలో ఆ రికార్డు మిస్ అయింది. ఇక బంగ్లాదేశ్ బౌలర్లలో షకీబ్ అల్ హసన్, ఇబాదత్ హొసెన్, తస్కిన్ అహ్మద్‌లు తలా రెండు వికెట్లు తీయగా.. ముస్తాఫిజుర్ రహ్మాన్, మెహదీ హసన్‌లు చెరొక వికెట్ తీశారు.
Comments
Please login to add a commentAdd a comment