బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో వన్డేలో టీమిండియా 227 పరుగుల తేడాతో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే తొలి రెండు వన్డేల్లో ఓటమి పాలయిన భారత్ 1-2 తేడాతో ఆతిథ్య జట్టుకు సిరీస్‌ను సమర్పించింది. అయితే మ్యాచ్‌లో టీమిండియా యువ ఆటగాడు ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీతో చెలరేగితే.. టీమిండియా రన్‌మెషిన్ విరాట్ కోహ్లి సెంచరీతో మెరిశాడు.
85 బంతుల్లోనే శతకాన్ని అందుకున్న కోహ్లికి వన్డేలలో ఇది 44వ సెంచరీ. 43 నుంచి 44 శతకం చేయడానికి కోహ్లీ ఏకంగా 40 నెలల సమయం తీసుకున్నాడు. ఈ సెంచరీ ద్వారా అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాళ్లలో కోహ్లీ రికీ పాంటింగ్ (71 సెంచరీలు) ను అధిగమించాడు. ఇక కోహ్లీ ముందున్నది సచిన్ టెండూల్కర్ మాత్రమే.సచిన్.. తన కెరీర్ లో వంద సెంచరీలు చేశాడు. ఇందులో టెస్టులలో 51, వన్డేలలో 49 సెంచరీలు సాధించాడు. అయితే కోహ్లీ మాత్రం వన్డేలలో ఇప్పటికే 44 సెంచరీలు చేశాడు. మరో ఐదు సెంచరీలు చేస్తే కోహ్లీ.. వన్డేలలో సచిన్ అత్యధిక రికార్డులను బద్దలుకొడుతాడు.
Comments
Please login to add a commentAdd a comment