మహిళల ఐపీఎల్ 2024 ఎడిషన్‌లో భాగంగా ఇవాళ (మార్చి 10) ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ తొలుత బ్యాటింగ్ చేసి 181 పరుగుల భారీ స్కోర్ (5 వికెట్ల నష్టానికి) చేసింది. జెమీమా రోడ్రిగెజ్ (36 బంతుల్లో 58; 8 ఫోర్లు, సిక్స్), అలైస్ క్యాప్సీ (32 బంతుల్లో 48; 8 ఫోర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడ్డారు. ఓపెనర్లు మెగ్ లాన్నింగ్ (29), షఫాలీ వర్మ (23) సైతం ఓ మోస్తరు స్కోర్లు చేశారు.
మారిజన్ కప్ 12, జొనాస్సెన్ 1, రాధా యాదవ్ ఒక పరుగు చేశారు. ఆర్సీబీ బౌలర్లలో శ్రేయాంక పాటిల్ 4 వికెట్లతో విజృంభించగా.. అషా శోభన ఓ వికెట్ దక్కించుకుంది. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఆర్సీబీ 7 ఓవర్లు పూర్తయ్యేసరికి వికెట్ నష్టానికి 49 పరుగులు చేసింది. స్మృతి మంధన (5) ఔట్ కాగా.. సోఫీ ఎక్లెస్‌స్టోన్ (8), ఎల్లిస్ పెర్రీ (36) క్రీజ్‌లో ఉన్నారు. మంధన వికెట్ క్యాప్సీకి దక్కింది.
కాగా, ఢిల్లీ క్యాపిటల్స్ ఈ సీజన్‌లో ఆడిన 6 మ్యాచ్‌ల్లో 4 విజయాలతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతుండగా.. ఆర్సీబీ 6 మ్యాచ్‌ల్లో 3 విజయాలతో మూడో ప్లేస్‌లో నిలిచింది. 7 మ్యాచ్‌ల్లో 5 విజయాలు సాధించిన ముంబై ఇండియన్స్ వరుసగా రెండో ఏడాది కూడా ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించగా.. యూపీ వారియర్జ్ (6 పాయింట్లు) నాలుగో స్థానంలో, గుజరాత్ జెయింట్స్ (2 పాయింట్లు) చివరి స్థానంలో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment