చెలరేగిన ఢిల్లీ బ్యాటర్లు.. ఆర్సీబీ బౌలర్లకు చుక్కలు | WPL 2024: Delhi Capitals Set 195 Runs Target For RCB | Sakshi
Sakshi News home page

చెలరేగిన ఢిల్లీ బ్యాటర్లు.. ఆర్సీబీ బౌలర్లకు చుక్కలు

Published Thu, Feb 29 2024 9:30 PM | Last Updated on Fri, Mar 1 2024 9:20 AM

WPL 2024: Delhi Capitals Set 195 Runs Target For RCB - Sakshi

మహిళల ఐపీఎల్‌ 2024లో భాగంగా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో ఇవాళ (ఫిబ్రవరి 29) జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ భారీ స్కోర్‌ చేసింది. టాస్‌ ఓడి ఆర్సీబీ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ.. నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. ఢిల్లీ​ బ్యాటర్లలో షఫాలీ వర్మ (31 బంతుల్లో 50; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), అలైస్‌ క్యాప్సీ (33 బంతుల్లో 46; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), మారిజన్‌ కప్‌ (16 బంతుల్లో 32; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), జెస్‌ జొనాస్సెన్‌ (16 బంతుల్లో 36 నాటౌట్‌; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), అరుంధతి రెడ్డి (4 బంతుల్లో 10 నాటౌట్‌; 2 ఫోర్లు) చెలరేగిపోయారు. కెప్టెన్‌ మెగ్‌ లాన్నింగ్‌ (11), జెమీమా రోడ్రిగెజ్‌ (0) నిరాశపరిచారు.

ఆర్సీబీ బౌలర్లలో సోఫీ డివైన్‌, డి క్లెర్క్‌ తలో 2 వికెట్లు పడగొట్టగా.. శ్రేయాంక పాటిల్‌ ఓ వికెట్‌ దక్కించుకుంది. ఆర్సీబీ బౌలర్లలో ఆశా శోభన (2-0-30-0), మోలినెక్స్‌ (3-0-23-0), వేర్హమ్‌ (1-0-13-0) దారాళంగా పరుగులు సమర్పించకోగా.. రేణుకా సింగ్‌ (4-0-28-0) వికెట్లు తీయలేకపోయినా పర్వాలేదనిపించింది.  అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగని ఆర్సీబీ ధాటిగా ఇన్నింగ్స్‌ను  ప్రారంభించింది. కెప్టెన్‌ స్మృతి మంధన 11 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌ సాయంతో 20 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. 2 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్‌ 20/0గా ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement