భారత మహిళా జట్టు స్టార్ బ్యాటర్ జెమిమా రోడ్రిగ్స్ బిగ్ బాష్ లీగ్-2022లో మెల్‌బోర్న్ స్టార్స్‌కు ప్రాతినిధ్యం వహించనుంది. దీంతో మెల్‌బోర్న్ స్టార్స్‌తో ఒప్పందం కుదర్చుకున్న మొదటి భారత క్రికెటర్‌గా రోడ్రిగ్స్ నిలిచింది. కాగా గత బీబీఎల్ సీజన్‌లో మెల్‌బోర్న్ రెనెగేడ్స్ తరుపున ఆడిన రోడ్రిగ్స్ అద్భుతంగా రాణించింది.
ఆమె గతేడాది టోర్నీలో 116 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో 333 పరుగులు చేసింది. ఇక 2018లో భారత్ తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేసిన రోడ్రిగ్స్.. ఇప్పటి వరకు 58 టీ20లు, 21 వన్డేల్లో ఆడింది. ఇక ఇప్పటికే పలు భారత మహిళా క్రికెటర్‌లు బిగ్‌బాష్ లీగ్‌లో పలు ఫ్రాంచైజీలతో ఒప్పందం కుదుర్చుకున్నారు.
బిగ్ బాష్ లీగ్‌లో భారత స్టార్ క్రికెటర్లు
ఇక ఇప్పటికే భారత మహిళా క్రికెటర్‌లు బిగ్‌బాష్ లీగ్‌లో పలు ఫ్రాంచైజీలతో ఒప్పందం కుదుర్చుకున్నారు. వారిలో స్మృతి మంధాన, దీప్తి శర్మ (సిడ్నీ థండర్), షఫాలీ వర్మ, రాధా యాదవ్ (సిడ్నీ సిక్సర్స్) తరపున ఆడగా.. రిచా ఘోష్ (హోబర్ట్ హరికేన్స్) హర్మన్‌ప్రీత్ కౌర్ ( మెల్ బోర్న్ రెనెగేడ్స్ ),రాధా యాదవ్ ( సిడ్నీ సిక్సర్స్) తరపున ప్రాతనిధ్యం వహిస్తున్నారు.
చదవండి: Suresh Raina Retirement: సురేష్ రైనా సంచలన నిర్ణయం.. క్రికెట్‌కు గుడ్‌బై
Comments
Please login to add a commentAdd a comment