భారత్ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్-2023కు కౌంట్ డౌన్ మొదలైంది. మరో 46 రోజుల్లో ఈ మెగా ఈవెంట్‌కు తెరలేవనుంది. అయితే ఈ మెగా టోర్నీకి ముందు ఐసీసీ, బీసీసీఐకి మరో తలనొప్పి వచ్చి పడింది. కొత్తగా ప్రకటించిన వరల్డ్‌కప్ షెడ్యూల్‌లో మార్పులు చేయాలని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సిఏ) బీసీసీఐను అభ్యర్దించినట్లు తెలుస్తోంది.
కాగా ఇప్పటికే గుజరాత్ క్రికెట్ అసోసియేషన్, బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అభ్యర్ధన మెరకు ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌లో ఐసీసీ స్వల్ప మార్పులు చేసిన సంగతి తెలిసిందే. కొత్త షెడ్యూల్ ప్రకారం మరో వారం రోజుల్లో టికెట్ల విక్రయాలకు కూడా బీసీసీఐ సిద్దమైంది. అంంతలోనే హెచ్‌సీఏ.. భారత క్రికెట్ బోర్డుకు షాకిచ్చింది.
కాగా వరల్డ్ కప్ కొత్త షెడ్యూల్ ప్రకారం, హైదరాబాద్ వేదికగా అక్టోబర్ 9వ తేదీన న్యూజిల్యాండ్, నెదర్లాండ్స్ తలపడనున్నాయి. ఆ మరుసటి రోజే(ఆక్టోబర్) 10వ తేదీన పాకిస్తాన్, శ్రీలంక మ్యాచ్ జరగాల్సి ఉంది. ఇలా వరుస రోజుల్లో మ్యాచ్‌లకు భద్రత కల్పించడం తమకు కష్టమవుతుందని హైదరాబాద్ పోలీసులు హెచ్‌సిఎకు తెలిపినట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలో పోలీసులల అభ్యర్దను పరిగణలోకి తీసుకున్న హెచ్‌సిఏ.. ఇదే విషయంపై బీసీసీఐకు లేఖ రాసింది. కాగా వాస్తవానికి పాక్-శ్రీలంక మ్యాచ్ ఆక్టోబర్ 12 హైదారాబాద్‌గా జరగాల్సింది. కానీ ఐసీసీ షెడ్యూల్ మార్చడంతో ఆ మ్యాచ్ రెండు రోజులు ముందు వచ్చింది. ఇక హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ రిక్వెస్ట్‌పై బీసీసీఐ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి
చదవండి: ODI WC 2023: సంజూ శాంసన్ కాదు.. వన్డే ప్రపంచకప్‌లో భారత వికెట్ కీపర్ అతడే!
Comments
Please login to add a commentAdd a comment