ఇంగ్లండ్ స్టార్ మహిళా క్రికెటర్ కేథరీన్ హెలెన్ స్కీవర్ బ్రంట్ 19 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికింది. అంతర్జాతీయ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగతున్నట్లు ఆమె ఇవాళ (మే 5) ప్రకటించింది. ఇంగ్లండ్ జాతీయ జట్టు తరఫున బ్రంట్ చివరిసారిగా ఫిబ్రవరిలో సౌతాఫ్రికా వేదికగా జరిగిన టీ20 వరల్డ్‌కప్‌లో పాల్గొంది. 2004లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన 37 ఏళ్ల బ్రంట్.. ఇంగ్లండ్ గెలిచిన రెండు వరల్డ్‌కప్‌ల్లో, ఓ టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఉంది.
రైట్ ఆర్మ ఫాస్ట్ బౌలర్, లోయర్ ఆర్డర్‌లో ఉపయోగకరమైన బ్యాటర్ అయిన బ్రంట్.. 14 టెస్ట్‌ల్లో 51 వికెట్లు, 184 పరుగుల.. 141 వన్డేల్లో 170 వికెట్లు, 1090 పరుగులు.. 112 టీ20ల్లో 114 వికెట్లు, 590 పరుగులు చేసింది. బ్రంట్.. టెస్ట్‌ల్లో 3 సార్లు, వన్డేల్లో 5 సార్లు ఐదు వికెట్ల ప్రదర్శనను నమోదు చేసింది. ఈమె ఖాతాలో 2 వన్డే హాఫ్ సెంచరీలు, ఓ టెస్ట్ అర్ధశతకం కూడా ఉన్నాయి.
కెరీర్ చరమాంకం వరకు ఫాస్ట్ బౌలర్‌గా రాణించిన బ్రంట్.. ఇంగ్లండ్ వుమెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్‌గా నాలుగు సార్లు ఎంపికైంది. బ్రంట్.. 2009 టీ20 వరల్డ్‌కప్ ఫైనల్లో న్యూజిలాండ్‌పై అత్యుత్తమ ప్రదర్శన (3/6) కనబర్చి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకుంది. బ్రంట్.. 2022 మేలో సహచర మహిళా క్రికెటర్ నాట్ స్కీవర్‌ను వివాహం చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment