Katherine Brunt
-
రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లండ్ స్టార్ పేసర్
ఇంగ్లండ్ స్టార్ మహిళా క్రికెటర్ కేథరీన్ హెలెన్ స్కీవర్ బ్రంట్ 19 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికింది. అంతర్జాతీయ క్రికెట్లోని అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగతున్నట్లు ఆమె ఇవాళ (మే 5) ప్రకటించింది. ఇంగ్లండ్ జాతీయ జట్టు తరఫున బ్రంట్ చివరిసారిగా ఫిబ్రవరిలో సౌతాఫ్రికా వేదికగా జరిగిన టీ20 వరల్డ్‌కప్‌లో పాల్గొంది. 2004లో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన 37 ఏళ్ల బ్రంట్.. ఇంగ్లండ్ గెలిచిన రెండు వరల్డ్‌కప్‌ల్లో, ఓ టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఉంది. రైట్ ఆర్మ ఫాస్ట్ బౌలర్, లోయర్ ఆర్డర్లో ఉపయోగకరమైన బ్యాటర్ అయిన బ్రంట్.. 14 టెస్ట్‌ల్లో 51 వికెట్లు, 184 పరుగుల.. 141 వన్డేల్లో 170 వికెట్లు, 1090 పరుగులు.. 112 టీ20ల్లో 114 వికెట్లు, 590 పరుగులు చేసింది. బ్రంట్.. టెస్ట్‌ల్లో 3 సార్లు, వన్డేల్లో 5 సార్లు ఐదు వికెట్ల ప్రదర్శనను నమోదు చేసింది. ఈమె ఖాతాలో 2 వన్డే హాఫ్ సెంచరీలు, ఓ టెస్ట్ అర్ధశతకం కూడా ఉన్నాయి. కెరీర్ చరమాంకం వరకు ఫాస్ట్ బౌలర్‌గా రాణించిన బ్రంట్.. ఇంగ్లండ్ వుమెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్‌గా నాలుగు సార్లు ఎంపికైంది. బ్రంట్.. 2009 టీ20 వరల్డ్‌కప్ ఫైనల్లో న్యూజిలాండ్‌పై అత్యుత్తమ ప్రదర్శన (3/6) కనబర్చి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకుంది. బ్రంట్.. 2022 మేలో సహచర మహిళా క్రికెటర్ నాట్ స్కీవర్‌ను వివాహం చేసుకుంది. -
ఇంగ్లండ్ బౌలర్‌కు షాకిచ్చిన ఐసీసీ
ఇంగ్లండ్ మహిళా ఫాస్ట్ బౌలర్ కేథరిన్ బ్రంట్‌కు ఐసీసీ షాకిచ్చింది. మ్యాచ్ సమయంలో అసభ్య పదజాలం ఉపయోగించి ఐసీసీ నియమావళి లెవెల్-1 నిబంధనను ఉల్లంఘించినందుకు గానూ కేథరిన్‌ను హెచ్చరించడమే గాక మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత విధించింది. ఇక డిసిప్లీనరి యాక్ట్ కింద ఒక పాయింట్ కోత విధించింది. ఏడాది కాలంలో కేథరిన్ బ్రంట్ ఐసీసీ నిబంధన ఉల్లఘించడం ఇది రెండోసారి. ఇప్పటికే రెండు డీమెరిట్ పాయింట్లు ఉండడంతో.. మరోసారి నిబంధన ఉల్లంఘిస్తే మాత్రం ఒక మ్యాచ్ నిషేధం ఎదుర్కొనే అవకాశం ఉంది. విషయంలోకి వెళితే.. శనివారం ఇంగ్లండ్, టీమిండియా మహిళల మధ్య కామన్వెల్త్ గేమ్స్ సెమీఫైనల్ మ్యాచ్ జరిగింది. భారత బ్యాటింగ్ సమయంలో ఇన్నింగ్స్ 17వ ఓవర్ కేథరిన్ బ్రంట్ వేసింది. దీప్తి శర్మ ఇచ్చిన క్యాచ్‌ను ఫీల్డర్ విడిచిపెట్టడంతో కేథరిన్ అసభ్య పదజాలం ఉపయోగిస్తూ కోపంగా అరిచింది. ఆమె వ్యాఖ్యలు స్టంప్ మైక్‌లో రికార్డ్ అయ్యాయి. దీంతో మ్యాచ్ అనంతరం ఐసీసీ నిబంధనల ప్రకారం ఆర్టికల్ 2.3 నిబంధన ఉల్లఘించిన కేథరిన్ బ్రంట్‌కు హెచ్చరిస్తూ ఒక డీమెరిట్ పాయింట్ విధిస్తున్నట్లు మ్యాచ్ రిఫరీ స్పష్టం చేశారు. తొలిసారిగా కామన్వెల్త్ క్రీడల్లో ప్రవేశపెట్టిన మహిళల టి20 క్రికెట్లో భారత జట్టు సత్తా చాటింది. ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరుస్తూ హర్మన్‌ప్రీత్ బృందం ఫైనల్లోకి అడుగు పెట్టింది. ఫలితంగా స్వర్ణం లేదా రజత పతకం గెలుచుకోవడం ఖాయమైంది. శనివారం ఆసక్తికరంగా జరిగిన తొలి సెమీఫైనల్లో ఆతిథ్య ఇంగ్లండ్ జట్టుపై భారత్ 4 పరుగుల తేడాతో గెలిచింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. స్మృతి మంధాన (32 బంతుల్లో 61; 8 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీతో చెలరేగగా, జెమీమా రోడ్రిగ్స్ (31 బంతుల్లో 44 నాటౌట్; 7 ఫోర్లు) రాణించింది. మహిళల అంతర్జాతీయ టి20ల్లో భారత్ తరఫున వేగవంతమైన అర్ధ సెంచరీ (23 బంతుల్లో)ని స్మృతి నమోదు చేయడం విశేషం. అనంతరం ఇంగ్లండ్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 160 పరుగులే చేయగలిగింది. ఆఖరి ఓవర్లో గెలుపు కోసం 14 పరుగులు చేసే ప్రయత్నంలో ఇంగ్లండ్ 9 పరుగులు మాత్రమే రాబట్టగలిగింది. స్పిన్నర్లు స్నేహ్ రాణా (2/28), దీప్తి శర్మ (1/18) ప్రత్యర్థిని కట్టడి చేయడంలో సఫలమయ్యారు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్ల మధ్య రెండో సెమీఫైనల్ విజేతతో తుది పోరులో భారత తలపడుతుంది. భారత కాలమానం ప్రకారం నేడు రాత్రి 9 గంటల 30 నిమిషాలకు ఫైనల్ మొదలవుతుంది. కాంస్య పతక మ్యాచ్ మధ్యాహ్నం గం. 3:30 నుంచి జరుగుతుంది. చదవండి: Commonwealth Games 2022: క్రికెట్లో కనకంపై గురి మంధాన ఊచకోత.. టీ20ల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ నమోదు -
'ఒక శకం ముగిసింది'.. టెస్టులకు ఇంగ్లండ్ దిగ్గజ క్రికెటర్ గుడ్‌బై
ఇంగ్లండ్ దిగ్గజ మహిళా క్రికెటర్ కేథరిన్ బ్రంట్ టెస్టులకు గుడ్‌బై ప్రకటించింది. ఇకపై వన్డేల్లో, టి20ల్లో మాత్రమే కొనసాగనున్నట్లు బ్రంట్ తెలిపింది. ఇంగ్లండ్ మహిళా క్రికెట్ తరపున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా కేథరిన్ బ్రంట్ నిలిచింది. 2004లో యాషెస్ సిరీస్ ద్వారా కేథరిన్ బ్రంట్ ఇంగ్లండ్ తరపున టెస్టుల్లో అరంగేట్రం చేసింది. డెబ్యూ మ్యాచ్‌లోనే తొమ్మిది వికెట్లు తీయడంతో పాటు బ్యాట్‌తోనూ 52 పరుగులు చేసిన బ్రంట్ విజయంలో కీలకపాత్ర పోషించింది. అంతేగాక 42 ఏళ్ల తర్వాత ఇంగ్లండ్ యాషెస్ ట్రోపీని రిటైన్ చేసుకోవడంలో కేథరిన్ బ్రంట్‌ది ముఖ్యపాత్ర. ఇప్పటివరకు కేథరిన్ బ్రంట్ 14 టెస్టుల్లో 51 వికెట్లు పడగొట్టింది. ఇక టెస్టుల్లో రిటైర్మెంట్పై బ్రంట్ స్పందిస్తూ.. ''గత రెండేళ్ల నుంచి టెస్టులకు రిటైర్మెంట్ ఇవ్వాలని అనుకున్నా. ఒక ఫార్మాట్ నుంచి వైదొలుగుతున్నామంటే చెప్పలేని బాధ ఉంటుంది. టెస్టు క్రికెట్ అంటే నాకు చాలా ఇష్టం. ఇష్టమైన ఫార్మాట్ నుంచి రిటైర్ అవ్వడం అనేది హార్ట్ బ్రేకింగ్. కానీ పరిమిత ఓవర్ల క్రికెట్‌పై దృష్టి పెట్టేందుకు ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదు.'' అంటూ ఎమోషనల్ అయింది. ఇక ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు బ్రంట్ రిటైర్మెంట్పై స్పందిస్తూ.. ''ఒక శకం ముగిసింది. ఇంగ్లండ్ మహిళా క్రికెట్లో టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా ఉన్న కేథరిన్ బ్రంట్ ఆటకు గుడ్‌బై చెప్పింది.. నీ సేవలకు సలాం.. థాంక్యూ బ్రంటీ'' అంటూ లవ్ ఎమోజీతో ట్వీట్ చేసింది. The end of an era. Our third leading wicket-taker in the format, @kbrunt26 is retiring from Test cricket. Thank you Brunty ❤️ — England Cricket (@englandcricket) June 18, 2022 చదవండి: Ranji Trophy 2022: బెంగాల్‌పై ఘన విజయం.. 23 ఏళ్ల తర్వాత ఫైనల్లో మధ్యప్రదేశ్ పాకిస్తాన్ మాజీ క్రికెటర్‌పై ఆరోపణలు.. లైంగికంగా వేధించడమే గాక స్నేహితులను తీసుకొచ్చి