కోహ్లిని చూసేందుకు ఆస్పత్రికి పోటెత్తారు!
మ్యాచ్‌ల సందర్భంగా టీమిండియా కెప్టెన్, డ్యాషింగ్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లి మైదానంలో తప్ప బయట పెద్దగా కనిపించడు. కానీ, రాంచీలో ఆస్ట్రేలియాతో రెండో టెస్టు తొలిరోజున భుజానికి గాయం కావడంతో రెండోరోజు పూర్తిగా మూడు సెషన్లలోనూ కోహ్లి మైదానంలో కనిపించలేదు. అయినప్పటికీ, కోహ్లి ఫిట్‌గా ఉన్నాడని, బ్యాటింగ్‌కు దిగుతాడని బీసీసీఐ, బౌలర్ ఉమేశ్ యాదవ్ స్పష్టం చేశారు. అయినప్పటికీ గాయం స్వభావాన్ని తెలుసుకోవడానికి కోహ్లికి జట్టు వైద్యబృందం రాంచీలోని ఓ స్థానిక ఆస్పత్రిలో ఎంఆర్‌ఐ స్కానింగ్ చేయించింది.
ఈ సందర్భంగా ఆస్పత్రికి కోహ్లి వస్తున్నారన్న వార్త చుట్టుపక్కల దావాహనంలా వ్యాపించింది. దీంతో వేలాదిమంది ఆస్పత్రి వద్ద గుమిగూడి కోహ్లిని చూసేందుకు ఆరాటపడ్డారు. అభిమానులు ఎగబడకుండా కట్టుదిట్టమైన భద్రత నడుమ ఆయన వెళ్లిపోయారు. అయిన్పటికీ ఆస్పత్రి నుంచి బయటకు వస్తున్న కోహ్లిని చూసిన క్రికెట్ ప్రేమికులు కెరింతలతో తమ హర్షం వ్యక్తం చేశారు. గత గురువారం రాంచీలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం ఆన్‌లైన్‌లో హల్‌చల్ చేస్తున్నాయి.
A small insight into How Indian cricket players are bigger stars than Premier League Football players over here !!! https://t.co/QhIYgh46tw
— Michael Vaughan (@MichaelVaughan) March 17, 2017