అవకాశాలను వదులుకోం
- గతం నుంచి నేర్చుకున్నామన్న ధోని
- ఇంగ్లండ్‌కు బయల్దేరిన భారత జట్టు
ముంబై: టెస్టు మ్యాచుల్లో ఆరంభంలో ఆధిక్యం దక్కినా, ఆ తర్వాత పట్టు విడవటం భారత్‌కు అలవాటు. ఇటీవల దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ సిరీస్‌లలో అదే జరిగింది. అయితే ఈసారి గత అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకున్నట్లు భారత కెప్టెన్ ఎం.ఎస్. ధోని తెలిపాడు. ఇంగ్లండ్‌లో సుదీర్ఘ పర్యటన కోసం భారత జట్టు ఆదివారం తెల్లవారుజామున బయల్దేరి వెళ్లనున్న నేపథ్యంలో ధోని మీడియాతో మాట్లాడాడు. ‘2011లో ఇంగ్లండ్, ఆసీస్ పర్యటనలు చేదు అనుభవాన్ని మిగిల్చాయి. అయితే ఆ తర్వాత మా ఆటతీరు మెరుగైంది.
కొన్ని టెస్టుల్లో శాసించే స్థితిలో నిలిచాం. అయితే ఆ తర్వాత పట్టు జారవిడిచాం. ఈసారి అలాంటి అవకాశం లభిస్తే వదులుకోము’ అని ధోని ఆత్మవిశ్వాసంతో చెప్పాడు. మ్యాచ్ పరిస్థితులు ఎలా ఉన్నా తన బ్యాటింగ్ శైలి మారదని ధోని స్పష్టం చేశాడు. ఈ పర్యటనలో భారత్, ఇంగ్లండ్ మధ్య తొలి టెస్టు వచ్చే నెల 9 నుంచి జరుగుతుంది. అంతకుముందు టీమిండియా...లీసెస్టర్‌షైర్, డెర్బీషైర్ జట్లతో మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడుతుంది.