practice matches
-
ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌కు ముందు టీమిండియాకు మాంచి ప్రాక్టీస్
న్యూఢిల్లీ: భారత జట్టు ఇటీవల బోర్డర్–గావస్కర్ ట్రోఫీలో ఓటమితో పాటు అంతకు ముందు సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో టెస్టు సిరీస్‌లో క్లీన్‌స్వీప్‌నకు గురైంది. ఈ రెండు సార్లూ మన బ్యాటింగే పెద్ద బలహీనతగా కనిపించింది. ఈ నేపథ్యంలో వచ్చే జూన్‌లో ఇంగ్లండ్‌లో జరిగే టెస్టు సిరీస్‌కు ముందుగా టీమిండియా సన్నద్ధత మెరుగ్గా ఉండాలని బీసీసీఐ భావిస్తోంది. భారత టెస్టు జట్టు సభ్యులంతా రంజీ ట్రోఫీలో ఆడేందుకు సిద్ధమైనా... ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ ఉండటంతో ఒకటికి మించి రంజీ మ్యాచ్ ఆడే అవకాశం కనిపించడం లేదు. ఆ తర్వాత ఐపీఎల్ మొదలైతే ఎరుపు బంతితో సాధన అసాధ్యం! దాంతో ఇంగ్లండ్‌కు వెళ్లి అక్కడే నాలుగు రోజులు మ్యాచ్‌లు ఆడాలని బోర్డు నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇంగ్లండ్ యువ జట్టు ‘లయన్స్’తో భారత్ నాలుగు రోజుల మ్యాచ్‌లు ఆడనుంది. ఐపీఎల్ ముగిసే మే 25 నుంచి తొలి టెస్టు ప్రారంభమయ్యే జూన్ 20 మధ్య ఉన్న సమయంలో టీమిండియా మూడు మ్యాచ్‌లు ఆడుతుంది. అక్కడి వాతావరణం, పరిస్థితులకు అలవాటు పడి బ్యాటింగ్ మెరుగుపర్చుకోవడం మాత్రమే కాకుండా టెస్టు టీమ్‌లో స్థానాన్ని ఆశించే ఆటగాళ్లు కూడా తమ సత్తాను చాటేందుకు ఈ మూడు మ్యాచ్‌లు ఉపకరిస్తాయని బోర్డు ఆశిస్తోంది. ఆసీస్‌తో సిరీస్‌లో విఫలమైన రోహిత్, కోహ్లిలతో పాటు ఇతర ఆటగాళ్లంతా ఈ మ్యాచ్‌లలో బరిలోకి దిగనున్నారు. -
టీమిండియా ప్రాక్టీస్ షురూ
సిడ్నీ: ఆస్ట్రేలియా జట్టుతో సుదీర్ఘ సిరీస్ కోసం భారత జట్టు ప్రాక్టీస్ మొదలుపెట్టింది. ఐపీఎల్ ముగిశాక దుబాయ్ నుంచి నేరుగా సిడ్నీ చేరుకున్న భారత ఆటగాళ్లకు కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. అందరి ఫలితాలు నెగెటివ్‌గా రావడంతో ఆటగాళ్లు అవుట్డోర్ ప్రాక్టీస్‌ను ప్రారంభించారు. ప్రస్తుతం 14 రోజుల క్వారంటైన్లో ఉన్న భారత ప్లేయర్లంతా ప్రాక్టీస్‌లో, జిమ్‌లో చెమటోడుస్తున్న ఫొటోలను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ట్విట్టర్ ద్వారా పంచుకుంది. సిడ్నీ ఒలింపిక్ పార్క్ మైదానంలో హార్దిక్ పాండ్యా, పృథ్వీ షా, హనుమ విహారి, చతేశ్వర్ పుజారా, స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, చహల్, పేసర్లు ఉమేశ్ యాదవ్, సిరాజ్, ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, శార్దుల్ ఠాకూర్ వార్మప్ చేస్తూ జాలీగా కనిపించారు. టీమిండియా కొత్త ఆటగాళ్లు నటరాజన్, దీపక్ చహర్ కూడా బౌలింగ్ ప్రాక్టీస్ మొదలుపెట్టారు. మూడు ఫార్మాట్లకు (టెస్టు, వన్డే, టి20) చెందిన భారత ఆటగాళ్లందరూ ఒకేసారి ఆస్ట్రేలియాకు చేరుకున్నారు. ఆదివారం నెట్ ప్రాక్టీస్ సెషన్ కూడా జరిగింది. తొలిసారి భారత జట్టులోకి ఎంపికైన ఎడంచేతి వాటం పేసర్ నటరాజన్ తెల్లబంతులతో టాపార్డర్ బ్యాట్స్‌మెన్‌కు బౌలింగ్ చేశాడు. పుజారా, కోహ్లి క్యాచింగ్ ప్రాక్టీస్ కూడా చేశారు. నవంబర్ 27న సిడ్నీలో జరిగే తొలి వన్డే మ్యాచ్‌తో ఇరు జట్ల మధ్య సిరీస్ ప్రారంభం కానుంది. ఈ పర్యటనలో ఆసీస్‌తో భారత్ 3 వన్డేలు, 3 టి20లు, 4 టెస్టులు ఆడనుంది. -
ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఉండటం మంచిదే: హర్మన్ ప్రీత్
దక్షిణాఫ్రికా పర్యటనలో ఆడనున్న రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌లు తమ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయని భారత మహిళా క్రికెటర్ హర్మన్‌ప్రీత్ సింగ్ వ్యాఖ్యానించింది. ఫిబ్రవరి 5తో ప్రారంభమవనున్న 3 వన్డేలు, 5 టి20ల సిరీస్‌లో పాల్గొనేందుకు త్వరలోనే మహిళల జట్టు దక్షిణాఫ్రికా వెళ్లనుంది. ‘సిరీస్ ప్రారంభం కావడానికి ముందే మేం అక్కడికి వెళ్తున్నాం. 4–5 రోజుల పాటు క్యాంప్‌లో పాల్గొననున్నాం. దీంతోపాటు రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడనున్నాం’ అని హర్మన్ తెలిపింది. -
అవకాశాలను వదులుకోం
- గతం నుంచి నేర్చుకున్నామన్న ధోని - ఇంగ్లండ్‌కు బయల్దేరిన భారత జట్టు ముంబై: టెస్టు మ్యాచుల్లో ఆరంభంలో ఆధిక్యం దక్కినా, ఆ తర్వాత పట్టు విడవటం భారత్‌కు అలవాటు. ఇటీవల దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ సిరీస్‌లలో అదే జరిగింది. అయితే ఈసారి గత అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకున్నట్లు భారత కెప్టెన్ ఎం.ఎస్. ధోని తెలిపాడు. ఇంగ్లండ్‌లో సుదీర్ఘ పర్యటన కోసం భారత జట్టు ఆదివారం తెల్లవారుజామున బయల్దేరి వెళ్లనున్న నేపథ్యంలో ధోని మీడియాతో మాట్లాడాడు. ‘2011లో ఇంగ్లండ్, ఆసీస్ పర్యటనలు చేదు అనుభవాన్ని మిగిల్చాయి. అయితే ఆ తర్వాత మా ఆటతీరు మెరుగైంది. కొన్ని టెస్టుల్లో శాసించే స్థితిలో నిలిచాం. అయితే ఆ తర్వాత పట్టు జారవిడిచాం. ఈసారి అలాంటి అవకాశం లభిస్తే వదులుకోము’ అని ధోని ఆత్మవిశ్వాసంతో చెప్పాడు. మ్యాచ్ పరిస్థితులు ఎలా ఉన్నా తన బ్యాటింగ్ శైలి మారదని ధోని స్పష్టం చేశాడు. ఈ పర్యటనలో భారత్, ఇంగ్లండ్ మధ్య తొలి టెస్టు వచ్చే నెల 9 నుంచి జరుగుతుంది. అంతకుముందు టీమిండియా...లీసెస్టర్‌షైర్, డెర్బీషైర్ జట్లతో మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడుతుంది. -
బౌలింగ్‌తోనే దెబ్బ తిన్నాం: ధోని
జొహన్నెస్‌బర్గ్: ఆరంభ ఓవర్లలోనే గతి తప్పిన తమ బౌలర్లు ఓటమికి బాట పరిచారని భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని వ్యాఖ్యానించాడు. ప్రాక్టీస్ మ్యాచ్‌లు లేకపోవడం తొలి వన్డేలో పరాజయానికి కారణం కాదని అతను విశ్లేషించాడు. ‘మొత్తంగా చూస్తే ఇది చెత్త ప్రదర్శన. అయితే ఇది మా బౌలింగ్‌తోనే మొదలైంది. ఈ వికెట్‌పై 300కు పైగా పరుగులు ఇవ్వాల్సింది కాదు. ఇక్కడి పరిస్థితుల్లో అనుభవం కీలకం. దక్షిణాఫ్రికా బౌలర్లకు లెంగ్త్‌పై అవగాహన ఉంది. వారి జట్టులో అత్యుత్తమ పేసర్లు ఉన్నారు. మా ఆరంభం సరిగా లేకపోవడం కూడా ఓటమికి కారణమైంది’ అని ధోని అభిప్రాయ పడ్డాడు. చివరి ఓవర్లలో బౌలర్లు భారీగా సమర్పించుకోవడం ఇటీవల సహజంగా మారిందని, అగ్రశ్రేణి బౌలర్ కూడా బాధితుడిగా మారుతున్నాడని ధోని తన బౌలర్లను సమర్ధించాడు. ‘సర్కిల్లో అదనపు ఫీల్డర్ ఉండటం, బంతి రివర్స్ స్వింగ్ వల్ల మంచి బౌలర్లు కూడా భారీ పరుగులిస్తున్నారు. కాబట్టి ఏ జట్టయినా ఆరంభ ఓవర్లలో ప్రత్యర్థిని కట్టడి చేయగలగాలి. అప్పుడే బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి పెంచగలం’ అని భారత కెప్టెన్ అన్నాడు. పరిస్థితులకు తొందరగా అలవాటు పడితేనే బ్యాటింగ్‌లో ప్రభావం చూపించగలమని అతను సహచరులకు సూచించాడు. ‘అంతర్జాతీయ క్యాలెం డర్లో ఎక్కువ ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆశించడం సరైంది కాదు. షెడ్యూల్‌ను మనం తప్పు పట్టలేం. వన్డేకు ముందు మాకు రెండున్నర రోజుల విరామం లభిం చింది. మ్యాచ్‌కు మానసికంగా సిద్ధమయ్యేందుకు ఇది సరిపోతుంది’ అని ధోని అన్నాడు.