
దక్షిణాఫ్రికా పర్యటనలో ఆడనున్న రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌లు తమ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయని భారత మహిళా క్రికెటర్ హర్మన్‌ప్రీత్ సింగ్ వ్యాఖ్యానించింది. ఫిబ్రవరి 5తో ప్రారంభమవనున్న 3 వన్డేలు, 5 టి20ల సిరీస్‌లో పాల్గొనేందుకు త్వరలోనే మహిళల జట్టు దక్షిణాఫ్రికా వెళ్లనుంది. ‘సిరీస్ ప్రారంభం కావడానికి ముందే మేం అక్కడికి వెళ్తున్నాం. 4–5 రోజుల పాటు క్యాంప్‌లో పాల్గొననున్నాం. దీంతోపాటు రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడనున్నాం’ అని హర్మన్ తెలిపింది.