
చాంపియన్స్ ట్రోఫీలో ఆడేందుకు దుబాయ్ వెళ్లనున్న భారత జట్టు
న్యూఢిల్లీ: పాక్ ఆతిథ్యమిచ్చే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌ల్ని దుబాయ్‌లో ఆడేందుకు వెళ్లనున్న భారత జట్టు తమవెంట కుటుంబసభ్యులను తీసుకెళ్లడం లేదు. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సిఫార్సుల మేరకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇటీవలే కొత్త పాలసీని తీసుకొచి్చన సంగతి తెలిసిందే. దీనిప్రకారం ఎన్నో ఏళ్ల తర్వాత దేశవాళీ క్రికెట్‌లో స్టార్లు, దిగ్గజ హోదా పక్కనబెట్టి కెపె్టన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి తమ రాష్ట్ర జట్లకు ఆడిన సంగతి తెలిసిందే! అలాగే ఇప్పుడు తాజాగా విదేశీ ప్రయాణం విషయంలోనూ ఈ పాలసీ అమలవుతోంది.
దుబాయ్‌లో ఈ నెల 20న బంగ్లాదేశ్, 23న పాకిస్తాన్, మార్చి 2న న్యూజిలాండ్‌లతో భారత్ లీగ్ దశ మ్యాచ్‌ల్ని ఆడనుంది. నాకౌట్ దశ, ఫైనల్స్ కలిపినా మార్చి 9న టోర్నీ ముగుస్తుంది. అంటే మూడు వారాల్లోపే ముగియనున్న ఈ టోర్నీ కోసం కొత్త నియమావళి ప్రకారం భార్యబిడ్డలను అనుమతించరు. కొత్త పాలసీ ప్రకారం ఏదైనా విదేశీ పర్యటన 45 రోజులు, అంతకుమించి జరిగితేనే గరిష్టంగా రెండు వారాల పాటు కుటుంబసభ్యుల్ని క్రికెటర్ల వెంట వెళ్లేందుకు అనుమతిస్తారు.
కానీ 8 దేశాలు ఆడే చాంపియన్స్ ట్రోఫీ కనీసం నెల రోజుల పాటైనా జరగకపోవడంతో దుబాయ్ స్టేడియంలో ఆట, ఇది పూర్తయ్యాక భార్యబిడ్డలతో సరదాగా దుబాయ్ వీధుల్లో సయ్యాట ఆడేందుకు అవకాశం లేకుండా పోయింది. అలాగే స్టార్ ఆటగాళ్ల వెంట పరిమిత సంఖ్యలో అనుమతించే వ్యక్తిగత సిబ్బందికి జట్టు, కోచింగ్ సిబ్బంది బస చేసిన హోటల్‌లో కాకుండా వేరే హోటల్‌లో బస ఏర్పాట్లు చేస్తారు. గతంలో వ్యక్తిగత ట్రెయినర్, మేనేజర్, షెఫ్‌లకు కోచింగ్ బృందంలో కలిపి వసతి ఏర్పాటు చేసేవారు.
Comments
Please login to add a commentAdd a comment