బ్రిస్టల్ : నది ఒడ్డుకు కొట్టుకువచ్చిన ఓ వ్యక్తి శరీరాన్ని చూసి ప్రజలు పరుగులు తీశారు. ఇంగ్లాండ్‌లోని బ్రిస్టల్ నగరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. నదిపై ఉన్న బ్రిస్టల్ బ్రిడ్జి పక్కకు ఉన్న ప్రదేశంలోకి ఓ శవం కొట్టుకువచ్చింది. వ్యక్తి శరీరం మొత్తం తాళ్లు చుట్టి ఉండటంతో హడలిపోయిన ప్రజలు దాన్ని ‘మమ్మీ’ గా భావించారు.
అయితే, వ్యక్తి శరీరం ఎక్కడి నుంచి వచ్చిందన్న విషయంపై ఎలాంటి సమాచారం అందలేదని బ్రిస్టల్ పోస్ట్ పేర్కొంది. హాలోవీన్ సందర్భంగా బ్రిడ్జిపై వెళ్తున్న వారిని భయాందోళనలకు గురి చేసేందుకు కొందరు వ్యక్తులు ఈ పని చేసుంటారని పోలీసులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment