halloween
-
హంతకుని గెటప్‌లో మార్క్ జుకర్‌బర్గ్ (ఫోటోలు)
-
Halloween Day: ఈ దెయ్యాల ఉత్సవం దేనికి జరుపుతారో తెలుసా?
హాలోవీన్ డే అంటే దెయ్యాల ఉత్సవం. గతంలో ఈ పండుగ గురించి భారతీయులకు పెద్దగా తెలియదు. అయితే కాలానుగుణంగా ఈ విదేశీ పండుగ మనదేశంలోనూ అక్కడక్కడా జరుపుకుంటున్నారు.ప్రతియేటా అక్టోబర్ 31న హాలోవీన్ డే జరుపుకుంటారు. పాశ్చాత్య దేశాలో ప్రజలు దెయ్యాల వేషం వేసుకుని ఈ పండుగ చేసుకుంటారు. అతీంద్రియ శక్తులతో ఈ పండుగకు ముడిపెడతారు. ఈ హాలోవీన్ పండుగ ఇప్పుడు ఒక ట్రెండ్‌గా మారిపోయింది. ఢిల్లీ, బెంగళూరు తదితర నగరాల్లోనే కాకుండా మరికొన్ని పట్టణాల్లో కూడా హాలోవీన్ పార్టీలు నిర్వహిస్తున్నారు.కొన్ని చోట్ల పాఠశాలల్లో ఈ పండుగను జరుపుకుంటున్నారు. ఈ హాలోవీన్ పండుగ వెనుక అనేక ఆసక్తికర అంశాలున్నాయి. ఈ పండుగకు రెండు వేల సంవత్సరాలకు మించిన చరిత్ర ఉంది. ఈ ఉత్సవం ఐర్లాండ్, యునైటెడ్ కింగ్డమ్, నార్తర్న్ ఫ్రాన్స్ మొదలైన దేశాల్లో ప్రారంభమైనట్లు చెబుతారు. ఈ పండుగను సంహైన్ అని కూడా పిలుస్తారు.సాధారణంగా సినిమాల్లో, సీరియల్స్‌లో హాలోవీన్‌ను పౌర్ణమి నాడు వచ్చినట్లు చూపిస్తారు. అయితే, హాలోవీన్ సమయంలో పౌర్ణమి చాలా అరుదుగా వస్తుంది. 2020లో పౌర్ణమి నాడు హాలోవీన్ వచ్చింది. తదుపరి హాలోవీన్ పౌర్ణమి రాత్రి కోసం చాలా సంవత్సరం వేచి ఉండాలి. హాలోవీన్ రోజున, పిల్లలు వివిధ రకాల దుస్తులు ధరించి సమీపంలోని ఇళ్లకు వెళతారు. క్యాండీలను పంచిపెడతారు.ఈ ఆచారం ప్రారంభమైన నాటి రోజుల్లో రాత్రి సమయంలో దెయ్యాలు భూమిపై సంచరిస్తాయని నమ్మేవారు. ఈ కారణంగా ప్రజలు ఇళ్ల వెలుపల ఆహారాన్ని ఉంచడం మొదలుపెట్టారు. దీని తరువాత, చర్చిలలో ప్రార్థన చేసే అలవాటు ప్రారంభమైంది. క్రమంగా పిల్లల నుండి వృద్ధుల వరకు అందరూ ఈ పండుగను ఉత్సాహంగా జరుపుకోవడం ప్రారంభించారు.హాలోవీన్ రోజున నలుపు ,నారింజ రంగులతో అలంకరించుకుంటారు. నారింజ రంగు శక్తికి చిహ్నంగా భావిస్తారు. ఈ రంగు శరదృతువును సూచిస్తుంది. నలుపు రంగు అనేది భయానికి, మరణానికి చిహ్నంగా పరిగణిస్తారు. ఇది శీతాకాలాన్ని సూచిస్తుంది. ఈ రెండు రంగులు రుతువులలో మార్పులు, జీవితం ,మరణాన్ని సూచిస్తాయి. ఇది కూడా చదవండి: పిల్లల చేత దివిటీలు ఎందుకు కొట్టిస్తారంటే.. -
కొంపముంచిన ‘హాలోవీన్’ మేకప్!.. భయంకరంగా మహిళ ముఖం!
హాలోవీన్ ఉత్సవాన్ని అమెరికా, ఐరోపా దేశాల్లో జరుపుకుంటారు. ఇప్పుడు భారత్‌లోనూ ఈ ఉత్సవం క్రేజ్ కనిపిస్తోంది. ఈ ఉత్సవంలోని ప్రత్యేకత ఏమిటంటే ఇందులో పాల్గొనే జనం ఇతరులను భయపెట్టేలాంటి మేకప్ వేసుకుని రోడ్లపై తిరుగుతారు. ఒకరికొకరు బహుమతులు లేదా చాక్లెట్లు ఇచ్చిపుచ్చుకుంటారు. ఈ పండుగను ప్రతి సంవత్సరం అక్టోబర్ 31 న జరుపుకుంటారు. ఈ ఉత్సవం సందర్భంగా ఒక మహిళ తన ముఖంపై వేయించుకున్న భయంకరమైన టాటూ ఆమెను మరింత ఇబ్బందులపాలు చేసింది. ఎలిజబెత్ రోజ్ అనే మహిళ హాలోవీన్ రోజున తాను భయానకంగా కనిపించేందుకు తన ముఖంపై తాత్కాలిక టాటూలు వేయించుకుంది. ఆ మహిళ నుదిటిపైన, నోటిపైన టాటూలు వేయించుకుంది. అయితే ఆ టాటూల గుర్తులు తొలగక పోవడంతో ఆమెకు ఇబ్బంది ఎదురయ్యింది. ఆ మహిళ తన ముఖంపై ఉన్న టాటూను తొలగించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు ఒక వీడియోలో తెలియజేసింది. ‘నేను నా ముఖంపై టాటూ వేయించుకుని హాలోవీన్‌కు వెళ్లాను’ అని రోజ్ ఆ వీడియోలో పేర్కొంది. ఆమె ఆ టాటూను తొలగించడానికి కాటన్ ప్యాడ్‌ను ఉపయోగించింది. అయినా ఉపయోగం లేకపోయింది. మరుసటి రోజు తనకు ఆఫీసులో మీటింగ్ ఉన్న విషయం గుర్తుకువచ్చి ఆమె మరింత ఆందోళనకు గురయ్యింది. అయితే వోడ్కా, యాంటీ బాక్ జెల్, సెల్లోటేప్, ఆలివ్ ఆయిల్, నెయిల్ వార్నిష్ రిమూవర్ మొదలైనవాటిని ఉపయోగించి ఎట్టకేలకు ఆ టాటూ గుర్తులను తొలగించింది. ఇది కూడా చదవండి: ప్రియుడు ఖరీదైన గిఫ్ట్ ఇస్తే బ్రేకప్ చెప్పింది.. ట్విస్ట్ ఇదే! -
అస్తిపంజరం డ్యాన్స్ చేస్తున్న దృశ్యాలను మీరెప్పుడైనా చూశారా?
దేవుడున్నాడన్నది ఎంత నిజమో దెయ్యాలు ఉన్నాయన్నది కూడా అంతే నిజం. కూడా దెయ్యాలకూ కొన్ని స్పెషల్ డేస్ ఉంటాయి. అదే హలోవీన్ ఫెస్టివల్. ఈ పండగను పురస్కరించుకొని రకరకాల వికృత వేషాలు చూస్తుంటాం. తాజాగా దుబాయ్‌లో అస్తిపంజరం డ్యాన్స్ చేస్తున్న వీడియో ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తోంది. భారతీయ సాంప్రదాయంలో పలు పండగలకు ప్రత్యేకమైన విశిష్టతలున్నాయి. అదే విధంగా దెయ్యాలకూ స్పెషల్‌గా పండగలున్నాయి. అదేనండీ మన హలోవీన్ పండగ. ఐర్లాండులో పుట్టిన ఈ పండగ తర్వాతి రోజుల్లో ప్రపంచ దేశాలకూ పట్టింది. హాలోవీన్ అనే స్కాట్లాండ్ పదం ఆల్ హాలో ఈవ్ నుంచి వచ్చింది. 1846లో ఏర్పడిన తీవ్రమైన కరువు కారణంగా ఉత్తర అమెరికాకు వలస వెళ్లిన ఐర్లాండు ప్రజలు.. ఈ సంప్రదాయాన్ని పరిచయం చేశారు. దీన్ని సాంహైన్ పండుగ అని కూడా అంటారు. 2,000 సంవత్సరాల కిందట ఐర్లాండ్, యునైటెడ్ కింగ్డమ్, ఫ్రాన్స్‌లోని కొన్ని ప్రాంతాలలో నివసించిన సెల్ట్స్ జాతి ప్రజలు నవంబరు 1ని కొత్త సంవత్సరంగా జరుపుకునేవారు. దానికి ఒకరోజు ముందే హాలోవీన్ వేడుకలు నిర్వహించే సంప్రదాయం కొనసాగుతోంది.పండుగ రోజున మంటలను వెలిగించి, దెయ్యాలను పారదోలాలనే ఉద్దేశంతో ప్రజలు విచిత్రమైన వస్త్రధారణలో ఉంటారు. హలోవీన్ పండ అంటే ప్రాణం ఉన్నవారికి, మరణించినవారికి మధ్య సరిహద్దులు తొలగిపోతాయని అప్పటి ప్రజలు నమ్మేవారు. పూర్వం ‘హాలోవీన్’ రోజున పశువులను బలి ఇచ్చి, వాటి ఎముకలను కాల్చేవారు. ఈ రోజున చెడు ఆత్మలను అనుకరిస్తూ.. దెయ్యాలు, మంత్రగత్తుల్లా వేషాలు వేయడం ఆనవాయితీగా వస్తోంది. హలోవీన్ డే వస్తుందంటే చాలు ప్రజలు పలు హర్రర్ సినిమాల్లోని భయానక పాత్రలను అనుసరిస్తూ వికృత వేషాల్లో కనిపిస్తారు. తాజాగా దుబాయ్‌లో హలోవీన్ డేను పురస్కరించుకొని భారీ డ్రోన్ షోను నిర్వహించారు. ఇందులో ఓ అస్తిపంజరం డ్యాన్స్ చేస్తున్న దృశ్యాలను వీడియోలో చూడొచ్చు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్చల్ చేస్తుంది. -
ప్రియురాలికి ప్రపోజ్ చేసిన స్టార్ హీరోయిన్ మాజీ లవర్!
ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ మాల్యా తనయుడు సిద్ధార్థ్ మాల్యా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. నటుడు, మోడల్‌గా గుర్తింపు తెచ్చుకున్న సిద్ధార్థ్ తన ప్రియురాలికి ప్రపోజ్ చేశారు. తాజాగా హాలోవిన్ పార్టీకి హాజరైన సిద్ధార్థ్.. తన ప్రియురాలు జాస్మిన్‌కు చేతికి ఉంగరం తొడిగి నిశ్చితార్థం చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. ఇది చూసిన ఆయన అభిమానులు ఈ జంటకు అభినందనలు చెబుతున్నారు. సిద్ధార్థ్ తన ఇన్‌స్టాలో రాస్తూ..'ఇక నుంచి మీరు ఎప్పటికీ నాతోనే ఉంటారని ఆశిస్తున్నా. నేను నిన్ను ప్రేమిస్తున్నా. నా ప్రేమను అంగీకరించినందుకు ధన్యవాదాలు' అంటూ పోస్ట్ చేశారు. కాగా.. ప్రస్తుతం కాలిఫోర్నియాలో హాలోవిన్ పార్టీకి వీరద్దరు హాజరైనట్లు తెలుస్తోంది. ఈ జంటకు బాలీవుడ్ తారలు సుస్సానే ఖాన్, అర్పితా శర్మ, అనూషా దండేకర్ అభినందనలు తెలిపారు. అయితే గతంలో సిద్ధార్థ్.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణెతో రిలేషన్లో ఉన్నారు. రణవీర్ సింగ్‌తో వివాహం కాకముందే దీపికాతో సిద్ధార్థ్‌కు పరిచయముంది. గతంలో వీరిద్దరు కలిసి ఐపీఎల్ మ్యాచ్‌లో సందడి చేశారు. ఐపీఎల్ మ్యాచ్‌లో ముద్దు పెట్టుకోవడంతో వీరు డేటింగ్లో ఉన్నారంటూ రూమర్స్ వినిపించాయి. కాగా.. వ్యాపారవేత్త విజయ్ మాల్యా ప్రస్తుతం లండన్‌లో ఉన్న సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Sid (@sidmallya) -
మా వైఫల్యం వల్లే ఆ 156 మంది చనిపోయారు: పోలీస్ చీఫ్ యూన్ హీ క్యూన్
సియోల్: రాజధాని సియోల్‌లో శనివారం రాత్రి చోటుచేసుకున్న దుర్ఘటనకు తమ వైఫల్యమే కారణమని దేశ పోలీస్ చీఫ్ యూన్ హీ క్యూన్ అంగీకరించారు. హాలోవిన్ ఉత్సవాల్లో చోటుచేసుకున్న తొక్కిసలాటలో 156 మంది చనిపోగా, మరో 151 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో 26 మంది పరిస్థితి విషమంగా ఉంది. ‘జరగబోయే ప్రమాదం గురించి ఘటనకు ముందు అందిన అత్యవసర ఫోన్‌కాల్స్‌పై మా అధికారులు సరిగా స్పందించలేదని తేలింది. వెంటనే చర్యలు తీసుకుని ఉంటే విషాదం నివారించగలిగే వారం. ప్రభుత్వ విభాగం అధిపతిగా ఈ దుర్ఘటనకు నాదే బాధ్యత’ అని యూన్ చెప్పారు. ఈ దుర్ఘటనకు ఎవరు బాధ్యత వహిస్తారంటూ ప్రభుత్వంపై ప్రజాగ్రహం వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఆయన ఈ మేరకు స్పందించారు. మృతి చెందిన 156 మందిలో 101 మంది మహిళలుండగా వీరిలో ఎక్కువ మంది టీనేజర్లని ప్రభుత్వం తెలిపింది. పురుషులతో పోలిస్తే వీరు తక్కువ ఎత్తు ఉండటం, శారీరకంగా తక్కువ బలవంతులు కావడంతో తోపులాటలో ఛాతీ ఎక్కువ ఒత్తిడికి గురై ఊపిరాడక చనిపోయారని పేర్కొంది. హాలోవీన్ ఉత్సవాల కోసం 137 మంది అధికారులను కేటాయించామని సీనియర్ పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. వీరికి డ్రగ్స్ వాడకాన్ని నివారించే బాధ్యతలే తప్ప, బందోబస్తు విధులను కేటాయించలేదన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా లక్ష మంది ఈ కార్యక్రమంలో పాల్గొనడం, నిర్వాహకులెవరూ లేకపోవడం కూడా ప్రమాదానికి కారణమని భావిస్తున్నామన్నారు. మృతుల్లో అమెరికా, చైనా, రష్యా, ఇరాన్ తదితర దేశాలకు చెందిన పౌరులు కూడా ఉన్నారు. చదవండి: ఎవరెస్ట్ నేర్పే పాఠం ఎలాంటిదంటే.. -
రాకాసి హస్తం కాదు.. విశ్వం ఆవిర్భావానికి కారణ భూతం..!
చూడటానికి అచ్చం రాకాసి హస్తంలా ఉంది కదూ! నిజానికిది ఈ విశ్వావిర్భావానికి కారణ భూతంగా అంతరిక్ష శాస్త్రవేత్తలు భావించే ధూళి మేఘం. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఎప్పట్లాగే కాలంలో వెనక్కు వెళ్లి భూమికి 7,000 కాంతి సంవత్సరాల దూరంలోని పిల్లర్స్ ఆఫ్ క్రియేషన్‌ను ఇలా క్లిక్‌మనిపించింది. దీన్ని ఇంత స్పష్టంగా మనం చూడగలగడం ఇదే తొలిసారి. చదవండి: పెట్రోల్, డీజిల్ కార్ల తయారీపై... 2035 నుంచి ఈయూ నిషేధం -
‘జోకర్’ బీభత్సం: రైల్లో మంటలు.. 10 మందికి గాయాలు
టోక్యో: జపాన్ రాజధాని టోక్యోలో ఆదివారం హాలోవీన్ కార్యక్రమం జరిగింది. చిత్ర విచిత్రమైన గెటప్పుల్లో వచ్చి జనాలను భయభ్రాంతులకు గురి చేయడమే దీని ఉద్దేశ్యం. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు ప్రతి ఏటా అక్టోబర్ 31న హాలోవీన్ సంబరాలు నిర్వహిస్తాయి. ఈ క్రమంలో జపాన్‌లో హాలోవీన్ సందర్భంగా బ్యాట్‌మ్యాన్ సినిమాలో విలన్ ‘జోకర్’ వేషధారణలో వచ్చిన ఓ వ్యక్తి రైల్లో బీభత్సం సృష్టించాడు. ట్రైన్లో మంట పెట్టాడు.. కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో పది మందికి గాయాలయ్యాయి. ఆ వివరాలు.. 29 ఏళ్ల యువకుడు ఒకరు హాలోవీన్ సందర్భంగా బ్యాట్‌మ్యాన్ సినిమాలో విలన్ ‘జోకర్’లా తయరయ్యాడు. అనంతరం రద్దీగా ఉండే షింజుకు రైల్వే స్టేషన్‌కు వెళ్లాడు. రైలు ఎక్కిన తర్వాత చేతిలో కత్తి, యాసిడ్ బాటిల్‌తో లోపల ఉన్న ప్రయాణికులను భయపెట్టాడు. అంతటితో ఆగక 60 ఏళ్ల వృద్ధుడిపై కత్తితో దాడి చేశాడు. ప్రస్తుతం ఆ పెద్దాయన పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. అంతేకాక సదరు వ్యక్తి ట్రైన్ చుట్టూ ఒకలాంటి ద్రవం పోసి.. మంటపెట్టాడు. (చదవండి: కొత్త లుక్‌తో భయపెడుతున్న మెగాస్టార్.. షాక్‌లో అభిమానులు!) అతడి చర్యలకు కంపార్ట్మెంట్లో ఉన్న ప్రయాణికులు బిక్కచచ్చిపోయారు. కొందరు కిటికీలోంచి బయటకు దూకి పారిపోయే ప్రయత్నం చేశారు. ఆ మార్గంలో ఓ ఎమర్జెన్సీ స్టాప్ ఉండటంతో రైలు అక్కడ ఆపి.. అందరూ బయటకు పరుగు తీశారు. సదురు జోకర్ వేషదారి చేసిన పనుల వల్ల సుమారు 10మంది గాయపడినట్లు సమాచారం. (చదవండి: ఈ ద్రాక్ష పండ్ల గుత్తి రూ.లక్షల్లో.. ఒక్క పండు రూ.33 వేలంట..) అప్పటికే విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఎమర్జెన్సీ స్టాప్ వద్దకు చేరుకుని మంటలు ఆర్పేందుకు ప్రయత్నించడమే కాక ప్రయాణికులకు సాయం చేశారు. ప్రత్యక్ష సాక్షి ఒకరు మాట్లాడుతూ.. ‘‘జోకర్ గెటప్‌లో వచ్చిన సదరు వ్యక్తి హాలోవీన్ స్టంట్‌లో భాగంగా ఇలా చేసి ఉంటాడని భావిస్తున్నాం. ఎందుకంటే ట్రైన్ ఆగిన తర్వాత అతడు అక్కడ నుంచి నింపాదిగా నడుచుకుంటూ బయటకు వెళ్లిపోయాడు’’ అని తెలిపాడు. చదవండి: Halloween 2021: దెయ్యాల్లా మారిన మన స్టార్స్‌ని గుర్తుపట్టారా? -
కొత్త లుక్‌తో భయపెడుతున్న మెగాస్టార్.. షాక్‌లో అభిమానులు!
సినీ ప్రపంచంలో ఎప్పుడూ ఏదో ఓ ట్రెండ్, ఛాలెంజ్‌లు నడుస్తూనే ఉంటాయి. తారలు వాటిని ఫాలో కావడం షరా మామూలే. కాకపోతే ఇలాంటివి ఎక్కువగా యువ హీరో హీరోయిన్లు పాటిస్తూ ఉంటారు. ఆదివారం అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు హాలోవీన్ ఉత్సవాలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా తారలు దెయ్యాల గెటప్సతో ఫోటోలు, వీడియోలతో నెట్టింట హల్చల్ చేస్తున్నారు. తాజాగా వారి సరసన మెగాస్టార్ చిరంజీవి కూడా చేరిపోయారు. ప్రస్తుతం చిరు చేసిన ఓ వీడియో వైరల్‌గా మారింది. ‘సైరా నరసింహారెడ్డి’ తర్వాత చిరు సినిమాలకు గ్యాప్ ఇచ్చినప్పటికీ ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ కుర్ర హీరోలతో పోటీ పడుతున్నారు. అంతేనా కొత్త లుక్స్‌లో కనిపిస్తూ కేక పెట్టించడంతో పాటు ఫ్యాన్స్‌లో జోష్ నింపుతున్నారు. ఇటీవలే సోషల్‌మీడియాలో గుండు ఫొటోతో కనిపించి అందరికి పెద్ద షాకే ఇచ్చిన చిరు, తాజాగా దెయ్యం లుక్‌లో నయా అవతార్‌ను చూపించారు. ఈ లుక్ చూసి అందరు ఆశ్చర్యపోతున్నారు. అయితే హాలోవీన్ ఉత్సవాలు కారణంగా మెగాస్టార్ అలా కనిపించారు. మరో వైపు నిహారిక కూడా తన భర్తతో కలిసి డిఫరెంట్ గెటప్‌లో సందడి చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మెగాస్టార్ నటించిన ఆచార్య సినిమా ఫిబ్రవరి 4, 2022న థియేటర్లలో విడుదల కానుంది. శివ కొరటాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం భారీ అంచానాలే నెలకొన్నాయి. ఇక లూసిఫర్ రీమేక్‌గా తెరకెక్కుతోన్న ‘గాడ్ ఫాదర్’ చిత్రీకరణ దశలో ఉండగా.. మెహర్ రమేశ్ దర్శకత్వంలో ‘భోళా శంకర్’ త్వరలో మరో చిత్రంలో నటిస్తూ దుకుడు పెంచారు. Boss @KChiruTweets Insta story ❤️❤️😂😂 pic.twitter.com/7HYJmUyoJN— chiranjeevi tharvathe yevarayina | Aacharya 🔥🔥 (@Deepu0124) October 31, 2021 చదవండి: Halloween 2021: దెయ్యాల్లా మారిన మన స్టార్స్‌ని గుర్తుపట్టారా? -
Halloween 2021: దెయ్యాల్లా మారిన మన స్టార్స్‌ని గుర్తుపట్టారా?
Halloween 2021: హాలోవీన్ అనేది అమెరికా, యూకే వంటి వెస్ట్రన్ దేశాల్లో ఎక్కువగా జరుపుకుంటారు. ఇప్పుడు ఆ ట్రెండ్ ఇండియాలో కూడా వచ్చేసింది. ప్రతి ఏడాది అక్టోబర్31న హాలోవీన్ ఫెస్టివల్‌ను సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ సందర్భంగా దెయ్యాల్లా విచిత్ర వేషధారణతో రెడీ అయ్యి ఫ్రెండ్స్‌తో సందడి చేస్తారు. హాలోవీన్ ఫెస్టివల్ అంటూ పలువరు స్టార్స్ దెయ్యాల్లా రెడీ అయ్యారు. ఆ ఫోటోలను మీరు కూడా చూసేయండి. .. View this post on Instagram A post shared by miheeka (@miheeka) View this post on Instagram A post shared by Vidyu Raman (@vidyuraman) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) View this post on Instagram A post shared by k a u s h a l M a n d a (@kaushalmanda) View this post on Instagram A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) View this post on Instagram A post shared by Sunny Leone (@sunnyleone) View this post on Instagram A post shared by Sunny Leone (@sunnyleone) View this post on Instagram A post shared by Soha (@sakpataudi) View this post on Instagram A post shared by Karan Tacker (@karantacker) -
హర్రర్.. హ్యూమర్
-
నది ఒడ్డున భయానక దృశ్యం.. పరుగులు
బ్రిస్టల్ : నది ఒడ్డుకు కొట్టుకువచ్చిన ఓ వ్యక్తి శరీరాన్ని చూసి ప్రజలు పరుగులు తీశారు. ఇంగ్లాండ్‌లోని బ్రిస్టల్ నగరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. నదిపై ఉన్న బ్రిస్టల్ బ్రిడ్జి పక్కకు ఉన్న ప్రదేశంలోకి ఓ శవం కొట్టుకువచ్చింది. వ్యక్తి శరీరం మొత్తం తాళ్లు చుట్టి ఉండటంతో హడలిపోయిన ప్రజలు దాన్ని ‘మమ్మీ’ గా భావించారు. అయితే, వ్యక్తి శరీరం ఎక్కడి నుంచి వచ్చిందన్న విషయంపై ఎలాంటి సమాచారం అందలేదని బ్రిస్టల్ పోస్ట్ పేర్కొంది. హాలోవీన్ సందర్భంగా బ్రిడ్జిపై వెళ్తున్న వారిని భయాందోళనలకు గురి చేసేందుకు కొందరు వ్యక్తులు ఈ పని చేసుంటారని పోలీసులు భావిస్తున్నారు. -
రాత్రి పిశాచిలాగా గర్ల్‌ఫ్రెండ్.. బాయ్‌ఫ్రెండ్‌కు చుక్కలు
-
బాయ్‌ఫ్రెండ్‌కు చుక్కలు చూపించిన లవర్
న్యూయార్క్ : అమెరికాలో ఓ గర్ల్ ఫ్రెండ్ తన బోయ్‌ఫ్రెండ్‌కు చుక్కలు చూపించింది. అర్థరాత్రి హలోవీన్(రక్త పిశాచాల మాదిరిగా వేసుకునే వేశం) ద్వారా దాదాపు అతడి గుండె ఆగినంత పనిచేసింది. హ్యాపీగా భోజనం చేసి గాఢ నిద్రలోకి జారుకున్న అతడి వద్దకు వెళ్లి మరి ఠారెత్తించింది. వివరాల్లోకి వెళితే.. పాశ్చాత్య నగరాల్లో హలోవీన్ అనేది సాధారణంగా జరుగుతుంటుంది. నటాలీ అనే ఓ 23 ఏళ్ల యువతి తాను హలోవీన్ మేకప్ వేసుకుంటే ఎదుటి వ్యక్తులు భయపడతారా లేదా అని పరీక్షించుకోవాలనుకుంది. ఓ టిష్యూ పేపర్ సన్నటి దారాల సహాయంతో తన ముఖాన్ని జుగుప్సాకరంగా మార్చుకుంది. నోరును కుట్టేసినట్లుగా మొత్తం రసి కారుతున్నట్లుగా మార్చుకొని పై గదిలో తన బెడ్రూంలో నిద్రిస్తున్న బోయ్‌ఫ్రెండ్ స్టీపెన్ (27) వద్దకు వెళ్లి 'బేబీ నా ముఖం చూడు అంటూ చూపిస్తూ మెల్లిగా అతడి దగ్గరకు అడుగులు వేసింది. ఆ దృశ్యాన్ని చూసి గాఢ నిద్రలో ఉన్న బోయ్‌ఫ్రెండ్ బెంబేలెత్తిపోయాడు.. తెలుగు భాషలో చెప్పాలంటే 'ఓరి నాయనో ఓరి దేవుడో ఏమైంది.. నా దగ్గరకు రాకు తల్లో' అని కేకలు వేస్తూ మంచంపై ఎగిరెగిరి పడ్డాడు. ఈ వీడియో ఆన్లైన్లో తెగ వైరల్ అయింది. -
'థ్రిల్లర్' డ్యాన్స్‌తో అదరగొట్టిన ఒబామా
-
'థ్రిల్లర్' డ్యాన్స్‌తో అదరగొట్టిన ఒబామా
దివాలి వేడుకలతో మెరిసిపోయిన వైట్‌హోస్, బరాక్ ఒబామా, మిచెల్లీ డ్యాన్సులతో హోరెత్తింది. సోమవారం రాత్రి వైట్‌హోస్‌లో జరిగిన హాలోవీన్ ట్రిక్ ఆర్ ట్రీట్ ఈవెంట్లో మైకెల్ జాక్సన్ "థ్రిల్లర్" డ్యాన్స్‌లతో అమెరికా అధ్యక్షుడు ఒబామా, ఆయన భార్య మిచెల్లీ ప్రేక్షకులను మురిపించారు. వైట్‌హోస్‌లో సౌత్ లాన్లో ఏర్పాటుచేసిన ఈ ఈవెంట్‌కు 4వేలకు పైగా ప్రజలను ఒబామా ఆహ్వానించారు. వీరిలో ఎక్కువగా వాషింగ్టన్ ప్రాంతంలోని ఎలిమెంటరీ స్కూల్ పిల్లలు, సైనిక కుటుంబాలు ఉన్నాయి. ఈ సందర్భంగా ఒబామా పలు చమత్కారాలు చేశారు. కనీసం ఈరోజైనా తల్లిదండ్రులు మిచెల్లీపై, పోషకాహారంపై శ్రద్ధ తీసుకోకుండా ఉండాలని ఆశిస్తున్నట్టు చమత్కరించారు. ఈ విషయానికి తానుకూడా సమ్మతిస్తున్నట్టు మిచెల్లీ తెలిపారు. ప్రతిఒక్కరూ క్యాండీ(మిఠాయి) తినాలని మిచెల్ చెప్పారు. అలా మిఠాయిలను ఆస్వాదిస్తూ రాత్రంతా ఈవెంట్ వేడుకలను ఎంజాయ్ చేయాలని ఒబామా పిలుపునిచ్చారు. -
ఆ ఫొటో పెట్టినందుకు హీరోయిన్ సారీ!
ముంబై: పాకిస్థానీ నటి మహీరాఖాన్ ట్విట్టర్లో పెట్టిన ఓ ఫొటో వివాదాస్పదమైంది. ఇటీవల హాలోవిన్ పార్టీ సందర్భంగా శివసేన అధినేత బాల్‌ఠాక్రేను పోలినవిధంగా దుస్తులు వేసుకొని, నుదుట తిలకం ధరించిన పాకిస్థాన్ దర్శకుడు అసీజ్ రజాతోపాటు ఆమె దిగిన ఈ ఫొటో ఆన్లైన్లో హల్చల్ చేస్తున్నది. ఈ ఫొటోలో శివసైనికుడి మాదిరిగా దుస్తులు వేసుకున్న దర్శకుడు రజా 'మహీరాకో బార్ నికాలో' (మహీరాను వెళ్లగొట్టండి) అన్న ప్లకార్డు పట్టుకొని ఉండగా.. ఆయన పక్కన క్యాట్ వుమన్ డ్రెస్‌లో ఉన్న మహీరా కనిపించింది. ఈ ఫొటో వెలుగుచూడటంతో మహీరాఖాన్ క్షమాపణలు చెప్పింది. ఎవరి మనోభావాలు దెబ్బతీయడం తన ఉద్దేశం కాదని, ఈ ఫొటో వల్ల ఎవరైనా నొచ్చుకొని ఉంటే క్షమాపణలు కోరుతున్నానని ఆమె తెలిపారు. పాక్ నటి అయిన మహీరాఖాన్ ప్రస్తుతం షారుఖ్ ఖాన్ హీరోగా నటిస్తున్న 'రాయిస్' సినిమాతో బాలీవుడ్‌కు పరిచయం కానుంది. వచ్చే ఏడాది ఈ సినిమా విడుదల కానుంది. పాకిస్థాన్ నటులు బాలీవుడ్లో నటించవద్దని శివసేన ఆందోళన చేస్తున్న నేపథ్యంలో మహీరాఖాన్ ఫొటోపై పలు విమర్శలు వచ్చాయి. -
కుక్కలకూ ఓ హాలోవెన్ ఫ్యాషన్ షో
-
'హాలోవీన్' కోసం మూతిని కుట్టేసుకుంది!
ఏదైనా హర్రర్ సినిమాలో సూది దారం తీసుకొని నోటిని కుట్టేసుకున్న దృశ్యాన్ని చూస్తే ఒళ్లు జలదరిస్తుంది. అలాంటిది నిజంగానే మూతి కుట్టేసుకొని కనిపిస్తే భయపడిపోరు! పాశ్చాత్య దేశాల్లో ఈ నెల 31న నిర్వహించే 'హాలోవిన్' పార్టీ కోసం మూతిని సూదిదారంతో ఎలా కుట్టేసుకోవాలో ఇంటర్నెట్ వేదికగా వివరించింది 'ప్రామిస్' అనే మేకప్ ఆర్టిస్ట్. ప్రామిస్ అసలు పేరు ప్రతిగ్యా తమంగ్. నేపాల్‌లో పుట్టిన ఆమె ప్రస్తుతం అమెరికాలో నివాసముంటున్నది. 'మానవ ఊసరవెల్లి'గా పేరొందిన ఈ అమ్మడికి యూట్యూబ్‌లో పెద్దసంఖ్యలోనే ఫ్యాన్స్ ఉన్నారు. యూట్యూబ్‌లో ఆమెకు 40 లక్షలమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. వారికి ఈమె చిత్రవిచిత్రంగా ఆన్లైన్ పాఠాలు చెప్తుంది. తాజాగా ప్రతిగ్యా మూతిని సూది దారంతో ఎలా కుట్టేసుకోవాలో ట్యూషన్ చెప్పింది. ఆమెకు పిచ్చికాకపోతే ఎవరైనా చూస్తూ చూస్తూ మూతిని కుట్టేసుకుంటారా? అనుకోకండి. ఆమె కేవలం మూతిని కుట్టేసుకున్నట్టు ఎలా కనిపించాలో వివరించిందంతే. నోటిని కుట్టేసుకున్నట్టు దారాన్ని రెండు పెదవుల అంచులకు అంతకించుకొని.. సూది గుచ్చినట్టు ఎర్రని చుక్కలు పెట్టి నోటిని కుట్టేసుకున్నట్టు కనిపించవచ్చునని వివరించింది. ఈ వీడియోను యూట్యూబ్‌లో ఇప్పటివరకు 30 లక్షలమంది చూశారు.