Halloween 2021: Chiranjeevi Halloween Look Pic Goes Viral - Sakshi
Sakshi News home page

Chiranjeevi Hallowen Look: కొత్త లుక్‌తో భయపెడుతున్న మెగాస్టార్‌.. షాక్‌లో అభిమానులు!

Published Mon, Nov 1 2021 1:21 PM | Last Updated on Mon, Nov 1 2021 3:00 PM

Mega Star Chiranjeevi Hallowen Look Goes Viral - Sakshi

సినీ ప్రపంచంలో ఎప్పుడూ ఏదో ఓ ట్రెండ్‌, ఛాలెంజ్‌లు నడుస్తూనే ఉంటాయి. తారలు వాటిని ఫాలో కావడం షరా మామూలే. కాకపోతే ఇలాంటివి ఎక్కువగా యువ హీరో హీరోయిన్‌లు పాటిస్తూ ఉంటారు. ఆదివారం అక్టోబ‌ర్ 31న ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు హాలోవీన్ ఉత్సవాలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా తారలు దెయ్యాల గెటప్సతో ఫోటోలు, వీడియోలతో నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నారు. తాజాగా వారి సరసన మెగాస్టార్‌ చిరంజీవి కూడా చేరిపోయారు. ప్రస్తుతం చిరు చేసిన ఓ వీడియో వైరల్‌గా మారింది. 

‘సైరా నరసింహారెడ్డి’ తర్వాత చిరు సినిమాలకు గ్యాప్‌ ఇచ్చినప్పటికీ ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ కుర్ర హీరోల‌తో పోటీ ప‌డుతున్నారు. అంతేనా కొత్త లుక్స్‌లో క‌నిపిస్తూ కేక పెట్టించడంతో పాటు ఫ్యాన్స్‌లో జోష్‌ నింపుతున్నారు. ఇటీవలే సోషల్‌మీడియాలో గుండు ఫొటోతో క‌నిపించి అంద‌రికి పెద్ద షాకే ఇచ్చిన చిరు, తాజాగా దెయ్యం లుక్‌లో నయా అవతార్‌ను చూపించారు. ఈ లుక్ చూసి అంద‌రు ఆశ్చ‌ర్య‌పోతున్నారు. అయితే హాలోవీన్ ఉత్సవాలు కారణంగా మెగాస్టార్ అలా కనిపించారు. 

మరో వైపు నిహారిక కూడా త‌న భ‌ర్త‌తో క‌లిసి డిఫ‌రెంట్ గెట‌ప్‌లో సంద‌డి చేసిన విష‌యం తెలిసిందే. ప్రస్తుతం మెగాస్టార్‌ నటించిన ఆచార్య సినిమా ఫిబ్రవరి 4, 2022న థియేటర్లలో విడుదల కానుంది. శివ కొరటాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం భారీ అంచానాలే నెలకొన్నాయి. ఇక లూసిఫర్‌ రీమేక్‌గా తెరకెక్కుతోన్న ‘గాడ్ ఫాదర్’ చిత్రీకరణ దశలో ఉండగా.. మెహర్ రమేశ్ దర్శకత్వంలో ‘భోళా శంకర్’ త్వరలో మరో చిత్రంలో నటిస్తూ దుకుడు పెంచారు.

చదవండి: Halloween 2021: దెయ్యాల్లా మారిన మన స్టార్స్‌ని గుర్తుపట్టారా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement