Mega Star Chiranjeevi
-
షార్జా స్టేడియంలో చిరంజీవి సందడి (ఫోటోలు)
-
చిరంజీవి ఇంటికి అల్లు అర్జున్
-
యాభై సంవత్సరాల ముందే బెస్ట్ యాక్టర్ గా అవార్డు..
-
పుట్టినరోజున విడుదలైన చిరు ఏకైక సినిమా ఏంటో తెలుసా? (ఫొటోలు)
-
సావిత్రిగారిని చూడగానే నోట మాట రాలేదు: చిరంజీవి
‘‘మహానటి సావిత్రిగారిపై రాసిన ‘సావిత్రి క్లాసిక్స్’ పుస్తకాన్ని ఆవిష్కరించడంతో నా జన్మ సార్థకం అయిందని భావిస్తున్నాను’’ అన్నారు హీరో చిరంజీవి. దివంగత నటి సావిత్రిపై సంజయ్ కిశోర్ రచించిన ‘సావిత్రి క్లాసిక్స్’ బుక్ లాంచ్ వేడుక మంగళవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చిరంజీవి మాట్లాడుతూ– ‘‘నా తొలి సినిమా ‘పునాదిరాళ్లు’లోనే సావిత్రిగారితో నటిస్తున్నానని తెలియగానే ఒళ్లు జలదరించింది. రాజమండ్రిలోని పంచవటి హోటల్లో ఉన్న సావిత్రిగారిని పరిచయం చేసేందుకు నన్ను తీసుకెళ్లారు. ఆమెను చూడగానే నోట మాట రాలేదు. ‘నీ పేరేంటి బాబు’ అని అడిగారామె. చిరంజీవి అన్నాను. ‘శుభం బాగుంది’ అన్నారు. మరుసటి రోజ వర్షం వల్ల ‘పునాదిరాళ్లు’ షూటింగ్ క్యాన్సిల్ అయింది. నేను సరదాగా డ్యాన్స్ చేస్తూ జారిపడ్డాను. అయినా ఆగకుండా నాగుపాములా డ్యాన్స్ చేయడంతో అందరూ క్లాప్స్ కొట్టారు. అప్పుడు సావిత్రిగారు ‘భవిష్యత్‌లో మంచి నటుడు అవుతావు’ అని చెప్పిన మాట నాకు వెయ్యి ఏనుగుల బలం అనిపించింది. ‘ప్రేమ తరంగాలు’లో సావిత్రిగారి కొడుకుగా నటించాను. ఆ తర్వాత ఆమెతో నటించే, ఆమెను చూసే చాన్స్ రాలేదు. కేవలం కళ్లతోనే నటించగల, హావభావాలు పలికించగల అలాంటి గొప్ప నటి ప్రపంచంలో మరెవరూ లేరు’’ అన్నారు. ఈ వేడుకలో సావిత్రి కుమార్తె విజయ చాముండేశ్వరి, కుమారుడు సతీశ్ కుమార్, నటీనటులు జయసుధ, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, మురళీ మోహన్, రచయిత పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడారు. -
పద్దెనిమిది ఏళ్ల తర్వాత...
పద్దెనిమిదేళ్ల తర్వాత స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు హీరో చిరంజీవి, హీరోయిన్ త్రిష. చిరంజీవి హీరోగా నటిస్తున్న సోషియో ఫ్యాంటసీ అడ్వెంచరస్ ఫిల్మ్ ‘విశ్వంభర’. ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్, విక్రమ్ ఈ భారీ బడ్జెట్ సినిమాను నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమాలోని ఓ హీరోయిన్ పాత్రలో త్రిష నటిస్తున్నట్లుగా యూనిట్ పేర్కొంది. ఈ సినిమా కోసం 13 సెట్లను నిర్మించారు మేకర్స్. ప్రస్తుతం హైదరాబాద్‌లో వేసిన ఓ సెట్లో చిరంజీవి, త్రిషలపై కొన్ని కీలక సన్నివేశాలతో పాటు, ఓ పాటను కూడా చిత్రీకరించే పనిలో ఉందట చిత్రబృందం. అలాగే ఈ సినిమాలో మీనాక్షీ చౌదరి మరో హీరోయిన్గా నటిస్తారనే టాక్ వినిపిస్తోంది. ‘విశ్వంభర’ని సంక్రాంతి పండగకి జనవరి 10న విడుదల కానుంది. ఇక 2006లో వచ్చిన ‘స్టాలిన్’ చిత్రం తర్వాత చిరంజీవి, త్రిష కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్న చిత్రం ‘విశ్వంభర’యే కావడం విశేషం. -
బెంగుళూరు ఫామ్‌హౌస్‌లో మెగా ఫ్యామిలీ గ్రాండ్ సంక్రాంతి సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
సంక్రాంతికి విశ్వంభర
హీరో చిరంజీవి సంక్రాంతి కానుకగా అభిమానులకు ఖుషీ కబురు చెప్పారు. ఆయన నటిస్తున్న తాజా చిత్రానికి ‘విశ్వంభర’ అనే టైటిల్ ఖరారు చేసి, టైటిల్ గ్లింప్స్ విడుదల చేశారు మేకర్స్. అంతేకాదు.. ఈ సినిమాని 2025 సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. ‘బింబిసార’ వంటి హిట్ మూవీ తర్వాత దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్న చిత్రమిది. యూవీ క్రియేషన్స్‌పై విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. ‘‘ఫ్యాంటసీ అడ్వెంచర్‌గా రూపొందుతోన్న చిత్రం ‘విశ్వంభర’. చిరంజీవిగారి కెరీర్లో అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న సినిమా ఇది. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతోంది’’ అన్నారు మేకర్స్. ఈ చిత్రానికి సంగీతం: ఎంఎం కీరవాణి, కెమెరా: ఛోటా కె.నాయుడు, ఎగ్జిక్యూటివ్‌ప్రోడ్యూసర్: కార్తీక్ శబరీష్, లైన్‌ప్రోడ్యూసర్: రామిరెడ్డి శ్రీధర్ రెడ్డి. -
నాకు చిరంజీవి గారికి ఒక మంచి బాండింగ్ ఉంది
-
చిరంజీవి రాజకీయాలు మాట్లాడాలంటే నేరుగా మాట్లాడొచ్చు : సజ్జల
-
నేను బ్రో సినిమా గురించే మాట్లాడుతున్నా : అంబటి రాంబాబు
-
మెగాస్టార్ వాల్తేరు వీరయ్య 200 డేస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
నా అభిమాన హీరోకి ఒక రాజకీయ నాయకుడిగా చెబుతున్నా : పేర్ని నాని
-
సినిమా నటులపై ఏ రాజకీయ పార్టీ అయినా మాట్లాడిందా..?
-
మెగాస్టార్ చిరంజీవికి కొడాలి నాని స్ట్రాంగ్ కౌంటర్
-
బోలా శంకర్ అల్టిమేట్ ప్రోమో
-
Exclusive Interview: చిరంజీవి కామెడీ టైమింగ్ కి పొట్ట చెక్కలు అవ్వాల్సిందే..
-
ఈ సినిమా చూసి ప్రతి అమ్మాయి, తల్లి దండ్రులు జాగ్రత్త పడాలి..
-
వైష్ణవి చైతన్య మాటలకు దండం పెట్టిన చిరంజీవి..
-
మెగా స్టార్ భోళా శంకర్ మూవీ ట్రైలర్ విడుదల
-
రామ్ చరణ్ - ఉపాసన బిడ్డ పేరు ఇదే.. మెగాస్టార్ ట్వీట్!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ – ఉపాసన దంపతులు తల్లిదండ్రులు అయినరోజు నుంచి మెగాఫ్యామిలీ వార్తల్లో నిలుస్తూనే ఉంది. కొణిదెల వారి ఇంట ఈనెల 20న మెగా ప్రిన్సెస్ అడుగుపెట్టింది. దీంతో మెగా ఇంట నేటివరకు కూడా సంబరాలు జరుగుతూనే ఉన్నాయి. పాప పుట్టినరోజు నుంచి ఇటు మీడియాలో.. అటు సోషల్ మీడియాలో ఏ పేరు పెట్టబోతున్నారనే చర్చ నడుస్తూనే ఉంది. తాజాగా మనవరాలి పేరును చిరంజీవి ట్వీట్ చేశారు. మా ఇంటి మహాలక్ష్మి పేరు 'క్లీంకార కొణిదెల'(Klin Kara Konidela) అంటూ పోస్ట్ చేశారు. ఈ మేరకు ఓ ఫోటోను మెగాస్టార్ ట్విటర్లో పోస్ట్ చేస్తూ మనవరాలి పేరును వెల్లడించారు. ఆ ఫోటోలో చిరంజీవి దంపతులు కూడా ఉన్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో పెద్దఎత్తున వైరలవుతోంది. Klin Kaara Konidela 😍@AlwaysRamCharan @upasanakonidela pic.twitter.com/8emWJoJcra — Chiranjeevi Konidela (@KChiruTweets) June 30, 2023 And the baby’s name is ‘Klin Kaara Konidela ‘.. Taken from the Lalitha Sahasranama Nama.. ‘Klin Kaara’ represents an Embodiment of Nature.. Encapsulates the supreme power of divine Mother ‘Shakthi’ .. and has a powerful ring and vibration to it .. All of us are sure the… pic.twitter.com/vy3I0jaS4o — Chiranjeevi Konidela (@KChiruTweets) June 30, 2023 -
మెగాస్టార్ మాస్ మేనియా... సంధ్య థియేటర్ దద్దరిల్లింది
-
మెగా ఫ్యాన్స్ కు కిక్కిచ్చే అప్డేట్..
-
ఇన్నేళ్లకు మా చేతిలో బిడ్డని పెట్టారు..
-
మహేష్ బాబును ఫాలో అవుతున్న చిరంజీవి
-
చిరంజీవి మిడ్ నైట్ విజువల్స్
-
మెగా ఫాన్స్ హంగామా పుట్టిన పాపతో రామ్ చరణ్
-
పండంటి పాపకు జన్మనిచ్చిన ఉపాసన మెగా ఫ్యామ్లీయ్ లో సంబరాలు
-
టాలీవుడ్ ని షేక్ చేస్తున్న మెగా రూమర్
-
మెగా ఫామిలీ లో మరో బ్యానర్...చరణ్ కు పోటీగా!
-
ఫామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాలో చిరంజీవి, ప్రభాస్ !
-
చిరుకు షాకిచ్చిన శ్రీయా
-
సోగ్గాడుగా చిరు? సస్పెన్స్ లో మెగా ఫాన్స్..
-
ప్రభాస్ ప్రొడక్షన్ లో చిరంజీవి సినిమా
-
సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చిన మెగాస్టార్
-
విరాట్ కోహ్లి బయోపిక్‌లో రామ్‌చరణ్..? పోలికలు కూడా దగ్గరగా ఉన్నాయి..!
తాజాగా ఢిల్లీలో జరిగిన ఇండియా టుడే కాంక్లేవ్ సందర్భంగా మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ ఓ ఆసక్తికర విషయాన్ని మీడియాతో షేర్ చేసుకున్నాడు. RRR సినిమాతో గ్లోబల్ స్టార్‌గా మారిపోయిన చెర్రీ.. స్పోర్ట్స్ బయోపిక్‌లో నటించాలని తనకు చాలకాలంగా కోరిక ఉందని అన్నాడు. అవకాశం వస్తే టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి బయోపిక్‌లో నటించేందుకు ఇష్టపడతానని తెలిపాడు. క్రీడా జగత్తులో విరాట్ కోహ్లి ఓ అద్భుతమని, అతనిదో స్ఫూర్తిదాయకమైన క్యారెక్టరని పొగడ్తలతో ముంచెత్తిన చరణ్.. కోహ్లి రోల్ ప్లే చేసే అవకాశం వస్తే మాత్రం వదులుకునేది లేదని తన మనసులోని మాటను బయటపెట్టాడు. లుక్స్ పరంగా కూడా తాను కోహ్లికి దగ్గరగా ఉంటానని, ఇది తనకు అదనపు అడ్వాంటేజ్ అని తెలిపాడు. వెండితెరపై ఇప్పటికే వైవిధ్యమైన పాత్రలను పోషించి సక్సెస్ సాధించిన చరణ్.. స్పోర్ట్స్ బయోపిక్ చేయాలన్న సాహసోపేతమైన కోరిక కలిగి ఉండటం సినీ జనాలకు ఆకట్టుకుంటుంది. కాంక్లేవ్ సందర్భంగా చరణ్.. ఆస్కార్ విన్నింగ్ నాటు నాటు పాటకు స్టెప్పులేసి అలరించాడు. #ViratKohli this is crazy 🕺🕺🕺 He is doing #NaatuNaatu #rrr #RamCharan #jrntr #INDvAUS @imVkohli @ImRo45 @AlwaysRamCharan @tarak9999 pic.twitter.com/2bm6FL6iAT — Telugu Box office (@TCinemaFun) March 17, 2023 ఓ పక్క చరణ్.. కోహ్లి బయోపిక్‌లో నటించాలని ఉందని తన మనసులో మాట బయటపెట్టగా, మరో పక్క కోహ్లి.. ఆసీస్‌తో తొలి వన్డే సందర్భంగా మైదానంలో నాటు నాటు పాటకు స్టెప్పులేసి పరోక్షంగా చరణ్ ప్రపోజల్‌కు అంగీకారం తెలిపాడు. కాగా, నాటు నాటు పాటకు ఆస్కార్ అందుకున్న తర్వాత అమెరికా నుంచి నేరుగా ఢిల్లీకి వచ్చిన రామ్ చరణ్.. తండ్రి చిరంజీవితో కలిసి కేంద్ర మంత్రి అమిత్ షాను కలిశాడు. చరణ్ పాల్గొన్న కాంక్లేవ్‌లోనే పాల్గొన్న అమిత్ షా.. సదస్సు అనంతరం అదే హోటల్లో బస చేస్తున్న చరణ్ రూమ్ కి వెళ్లి కొద్దిసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు గెలుచుకున్నందుకు గానూ అమిత్‌షా అభినందించి చరణ్‌ను శాలువాతో సత్కరించారు. భారతీయ చిత్రసీమలో ఇద్దరు దిగ్గజాలు @KChiruTweets మరియు @AlwaysRamCharan లను కలవడం ఆనందంగా ఉంది. తెలుగు సినిమా పరిశ్రమ భారతదేశ సంస్కృతి మరియు ఆర్థిక వ్యవస్థను గణనీయంగా ప్రభావితం చేసింది. నాటు-నాటు పాటకు ఆస్కార్ మరియు RRR చిత్రం అద్భుత విజయం సాధించినందుకు రాంచరణ్ ను అభినందించారు. pic.twitter.com/eyLWuq3xmM — Amit Shah (@AmitShah) March 17, 2023 అనంతరం ట్వీట్ చేసిన కేంద్రమంత్రి అమిత్ షా భారతీయ చిత్రసీమలో ఇద్దరు దిగ్గజాలు చిరంజీవి, రామ్ చరణ్‌లను కలవడం ఆనందంగా ఉందని తెలిపారు. తెలుగు సినిమా పరిశ్రమ.. భారతదేశ సంస్కృతి, ఆర్థిక వ్యవస్థను గణనీయంగా ప్రభావితం చేసిందని పేర్కొన్నారు. -
ఏపీలో చిరంజీవి, బాలకృష్ణ సినిమాల టికెట్ ధర పెంపునకు అనుమతి
-
ప్రశాంత జీవనానికి విశాఖ అద్భుతమైన ప్రాంతం : చిరంజీవి
-
విశాఖ తీరంలో మెగాస్టార్ చిరంజీవి అభిమానుల సందడి
-
కైకాల సత్యనారాయణ భౌతికఖాయానికి నివాళులు అర్పించిన చిరంజీవి
-
గాడ్ ఫాదర్ సినిమా టాక్ పై మెగాస్టార్ ఆసక్తికర కామెంట్స్
-
అలయ్ బలయ్ కు హాజరైన మెగాస్టార్ చిరంజీవి
-
కన్నీళ్లు తెప్పించే ఘటన.. ‘సినీ గాడ్‌ఫాదర్’ను కళ్లారా చూడాలని.. ఇంతలోనే
అనంతపురం సప్తగిరి సర్కిల్: మెగాస్టార్ చిరంజీవి అంటే నిలువెల్లా ఆ యువకుడికి అభిమానం. కళ్లారా చూడాలన్న తాపత్రయం. సినీ గాడ్‌ఫాదర్‌ను హైదరాబాద్ వెళ్లి చూసే అవకాశం ఎలాగూ ఉండదు. బుధవారం అనంతపురం వస్తున్నారని తెలిసి.. మిత్రుడిని వెంటబెట్టుకొని గుత్తి నుంచి ద్విచక్ర వాహనంపై ఆత్రంగా బయల్దేరాడు. మరో పదినిమిషాల్లో సభా ప్రాంగణానికి చేరుకుంటాడు. అంతలోనే గార్లదిన్నె వద్ద మృత్యువు అతన్ని ప్రమాద రూపంలో కబళించింది. చదవండి: గాడ్‌ఫాదర్ ఈవెంట్.. ఎస్పీకి ఫిర్యాదులు.. అసలు ఏం జరిగిందంటే? అయితేనేం అభిమానం “చిరంజీవి’గా వెలుగునివ్వాలని అతని కుటుంబ సభ్యులు భావించారు. నేత్రాలను దానం చేస్తే.. మరో ఇద్దరి జీవితాల్లో వెలుగునిస్తాడని భావించారు. అనుకున్నదే తడవుగా నేత్రాలను దానం చేశారు. గుత్తి పట్టణానికి చెందిన రాజశేఖర్ (22) కళ్లను అతని కుటుంబ సభ్యులు సాయిట్రస్ట్ ఆధ్వర్యంలో ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి ద్వారా నేత్రాలను గురువారం సేకరించారు. కళ్లను సేకరించిన వారిలో సాయిట్రస్ట్ సభ్యులు విజయసాయి, నారాయణ, ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రి టెక్నీషియన్ రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు. -
ఇందిరాదేవి మరణవార్త కలచివేసింది : చిరంజీవి ట్వీట్
-
మెగాస్టార్ బర్త్ డే సెలెబ్రేషన్ లో కొడాలి నాని
-
స్టార్ స్టార్ సూపర్ స్టార్ - మెగా స్టార్ చిరంజీవి
-
చిరంజీవి పొలిటికల్ రీ ఎంట్రీ.. నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
సాక్షి,విజయనగరం: తన సోదరుడు, ప్రముఖ సినీ నటుడు చిరంజీవి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేదని జనసేన నేత కొణిదెల నాగబాబు తెలిపారు. విజయనగరం జిల్లాలో పార్టీ విస్తృతస్థాయి సమావేశానికి వచ్చిన ఆయన ఓ హోటల్లో గురువారం మీడియాతో మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో జనసేనకు చిరంజీవి మద్దతుగా ఉంటారే తప్ప ఎక్కడా పోటీ చేయరన్నారు. పొత్తులపై అన్నీ ఆలోచించి పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నిర్ణయం తీసుకుంటారన్నారు. జిల్లాలో జనసేన పార్టీ పరిస్థితి తెలుసుకునేందుకు ఇక్కడకు వచ్చినట్టు వివరించారు. చదవండి: Ambati Rambabu: దేవినేని ఉమకు అంతా తెలిస్తే.. అప్పుడేం చేశారు: మంత్రి అంబటి -
‘ఆచార్య’లో నటించిన ఈ బాలుడు ఎవరో తెలుసా!
సాక్షి,మందమర్రిరూరల్: మెగాస్టార్ చిరంజీవి, రామ్‌చరణ్ నటించిన ఆచార్య సినిమాలో మందమర్రికి చెందిన బాలుడు మిథున్‌కు నటించే అవకాశం లభించింది. మందమర్రికి చెందిన డాక్టర్ భీమనాథుని సదానందం కుమారుడు శ్రీధర్, సరిత దంపతుల కుమారుడు మిథున్ శ్రేయాష్ హైదరాబాద్‌లోని రామంతాపూర్‌లో ఉంటున్నారు. మిథున్ సెయింట్ జోసెఫ్ హైస్కూల్లో ఐదో తరగతి చదువుతున్నాడు. ఆచార్య సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ కోసం వెతుకగా శ్రీధర్ మిత్రుడు విజయ్‌కుమార్‌కు తెలిసిన వారి ద్వారా సినిమా వాళ్లకి పరిచయం చేశారు. ఆడిషన్లో డైలాగ్‌లు బాగా చెప్పడంతో ఎంపిక చేసుకున్నారు. రాజమండ్రి మారెడుమల్లె, కోకాపేట ఏరియాలో జరిగిన షూటింగ్లో పాల్గొన్నాడు. ఆచార్య సినిమా శుక్రవారం రిలీజ్ కానుంది. చిరంజీవి సినిమాలో తమ మనవడు నటించడం సంతోషంగా ఉందని డాక్టర్ సదానందం తెలిపాడు. పట్టణంలోని ప్రైవేట్ వైద్యుల సంఘం ఆధ్వర్యంలో బాలుడిని అభినందించారు. చదవండి: Acharya Movie Review: సాక్షి ఆడియన్స్ పోల్.. 'ఆచార్య'పై ప్రేక్షకుల రివ్యూ -
పరిశ్రమ తరుపున సీఎం జగన్ కు ప్రత్యేక కృతజ్ఞతలు
-
అన్ స్టాపబుల్ కు మెగాస్టార్ ఎందుకు రాలేదు ?
-
చిరు చిత్రానికి పోటీగా వస్తున్నకమల్, వెంకటేష్
-
సీఎం జగన్‌తో భేటీ కానున్న మెగాస్టార్ చిరంజీవి
-
చిరు సరసన స్టెప్పులేసిన రెజీనా
-
సినీ పరిశ్రమకు పెద్దదిక్కుగా ఉండే ప్రసక్తే లేదు
-
చిరు సినిమాలో రవితేజ.. ఆ పాత్రం కోసం అంత రెమ్యూనరేషన్ ఇస్తున్నారా?
క్రాక్ సినిమా బ్లాక్‌బస్టర్‌తో మాస్ మహరాజా రవితేజ మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. దాన్ని అలానే కొనసాగించాలనే ప్రయత్నంతో వరుసగా ప్రాజెక్టులు చేస్తున్నాడు రవి. ప్రస్తుతం ఈ వరుసలో.. ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీ, ధమాకా, రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు అనే చిత్రాలు ఉండగా, ఇటీవల చిరు సినిమాలో నటించే ఆఫర్ కూడా అందుకున్నాడని సమాచారం. ప్రస్తుతం ఈ వార్త టాలీవుడ్లో చక్కర్లు కొడుతోంది. మెగా స్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. అందులో ఓ కీలక పాత్ర రవితేజ చేయాలని దర్శకుడా బాబీ అడిగారంట..ఓ వైపు మెగాస్టార్ చిరు సినిమా.. మరో వైపు బాబీతో సాన్నిహిత్యం కారణంగా రవితేజ్ వెంటనే ఓకే అన్నాడట. అయితే ఆ పాత్ర కోసం రవితేజ 7 కోట్లు తీసుకోబోతున్నాడని, నిర్మాతలు కూడా అంత మొత్తం ఇచ్చేందుకు అంగీకరించినట్లు టాలీవుడ్లో టాక్. ఇప్పటికే చిరంజీవి అన్నయ్య సినిమాలో రవితేజ , వెంకట్ లు తమ్ముళ్లుగా నటించారు. ఆ సినిమా బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత చిరుతో రవితేజ జతకడితే.. సినిమాకు ఓ రేంజ్లో హైప్ రావడం ఖాయం. అయితే దీనికి సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. చదవండి: Vijay Sethupathi: విజయ్ సేతుపతిపై క్రిమినల్ కేసు.. ఎందుకంటే ? -
ఘనంగా భోళా శంకర్ ప్రారంభోత్సవం
-
మెగాస్టార్ చిరంజీవి 154వ సినిమా పూజా కార్యక్రమం
-
కొత్త లుక్‌తో భయపెడుతున్న మెగాస్టార్.. షాక్‌లో అభిమానులు!
సినీ ప్రపంచంలో ఎప్పుడూ ఏదో ఓ ట్రెండ్, ఛాలెంజ్‌లు నడుస్తూనే ఉంటాయి. తారలు వాటిని ఫాలో కావడం షరా మామూలే. కాకపోతే ఇలాంటివి ఎక్కువగా యువ హీరో హీరోయిన్లు పాటిస్తూ ఉంటారు. ఆదివారం అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు హాలోవీన్ ఉత్సవాలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా తారలు దెయ్యాల గెటప్సతో ఫోటోలు, వీడియోలతో నెట్టింట హల్చల్ చేస్తున్నారు. తాజాగా వారి సరసన మెగాస్టార్ చిరంజీవి కూడా చేరిపోయారు. ప్రస్తుతం చిరు చేసిన ఓ వీడియో వైరల్‌గా మారింది. ‘సైరా నరసింహారెడ్డి’ తర్వాత చిరు సినిమాలకు గ్యాప్ ఇచ్చినప్పటికీ ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ కుర్ర హీరోలతో పోటీ పడుతున్నారు. అంతేనా కొత్త లుక్స్‌లో కనిపిస్తూ కేక పెట్టించడంతో పాటు ఫ్యాన్స్‌లో జోష్ నింపుతున్నారు. ఇటీవలే సోషల్‌మీడియాలో గుండు ఫొటోతో కనిపించి అందరికి పెద్ద షాకే ఇచ్చిన చిరు, తాజాగా దెయ్యం లుక్‌లో నయా అవతార్‌ను చూపించారు. ఈ లుక్ చూసి అందరు ఆశ్చర్యపోతున్నారు. అయితే హాలోవీన్ ఉత్సవాలు కారణంగా మెగాస్టార్ అలా కనిపించారు. మరో వైపు నిహారిక కూడా తన భర్తతో కలిసి డిఫరెంట్ గెటప్‌లో సందడి చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మెగాస్టార్ నటించిన ఆచార్య సినిమా ఫిబ్రవరి 4, 2022న థియేటర్లలో విడుదల కానుంది. శివ కొరటాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం భారీ అంచానాలే నెలకొన్నాయి. ఇక లూసిఫర్ రీమేక్‌గా తెరకెక్కుతోన్న ‘గాడ్ ఫాదర్’ చిత్రీకరణ దశలో ఉండగా.. మెహర్ రమేశ్ దర్శకత్వంలో ‘భోళా శంకర్’ త్వరలో మరో చిత్రంలో నటిస్తూ దుకుడు పెంచారు. Boss @KChiruTweets Insta story ❤️❤️😂😂 pic.twitter.com/7HYJmUyoJN— chiranjeevi tharvathe yevarayina | Aacharya 🔥🔥 (@Deepu0124) October 31, 2021 చదవండి: Halloween 2021: దెయ్యాల్లా మారిన మన స్టార్స్‌ని గుర్తుపట్టారా? -
చిరు చిత్రంలో అల్లు అర్జున్ ?
-
గాయం నుంచి కోలుకుంటున్నచిరు
-
ఏ సినిమాతో చిరు ‘మెగాస్టార్’గా ఎదిగారో తెలుసా?
-
‘నారప్ప’లో ఎక్కడా వెంకటేష్ కనిపించలేదు: చిరంజీవి
వెంకటేష్ నటించిన నారప్ప చిత్రం జూలై 20న అమెజాన్ ప్రైమ్ వీడియో లో విడుదల అయి, సర్వత్రా పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. తమిళంలో అఖండ విజయం సొంతం చేసుకున్న అసురన్‌కి రీమేక్ ఇది. ఇందులో వెంకీ నటన ఓ రేంజ్లో ఉందని అభిమానులు పండగ చేసుకుంటుండగా, మరోవైపు విమర్శకుల నుంచి సైతం నుంచి నారప్పకు ప్రశంసలు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల ఓటీటీలో విడుదలైన చిత్రాల జాబితాలో బిగ్గస్ట్ బ్లాక్ బస్టర్ దిశగా ఈ చిత్రం దూసుకుపోతోంది. తాజాగా ఈ చిత్రం చూసిన అనంతరం మెగాస్టార్ చిరంజీవి దీనిపై స్పందించారు. తమిళ రీమేక్ చిత్రాలు తెలుగులో విజయం సాధించడం అరుదనే చెప్పాలి. అందుకు ఇటీవల విడుదలైన ‘జాను’ సినిమానే ఉదాహరణ. అక్కడ అఖండ విజయం సొంత చేసుకున్న ‘96’ రీమేక్‌గా టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు వచ్చినా, అంతగా ఆకట్టుకోలేకపోయిందనే చెప్పాలి. కానీ వెంకీ ‘నారప్ప’ మాత్రం ఇందుకు భిన్నంగా తమిళంలో ఎంతటి విజయం సాధించిందో తెలుగులోను అదే రేంజ్ విజయం దిశగా దూసుకుపోతుంది. ఇప్పటికే సోషల్ మీడియాలో నారప్పలో వెంకీ నటనకు నెటిజన్లు కామెంట్లు, మీమ్స్‌తో ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి వెంకీ నటనను అభినందిస్తూ ఓ ఆడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ పోస్ట్‌లో.. కంగ్రాట్స్, నారప్ప చిత్రాన్ని ఇప్పుడే చూశా. నటన పరంగా ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసినట్టుంది. సినిమా చూస్తున్నంత సేపు ఎక్కడా వెంకటేష్ కనబడలేదు, నారప్పే కనిపించాడు. మొత్తానికి ఈ చిత్రంలో కొత్త వెంకటేష్‌ను చూపించావు. పాత్రను ఎంతగానో అర్థం చేసుకొన్నావ్, అందుకే అంతగా ఆ రోల్లో లీనమై నటించావు. నీలో ఉండే నటుడు ఎప్పుడూ ఒక తపన తో, తాపత్రయం తో ఉంటాడు. అలాంటి వాటికి ఈ చిత్రం మంచి ఉదాహరణ అని మెగాస్టార్ తెలిపారు. Its a moment of happiness listening to every word of your appreciation @KChiruTweets. Overwhelmed and humbled for your feedback on Narappa. Thank you Chiranjeevi 🤗 pic.twitter.com/mS18fzEgfD — Venkatesh Daggubati (@VenkyMama) July 23, 2021 -
ధర్మస్థలికి దారులు తెరుచుకున్నాయ్..నెట్టింట రామ్‌చరణ్ పోస్ట్ రచ్చ
acharya movie update: కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా పలు రంగాలతో పాటు సిని పరిశ్రమ కూడా ప్యాకప్ చెప్పిన సంగతి తెలిసిందే. ఇటీవల వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో మధ్యలో ఆపేసిన చిత్రాలన్నీ పట్టాలెక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో ముగింపు దశలో చిత్రీకరణ జరుపుకుంటున్న ‘ఆచార్య’ కు సంబంధించి ఓ ఆసక్తికర పోస్ట్‌ను రామ్‌చరణ్ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. ఈ జోడి కోసం అభిమానుల ఎదురుచూపులు మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఆచార్య’. కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో రామ్ చరణ్, పూజా హెగ్డే కీలక పాత్రధారులు. ఇదివరకే చిరు చరణ్‌లు వెండితెరపై కనిపించి అలరించిన, అది కేవలం అతిథి పాత్రల వరకే పరిమితంగా ఉండేది. ప్రస్తుతం తెరకెక్కుతున్న ‘ఆచార్య’లో అభిమానులకు కనుల విందుగా చేయడానికి వీరి కాంబోకు సంబంధించి..చరణ్‌ది దాదాపు 40 నిమిషాలు ఉంటుందని టాక్. ఇంటర్వెల్లో వచ్చే చరణ్ పాత్ర సెకండాఫ్ అంతా ఉంటుందని తెలిసింది. దీంతో ఈ సినిమా కు అంచనాలు ఓ రేంజ్లో క్రియేట్ అయ్యాయి. ఈ చిత్రం ఫైనల్ షెడ్యూల్లో కొన్ని యాక్షన్ సన్నివేశాలతో పాటు ఓ పాటను కూడా చిత్రీకరిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా దీనికి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్‌ను రామ్‌చరణ్ అభిమానుల కోసం సోషల్ మీడియాలో పంచుకున్నాడు. అందులో ‘ధర్మస్థలికి దారులు మళ్లీ తెరుచుకున్నాయ్.. మేము ఫైనల్ షెడ్యూల్లో ఉన్నాం. త్వరలోనే మరిన్ని ఆసక్తికరమైన అప్డేట్స్తో మీ ముందుంటామని తెలిపారు. View this post on Instagram A post shared by Konidela Production Company (@konidelapro) -
మరోసారి గుడ్ న్యూస్ చెప్పిన మెగాస్టార్ చిరంజీవి
సాక్షి, హైదరాబాద్: రెండో దశలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో మెగాస్టార్ చిరంజీవి సినీ జర్నలిస్టులకు, సినీ కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పారు. ‘కరోనా క్రైసిస్ ఛారిటీ’ (సీసీసీ) ద్వారా ఉచితంగా కోవిడ్-19 టీకా ఇప్పించనున్నామని మంగళవారం ట్విటర్లో వెల్లడించారు. తెలుగు చిత్ర పరిశ్రమలోని సినీ కార్మికులని,సినీ జర్నలిస్టులని కరోనా బారి నుంచి రక్షించుకునేందుకు అపోలో 24/7 సౌజన్యంతో ఉచిత టీకా సౌకర్యాన్ని అందిస్తున్నామని చిరంజీవి తెలిపారు. ప్రతి ఒక్కరూ భద్రంగా ఉండాలంటూ ఒక వీడియో సందేశాన్ని చిరంజీవి షేర్ చేశారు. 45 ఏళ్లు దాటిన వారిన సినీ కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తామని చిరంజీవి తన సందేశంలో పేర్కొన్నారు. అలాగే వ్యాక్సిన్ తీసుకున్న వారికి మూడు నెలల పాలు అపోలో ఆసుపత్రి ద్వారా ఉచితంగా వైద్యులను సంప్రదించే అవకాశంతోపాటు, మందులను కూడా రాయితీ ధరలకు అందించే సదుపాయాన్ని కల్పిస్తున్నామని చిరంజీవి తెలిపారు. గతేడాది కరోనా వైరస్ సంక్షోభ కాలంలో కరోనా క్రైసిస్ ఛారిటీని ఏర్పాటు చేసిన చిరు దాని ద్వారా ఎంతోమంది సినీ కార్మికులకు సాయం చేసిన సంగతి తెలిసిందే. (రెమిడెసివిర్ అడిగిన దర్శకుడు: ఊహించని స్పందన) తెలుగు చిత్ర పరిశ్రమలోని సినీ కార్మికులని,సినీ జర్నలిస్టులని కరోనా బారి నుంచి రక్షించుకునేందుకు కరోనా క్రైసిస్ ఛారిటీ #CCC తరుపున ఉచితంగా అందరికి వాక్సినేషన్ వేయించే సదుపాయం అపోలో 247 సౌజన్యంతో చేపడుతున్నాం. Lets ensure safety of everyone.#GetVaccinated#WearMask #StaySafe pic.twitter.com/NpIhuYWlLd — Chiranjeevi Konidela (@KChiruTweets) April 20, 2021 -
దుబాయ్‌లో ఒక్కదాన్నే: కరోనా కష్టాలు చెప్పిన హీరోయిన్
కరోనా మహమ్మారి సామాన్యులతో పాటు ప్రముఖులను తీవ్ర ఇబ్బందులు పెట్టింది. కరోనా బారిన పడి తాను నరకయాతన పడ్డాడని రత్తాలు రత్తాలు అంటూ చిరంజీవితో ఆడిపాడిన లక్ష్మి రాయ్ బాధపడింది. 2020 తన జీవితంలో విషాదం నింపిందని ఆవేదన వ్యక్తం చేసింది. ఆ సంవత్సరమే తన తండ్రిని కోల్పోయానని కన్నీరు పెట్టుకుంది. ఈ బాధాకర విషయాలను ఓ ఆంగ్ల మీడియాతో పంచుకుంది. అయితే కొత్త సంవత్సరం ప్రారంభంలోనే తాను కరోనా బారినపడ్డట్లు చెప్పుకుంది. 2020 నవంబర్‌లో నోటి క్యాన్సర్‌తో తన తండ్రి రామ్ రాయ్‌ను కోల్పోయానని బాధపడింది. నాన్నను కోల్పోవడంతో తాను సర్వం కోల్పోయానని తెలిపింది. మానసికంగా కుంగిపోయిన సమయంలో కొత్త సంవత్సర సంబరాలకు దుబాయ్‌కు వెళ్లగా అక్కడ కరోనా బారిన పడ్డట్లు లక్ష్మీ రాయ్ పేర్కొంది. అప్పుడు ఎదుర్కొన్న కష్టాలు తాను ఎప్పుడూ పడలేదని వివరించింది. దుబాయ్‌లో న్యూ ఇయర్ సంబరాల కోసం వెళ్లిన సమయంలో గొంతునొప్పి రావడం.. ఆ తర్వాత వాసన గ్రహించకపోవడం గుర్తించి పరీక్షించుకోగా కరోనా నిర్ధారణ అయ్యిందని తెలిపింది. దుబాయ్‌లో తనకు ఎవరూ తెలిసిన వారు లేరని, ఒక గదిలో ఒక్కదాన్నే ఐసోలేషన్‌లో ఉన్నట్టు వివరించింది. అనంతరం 12 రోజుల తర్వాత కరోనా నుంచి కోలుకున్నానని.. అయితే కరోనాతో తాను మానసికంగా మరింత కుంగిపోయినట్లు ఆంగ్ల మీడియాతో లక్ష్మి రాయ్ పంచుకుంది. ఈ విధంగా 2020 సంవత్సరం తాను తీవ్ర ఇబ్బందులు పడ్డానంటూ లక్ష్మి రాయ్ బాధపడింది. కరోనా నుంచి కోలుకున్న అనంతరం ముంబై వచ్చేసింది. ఇప్పుడు తిరిగి సినిమాలు చేస్తున్నట్లు తెలిపింది. తెలుగు, తమిళ్ సినిమాలతో పలు వెబ్ సిరీస్‌లు చేస్తున్నట్లు చెప్పింది. గతంలో చిరంజీవి సరసన ఖైదీ నంబర్ 150లో ఐటమ్‌సాంగ్ చేసిన విషయం తెలిసిందే. -
కరోనా: పేదలకు అండగా మెగాస్టార్
సాక్షి, హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి మరో మంచి పనికి శ్రీకారం చుట్టారు. తాజాగా కరోనా బారిన పడిన నిస్సహాయులైన పేద రోగులకు ఉచిత ప్లాస్మాను తన బ్లడ్ బ్యాంకు ద్వారా అందించేందుకు చిరు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ మంగళవారం ఓ ప్రకటనను విడుదల చేసింది. “పచ్చటి జీవితాలపై కర్మశ కరోనా పంజా విసుర్లూ చిన్నాభిన్నం చేస్తోంది. అందులో పేద రోగులు చికిత్స పొందడం గగనమవుతోంది. ఈ పరిస్థితుల్లో పేద రోగుల్ని కరోనా బారి నుంచి కాపాడేందుకు చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంక్ సమాయత్తమైంది అంటూ ఆ ప్రకటనలో పేర్కొంది. కరోనా సోకి కోలుకున్న వారు ప్లాస్మాదానం చేస్తే మరికొంతమందికి ఆయుషు పోసీనట్లే అని అందులో వివరించారు. తెల్లరేషన్ కార్డుదారులు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న కోవిడ్ పేషెంట్లకు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా ఉచితంగా ప్లాస్మా సరఫరా చేయనున్నారు. పేదలంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నిర్వాహకులు కోరారు. 22 సంవత్సరాలుగా మెగాస్టార్ చిరంజీవి సొంత నిధులు వెచ్చించి 9 లక్షల 27 వేల మంది పేద రోగులకు ఈ బ్లడ్‌బ్యాంక్ ద్వారా ఉచితంగా రక్తాన్ని అందించారని ఈ సందర్భంగా వారు తెలిపారు. పేదవాళ్ళకి అండగా నిలుస్తున్న చిరంజీవిని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు కొనియాడుతున్నారు. ప్లాస్మా కరోనాను ఎదుర్కోవడానికి ఒక బలమైన ఆయుధమని ఇది వరకే పిలుపునిచ్చిన మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టడంతో అందరూ ఆయనను ప్రశంసిస్తున్నారు. ప్రస్తుతం ఒక ఖరీదైన వస్తువుగా ఉన్న ప్లాస్మాను పేదలకు అందుబాటులోకి తెస్తున్న చిరంజీవికి చాలా మంది ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఇక చిరంజీవి సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన ఆచార్య సినిమా షూటింగ్లో పాల్గొంటున్నారు. ఈ సినిమా 2021లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. చదవండి: ఎన్నోసార్లు బాలూగారి నుంచి తిట్లు కూడా తిన్నా.. -
పెద్ద దిక్కును కోల్పోయాం : చిరంజీవి
‘నేను హీరోగా పరిచయం అయిన తొలి రోజుల నుంచి రావి కొండలరావుగారితో పలు చిత్రాల్లో నటించాను. ముఖ్యంగా మా కాంబినేషన్లో వచ్చిన ‘చంటబ్బాయ్, మంత్రిగారి వియ్యంకుడు’ వంటి చిత్రాల్లో ఆయన కీలక పాత్రలు పోషించారు. నాటక, సాంస్కృతిక రంగాలకు కూడా ఆయన మరణం తీరని లోటు. కొండలరావు, ఆయన సతీమణి రాధాకుమారిగార్లు జంటగా ఎన్నో చిత్రాల్లో నటించారు. చిత్ర పరిశ్రమలో ఏ వేడుక జరిగినా ఆ ఇద్దరూ పార్వతీ పరమేశ్వరుల్లాగా వచ్చి, వారి అభినందనలు, ఆశీస్సులు అందించడం చూడముచ్చటగా ఉండేది. రావి కొండలరావుగారి మరణంతో చిత్రపరిశ్రమ ఒక పెద్ద దిక్కును కోల్పోయినట్టు అయింది’ అని నటుడు చిరంజీవి అన్నారు. నా కథలు కొండలరావుకి చెప్పేవాణ్ణి – నటుడు గిరిబాబు మద్రాసులో ఉన్నప్పటి నుంచి రావి కొండలరావుగారితో నాకు పరిచయం ఉంది. ఆయన చాలా గొప్పవారు.. మంచి మనిషి. స్నేహశీలి. చక్కని ప్రవర్తన ఉన్నవాడు. నటుడు, రచయిత, దర్శకుడు, నిర్మాత.. ఇలా బహుముఖ ప్రజ్ఞాశాలి. విజయా ప్రొడక్షన్స్ సంస్థకు ఆయన ఎంతో నమ్మకస్తుడు. అందుకే ‘భైరవద్వీపం, బృందావనం, శ్రీకృష్ణార్జున విజయం’ వంటి చిత్రాలు కొండలరావుగారి నిర్మాణ నిర్వహణలోనే పూర్తి చేశారు. నేను, ఆయన కలిసి చాలా సినిమాలు చేశాం. నేను హీరోగా చేసిన ‘వధూవరులు’ చిత్రంలో మంజు భార్గవి తండ్రి పాత్ర చేశారాయన. నా సొంత సినిమా ‘సంధ్యారాగం’లోనూ ఆయనకు మంచి పాత్ర ఇచ్చా. నా సొంత సినిమాలన్నింటికీ నేనే కథలు రాసుకునేవాణ్ణి. జడ్జిమెంట్ కోసం ఆ కథలను ఆయనకు వినిపించేవాణ్ణి. ‘చాలా బాగా రాశావు గిరిబాబు’ అని అభినందించేవారు. మంచి మనిషి ఈ రోజు మనల్ని విడిచి వెళ్లడం బాధాకరం. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని భగవంతుణ్ణి వేడుకుంటున్నాను. ఐదు రోజుల క్రితమే మాట్లాడాను – నటుడు–రచయిత–దర్శకుడు తనికెళ్ల భరణి నేను కాలేజీలో చదువుకునే రోజుల నుండి రావి కొండలరా వుగారు పరిచయం. అదేదో ౖyð రెక్ట్ ముఖ పరిచయం కాదు, మేము నాటకాలు వేసేవాళ్లం కదా.. అలా మాది నాటక పరిచయం. ఆయన రాసిన నాటకాల్ని చదివి ఎంజాయ్ చేసేవాళ్లం. తర్వాత నేను చెన్నై వెళ్లాను. అక్కడ రాళ్లపల్లిగారి ద్వారా ఆయనతో నాకు పరిచయం ఏర్పడింది. అప్పట్లో విజయచిత్ర అని సినిమా వారపత్రిక ఉండేది. ఆయన దానికి సంపాదకునిగా ఉండేవారు. నేను ఆ పుస్తకాన్ని రెగ్యులర్‌గా ఫాలో అయ్యేవాణ్ని. అందులో ఆయన రాసే ఆర్టికల్స్, ఇంటర్వ్యూలు చదివేవాడిని. హైదరాబాద్‌కి వచ్చిన తర్వాత సినిమాకి సంబంధించిన ఏ సాహిత్య సమావేశం అయినా ఆయన లేకుండా జరిగేది కాదు. అంతటి సాహితీప్రియుడు ఆయన. మంచి వక్త, అందరినీ సరదాగా నవ్విస్తూ ఉండేవారు. కరెక్ట్‌గా ఐదు రోజుల క్రితం అనుకుంటా.. ఫోన్ చూస్తుంటే ‘ఆర్’ అనే అక్షరం దగ్గర ఆయన ఫోన్ నంబర్ కనిపిస్తే, ఆయనకు ఫోన్ చేశాను. గతేడాది ఆయన ఒక సాహిత్య కార్యక్రమం చేయమని అడిగారు. అప్పుడు నేను రాసిన ‘శృంగారా గంగావతరణం’ అనే కావ్యం సత్సంగం ఆయన ఇంట్లో జరిగింది. ఆయనకు తెలిసిన సాహితీ మిత్రులందరినీ ఆహ్వానించారు. ఆయన నాకు సన్మానం చేసి ఆశీర్వదించారు. అది గుర్తుకు వచ్చి నేను ఆయనకు ఫోన్ చేస్తే, ‘ఏమిటి స్వామీ.. ఎలా ఉన్నారు’ అని బాగా మాట్లాడారు. ‘ఏమీ లేదండీ.. కోవిడ్‌లో ఎలా ఉన్నారని ఊరికే పలకరిద్దా’మని అన్నాను. ‘చాలా మంచిదయ్యా.. మాలాంటి వారిని అప్పుడప్పుడు పలకరిస్తే ఉత్సాహంగా ఉం టుంది’ అన్నారు. ‘ఏమిటి మరి హూషారుగా ఉన్నారా’ అంటే... ‘లేదండీ... ఈ మధ్య నేను కింద పడిపోయాను. వాకర్ సాయంతో నడుస్తున్నాను’ అన్నారు. ‘సరేనండీ జాగ్రత్త’ అన్నాను. ఇంతలోనే వెళ్లిపోయారు. ఇండస్ట్రీలోని మరో పెద్ద తలకాయి దూరమైంది. ఆల్‌రౌండర్ అంటే రావి కొండలరావు గారే – రాజేంద్ర ప్రసాద్ ‘‘సినిమా పరిశ్రమలో ఎక్కువ సంవత్సరాలు పని చేసిన వ్యక్తి కొండలరావుగారు. సినిమా నటునిగా పక్కన పెడితే బయట నాటకాల్లోlఆయన చాలా గొప్ప నటుడు. జర్నలిస్ట్, కథకుడు, రచయిత, నటుడు.. ఇలా ఆయన చాలా గొప్పవాడు. సినిమా పరిశ్రమలో ఆల్ రౌండర్ అంటే ఆయన పేరే చెప్పొచ్చు. వాళ్ల ఊర్లో ఆయన ఫేమస్ టీచరు. ఆయన టీచర్‌గా ఎంత ఫేమస్ అంటే మేమందరం ఎప్పుడు కలిసినా ఆయన టీచర్‌గా చేసినప్పటి విశేషాలే మాట్లాడుకునేవాళ్లం. ఆయన భాషలో ఇప్పుడున్న పరిస్థితిని చెప్పాలంటే ‘‘యూ రాస్కెల్ కరోనా, సైలెంట్‌గా ఉండు, ఉండమన్నానా, యూ ఇడియట్...’ ఇలా ఉంటుంది ఆయనతో సంభాషణ. సింపుల్ లివింగ్, గ్రేట్ పర్సన్ అంటే ఆయన పేరే చెప్పాలి. వ్యక్తిగతంగా నేనంటే విపరీతమైన లవ్. లొకేషన్‌కి వచ్చిన దగ్గర్నుండి ప్రసాదూ, ప్రసాదు... అని కలవరించేవారు. ఒక జీవితానికి మరపురాని కలలు ఆ రోజలు. సినిమా పరిశ్రమలో నాకున్న అతి పెద్ద వయసున్న బెస్ట్ ఫ్రెండ్ ఆయనే. నన్ను బిడ్డలా చూసుకునేవారు – సంగీత దర్శకుడు మాధవపెద్ది సురేష్ రావికొండలరావుగారు మా మాధవపెద్ది కుటుంబాలకు మూడు తరాల నుంచి అత్యంత ఆప్తులు. ఆయన్ను వరసకి తాతయ్యా అని పిలుస్తాను. మా చిన్నాన్నలు సత్యం, గోఖ్లే ఆయనతో ఫ్రెండ్లీగా ఉండేవారు. వైజాగ్‌లో ఓ ప్రోగ్రామ్ కోసం ట్రైన్లో ఆయనా, నేను కలసి ప్రయాణించాం. అప్పుడు సంగీతం పట్ల నాకు ఉన్న అభిరుచినంతా ఆయనతో చెప్పడం జరిగింది. అప్పటికి మ్యూజిక్ డైరెక్టర్‌గా 4–5 సినిమాలు చేశాను. వైజాగ్ నుంచి వచ్చిన తర్వాత ‘విజయా ప్రొడక్షన్స్ వాళ్లు టీవీ సీరియల్స్ చేయాలనుకుంటున్నారు. దానికి సంగీతం అందించాలి’ అని రావి కొండలరావుగారు అన్నారు. 2పాటలు కంపోజ్ కూడా చేశాను. కానీ అనుకున్నట్టు జరగలేదు. ఆ తర్వాత 1992లో సింగీతం శ్రీనివాసరావు, నేను, రాజేంద్ర ప్రసాద్, డీవీ నరసరాజు.. ఇలా అందరం ఓ సినిమాకి పని చేశాం. ఆ సినిమాకు నిర్మాణ సంచాలకుడిలా ఉంటూనే రావి కొండలరావుగారు చాలావరకు మాటలు కూడా రాశారు. ‘భైరవ ద్వీపం, శ్రీకృష్ణార్జున విజయం’ సినిమాలకు నా పేరు సూచించింది ఆయనే. ఆయన మేలు ఎప్పటికీ మర్చిపోలేను. కొండలరావుగారు చేసిన ‘కన్యాశుల్కం’ సీరియల్‌కి నేను పని చేశాను. నన్ను ఆయన బిడ్డలానే చూసుకునేవారు. ఈ ఏడాది మార్చి 4న ఆయనకు, ముళ్ళపూడి వెంకట రమణగారి భార్య శ్రీదేవిగారికి, జంధ్యాలగారి భార్య అన్నపూర్ణగారికి, వేటూరిగారి భార్య సీతా మహాలక్ష్మిగారికి సన్మానం చేసుకునే భాగ్యం నాకు దక్కడం చాలా సంతోషం. అప్పుడు చాలా బాగా మాట్లాడారు. అదే ఆయన్ను చివరిసారి చూడటం. ఆరోగ్యం బావుండటం లేదని తెలిసింది. గురువుగారికి ఎలా ఉంది అని వాళ్ల అబ్బాయితో మాట్లాడాను. నా జీవితంలో అతి ముఖ్యమైన వ్యక్తుల్లో గురువుగారు చాలా ముఖ్యమైనవారు. తాతినేని చలపతిరావు నన్ను మ్యూజిషియన్‌గా పరిచయం చేస్తే, జంధ్యాలగారు నన్ను సంగీత దర్శకుడిగా పరిచయం చేశారు. రావి కొండలరావుగారు నన్ను మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎలివేట్ చేశారు. నేను, నా కుటుంబం ఆయనకు రుణపడి ఉంటాం. ఆయన లేని లోటు నాకు ఎప్పుడూ ఉంటుంది. మృత్యోర్మా అమృతంగమయా – దర్శకుడు వీఎన్ ఆదిత్య రావి కొండలరావుగారితో మా కుటుంబానికి ఉన్న అనుబంధం వయస్సు నలభై ఐదు ఏళ్లకు పైనే. 1970లలో మా నాన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జోనల్ ఆఫీస్‌లో కల్చరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు రావి కొండలరావు, శ్రీమతి రాధాకుమారి దంపతులతో స్నేహం ఏర్పడింది. ‘ఉగాది శుభాకాంక్షలతో... మీ రావికొండలరావు, రాధాకుమారి’ అనే పోస్ట్ కార్డు దాదాపు ముప్పై ఏళ్లు క్రమం తప్పకుండా మేం ఏ ఊరికి ట్రాన్స్ఫర్ అయితే ఆ అడ్రస్‌కి వచ్చేది. ఆ కార్డు ఆధారంగానే నేను వాళ్లింటికి వెతుక్కుంటూ వెళ్లడం, ‘బృందావనం’ సినిమాకి సింగీతం శ్రీనివాసరావుగారి దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేయడం, దర్శకుడవ్వాలన్న నా కల సాకారం కావడం.. నాకు ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన మహా మనీషి రావి కొండలరావుగారు. ‘భైరవద్వీపం’, ‘శ్రీకృష్ణార్జున విజయం’ రెండు చిత్రాలకు ఆయన సంభాషణల రచయిత కూడా. సింగీతంగారి దర్శకత్వంలో వచ్చిన ఆ రెండు సినిమాలకు రావి కొండలరావుగారి ప్రోద్బలంతో నేను ఆయనకు అసిస్టెంట్ రైటర్‌గా పని చేయడం నా కెరీక్‌కి గొప్ప బలం. పదిహేను రోజుల క్రితం వెళ్లినప్పుడు ‘నేనో కథ చెప్తాను సినిమాకి, నాకు అసిస్టెంట్‌గా వచ్చి, నేను డిక్టేట్ చేసింది రాస్తావా, డైరెక్టర్ అయిపోయాను కదా, రాయనంటావా’ అనడిగారు. నేను నవ్వి, ‘ఆ అమృతం ఆస్వాదించే అవకాశం నేనింకొకడికి ఎందుకిస్తాను అంకుల్. నేను రోజూ వచ్చి, మీకు అసిస్ట్ చేస్తాను’ అన్నాను. ఇంతలోనే ఇలా... రావి కొండలరావుగారి ప్రతి రచనా తెలుగు సాహిత్య యవనికపై ఒక అమృత ధారగా సజీవంగా ఉంటుంది. ఆయన సినిమాలు, నటన తెలుగు జాతి ఉన్నంతకాలం అమృతంలా మనని అలరిస్తూనే ఉంటాయి. మృత్యువు నుంచి అమృతత్వానికి రావి కొండలరావుగారి కొత్త ప్రయాణం మొదలైందనే భావిస్తాను నేను. ఆయన ప్రోత్సాహాన్ని మరువలేను – ప్రముఖ రచయిత, వ్యాఖ్యాత రాంభట్ల నృసింహ శర్మ రావి కొండలరావుగారితో నాది ఇరవయ్యేళ్ల పైబడిన సాంస్కృతిక ప్రయాణం. 2000సంవత్సరంలో ‘విశాఖ హ్యూమర్ క్లబ్’ స్థాపన, నిర్వహణలో, యాడ్స్ ఫర్ యూ పత్రికలో కాలమిస్ట్‌గా వారు నాకిచ్చిన ప్రోత్సాహం మరువలేను. ‘కన్యాశుల్కం’ టెలీఫిల్మ్ ధారావాహిక శీర్షిక గీతం రచనకు ఇచ్చిన అవకాశం వల్లే నాకు ఉత్తమ గీత రచయితగా ‘నంది పురస్కారం’ లభించింది. ఆయన నాకు తండ్రిలాంటి వారు – రచయిత–దర్శకుడు వర ముళ్లపూడి ‘‘నేను చిన్నప్పటి నుండి రావి కొండలరావుగారిని చూస్తూ పెరిగాను. ఆయన, రాధాకుమారి ఆంటీ మా ఇంటి మనుషుల్లానే ఉండేవారు. నాకు సలహాలు, సూచనలు ఇచ్చేవారు. మా నాన్న తర్వాత మరో తండ్రిలాంటివారాయన. ఈ ఏడాదితో ‘బాలరాజు కథ’ (బాపు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో రావి కొండలరావు నటించారు) విడుదలై యాభై ఏళ్లయింది. అప్పుడు నేను ఆయన దగ్గర చిన్న వీడియో బైట్ కావాలని అడిగితే, బాపు, రమణ గార్ల గురించి రెండు గంటలు ఆపకుండా చెబుతాను.. నువ్వు రా అన్నారు. ఈ లోపు కోవిడ్ కారణంగా ఆటంకం వచ్చింది. ఆయనేమో పెద్దవారు, నేను అటూ ఇటూ తిరుగుతుంటాను. ఈ సమయంలో ఆయనేకేమైనా ఎఫెక్ట్ అవుతుందేమో, ఎందుకులే అని తర్వాత కలుద్దాం అనుకున్నాను. ఆయన ఈ రోజు మన మధ్య లేకపోవటం చాలా బాధగా ఉంది. ఆయనతో ఆ ఇంటర్వ్యూ చేసినా బావుండేదని ఇప్పుడు అనిపిస్తోంది. చాలా మంచి మనిషి. చెన్నైలో వాళ్లబ్బాయి ఇంట్లో ఆయన ఉండేవారు. అప్పుడు వెళ్లి ఆయన్ని అనేక సార్లు కలవటం జరిగింది. నాకు, బాపుగారబ్బాయికి ఫాదర్ ఫిగర్‌లా అయినప్పటికీ చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు మాతో. బెస్ట్ హ్యూమన్ బీయింగ్. ఆయనకు ఎక్స్లెంట్ సెన్సాఫ్ హ్యూమర్ ఉండేది. స్పాంటేనియస్‌గా జోకులు పేల్చేవారు. ‘పెళ్లి పుస్తకం’ సినిమా టైమ్‌లో నాన్న, బాపుగారు, కొండలరావుగారు.. ముగ్గురూ ఒకచోట కూర్చుని వర్క్ చూస్తుంటే కడుపు నిండిపోయేది. ఆ సినిమా కథ ఈయనదే. ఆయనతో నాకెన్నో మంచి అనుభూతులు ఉన్నాయి. సినిమా పరిశ్రమకు సంబంధించిన ఓ గొప్ప చరిత్ర తెలిసిన మనిషి ఈ రోజుతో కనుమరుగయ్యారు. -
ఆచార్య కోసం ఆలయం
‘ఖైదీ నంబర్ 150, సైరా నరసింహారెడ్డి’ వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత చిరంజీవి హీరోగా నటిస్తున్న 152వ చిత్రం ‘ఆచార్య’. కొరటాల శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ పతాకాలపై రామ్‌చరణ్, నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ కథానాయిక. ఇప్పటికే సుమారు 40 శాతం చిత్రీకరణ పూర్తయింది. అయితే లాక్‌డౌక్ వల్ల షూటింగ్ ఆగిపోయింది. కాగా ఆగస్టు నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించే ఆలోచనలో ఉన్నారట చిత్రబృందం. ఈ సినిమాలో చిరంజీవి ద్విపాత్రాభినయం చేయనున్నారని టాక్. ఒకటి దేవాదాయ, ధర్మాదాయ శాఖ అధికారి పాత్ర‡అని సమాచారం. ఈ పాత్రకు సంబంధించిన కీలక సన్నివేశాల చిత్రీకరణ కోసం గుడి సెట్ తయారు చేయిస్తున్నారట. హైదరాబాద్ నగర శివారులో ప్రత్యేకంగా ఒక దేవాలయం సెట్‌ను రూపొందిస్తున్నారని టాక్. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. -
చిరునవ్వు కలకాలం నిలవాలంటే..
సాక్షి, హైదరాబాద్ : కరోనా విలయ తాండవంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక హెచ్చరిక చేసిన నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి ఒక అద్భుతమైన వీడియోను షేర్ చేశారు. కరోనా కట్టడికి మాస్క్ తప్పనిసరిగా ధరించండి. మిమ్మల్ని మీరు కాపాడుకోండి. మీ కుటుంబాన్ని, దేశాన్ని కూడా కాపాడండి.. ప్లీజ్.. అంటూ ట్విటర్లో ఒక వీడియోను ట్వీట్ చేశారు. చిరునవ్వు ముఖానికి అందం. కానీ ఆ చిరునవ్వు కలకాలం నిలవాలంటే.. మాస్క్ ధరించాలంటున్న చిరు ‘మెగా’ సందేశం ఆకట్టుకుంటోంది. మీసం మెలేయడం వీరత్వం అనేది ఒకపుడు.. కానీ ఇపుడు మాస్క్ ధరించడం వీరుడి లక్షణం అంటూ మరో వీడియోను కూడా ఆయన షేర్ చేశారు. రానున్న రోజుల్లో కరోనా మరింత మహమ్మారిగా మారనుందన్న డబ్ల్యూహెచ్ఓ హెచ్చరికల నేపథ్యంలో ప్రతీ ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని చిరంజీవి కోరారు. దయచేసి ప్రాథమిక జాగ్రత్తలను పాటిస్తూ..ఐక్యంగా పోరాడి ఈ బాధలను తొలగించు కుందామంటూ చిరు విజ్ఞప్తి చేశారు. హీరోయిన్ ఈషా రెబ్బా, కార్తికేయ కనిపించిన ఈ రెండు వీడియోలు ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. చదవండి : ఆల్ ఇండియా రికార్డ్ సెట్ చేసిన బన్నీ Thank you @ActorKartikeya @YoursEesha #chaitanbharadwaj ఆలోచన పంచుకోగానే ముందుకొచ్చిన మీకు నా ధన్యవాదాలు. I truly appreciate your commitment to the society. #SVVishweshwar #ShivramApte #Pappu #Babji pic.twitter.com/k6zyniBfc1 — Chiranjeevi Konidela (@KChiruTweets) July 16, 2020 @WHO Chief @DrTedros on Covid 19,13th July -"It’s going to get worse & worse.Every single person can do their bit to break chains of transmission & end collective suffering".అందుకే,మాస్క్ తప్పనిసరిగా ధరించండి.మిమ్మల్ని మీరు కాపాడుకోండి.మీ కుటుంబాన్ని, దేశాన్ని కాపాడండి. Please! pic.twitter.com/vOTwX3UZPk — Chiranjeevi Konidela (@KChiruTweets) July 16, 2020 -
2019–20 నుంచి నంది అవార్డులు
‘ఆంధ్రప్రదేశ్‌లో సినిమాల చిత్రీకరణకు సింగిల్ విండో విధానం తీసుకొచ్చినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిగారికి తెలుగు చిత్ర పరిశ్రమ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాం. టాలీవుడ్ ప్రముఖులంతా ఏడాదిగా జగన్‌గారిని కలవాలనుకున్నాం కానీ కుదరలేదు. ఈ రోజు కలిశాం’ అని హీరో చిరంజీవి అన్నారు. తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పలువురు పెద్దలు మంగళవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ– ‘‘కరోనా లాక్డౌన్ కారణంగా సినిమా షూటింగ్‌లు నిలిచిపోవడంతో ఇబ్బందులు పడుతున్నాం.ఈ విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా ఈ నెల 15నుంచి చిత్రీకరణలు జరుపుకునేందుకు సీఎం కేసీఆర్‌గారు వెసులుబాటు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా చిత్రీకరణలకు అనుమతి ఇవ్వాలని జగన్‌గారిని కోరగానే అనుమతి ఇవ్వడం సంతోషం. షూటింగ్‌లకు సంబంధించి విధి విధానాలు రూపొందించేందుకు మంత్రి పేర్ని నాని, అధికారులతో చర్చిస్తామన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో థియేటర్లలో మినిమమ్ ఫిక్స్డ్ ఛార్జీలు భారంగా మారాయని, వాటిని ఎత్తేయాలని కోరగానే సానుకూలంగా స్పందించినందుకు జగన్‌గారికి కృతజ్ఞతలు. నంది అవార్డుల పంపిణీ చాలా ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయి. ప్రభుత్వం నుంచి మేం ప్రోత్సాహం కోరుకుంటున్నామనగానే 2019–20కి అవార్డులు ఇవ్వడానికి నిర్ణయించారు. ఈ ఏడాదిలోనే ఆ వేడుక జరుగుతుందనుకుంటున్నాం. సినిమా టికెట్ల విషయంలో పారదర్శకత రావాలని కోరాం. టికెట్ల ధరల ఫ్లెక్సీ రేట్లపై దృష్టి పెట్టాలని విన్నవించాం. చెన్నై, ముంబై వంటి నగరాల్లో ఆయా సినిమాలను బట్టి టికెట్ల ధర పెరుగుతూ ఉంటుంది. దీని మూలంగా పెద్ద బడ్జెట్ పెట్టే నిర్మాతలకి లాభం ఉంటుంది. ఫ్లెక్సీ రేట్లపై తగు సమయంలో నిర్ణయం తీసుకుంటానని హామీ ఇచ్చారు. దానివల్ల చిత్ర పరిశ్రమకి ఎంతో లాభదాయకంగా ఉంటుంది. రానున్న రోజుల్లో అధికారులతో మాట్లాడి, మా సినీ పెద్దలతో మరోసారి మాట్లాడి నిర్ణయం తీసుకుంటామన్నారు. అదే జరిగితే పారదర్శకత ఉంటుంది.. ఎక్కడా బ్లాక్ మార్కెట్ అనేది ఉండదు. మేం అడిగిన చాలా విషయాలకు ఆయన సానుకూలంగా స్పందించారు. తెలుగు సినిమా పరిశ్రమ ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి చెందడానికి ఎప్పుడూ ముందుంటానని సీఎం చెప్పడం మాకు ఎంతో ఆనందం కలిగించింది. ముఖ్యంగా దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డిగారు వైజాగ్‌లో సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం 300 ఎకరాలు భూమి కేటాయించారు.. ఆ భూమి అలాగే ఉంది. దాన్ని మరోసారి పరిశీలిస్తామని జగన్‌గారు అన్నారు. వైజాగ్‌లో సినిమాల నిర్మాణం చేపట్టాలి, స్టూడియోలు నిర్మించాలి, ఔట్ డోర్ యూనిట్లు పెట్టాలనుకునేవారిని అన్ని రకాలుగా ప్రోత్సహించి ఉత్సాహపరిచే విధంగా జగన్‌గారు స్పందించిన తీరు చాలా అభినందనీయం. అలా చేస్తే ఆంధ్రప్రదేశ్‌లో సినిమా పరిశ్రమ బాగా అభివృద్ధి చెందుతుందనే ఆశాభావం అందరిలోనూ ఉంది. మేం అడిగిన వాటన్నింటికీ సానుకూలంగా స్పందించిన ఆయనకు మా తెలుగు చిత్ర పరిశ్రమ తరఫున మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలుపుతున్నాం’’ అన్నారు. దామోదర్ ప్రసాద్, ‘దిల్’రాజు, డి.సురేష్‌బాబు, రాజమౌళి, నాగార్జున, చిరంజీవి, పేర్ని నాని, సి. కల్యాణ్ విశాఖలో స్టూడియోల నిర్మాణానికి అనుమతి – మంత్రి పేర్ని నాని సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ– ‘‘సినిమాలకు సంబంధించి ఆన్లైన్లోనే టికెట్లు జారీ చేయాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డిగారు ఆదేశించారు. ఆన్లైన్ బుకింగ్ వల్ల అటు ప్రభుత్వానికి, ఇటు సినీ పరిశ్రమకూ మేలు జరుగుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది తప్పనిసరి. ఎఫ్డీసీ ద్వారా 2000 సంవత్సరం నుంచి చిన్న సినిమాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన సబ్సిడీ పెండింగ్‌లో ఉందని, దాన్ని విడుదల చేయాలని చేసిన వినతికి జగన్‌గారు సానుకూలంగా స్పందించారు. ఆంధ్రప్రదేశ్‌లో సినీ రంగాన్ని ప్రోత్సహించడానికి వీలుగా విశాఖపట్టణంలో సినిమా స్టూడియోలు నిర్మించుకోవాలనుకునే వారికి తక్కువ ధరకు స్థలాలు కేటాయించడానికి ముఖ్యమంత్రి అంగీకరించారు. వైజాగ్‌లో స్టూడియోలు, నివాసాలకు సంబంధించి తామంతా మాట్లాడుకుని మరో మారు చెబుతామని సినీ ప్రముఖులు ముఖ్యమంత్రికి చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో జూలై 15 తర్వాత సినిమా షూటింగులకు అనుమతి ఇవ్వనున్నాం. ఇందుకు సంబంధించి త్వరలో విధి విధానాలు విడుదల చేయనున్నాం. సినిమాహాళ్ల పునఃప్రారంభం అనేది కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన తేదీ నుంచే ఉంటుంది. కరోనా లాక్డౌన్ సమయంలో సినిమా థియేటర్లు ఫిక్స్డ్ విద్యుత్ ఛార్జీలు చెల్లించాల్సి ఉందని, వాటిని రద్దు చేయాలని సినీ ప్రముఖులు కోరగా జగన్‌గారు అంగీకరించారు. తమ సమస్యల పట్ల సానుకూలంగా స్పందించినందుకు సినీ ప్రముఖులు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు’’ అన్నారు. సీఎం జగన్‌తో జరిగిన ఈ భేటీలో చిరంజీవితో పాటు హీరో నాగార్జున, నిర్మాతలు సురేశ్ బాబు, సి, కల్యాణ్, దామోదర్ ప్రసాద్, ‘దిల్’ రాజు, డైరెక్టర్ రాజమౌళి తదితరులు పాల్గొన్నారు. -
ఉమాపతిరావు అంత్యక్రియలు పూర్తి
దోమకొండ: దోమకొండ సంస్థాన వారసుడు, రిటైర్డు ఐఏఎస్ అధికారి కామినేని ఉమాపతిరావు(92) అంత్యక్రియలను ఆదివారం కామారెడ్డి జిల్లా దోమకొండలోని లక్ష్మీబాగ్‌లో నిర్వహించారు. ఆయన మే 27న హైదరాబాద్‌లో మరణించిన విషయం తెలిసిందే. ప్రముఖ సినీ హీరో చిరంజీవితో పాటు ఆయన తనయుడు రామ్‌చరణ్, ఇతర కుటుంబ సభ్యులు, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కుటుంబ సభ్యులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. చిరంజీవి, రామ్‌చరణ్‌లు పాడెను మోశారు. ఉమాపతిరావు కుమారుడు, చిరంజీవి వియ్యంకుడు అయిన అనిల్‌కుమార్ చితికి నిప్పు పెట్టారు. దోమకొండ కోట నుంచి ఉమాపతిరావు భౌతిక కాయాన్ని అంత్యక్రియల కోసం తరలించే సమయంలో ఒక్కసారిగా తేనెటీగలు అక్కడున్నవారిని చుట్టుముట్టాయి. చిరంజీవి ఉన్న ప్రాంతానికి తేనెటీగలు రావడాన్ని గమనించిన ఆయన భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమై టవల్‌తో వాటిని పారదోలుతూ ఆయనను అక్కడి నుంచి లోపలకు తీసుకువెళ్లారు. మిగతావారు సురక్షిత ప్రదేశాలకు పరుగులు తీశారు. పాడె మోస్తున్న చిరంజీవి, రాంచరణ్ తేజ -
గరిటతో చరణ్.. పైపు పట్టిన చిరంజీవి
సాక్షి, హైదరాబాద్ : సినిమాల్లో హీరో అవ్వడం కాదు భార్య మనసు దోచుకుని సూపర్ హీరో అనిపించుకున్నారు మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్. తాజాగా రామ్ చరణ్‌కు లాక్డౌన్ కారణంగా ఇంట్లో ఖాళీ సమయం దొరకడంతో తన సతీమణి ఉపాసన కోసం ప్రత్యేకంగా వంటవండారు. దీనికి సంబంధించి వీడియోను ఉపాసన ట్విటర్లో పోస్ట్ చేసి తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. వంట వండటమే కాదు, తర్వాత పాత్రలను కూడా ఆయనే శుభ్రం చేశారు. ఇందుకే చరణ్ నా దృష్టిలో హీరో అయ్యారు అంటూ ఉపాసన పోస్ట్ పెట్టారు. అంతేకాకుండా లాక్డౌన్ కారణంగా ఇళ్లలోనే ఉంటున్న భర్తలు ఇది గమనించాలని సూచించారు. మరో వైపు రామ్ చరణ్ తండ్రి మెగాస్టార్ చిరంజీవి పైపు పట్టి ఇంటి ముందున్న ప్రాంతాన్ని శుభ్రం చేశారు. మనం నడిచే దారులు ఎప్పుడూ శుభ్రంగా ఉండాలంటూ, ఇంట్లోనే ఉండండి అంటూ తన లాక్డౌన్ అనుభవాలను ట్విటర్లో వీడియో రూపంలో అభిమానులతో పంచుకున్నారు. -
నిజమైన హీరోలు కావాలి
విలన్ పై పంచ్ విసిరేవాడు మాత్రమే కాదు హీరో. ప్రజలతో కలిసి పని చేసేవాడు కూడా హీరోనే. ప్రజలు తయారుచేసిన హీరో ప్రజల కోసం హీరోయిజం ప్రదర్శించే సమయం ఇది. కరోనా మహమ్మారిని దుర్కొనేందుకు ప్రభుత్వం మాత్రమే సరిపోదు. ప్రజల సహకారం ఒక్కటే చాలదు. స్ఫూర్తి నింపే సంకేతాలు కావాలి. ఉత్సాహం నింపే ముందడుగులు పడాలి. కరోనాపై పోరాటం కోసం తెలుగు ఇండస్ట్రీ ఇప్పటికే కదిలింది. బాలీవుడ్ ఇంకా కదలాల్సి ఉంది. అక్షయ్ కుమార్ 25 కోట్ల విరాళం మిగిలిన అందరు హీరోల వైపు చూపుడువేలు చూపిస్తోంది. ప్రజలు సంక్షోభంలో ఉన్నప్పుడు తెలుగు ఇండస్ట్రీ గొప్ప మానవతతో ఎంట్రీ ఇస్తూ ఉంటుంది. రెండు తెలుగు రాష్ట్రాలలో కరోనా బాధితులు పెరుగుతున్న నేపథ్యంలో ఒకవైపు ప్రజల కోసం, మరోవైపు పని లేక పస్తులుంటున్న సినీ కార్మికుల కోసం తెలుగు పెద్దలు స్పందించారు. చిరంజీవి, పవన్ కల్యాణ్, నాగార్జున, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్, అల్లు అర్జున్, నితిన్, అలీ, సాయిధరమ్ తేజ్... ఇలా ఎందరో స్పందించి విరాళం ప్రకటించారు. కరోనా వల్ల ఉపాధి లేక ఆకలి బాధలు పడుతున్న తెలుగు సినీ కార్మికుల కోసం ఏకంగా ‘కరోనా క్రైసిస్ ఛారిటీ’ వేదిక కూడా సిద్ధమైంది. మరోవైపు తమిళనాడులో రజనీకాంత్ 50 లక్షల విరాళం ప్రకటించారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ వైపు అందరి దృష్టి పడింది. బాలీవుడ్ కదలికలు రావడం లేదని మెల్లగా విమర్శలు మొదలయ్యాయి. తాజాగా అక్షయ్ కుమార్ కరోనా రిలీఫ్ కోసం ఏకంగా 25 కోట్ల భారీ విరాళం ప్రకటించడంతో ఇప్పుడు అందరి దృష్టి ఇతర బాలీవుడ్ స్టార్ల మీద పడింది. బాధ్యత ఉన్న హీరో కరోనా దాడి వల్ల అతలాకుతలమవుతున్న దేశానికి తన వంతు సహాయంగా అక్షయ్ కుమార్ 25 కోట్ల రూపాయలు ప్రకటించాలని అనుకున్నప్పుడు అతని భార్య ట్వింకిల్ ఖన్నా ‘అంత పెద్ద మొత్తమా.. ఆలోచించుకున్నావా?’ అని అడిగింది. ‘వీళ్లే నన్ను ఇంతవాణ్ణి చేశారు. ఈ సమయంలో జనం ప్రాణాల కన్నా వేరే ఏదీ ముఖ్యం కాదు. బతికుంటేనే బతుకు ఉంటుంది. వారి నుంచి తీసుకుంది వారికి తిరిగి ఇస్తున్నాను’ అని అక్షయ్ కుమార్ సమాధానం ఇచ్చాడు. దేశంలోని జన హిత సమస్యలను తీసుకొని గత కొన్నేళ్లుగా అక్షయ్ కుమార్ సినిమాల్లో నటిస్తున్నాడు. ‘టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథ’, ‘ప్యాడ్‌మ్యాన్’, ‘మిషన్ మంగళ్’... వాటిలో కొన్ని. తనది కేవలం సినిమా దేశభక్తి కాదని నిజమైన దేశభక్తి అని ఈ చర్యతో అక్షయ్ నిరూపించాడు. బిగ్ బి – కుటుంబం కరోనాకు సంబంధించి బిగ్ బి కుటుంబం ఏ విధంగా స్పందించనుందో ఇంకా తెలియాల్సి ఉంది. కరోనా వ్యాప్తి మొదలైన వెంటనే జనహితార్థం అమితాబ్ బచ్చన్ హిందీ, ఇంగ్లిష్ భాషల్లో ఒక వీడియోను ప్రభుత్వ ఆరోగ్య శాఖతో కలిసి విడుదల చేశారు. కరోనా నుంచి ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలో అందులో తెలియచేశారు. అది మంచి పనే. ఆర్థికంగా ప్రజల కోసం కాని, సినిమా కార్మికుల కోసం కాని ఏమి చేస్తారో చూడాల్సి ఉంది. బాలీవుడ్లో సినీ కార్మికుల పరిస్థితి ఘోరంగా ఉంది. అమితాబ్ వంటి సూపర్స్టార్ల జీవితంలో సినిమా కార్మికుల పాత్ర చాలా ఉంది. అమితాబ్ బచ్చన్ ఇంట్లో అమితాబ్‌తో పాటు జయా బచ్చన్, కుమారుడు అభిషేక్ బచ్చన్, కోడలు ఐశ్వర్యరాయ్ బచ్చన్ వీరంతా సినిమాలతో అనుబంధం ఉన్నవారే. వీరందరికీ స్పందించాల్సిన బాధ్యత ఉందని దేశ ప్రజలు భావించడం సహజం. ఖాన్లు ఎక్కడ? బాలీవుడ్ ఇండస్ట్రీ అంటే అది ముగ్గురు ఖాన్ల రాజ్యం. సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, ఆమిర్ ఖాన్. ఈ ఖాన్ల వాటా పెద్దది. వీరి సినిమాల వాటా కూడా పెద్దదే. బాలీవుడ్ మాత్రమే కాదు ఈ దేశం వీరికి చాలా ఇచ్చింది. ఇప్పుడు ఈ దేశానికి వీరు ఏదైనా చేయాల్సి ఉంది. నిజానికి గత కొంత కాలంగా షారుక్ ఖాన్, ఆమిర్ ఖాన్ మీడియాకి దూరంగా ఉంటున్నారు. షారుక్ ఖాన్ తన తదుపరి సినిమా ఖరారు చేయక ఖాళీగా ఉంటే ఆమిర్ ఖాన్ ఇటీవలే ‘లాల్‌సింగ్ చద్దా’ సినిమా షూటింగ్లో పాల్గొంటున్నాడు. సల్మాన్ ఖాన్ ‘రాధే’ సినిమాతో బిజీగా ఉన్నాడు. కరోనా వల్ల వీరంతా ఇళ్లకే పరిమితమైనా సల్మాన్ తన ఇంట్లో పెయింటింగ్ వేస్తూ కనిపించాడు తప్ప మిగిలిన ఇద్దరూ మీడియా ముందుకు రాలేదు. ఖాన్ల విడుదలైన ప్రతి సినిమా 100 కోట్ల నుంచి 300 కోట్ల వరకూ వసూలు చేస్తూ ఉంటుంది. వీరి రెమ్యూనరేషన్లు, ఆదాయమూ తెలియనివి కావు. ఈ కష్టకాలంలో వారి స్పందన కోసం వేచి చూడాల్సి వస్తోంది. సంపద ఉన్న హీరోయిన్లు బాలీవుడ్లో సంపద ఉన్న హీరోయిన్లకు కొదవలేదు. ప్రియాంక చోప్రా, దీపికా పడుకోన్, అనుష్కా శర్మ, ఆలియా భట్, కత్రినా కైఫ్, కరీనా కపూర్, కాజోల్... వీరంతా టాప్ రెమ్యునరేషన్ తీసుకునే తారలుగా ప్రసిద్ధి పొందారు. వీరంతా ఇప్పటి వరకూ ఎటువంటి స్పందనలు వినిపించలేదు. ఇల్లు తుడుచుకుంటున్నామని, అంట్లు తోముకుంటున్నామని, వర్కవుట్లు చేస్తున్నామని ఫొటోలు పెడుతున్నారు తప్పితే ప్రజల కోసం ఏం ఆలోచిస్తున్నారో చెప్పడం లేదు. ఒక్క సోనమ్ కపూర్ మాత్రం సినిమా కార్మికుల కోసం కొంత మొత్తం సహాయం చేసింది. తాను కష్టపడి పని చేసిన కూలీలో టికెట్ కొని వీరి కోసం చప్పట్లు కొట్టిన కోట్లాది వలస కూలీలు ఇప్పుడు అష్టకష్టాల్లో ఉన్నారు. వారి చప్పట్లతో అందలం ఎక్కిన తారలు వారి కన్నీటిలో భాగం పంచుకోవడం మానవీయ స్పందన అవుతుంది. ప్రొడక్షన్ హౌస్‌లు వినోద రంగంలో కోట్లాది రూపాయల ఆర్జన చేస్తున్న ప్రొడక్షన్ హౌస్‌లు బాలీవుడ్లో తక్కువ లేవు. వీటిలో మొదటి వరుసలో ఉన్న పేరు ‘యశ్‌రాజ్ ఫిల్మ్స్’. బాలీవుడ్ సినిమాల ద్వారా ప్రతి సంవత్సరం వేలాది కోట్ల లావాదేవీలు జరిపే సంస్థ ఇది. దర్శకుడు ఆదిత్యా చోప్రా దీని అధినేత. అలాగే బాలాజీ టెలిఫిల్మ్స్ సంస్థ టెలివిజన్ సీరియళ్ల నిర్మాణం లో నంబర్ వన్. దీని అధినేత ఏక్తా కపూర్ ఇంకా స్పందించలేదు. ‘ధర్మా ప్రొడక్షన్స్’ ద్వారా వందల కోట్ల వ్యాపారం చేసే సినిమాలు నిర్మించే దర్శకుడు కరణ్ జోహార్, రాజ్‌కుమార్ హిరాణి, విధు వినోద్ చోప్రా, రాజశ్రీ, టిప్స్, ఫాంటమ్... వీరంతా ఈ సమయంలో దేశం కోసం హిందీ ఇండస్ట్రీ కోసం పని చేయాల్సి ఉంది. టి–సిరీస్ అధినేత భూషణ్ కుమార్ 15 కోట్ల సహాయ ప్రకటన అభినందనీయం. టెలివిజన్ రంగంలో స్టార్‌గా రాణిస్తున్న కపిల్శర్మలాంటి వాళ్లు ప్రజల కోసం విరాళం ప్రకటిస్తున్నప్పుడు ఈ స్టార్లు ఎందుకు ప్రకటించరని ప్రజలు అనుకునే అవకాశం ఉంది. మున్ముందు మరింత పరీక్షా సమయం ఉండొచ్చు. సమాజం నుంచి హీరోలు, సినీరంగం నుంచి హీరోలు ఎందరో కావాల్సి ఉంటుంది. అందరం కలిసి కట్టుగా కరోనాను తరిమికొట్టగలమని ఆశిద్దాం. – సాక్షి ఫ్యామిలీ -
తొలిసారి ట్వీట్ చేసిన మెగాస్టార్ చిరంజీవి
సాక్షి, హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చారు. బుధవారం ఆయన ట్విటర్ ఖాతాను తెరిచారు. చిరంజీవి కొణిదెల పేరుతో అకౌంట్‌ను ప్రారంభించిన ఆయన.. అభిమానులతో మాట్లాడటం ఆనందంగా ఉందని అన్నారు. తెలుగు ప్రజలకు శ్రీ శార్వరి నామ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగు సంవత్సరాది రోజున ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా మహమ్మారిని కలిసికట్టుగా జయించడానికి కంకణం కట్టుకుందామని ఆయన పిలుపునిచ్చారు. (ఈ అమ్మ సెంటిమెంట్లను గౌరవించండి: మోదీ) అలాగే కరోనా వైరస్ (కోవిడ్-19)ను అరికట్టడానికి భారత ప్రభుత్వం 21 రోజులపాటు ప్రజలందరిని ఇళ్లలోనే ఉండమని ఇచ్చిన ఆదేశానికి మెగాస్టార్ చిరంజీవి ట్విటర్ వేదికగా మద్దతు తెలిపారు. కరోనా వంటి మహమ్మారిని ఎదుర్కొవడానికి కేంద్ర తీసుకున్న నిర్ణయం అనివార్యమైందని ఆయన పేర్కొన్నారు.ఈ క్లిష్ట సమయంలో మనమంతా సురక్షితంగా ఉండటానికి ప్రధాని నరేంద్రమోదీ, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్రెడ్డి, కేసీఆర్ ఇచ్చే ఆదేశాలను పాటిద్దామని పిలుపునిచ్చారు. ఇంటి పట్టునే ఉందామని.. సురక్షితంగా ఉండాలని ఆయన ట్విటర్లో పేర్కొన్నారు. (‘ఆర్ఆర్ఆర్’ టైటిల్, మోషన్ పోస్టర్ విడుదల..) #HappySarvariUgadi DELIGHTED to directly engage with my beloved fellow Indians,Telugus & my dearest fans through a platform like this.This #NewYear’s Day,let’s resolve to defeat this global health crisis with awareness & responsibility. #UnitedAgainstCorona #StayHomeStaySafe pic.twitter.com/Fb3Cnw4nHH — Chiranjeevi Konidela (@KChiruTweets) March 25, 2020 -
చూపులు కలవని శుభవేళ
అమ్మాయి కాఫీ ఇచ్చింది. అబ్బాయి కాఫీ తాగాడు. కాఫీ ఇస్తున్నప్పుడు.. అమ్మాయి అబ్బాయిని చూళ్లేదు! కాఫీ తాగుతున్నప్పుడైనా.. అబ్బాయి అమ్మాయిని చూళ్లేదు! ఇంకేం కలుస్తాయి చూపులు! చూపులు కలవలేదు కానీ... కాఫీ కలుపుతున్నప్పుడు అమృత ఘడియలేవో ఉన్నట్లున్నాయి. నలభై ఏళ్లయింది చిరంజీవి, సురేఖల పెళ్లయి. కలవని ఆ కాఫీ చూపులే.. వీళ్ల పెళ్లికి శుభలేఖలు. ► మీ ‘శుభలేఖ రాసుకున్న ఎదలో..’ పాట సూపర్ హిట్. మరి.. రియల్ లైఫ్‌లో శుభలేఖ రాసుకున్న విశేషాల గురించి? చిరంజీవి: నాకు నేనుగా బలి పశువును అయిన రోజు గురించేగా (నవ్వుతూ). ఓ సాయంత్రం నేను చైౖన్నై కోడంబాకం బ్రిడ్జ్ మీద నా కారులో వెళుతుంటే, నా బి.కామ్ క్లాస్మేట్ సత్యనారాయణ కనిపించాడు. ఇక్కడ ఉన్నావేంటి? అని అడిగితే, మా పెదనాన్నగారింటికి వచ్చాను అన్నాడు. నా కారులో దింపేస్తాను రమ్మన్నాను. వాళ్ల పెదనాన్న ఎవరో కాదు... అల్లు రామలింగయ్యగారు. అప్పటికే నేను నటించిన ఓ మూడు సినిమాలు విడుదలయ్యాయి. ‘రామలింగయ్యగారు నీతో పాటు ‘మనవూరి పాండవులు’లో యాక్ట్ చేశారుగా.. ఇంట్లోకి రా’ అన్నాడు. అయితే రామలింగయ్యగారు లేరు. కాఫీ తాగి వెళుదువు గాని అన్నాడు. అదే నేను లాక్ అయిన మొదటి స్టెప్. ► ఎలా లాక్ అయ్యారు? చిరంజీవి: ఆ కాఫీ పెట్టింది సురేఖ. తను నన్ను చూళ్లేదు, నేను తనని చూళ్లేదు (భార్యని చూస్తూ.. ‘ఆ కాఫీలో ఏం వశీకరణ మంత్రం కలిపావు’). ఆ తర్వాత ఆ అబ్బాయి ఎవరు? అని తను అతన్ని అడిగితే ‘మా క్లాస్మేట్. ‘మనవూరి పాండవులు’ లో నటించాడు’ అని చెప్పాడు. ‘వాళ్లు ఏమిట్లట. మనిట్లేనట’ (ఇద్దరూ పెద్దగా నవ్వుతూ) అంది. తర్వాత అల్లు అరవింద్ గారు, ఇతర కుటుంబ సభ్యులు నా గురించి డిస్కషన్ మొదలుపెట్టారు. అల్లు రామలింగయ్యగారికేమో వాళ్లమ్మాయిని ఓ ఐ.ఏ.ఎస్ ఆఫీసర్‌కిచ్చి చెయ్యాలనుండేది. కానీ, ఎందుకు ప్రయత్నం చేయకూడదని అరవింద్‌గారు నా గురించి ఎంక్వయిరీ ప్రారంభించారు. ‘తను ఆంజనేయస్వామి భక్తుడు, బ్యాడ్ హ్యాబిట్స్ లేవు, బాగా చదువుకున్నాడు, చాలా కష్టపడతాడు. అతని చేతిలో మంచి సినిమాలు కూడా ఉన్నాయి’ అని నా గురించి గుడ్ సర్టిఫికెట్ ఇచ్చాడు నా ఫ్రెండ్. నాకు ఇప్పుడు పెళ్లేంటి? అన్నాను నేను. మేకప్‌మేన్ జయకృష్ణ ‘మన వూరి పాండవులు’ నిర్మాత. రామలింగయ్యగారి ఫ్యామిలీకి చాలా దగ్గరివారు. ఆయన రామలింగయ్యగారిని కన్విన్స్ చేశారు. ఓకే అనడానికి ముందు ఓ పదిమంది నిర్మాతలను నా గురించి అడిగి సలహా తీసుకున్నారట రామలింగయ్యగారు. అందరూ నా గురించి మంచి ఫీడ్‌బ్యాక్ ఇచ్చారు. దాంతో నన్ను లాగి బుట్టలో పడేశారు. నాది పెళ్లి వయసు కాదని కరాఖండీగా చెప్పాను. కానీ, జయకృష్ణగారు మా నాన్నగారితో ‘అబ్బాయి వేరే ఆకర్షణలకి లోనవుతాడేమో’ అని చెప్పారేమో నాన్న భయపడిపోయి ‘నేను అబ్బాయిని ఒప్పిస్తా’ అన్నారు. పెళ్లి చూపులకు రానన్నాను. బలవంతంగా తీసుకెళ్లారు. ► సురేఖగారూ.. మీ నాన్న చెప్పారని మీరు చిరంజీవిగారిని పెళ్లి చేసుకున్నారా? సురేఖ: ‘మన వూరి పాండవులు’ చూసి ‘ఈ కళ్లబ్బాయి ఎవరో బావున్నాడు’ అనుకున్నాను. కళ్లు పెద్దగా, గుండ్రంగా ఉంటాయి కదా. మా అమ్మ యాక్టర్‌ను చేసుకుంది. నేనూ యాక్టర్‌ను చేసుకుం టే బాగుంటుందనుకున్నా. అందుకే సరే అన్నాను. ► మీ ‘అందరివాడు’ సినిమాలో పెళ్లిచూపుల సీన్ చాలా బావుంటుంది. మీ పెళ్లి చూపుల సీన్? చిరంజీవి: మమ్మల్ని మాట్లాడుకోమని పెద్దవాళ్లందరూ బయటకు వెళ్లారు. తను బీఏ చదువుకుందని తెలిసినా ఏదో ఒకటి మాట్లాడాలి కదా అని ఏం చదువుకున్నారు? అని అడిగాను. ఆ తర్వాత ఏం మాట్లాడాలో తెలియలేదు. అంతకుముందు నాకు అమ్మాయిలతో పెద్దగా పరిచయాలు కూడా లేవు. సురేఖ పొందిక చూసి ‘ఈ అమ్మాయినే చేసుకోవాలి’ అనుకున్నాను. మా అమ్మకి కూడా తను నచ్చింది. నాన్నగారైతే ‘ఏం కళరా ఆ అమ్మాయిది. పెళ్లి చేసుకో’ అన్నారు. సురేఖ: మామయ్యగారు చనిపోయేంతవరకు నన్నెప్పుడూ పేరు పెట్టి పిలవలేదు. ‘అమ్మా’ అనేవారు. నన్ను ఒక్క మాట కూడా పడనిచ్చేవారు కాదు. అంత బాగా చూసేవారు. ► అవునూ... మీ పెళ్లి చూపులకు, పెళ్లికి ఎంత గ్యాప్ వచ్చింది? సురేఖ: మూడు నెలలు. ► ఆ మూడు నెలల్లో కలుసుకున్నారా? ఫోన్లు మాట్లాడుకోవడం? చిరంజీవి: పెళ్లి కాకముందు మాట్లాడటం, తిరగటం తప్పని మనసులో పడిపోయింది. తనదీ అలాంటి ఫీలింగే. అయితే ఒకసారి మాట్లాడాలనిపించింది. అప్పుడు ల్యాండ్ ఫోన్లే కదా. ఫోన్ చేస్తే తనే తీసింది. ‘హలో.. నేను చిరంజీవి’ అన్నాను. ‘నేను సురేఖనండీ. ఫోన్ ఎవరికివ్వమంటారు’ అంది. అంతే... నాతో కనీసం రెండు మాటలు కూడా మాట్లాడకుండా ఎవరికివ్వమంటారు అందని నా అహం దెబ్బతింది. ‘మీ అన్నయ్య ఉన్నాడా’ అన్నాను. ‘లేరండీ’ అంది. ‘వచ్చాక నేను ఫోన్ చేశానని చెప్పు’ అని పెట్టేశాను. సురేఖ: అప్పుడప్పుడూ అన్నయ్యతో పెళ్లి తేదీ గురించి మాట్లాడేవాళ్లు. అందుకని అన్నయ్యతో మాట్లాడటం కోసమే ఫోన్ చేశారనుకున్నాను. నా గురించి చేశారనుకోలేదు (నవ్వుతూ). ► సరే.. హనీమూన్ విశేషాలు? చిరంజీవి: హనీమూన్ పక్కన పెట్టండి. పెళ్లికే టైమ్ దొరకలేదు. పెళ్లికి ఫిబ్రవరిలో మంచి ముహూర్తాలున్నాయంటే సరే అనుకున్నాం. అప్పుడు ‘తాతయ్య ప్రేమ లీలలు’ అనే సినిమా చేస్తున్నాను. ఆ చిత్రానికి యం.ఎస్ రెడ్డిగారు నిర్మాత. అందులో నూతన్‌ప్రసాద్ కాంబినేషన్లో నా సీన్లు ఉన్నాయి. ‘ఆయన చాలా బిజీ ఆర్టిస్ట్, డేట్స్ దొరకవు.. మీరు మే నెలలో పెళ్లి చేసుకోండి’ అని రెడ్డిగారు అన్నారు. ‘మీరు ఓకే అంటే ఫిబ్రవరిలో, లేదంటే తర్వాత చేసుకుంటాను’ అన్నాను. అరవింద్ ఏమో ‘ఓ మూడు రోజులు ఇవ్వండి’ అని పట్టుబట్టాడు. నా సినిమా టైమ్‌లో మా హీరో పెళ్లి చేసుకున్నాడులే అనుకొని ఏ నిర్మాత అయినా ఆనందంగా ఒప్పుకుంటారు. కానీ, రెడ్డిగారు ఒప్పుకోలేదు. అప్పుడు అల్లు అరవింద్ ‘మీ డేట్లు మళ్లీ మీకు ఇప్పిస్తాను. కాంబినేషన్ గురించి మీకేం భయం లేదు. నేనూ ఇండస్ట్రీలోనే ఉన్నాను కదా. మేం చిరంజీవిని తీసుకెళ్లిపోతున్నాం’ అన్నారు. అలా అనుకున్న ముహూర్తానికే పెళ్లయింది. ► మరి పెళ్లి బట్టల షాపింగ్‌కి టైమ్ దొరికిందా? చిరంజీవి: పెళ్లి పీటల మీద కూర్చున్నప్పుడు చొక్కా చిరిగిపోయింది. సురేఖ మార్చుకోమంటే ‘ఏం.. బట్టలు చిరిగితే తాళి కట్టలేనా’ అని, అలాగే కట్టేశాను. అయితే అప్పటికే నాకు ఏడెనిమిది పెళ్లిళ్లు చేసుకున్న అనుభవం ఉంది (ఇద్దరూ పెద్దగా నవ్వుతూ). అంటే సినిమాల్లో.. ► పెళ్లయ్యే నాటికే మీకు వంట వచ్చా? సురేఖ: రాదండీ. ఒకరోజు ఉప్మా చేస్తే ఉండలు, ఉండలుగా వచ్చింది. అప్పుడు ఆయనే ఉప్మా చేయడం నేర్పించారు. ఆయన మేనత్త, అమ్మమ్మ మాతోనే ఉండేవారు. వాళ్లు వండేవారు. ► భర్త మేనత్త, అమ్మమ్మ, అమ్మానాన్న, తమ్ముళ్లు (నాగబాబు, పవన్ కల్యాణ్) ఇంతమందితో ఉండాలంటే ప్రైవసీ ఉండదేమో అనిపించిందా? సురేఖ: మా ఇంట్లో ఎప్పుడూ చుట్టాలుండేవారు. అదే సందడి ఈ ఇంట్లోనూ ఉండేది. లేకపోతే ఒంటరితనం అనిపించేది. ఈయన ఉండేవారు కాదు. అందరూ కలిసి ఉండటంతో నాకు సెక్యూరిటీ ఉండేది. వాళ్లే వంటలు చేసి, నాకు, ఆయనకి, అందరికీ పెట్టేవారు. పిల్లలందరూ ఉండటంతో బావుండేది. చిరంజీవి: సురేఖ తమ్ముడు ఉండేవారు. అతను చనిపోయారు. నా తమ్ముళ్లిద్దరిదీ వాళ్ల తమ్ముడి వయసు. వీళ్ల మీద సురేఖకు ఆ ఎఫెక్షన్ ఉండటానికి కారణం అదే. మనం ఎలా ఉంటే అవతలివాళ్లు మనతో అలా ఉంటారు. సురేఖ అందరితో బాగుంటుంది. సురేఖ: వాళ్లు కూడా చాలా బాగుంటారు. ఏ రిలేషనయినా రెండువైపులా ఉండాలి. ఈయన లేకపోయినా కల్యాణ్ (పవన్ కల్యాణ్) ఎప్పుడూ పిల్లలతో ఉండేవాడు. బాగా సరదాగా ఉండేవాడు. అందుకే కల్యాణ్ పిల్లలతోపాటు పెరిగాడు, పిల్లలు కల్యాణ్‌తో పాటు పెరిగారు అంటాం. కల్యాణ్‌తో పాటు, వీళ్ల చెల్లెలు మాతోపాటు ఉండి చదువుకుంది. ► త్రీ షిఫ్ట్స్ చేస్తూ షూటింగ్స్‌తో చిరంజీవిగారు బిజీగా ఉండేవారట. పెళ్లయిన కొత్తలో ఆ బిజీని ఎలా తీసుకున్నారు? సురేఖ: నాన్నగారిని చూస్తూ పెరిగాను కదా. నైట్ షూటింగ్‌లని ఆయన లేటుగా రావటం అన్నీ తెలుసు. మా పెళ్లయిన కొత్తల్లో ఈయన పొద్దున్నే షూటింగ్‌కి వెళ్లి సాయంత్రం 6 గంటలకు వచ్చేవారు. మళ్లీ ఫ్రెష్ అయి నైట్ షూటింగ్‌కి వెళ్లేవారు. ‘పున్నమినాగు’ షూటింగ్ జరుగుతోంది అప్పుడు. నా లైఫ్ అంతా ఇలానే ఉంటుందని ప్రిపేర్ అయిపోయాను కాబట్టి ఏమీ అనిపించలేదు. ► ప్యారిస్‌లో షూటింగ్ జరుగుతున్నప్పుడు మీ పేరు బదులు ‘జయ’ అని జయప్రదగారి పేరుతో మిమ్మల్ని పిలిచారట? సురేఖ: ఓ రోజు కాదు, రోజూ జరిగేది. నెల రోజులు జయప్రదతో షూటింగ్ చేస్తే ఆ నెల రోజులూ జయ, జయ అని పిలిచేవారు. మా పెళ్లయిన కొత్తల్లో అప్పటికి నన్ను సురేఖా అని పిలవడానికి అలవాటుపడలేదు. అందుకని ఒక్కోసారి జయ అని పిలిచేవారు. ‘ఏమండీ.. నేను రేఖ’ అనేదాన్ని. ‘ఓ.. సారీ, సారీ రేఖ’ అనేవారు. చిరంజీవి: సురేఖలో ఉండే ఆ స్పోర్టివ్‌నెస్ పరాకాష్ట అని చెప్పాలి. మరో గమ్మల్తైన విషయం చెబుతా. మా పెళ్లైన రెండు నెలలకి ప్యారిస్ వెళ్లాం. హోటల్లో రూమ్ తీసుకున్నాం. దానికోసం రిసెప్షన్లో ఫామ్స్ అన్నీ కంప్లీట్ చేసి ఇవ్వాలి కదా. అక్కడ అన్నీ ఫిల్ చేస్తూ భార్య అనే చోట ఆగిపోయాను. వెంటనే పేరు గుర్తు రాలేదు (నవ్వులు). ‘సురేఖ’ అని చెప్పి.. ‘అల్లు అని రాసేరు, కొణిదెల అని రాయండి’ అంది. ► మీరు ఎంతోమంది హీరోయిన్లతో నటించారు. వాళ్లతో సురేఖగారు ఎలా ఉంటారు? చిరంజీవి: సురేఖ వెరీ ఫ్రెండ్లీ. సుహాసిని, సుమలత, విజయశాంతి, రాధ, రాధిక.. అందరితో ఓ ఫ్యామిలీలా ఉంటుంది. మొన్న నవంబర్‌లో మా 80స్ క్లబ్ (1980లకు చెందిన నటీనటులు) రీయూనియన్ పార్టీ మా ఇంట్లోనే జరిగింది. అన్నీ తనే ఎరేంజ్ చేసింది. వాళ్లందరూ ‘ఇంత ఎరేంజ్ చేశారు, మీరూ పార్టీలో ఉండండి’ అంటే ‘మీరంతా ఫ్రెండ్స్. ఎంజాయ్ చేయండి’ అంది. సురేఖ: ఎరేంజ్ చేశాం కదా అని ఫ్రెండ్స్ మధ్యలో దూరిపోకూడదు (నవ్వుతూ). ► జనరల్‌గా చిరంజీవిగారి బర్త్‌డే అంటే ఫ్యాన్స్ మరచిపోనివ్వరు. మరి.. మ్యారేజ్ డే, మీ బర్త్‌డేని ఆయన గుర్తుపెట్టుకుంటారా? చిరంజీవి: గుర్తుండేది కాదు, గుర్తు లేకనే ఈ సంవత్సరం ఫైట్ సీక్వెన్స్ కోసం పోలవరం వెళ్లడానికి రెడీ అయ్యాను. ఈ 18న సురేఖ పుట్టినరోజు. 20న మా పెళ్లిరోజు. అది గుర్తు లేక 16 నుండి పోలవరంలో షూటింగ్ ప్లాన్ చేసుకున్నాం. మా అబ్బాయికి (రామ్‌చరణ్) గుర్తుకొచ్చింది. వాళ్లమ్మ దగ్గరికెళ్లి ‘18 నీ పుట్టినరోజు, 20 మీ పెళ్లిరోజు, డాడీ షూటింగ్‌కి ఎలా ఒప్పుకున్నారు?’ అంటే, ‘పోనీలే డాడీకి గుర్తులేదేమో’ అందట. ‘లేదమ్మా, అది మన షూటింగే కదా, వాళ్లతో మాట్లాడి మారుస్తాను’ అని మార్చేశాడు. సురేఖ: మా మ్యారేజ్ డే అయినా, నా బర్త్‌డే అయినా హడావిడి ఏమీ ఉండదు. ► గిఫ్ట్‌లు ఇస్తుంటారా? సురేఖ: రెండేళ్ల క్రితం నా బర్త్‌డేకి వాచ్ ఇచ్చారు. కరెక్ట్‌గా రాత్రి 12 గంటలకు నన్ను నిద్ర లేపి మరీ ఇచ్చారు. ఆ గిఫ్ట్ నాకివ్వటం కోసం ఎంత కష్టపడ్డారో తర్వాత తెలిసి ఆనందపడ్డాను. చిరంజీవి: ఆ బ్రాండ్ వాచ్ ఇక్కడ దొరకలేదు. బెంగళూర్‌లో ఉంది. ఆ కంపెనీవాళ్లను అడిగితే, ‘మీరు మా ప్రివిలేజ్డ్ కస్టమర్’ అని ఫ్లయిట్‌కి వచ్చి ఇచ్చి వెళ్లారు. ► కలిసి షాపింగ్స్‌కి వెళతారా? చిరంజీవి: షాపింగ్ అంటే ఇద్దరికీ ఇష్టం. ఇక్కడ కష్టం కాబట్టి విదేశాలు వెళ్లినప్పుడు బాగా తిరుగుతాం. లండన్ వెళితే ఓ అపార్ట్మెంట్ అద్దెకి తీసుకుని కొన్ని వారాల పాటు అక్కడే ఉంటాం. నాకు, తనకి కుకింగ్ అంటే సరదా. కుక్ చేసుకుని షాపింగ్‌కి వెళ్లిపోతాం. ► పండగలు బాగా చేస్తుంటారని విన్నాం. ప్లానింగ్ అంతా సురేఖ గారిదేనా? చిరంజీవి: నాగబాబు, పవన్‌కల్యాణ్, అల్లు అరవింద్ ఫ్యామిలీ... ఇలా అన్ని క్లోజ్ ఫ్యామిలీలు మొన్న దీపావళి పండగకి కలిశాం. దాదాపు మేమే ఓ వందమంది దాకా ఉంటాం. అందరికీ తనే మెసేజ్ పెడుతుంది. ఆ మెసేజ్‌కే చిన్న పిల్లల దగ్గరనుండి, పెద్దవాళ్లదాకా అందరూ తూచా తప్పకుండా హాజరవుతారు. సంక్రాంతి పండగను మూడు రోజులు చాలా ఘనంగా చేసింది. అప్పుడు పంక్తి భోజనాలు పెట్టి, పెద్ద భోగి మంట ఏర్పాటు చేయించింది. పండగ అనేది వంకే తప్ప, అందరూ కలవాలనుకుంటుంది. అందుకే అందరితోనూ తనకు మంచి బాండింగ్ ఉంటుంది. సురేఖ: ఈయన మొదట్నుంచి వాళ్ల పిల్లలు, వీళ్ల పిల్లలు అని కాదు.. అందరి పిల్లలతో బాగుంటారు. చిన్నప్పుడు అందరి పిల్లలు ఓ పదిహేనుమంది దాకా అయ్యేవారు. అందరినీ షూటింగ్‌లకు తీసుకెళ్లేవారు. మాల్దీవ్స్ వెళ్లినా, స్విస్ వెళ్లినా హాలిడే ఉందంటే చాలు.. అల్లు వెంకటేశ్, బన్నీ, శిరీష్ ఇలా అందరి పిల్లల్ని ఫారిన్ తీసుకెళ్లేవారు. చిరంజీవి: పిల్లలందరికీ వండర్ఫుల్ మెమొరీస్ నాతోనే ఉంటాయి. నేనెన్ని చేసినా దాన్ని ఆర్గనైజ్ చేసి, మేనేజ్ చేసేవాళ్లు కావాలి. అది సురేఖ చేస్తుంది. ► పండగలవీ శ్రద్ధగా చేస్తున్నారంటే పూజలు బాగా చేస్తారా? సురేఖ: మరీ అంత ఎక్కువ కాదు. రోజూ మామూలుగా చేస్తా. స్పెషల్ అకేషన్ అంటే కచ్చితంగా బాగా చేస్తాను. మనం చేస్తుంటేనే పిల్లలు కూడా ఫాలో అవుతారు. మన నెక్ట్స్ జనరేషన్‌కు తెలుస్తుంది. మనం వదిలేస్తే వాళ్లూ వదిలేస్తారు. మా సుస్మిత, శ్రీజ పెళ్లి చేసుకుని వెళ్లిపాయినా ఇక్కడ పూజలు చేసినట్లే అత్తగారింట్లో చేస్తారు. ► మనవళ్లు, మనవరాళ్ల గురించి ? సురేఖ: అదొక లవ్లీ లైఫ్. ఈయనకి అప్పట్లో తీరిక లేక మా పిల్లల ఎదుగుదలను చూడలేదు. ఇప్పుడు చిన్నపిల్లలతో టైమ్ స్పెండ్ చేస్తున్నారు. అందరికీ ఆయనంటే పిచ్చి ఇష్టం. వాళ్లతో ఆయన ఎన్ని ఆటలు ఆడతారో చెప్పలేం. ► మీ ఇద్దరి మధ్య గొడవలు జరుగుతుంటాయా? చిరంజీవి: ఎందుకు జరగవు? తిట్టుకుంటానే ఉంటాం సురేఖ: అలా జరగబట్టే ఇంత సక్సెస్‌ఫుల్‌గా ఉన్నాం. ఎప్పుడూ స్వీట్ స్వీట్‌గా ఉంటే బోర్. ► ఇద్దరిలో ఎవరు సీరియస్? ఎవరు కామెడీ? చిరంజీవి: నేను కామెడీగా ఉండను. అలాగని పెద్ద సీరియస్‌గా కూడా ఉండను. కామెడీ అంటే సురేఖనే ఎక్కువ. ఆమె పంచ్‌లను తట్టుకోవటం చాలా కష్టం. ఒక్కోసారి ఆ పంచ్‌లకు గుక్క తిప్పుకోలేం. ► ఫైనల్లీ.. మళ్లీ జన్మంటూ ఉంటే మీరే కపుల్‌గా ఉండాలనుకుంటున్నారా? చిరంజీవి: నేను ఆ మద్రాస్ కోడంబాకం బ్రిడ్జి మీదకి మాత్రం వెళ్లను (పెద్దగా నవ్వుతూ). ఐయామ్ జస్ట్ కిడింగ్. డెఫ్నెట్లీ మేమే ఉండాలనుకుంటున్నాం. సురేఖ: అంతే... ► మీరు కట్టుకునే చీరలు బాగుంటాయి. మీవారు కాంప్లిమెంట్స్ ఇస్తుంటారా? సురేఖ: థ్యాంక్యూ. నాకు అప్డేటెడ్గా ఉండటం ఇష్టం. దానికి కారణం చిరంజీవిగారే. ఆయనకు ఫ్యాషన్ గురించి, కలర్స్ గురించి చాలా అవగాహన ఉంది. ఇంకో విషయం ఏంటంటే.. ఆయన చీర చూడగానే రేటు చెప్పేస్తారు. అది ఏ చీర అయినా కానివ్వండి.. బట్టల గురించి అంత ఐడియా ఉంది. నేను కట్టే చీరలు బాగుంటాయని అందరూ అంటుంటే బాగానే ఉంటుంది. కానీ అదే విషయాన్ని ఆయన నోటి నుంచి వింటే ఆ ఆనందమే వేరు. అంతేకదా.. మనం శ్రద్ధగా డ్రెస్ చేసుకున్నప్పుడు భర్త నుంచి ఓ చిన్ని కాంప్లిమెంట్ వస్తే ఆ ఫీలింగే స్పెషల్. ఆ విషయంలో ఆయన హండ్రెడ్ పర్సంట్ బెస్ట్. అన్నీ పట్టించుకుంటారు. కాంప్లిమెంట్స్ ఇస్తారు. ► సో.. మీ కళ్లబ్బాయి పక్కా ఫ్యామిలీ మ్యాన్ అన్నమాట? సురేఖ: డౌట్ ఏముంది? హండ్రడ్ పర్సంట్ పక్కా ఫ్యామిలీ మ్యాన్. ► 30 ఏళ్లు నటించి ఓ పదేళ్లు పాలిటిక్స్‌కి దగ్గరగా ఉండటంవల్ల సినిమాలకు దూరమయ్యారు. ఆ గ్యాప్ గురించి? సురేఖ: అప్పుడు పీస్‌ఫుల్‌గా ఉండేవారు కాదు. మాకూ అలానే ఉండేది. ఆయనకి మేకప్ వేసుకోగానే హుషారు వస్తుంది. చిరంజీవి: పనులన్నీ ముగించుకుని ఇంటికొచ్చాక కూడా మరుసటి రోజు ఏం మాట్లాడాలి? అనేదాని చుట్టూనే ఆలోచనలు ఉండేవి. ‘సినిమాలు చేయడం మొదలుపెట్టాక మళ్లీ మిమ్మల్ని మా మనిషిలా చూస్తున్నాం’ అంటున్నారు. సురేఖ: ఇప్పుడు ఫుల్ హుషారు. ఉదయం 9కి వెళ్లాలంటే ముందే రెడీ అయి కూర్చుంటారు. షూటింగ్ ఉంటే.. హీ ఈజ్ ఫుల్ యాక్టివ్. చిరంజీవి: ‘సైరా’ సినిమాకి 4.30కి లేచి వర్కవుట్ చేసుకొని 5.30గంటలకల్లా రెడీ అయ్యి 6 గంటలకు లొకేషన్‌కి వెళ్లి 7 గంటలకల్లా మేకప్‌తో రెడీగా ఉండేవాణ్ణి. ఇప్పుడు కొరటాల శివతో చేస్తున్న సినిమా షూటింగ్ షార్ప్ 7కల్లా స్టార్ట్ చేస్తున్నాం. జనవరి 2న షూటింగ్ స్టార్ట్ చేశాం. అప్పుడే ఓ సాంగ్, మూడు ఫైట్స్ కంప్లీట్ అయ్యాయి. ► మీ పెళ్లప్పటికే చిరంజీవిగారు కెరీర్‌వైజ్‌గా మంచి ఫామ్‌లోకొచ్చారు.. ఆ బిజీని ఎలా తీసుకునేవారు? సురేఖ: ఆయన కనబడటమే అపురూపంగా ఉండేది. ఎప్పుడూ షూటింగ్‌లతో దూరం, దూరంగా ఉండటంతో కళ్లారా ఎప్పుడు చూస్తానా అనిపించేది. చిరంజీవి: నేను ఫిలిం ఇన్స్టిట్యూట్లో ఉన్నప్పుడే అవకాశాలు మొదలయ్యాయి. ఆల్బమ్ పట్టుకుని అవకాశాల కోసం ఆఫీసుల చుట్టూ తిరిగే పరిస్థితి రాలేదు. అందుకే పెళ్లినాటికే ఫామ్‌లో ఉన్నా. అప్పుడేమో నేను కనబడితే రేఖకి అపురూపం. మనవరాళ్లు వచ్చాక ఎఫెక్షన్ తగ్గింది. పలకరిస్తే ‘ఆ వస్తున్నా’ అంటుంది. వచ్చి చూడదు. అందుకేనేమో లేటు వయసులో చాలామంది సెకండ్ కోసం చూస్తుంటారు (కొంటెగా నవ్వుతూ). అయినా నేనా ధైర్యం చేయలేను. ► చిరంజీవిగారు, చరణ్ కలిసి ఫుల్ లెంగ్త్ సినిమా చేయాలని ఉందా? సురేఖ: ఇద్దరినీ ఓ సినిమాలో చూడాలని ఉంది. ‘ఖైదీ నంబర్–150’లో ‘అమ్మడూ లెట్స్ డూ కుమ్ముడు’ పాట మధ్యలో చరణ్ వచ్చి డ్యాన్స్ చేస్తాడు. వాళ్లిద్దరూ కలిసి డ్యాన్స్ చేస్తుంటే ఈయన్ని చూడాలా, చరణ్‌ని చూడాలా అనుకున్నాను. ఆ తర్వాత ఇంట్లో ఆ సినిమా చూస్తూ ఒకసారి ఈయన్ని, మళ్లీ ఆ పాట పెట్టుకుని ఒకసారి చరణ్‌ని చూశాను. ► నటుడిగా చిరంజీవిగారు రిస్కీ ఫైట్స్ చేస్తుంటారు. మీకెలా అనిపిస్తుంది? సురేఖ: లొకేషన్లో ఏం చేసేవారో తెలిసేది కాదు కానీ, చేసొచ్చిన తర్వాత చెబుతుంటే ‘బాబోయ్’ అనిపించేది. ఎప్పుడో పొద్దున వెళితే సాయంత్రానికి వచ్చేవారు. అలా కాకుండా ఏ పదకొండింటికో ఆయన ఇంటికి వచ్చేస్తున్నారు అని ఎవరైనా చెబితే మాత్రం, ఏదో దెబ్బతగిలే ఉంటుందనుకునేదాన్ని. అలాగే ఫైట్ సీన్స్ అంటే మధ్యలో లొకేషన్ నుంచి ఫోన్ రాకూడదని కోరుకుంటా. ఫోన్ వస్తే ఆయనకు ఏదైనా దెబ్బ తగలిందని చెబుతారేమోనని భయం. ఇప్పుడు ఫర్వాలేదు కానీ అప్పట్లో ఇంత కంఫర్టబుల్ షూస్ కానీ, సేఫ్టీ ప్రికాషన్స్ కానీ లేవు కదా. ఈయనేమో డూప్ కూడా వద్దంటారు. – డి.జి. భవాని -
శంషాబాద్‌లో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నిర్మించండి
సాక్షి, హైదరాబాద్: సినిమా రంగంలోని 24 విభాగాల్లో పనిచేసే వారి నైపుణ్యాన్ని పెంచేందుకు వీలుగా అంతర్జాతీయ ప్రమాణాలతో శంషాబాద్ సమీపంలో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేయాలని ప్రముఖ నటులు చిరంజీవి, నాగార్జున.. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ను కోరారు. సీఎం కేసీఆర్ ఆదేశం మేరకు మంత్రి మంగళవారం చిరంజీవి ఇంట్లో వారితో భేటీ అయ్యా రు. చలనచిత్ర పరిశ్రమకు సంబంధించి పలు అంశాలను సమావేశంలో చర్చించారు. ఆన్లైన్ టికెటింగ్ విధానం అమలు తీరు తెన్నులపై చర్చించారు. టికెట్ల ధరలను నిర్ణయించే విధానాన్ని సరళీకరించే విధానం ఉండాలని మంత్రిని కోరారు. చిత్రపురి కాలనీ పక్కనే సినీ కార్మికులకు ఇళ్ల నిర్మాణానికి మరో 10 ఎకరాల స్థలం కేటాయించాలని, సినీ కార్మికులు, కళాకారుల కోసం కల్చరల్ కేంద్రం ఏర్పాటుకు జూబ్లీహిల్స్ ప్రాంతంలో 2 ఎకరాల స్థలం కేటాయించాలని కోరారు. సినీ, టీవీ కళాకారులకు ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా గుర్తింపు కార్డులు అందజేయాలని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సినీ కార్మికులకు వర్తింపచేయాలని, వారికి ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని ప్రతిపాదించారు. ఇప్పటికే పలుమార్లు సినీ ప్రముఖులు, చిత్రపురి కాలనీ సభ్యులతో సమావేశమై సమస్యలను తెలుసుకున్నట్లు మంత్రి తెలిపారు. ఈ నెల రెండో వారంలో మరోసారి సమావేశమై మరిన్ని అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. సమావేశంలో ఎఫ్డీసీ మాజీ చైర్మన్ రామ్మోహన్రావు, నిర్మాత నిరంజన్‌రెడ్డి, కిషోర్‌బాబు పాల్గొన్నారు. మంత్రి తలసానికి పుష్పగుచ్ఛం ఇస్తున్న నాగార్జున, చిరంజీవి -
ఇది మనందరి అదృష్టం
‘‘కళాకారుల ప్రతిభకు అవార్డులు, రివార్డులే కొలమానాలు’’ అన్నారు చిరంజీవి. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా లండన్‌లోని భవన్స్ ప్రాంగణంలో సంగీత వేడుక జరిగింది. సంగీతంలోని విశిష్టమైన 72 మేళకర్త రాగాలను ఏకధాటిగా 61గంటల 20 నిమిషాల పాటు వీణవాదన చేసి గిన్నిస్ రికార్డును సొంతం చేసుకున్నారు తెలుగు సినిమా సంగీత దర్శకుడు వీణాపాణి. ఈ సందర్భంగా వీణాపాణిని సత్కరించిన చిరంజీవి మాట్లాడుతూ– ‘‘ఇటువంటి కళాకారులను వ్యక్తిగతంగా, వృత్తిపరంగా గౌరవించడం మన సినిమా ఇండస్ట్రీకి గర్వకారణం. ఇంత గొప్ప గౌరవం దక్కటం తెలుగువారితో పాటు భారతీయులందరి అదృష్టం’’ అన్నారు. ‘‘వీణపాణి అసలు పేరు రమణమూర్తి. ఆయనకు వీణాపాణి అని నామకరణం చేసింది నేనే అని గర్వంగా చెప్పగలను’’ అన్నారు తనికెళ్ల భరణి. ‘‘మన తెలుగువాడు ఇంతటి కీర్తిని సాధించడం మనకు గర్వ కారణం’’ అన్నారు నిర్మాత అల్లు అరవింద్. ‘‘వీణాపాణి ఇంకా ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలి’’ అన్నారు జనార్థన మహర్షి. ‘‘నా దర్శకత్వంలో వచ్చిన ‘పట్టుకోండి చూద్దాం’ ద్వారా సంగీత దర్శకునిగా ప్రయాణం మొదలుపెట్టిన వీణాపాణికి గిన్నిస్ అవార్డు రావడం హ్యాపీగా ఉంది’’ అన్నారు శివ నాగేశ్వరరావు. ‘‘ఈ రికార్డును ఆ మహాత్మునికి అంకితం ఇస్తున్నాను. నన్ను 28ఏళ్లుగా భరిస్తున్న నా భార్యకు, పిల్లలకు కూడా ఈ అవార్డు చెందుతుంది’’ అన్నారు వీణాపాణి. -
ఉపరాష్ట్రపతితో భేటీ కానున్న చిరంజీవి
న్యూఢిల్లీ: తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథ ఆధారంగా తెరకెక్కిన ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా ఈనెల 2న విడుదలై బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. దీంతో ఎంతో చరిత్రాత్మాక నేపథ్యం ఉన్న ఈ సినిమాను పలువురు రాజకీయ ప్రముఖుల చేత వీక్షింపచేయాలని మెగాస్టార్ చిరంజీవి భావిస్తున్నారు. దీనిలో భాగంగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడిని మర్యాదపూర్వకంగా కలిసేందుకు చిరంజీవి బుధవారం ఢిల్లీకి పయనమయ్యారు. ఉప రాష్ట్రపతి కోసం ప్రత్యేకంగా ఆయన నివాసంలో ఈ రోజు సాయంత్రం ‘సైరా నరసింహారెడ్డి’ చిత్ర ప్రదర్శన జరగనున్నది. వెంకయ్యనాయుడితో కలిసి చిరంజీవి సినిమాను వీక్షించనున్నారు. అనంతరం ‘సైరా’ విశేషాలను వారిరువరు చర్చించుకోనున్నారు. అదేవిధంగా ప్రధాన మంత్రి మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలతో భేటీ కానున్నట్టు సమాచారం. సైరా సినిమా చూడాలని చిరంజీవి వారిరువురిని కోరనున్నట్టు తెలుస్తోంది. కాగా ఈనెల 5న తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్‌ను చిరంజీవి మర్యాదపూర్వకంగా కలిసిన సంగతి తెలిసిందే. ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా చూడాలని ఆమెను చిరంజీవి కోరారు. చిరంజీవి ఆహ్వానం మేరకు గవర్నర్ ప్రత్యేకంగా ఈ సినిమాను వీక్షించారు. అదేవిధంగా సోమవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని మెగాస్టార్ చిరంజీవి దంపతులు మర్యాదపూర్వకంగా కలిసిన విషయం తెలిసిందే. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక చిరంజీతో భేటీ కావడం ఇదే తొలిసారి కావడం విశేషం. -
సై సైరా... భయ్యా!
150 సినిమాల రిలీజులు చూశారు కాబట్టి మీకు రిలీజ్లు కొత్త కాదు. అయినా 151వ సినిమా ‘సైరా’ రిలీజ్ అంటే ఏమైనా టెన్షన్‌గా ఉందా? చిరంజీవి: నిజం చెప్పాలంటే ఏ సినిమాకి ఆ సినిమా కొత్తగా అనిపిస్తుంది. ప్రేక్షకులు దీనిని ఎలా ఆదరిస్తారు? మనం అనుకున్నది కాకుండా ఊహించని విధంగా ఏదైనా స్పందిస్తారా? వంటి సంశయాలు ఎప్పుడూ ఉంటాయి. టెన్షన్ అనను కానీ ఆత్రుత, ఉద్వేగం వంటి మిక్స్డ్ ఫీలింగ్స్ ఎప్పుడూ ఉంటాయి. కొన్ని సినిమాలకు ‘ఈ సినిమాను కచ్చితంగా ఆదరిస్తారు’ అనే ప్రగాఢమైన నమ్మకం ఉంటుంది. అలా ఈ సినిమాకు అనిపిస్తోంది. ఈ సినిమా కథ చాలా నమ్మకం కలిగించింది. ఆ నమ్మకమే ధైర్యంగా ఉండేలా చేసింది. గుర్రపు స్వారీలు మీకు అలవాటే. కత్తి యుద్ధాలు మొదటిసారి చేశారు కదా... ఎలా అనిపించింది? నేనెప్పుడూ కత్తి యుద్ధాలు చేసింది లేదు. భరతనాట్యం నేర్చుకోలేదు. కానీ చూసి, గమనించి చేసేవాణ్ణి. అలా బాగా డ్యాన్స్ చేయడం అలవాటైంది. కత్తి యుద్ధాలు, జానపద సినిమాలు చేసింది లేదు. మాస్టర్స్ చేసి, చూపించారు. అది చూసి నేర్చుకుని చేసేశాను. కొత్త విషయాలు నేర్చుకోవడం ఎప్పుడూ బాగుంటుంది. ఒక్క ఫ్లాప్ కెరీర్‌ని నిర్ణయించే వృత్తి మీది. 30 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న మీరేమంటారు? ఈ వృత్తిలో ఎన్ని ప్లస్సులున్నాయో అన్ని మైనస్సులూ ఉన్నాయి. ఇదే కాదు ఏ ప్రొఫెషన్లో అయినా ప్లస్సు, మైనస్సు కచ్చితంగా ఉంటాయి. చాలెంజ్‌లను అధిగమిస్తూ విజయాలు సాధించగలిగితేనే నువ్వు ముందుకు వెళ్లగలుగుతావు. ఇక్కడ సక్సెస్ రావాలంటే మనల్ని ముందుకు నడిపించేది కథ. ఆ కథలో కూడా కీలకమైనది ‘ఎమోషన్’ అని అంటాను నేను. ఆ ఎమోషన్ మిస్ అవ్వకుండా తీయగలిగితే సినిమా మీద కచ్చితంగా ధైర్యంగా, నమ్మకంగా ఉండొచ్చు. నేను కథలు వినేప్పుడు కూడా కామెడీ సీన్లు ఎన్ని ఉన్నాయి? డ్యాన్స్‌లు చేయడానికి స్కోప్ ఉందా? అని ఆలోచించను.హృదయాలను కదిలించే ఉద్వేగం ఉందా? లేదా అని చూసుకుంటాను. కంట తడిపెట్టించే సీన్స్ కొన్నయినా ఉండాలి. లేకపోతే ఎందుకు చూడాలి? మీరిచ్చే హంగులు అన్ని చోట్లా దొరుకుతున్నాయి. ప్రస్తుతం అందరికీ స్మార్ట్ఫోన్లు ఉన్నాయి. డిజిటల్ ఎంటర్టైన్మెంట్ లభిస్తోంది. దాన్ని మించి నువ్వు మాకు ఏమి ఇస్తున్నావు? అనే ప్రేక్షకుడి ప్రశ్నకు మన దగ్గర సమాధానం ఉండాలి. ఆ సమాధానం మంచి కథ. ఇక ఎంతోమంది అభిమానులను ఇచ్చిన ఈ వృత్తికి ఎందుకు వచ్చాం అనే ఫీలింగా? నో చాన్స్. అది ఎప్పటికీ ఉండదు. డిజిటల్ మీడియా ఎంటర్టైన్మెంట్ నుంచి ఆడియన్స్‌ని డైవర్ట్ చేయాలంటే మంచి కథ ఉన్న సినిమాలు ఇవ్వాలన్నారు. డిజిటల్ ముందు సినిమా స్కేల్ ఏమైనా తగ్గిందంటారా? ఆ స్కేల్ ఇంకా పెరిగిందంటాను. ప్రస్తుతం ఉన్న సాంకేతికతను వినియోగించుకుంటూ సినిమా కొత్త పుంతలు తొక్కుతుందని భావిస్తున్నాను. స్మార్ట్‌ఫోన్ రూపంలో మన చేతిలోనే ఇంత కంటెంట్ అందుబాటులో ఉన్నప్పుడు దాన్ని మించి మనం ఏం ఇవ్వగలం అనే ఆలోచనతో కొత్త కొత్త ఐడియాలు వస్తుంటాయి. నూతన దర్శకులు అలా ఆలోచించబట్టే కొత్త సబ్జెక్ట్‌లు వస్తున్నాయి. ‘అర్జున్ రెడ్డి, పెళ్లిచూపులు, కేరాఫ్ కంచెరపాలెం’ అన్నీ సక్సెస్ అయ్యాయి. డిజిటల్ ఎప్పుడూ సినిమాకు పోటీ కాదు. అయితే ది బెస్ట్ దిశగా ఆలోచింపజేస్తుంది. బెస్ట్ సినిమాలు వచ్చేందుకు స్కోప్ ఉండే అవకాశం ఉంది. ఇప్పటి ఆర్టిస్ట్‌లను చూస్తే ఈర్ష్యగా ఏమైనా అనిపిస్తోందా? మీ టైమ్‌లో యాక్షన్‌లో రిస్క్ ఎక్కువ ఉండేది. ఇప్పుడు టెక్నాలజీతో కొంత మేనేజ్ చేసే అవకాశం ఉంది కదా? అలాంటి ఫీలింగ్ నాకు ఎప్పుడూ ఉండదు. మీరన్నట్లు ఇప్పుడు చాలా సౌకర్యాలు ఉన్నాయి. మాకున్నంత రిస్క్ ఉండకపోచ్చు. అయితే రిస్క్ ఉంది. ప్రతి ఒక్కరూ నిరూపించుకోవడానికి కష్టపడాల్సిందే. అంత కష్టపడి సినిమా పూర్తి చేసిన తర్వాత కూడా ఈ సినిమాను ఎలా ఆదరిస్తారు అని టెన్షన్ ఉంటుంది. చిన్న చిన్న కంఫర్ట్స్ ఉంటే ఉండొచ్చు కానీ ఎవరైనా సరే ఈ మానసిక టెన్షన్ అనుభవించాల్సిందే. అది నేనయినా, మా అబ్బాయి రామ్‌చరణ్ అయినా.. ఎవరైనా. కష్టం కష్టమే. ఎవ్వరూ రిలాక్స్ అవుతూ సుఖంగా మాత్రం పని చేయడానికి కుదరదు. కొడుకు నిర్మాణంలో తండ్రి సినిమా చేయడం స్పెషల్‌గా ఉంటుంది. మీరు హీరోగా రామ్‌చరణ్ డబ్బులు పెట్టి ‘సైరా’ చేయడం గురించి... (నవ్వుతూ) ఇందులో తన డబ్బు వేరు.. నా డబ్బు వేరు అనే ఆలోచన మాకు లేదు. మేమందరం ఒకే రూఫ్ కింద ఉంటున్నాం. కాబట్టి మాకు ఆ తేడాలు లేవు. నాకోసం ఇలాంటి సినిమా నిర్మించాలనే తన తపనను కచ్చితంగా అభినందిస్తాను. ‘మగధీర’ సినిమా చేస్తున్నప్పుడు ‘నీకు రెండో సినిమాకే ఓ కాస్ట్యూమ్ డ్రామా చేసే అవకాశం వచ్చింది. నాకు ఆ అవకాశం రాలేదు’ అన్నాను. ‘డాడీకి అది తీరని కోరిక. ఇలాంటి సినిమా తీస్తే తన కోరిక నెరవేరుతుంది’ అని తన మనసులో ఉండిపోయింది. అందుకే ‘సైరా’ నిర్మించే అవకాశం నాకు ఇవ్వండి అని అడిగాడు. తనకు తెలుసు ఆ కథ నా దగ్గరే ఉందని. పరుచూరి బ్రదర్స్‌తో మళ్లీ కూర్చొని ఆ కథను బయటకు తీసుకొచ్చాడు. ఆ విధంగా నాకు మిగిలిన కోరికను తను తీర్చాడని చెప్పగలను. ఇప్పటి నటీనటులకు మీకన్నా రిస్క్ తక్కువ అని మాట్లాడుకున్నాం. అయినప్పటికీ రిస్క్ అయితే ఉంది. మరి.. ఓ స్టార్ కొడుకుకి ఇంత కష్టం అవసరమా? అని చరణ్‌ని సినిమాల్లోకి పంపించేటప్పుడు అనుకోలేదా? చరణ్ సినిమాల్లోకి రావాలనే విషయాన్ని వాళ్ల అమ్మ ద్వారా నాకు తెలియజేశాడు. నన్ను ఆర్టిస్ట్‌గా ఎంతగా గమనిస్తున్నాడు, ఎంతగా ఇష్టపడుతున్నాడో నాకు అప్పటివరకు తెలియదు. డాడీలా నేనూ సినిమాలు చేయాలనుకుంటున్నాను అని చెప్పినప్పుడు నన్ను గమనించిన విషయం గ్రహించాను. తను వస్తాను అన్నప్పుడు నేను ఒక్కటే చెప్పాను.. ‘నా కొడుకుగా నీకు అన్నీ కేక్ వాక్ అనుకుంటే కుదరదు. చాలా కష్టపడి పని చేయాలి. నీ కష్టాన్ని గుర్తిస్తారు. అంత ప్రేమను పొందాలంటే కష్టపడాలి. కష్టపడే విషయంలో చరణ్‌కి చెప్పేది లేదు. ఎంత కష్టపడతాడనే దానికి ఒక ఉదాహరణ చెప్పాలంటే ‘మగధీర’ సినిమా చేస్తున్నప్పుడు కాలికి గాయం అయింది. అది జరిగిందనే విషయం వారం వరకూ నాకూ, వాళ్ల అమ్మకు తెలియదు. ఇంట్లో కుంటుతూ నడుస్తుంటే, ‘ఏమైంది రా కాలికి... చూపించు’ అంటే చూపించాడు. మానుతున్నట్టుగా ఉంది గాయం. ‘మందులు వేసుకుంటున్నాను. ఫర్వాలేదులే’ అన్నాడు. కష్టపడే విషయంలో ఒళ్లు దాచుకోడు ^è రణ్. ఒక స్టార్ కొడుకుని, గోల్డెన్‌స్పూన్‌తో పుట్టాను అనే ఫీలింగ్ ఎక్కడా ఉండదు తనలో. ఎవరైనా బాధల్లో ఉంటే సహాయం చేయడం, హాస్పిటల్లో చూపించడం చేస్తుంటాడు. ఇవన్నీ చెప్పుకోవడం తనకు ఇష్టం ఉండదు. దానికి ప్రాచుర్యం కూడా కోరుకోడు. ఈ సినిమాలో పని చేసిన ప్రతి ఒక్కరూ ‘ఇంత బాగా చూసుకున్న నిర్మాత ఎవ్వరూ లేరు’ అంటున్నారు. సినిమాలో పని చేసిన ఎవరినైనా అడగండి ఇదే చెబుతారు. ‘ఎంతో సంతోషంగా కుటుంబ సభ్యులందరూ సంక్రాంతి చేసుకున్నాం’ అని కృష్ణానగర్‌లో ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారని మా మేకప్‌మేన్ చెప్పాడు. అది ‘సైరా’ వల్లే. సినిమా షూటింగ్లో ప్రతి రోజూ సెట్లో కొన్ని వేలమంది ఉండేవాళ్లు. చాలా మందికి పని దొరికింది. వాళ్లందరి ఆశీస్సులు ఈ సినిమాకు కచ్చితంగా ఉంటాయి. దాదాపు 300 కోట్లతో చరణ్ ఈ సినిమా నిర్మించారు. తన వెనకాల తండ్రి ఉన్నారనే ధైర్య మేనా? ఆ ధైర్యమే (నవ్వుతూ). ఇప్పుడు చరణ్‌కి ఉన్నంత రిస్కీ నేచర్ నాకు ఉండదు. ఎందుకంటే మా నాన్న మధ్యతరగతి వ్యక్తి. నేను సాధారణ కుటుంబం నుంచి వచ్చాను. ప్రతీ అడుగు ఆచితూచి జాగ్రత్తగా ఆలోచించి వేస్తాను. అయితే చరణ్‌కి నచ్చితే వెనకాడడు. దూకేస్తాడు. ఎందుకంటే వాళ్ల నాన్న మెగాస్టార్ అనే భరోసా ఉండి ఉండొచ్చు. 300 కోట్లు పెట్టి సినిమా చేసి, పెట్టిన డబ్బులు తిరిగొస్తాయా లేదా? అని ఆలోచించలేదు. మంచి ప్రయత్నం చేశాం అని అనుకుంటున్నాడు. నాకేంటి అనే ధీమా. నేనంత ధీమాగా, ధైర్యంగా ఆలోచించలేను. చరణ్ ‘ధైర్యం’ మీరు. మరి మీ ‘ధైర్యం’ ఏంటి? మీరు యాక్టర్‌గా ఎదుగుతున్న క్రమంలో మీ మానసిక స్థితి ఎలా ఉండేది? నా ధైర్యం నేనే. ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నాను? ఎంత సంపాదిస్తున్నాను? ఎంత బ్యాంక్ బాలెన్స్ ఉంది అని కాకుండా ఎంత సేపటికీ బెస్ట్ సినిమాలు ఏం వస్తున్నాయి అని ఆలోచించేవాణ్ణి. ఇక్కడ నిలదొక్కుకోవాలి, మన ం ‘ద బెస్ట్’ అనిపించుకోవాలి అనే తాపత్రయం ఎప్పుడూ ఉండేది. కొందరు పారితోషికం సరిగ్గా ఇచ్చేవారు.. కొందరు ఎగ్గొట్టేవారు. ఎప్పుడూ కూడా నాకు ఇంత కావాలని డిమాండ్ చేసింది లేదు. 2007లో ‘శంకర్‌దాదా జిందాబాద్’ చేస్తున్నంతవరకూ కూడా నిర్మాతలకు ఎంత మిగులుతుందని ఆలోచించి, దానికి తగినట్టుగా పారితోషికం తీసుకునేవాణ్ణి. డిమాండ్, కమాండ్ చేసిన సందర్భాలు ఎప్పుడూ లేవు. దానివల్ల ‘మంచివాడిలా ఉన్నాడు. ఇతనితో సినిమా చేద్దాం’ అని నిర్మాతలు నా దగ్గరకు వస్తారనుకునేవాడిని. నిర్మాత బతకాలి. తనుంటేనే మనకు బ్రతుకు తెరువు ఉంటుందని ఆలోచించేవాణ్ణి. నాతో సినిమాలు చేసిన నిర్మాతలందరూ ‘మీతో సినిమా చేసిన తర్వాత మాకు ఇంత మిగులుతుందని భరోసా ఉంటుంది’ అన్న సందర్భాలున్నాయి. లైఫ్ మొత్తం ప్రతిదీ ఆచి తూచి చేసుకుంటూ వచ్చాను. టెన్షన్‌తో నిద్రలేని రాత్రులు.. ఏమైపోతాం అనే భయాలు ఉండేవా? ‘ఏమైపోతాం’ అనే భయం ఎప్పుడూ లేదు. నా మీద నాకు నమ్మకం ఎక్కువ. ‘చాన్స్ రావాలే కానీ ఇరగదీస్తాను’ అనే కాన్ఫిడెన్స్ ఉండేది. అవకాశం రావాలి అంటే టాలెంట్ మాత్రమే సరిపోదు. మన క్యారెక్టర్ నచ్చాలి. ‘ఇతనితో సినిమా తీస్తే కంఫర్ట్‌బుల్‌గా ఉంటుందయ్యా’ అనుకోవాలి. మన ప్రవర్తన కూడా మన ఫ్యూచర్ మీద ప్రభావం చూపించే వీలుంది. నా క్యారెక్టర్ని, వ్యక్తిగత ప్రవర్తనను, టాలెంట్‌ను బిల్డ్ చేసుకుంటూ ముందుకు వెళ్లాను. చాలా కాన్ఫిడెంట్‌గా ఉండేవాణ్ని. ఓకే... ‘సైరా’ చేయకముందు మీకు నచ్చిన దేశం కోసం పోరాడిన వీరుడు ఎవరు? ఇప్పుడు ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ తర్వాత మీ అభిప్రాయం? మహాత్మా గాంధీ నా ఫేవరెట్ హీరో అని ఎప్పుడూ చెబుతుంటాను. మహాత్ముడు గొప్ప స్వాతంత్య్ర సమర యోధుడు అని చదువుకున్నాం. ఆ తర్వాత హీరోయిక్‌గా అనిపించింది భగత్‌సింగ్.. ఆజాద్ చంద్రశేఖర్. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురించి తెలుసుకున్నాక ఆయనలోని తెగువ, మొండితనం, ధైర్యం ఇన్స్పైరింగ్గా అనిపించింది. ఇంత గొప్ప వీరుడు మన తెలుగు ప్రాంతంలో ఉన్నారా? అని ఆయన మీద అభిమానం పెరిగిపోయింది. ఇప్పుడు నా వీరుల జాబితాలో ఈయన యాడ్ అయ్యారు. మీ మనవళ్లు, మనవరాళ్లతో ఇలాంటి వీరుల కథలు చెబుతారా? చెప్పాను. మా పెద్ద పాప సుస్మిత అయితే ‘సైరా’లో నాలాంటి కాస్ట్యూమ్స్ చిన్నవి తయారు చేయించి వాళ్ల పిల్లలకు వేసి ఫొటోలు తీసింది. వాళ్లు నాతోటి ఫోటోలు దిగారు. మా ప్రొడక్షన్ కంపెనీలో సీఎఫ్ఓగా పని చేసిన విద్య ఉంది. తను కూడా మా ఇంటి అమ్మాయే. విద్య కొడుకు ఆర్నవ్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి సంబంధించిన ఒక ఇంగ్లీష్ బుక్ కొనేశాడు. దాని మీద నాతో ‘సైరా’ అని సంతకం చేయించుకున్నాడు. సినిమా విడుదలయ్యే ముందు నరసింహారెడ్డి గురించి మొత్తం తెలుసుకోవాలని ఆ బుక్ మొత్తం కంఠస్థ పట్టాడు కూడా. నా గ్రాండ్ చిల్డ్రన్ అందరూ నన్ను ‘భయ్యా’ అంటారు. తాతయ్యా అని ఎవరూ పిలవరు. భయ్యా అని నేను పిలవమని చెప్పలేదు (నవ్వుతూ). వాళ్లే పిలుస్తుంటారు. భయ్యా చేస్తున్న సినిమా.. ఒక వారియర్ సినిమా.. సూపర్ మేన్ సినిమా అంట చూద్దాం అని వాళ్లంతా చాలా ఆసక్తిగా ఉన్నారు. ‘సైరా’కి వాడిన నగల విషయంలో సుస్మితకు సలహా ఇచ్చింది సురేఖగారే అని విన్నాం... అవును. నయనతార, తమన్నా వాళ్లకు సుస్మిత పాత కాలం నగలను డిజైన్ చేసింది. ఆమ్రపాలి, మంగత్రాయ్ వాళ్లతో కలిసి చేసింది. వాళ్ల గురించి చెప్పింది సురేఖే. ఆ నగల్లో తమన్నా, నయనతార కుందనపుబొమ్మలా ఉన్నారు. రెగ్యులర్ సినిమాల్లో కనిపించేలా ఈ సినిమాలో ఉండరు. మీరు సురేఖగారికి కొనిపెట్టిన నగల గురించి? నేను చాలా కొనిపెట్టాను. ఈ మధ్యన హాలీడేకు వెళ్లాం. మొన్న లాస్ట్ బర్త్‌డేకు ఐదు క్యారెట్ల డైమండ్ స్టడ్స్ ఇచ్చాను. చాలా హ్యాపీ ఫీల్ అయింది. అయితే సురేఖ సింపుల్ ఉమన్. ఏదైనా కొనిపెడతానంటే నాకెందుకు? పిల్లలకు కొనిపెడదాం అంటుంది. మరి నువ్వూ అనుభవించాలి కదా అంటుంటాను. ఇక మా రోల్స్ రాయల్స్ కారు ఎక్కాలంటే నేను ఉండాల్సిందే. ‘మీరు పక్కన ఉన్నప్పుడు ఆ కారులో వెళితే గర్వంగా ఉంటుంది. నేను ఒక్కదాన్నే ఎక్కితే నాకు అస్సలు ఇష్టం ఉండదు’ అంటుంది. ఆ కారులో తను ఒక్కతే వెళ్లదు. అంత సింపుల్. నిజానికి ఇప్పుడు మీ మనవళ్లు, మనవరాళ్లతో ఆడుకున్నంత ఎక్కువగా అప్పట్లో మీ పిల్లలతో ఆడుకోలేకపోయారు. ఇప్పుడు మీ భార్య సురేఖగారి ఫీలింగ్ ఏంటి? కష్టపడి పైకి వచ్చే రోజుల్లో నిరంతరం షూటింగ్లో ఉండి, పిల్లలు ఎలా ఎదిగారో కూడా తెలియలేదు. ఈ మధ్య నేను మా గ్రాండ్ చిల్డ్రన్‌తో ఆడుకుంటున్నాను. నేల మీద వాళ్లతో దొర్లుతున్నాను. అలా వాళ్లతో ఆడుకుంటుంటే పక్కనే సురేఖ నన్ను అలా గమనిస్తూ ఉంది. ఏంటి అని కళ్లతోనే అడిగాను. ‘ఏం లేదు.. మన పిల్లలతో మీరు ఎప్పుడు ఇలా ఆడుకున్నారా? అని గుర్తు తెచ్చుకుంటున్నాను. నాకు అస్సలు గుర్తు కూడా రావడం లేదు’ అంది. అదేంటి ‘ఎప్పుడైనా హాలిడేస్ అప్పుడు కలసి సరదాగా గడిపేవాళ్లం కదా’ అన్నాను. ‘అది సంవత్సరానికి ఒక్కసారో రెండుసార్లోనే కదా. పండగలకు కూడా మీరు ఉండేవారు కాదు’ అని చెప్పింది. నాకే కాదు ప్రొఫెషనల్ లైఫ్‌లో బిజీగా ఉండే ప్రతి ఒక్కరికీ ఇది కామన్. బ్రతుకుతెరువు కోసం కష్టపడే రోజుల్లో పిల్లల ఆలనా పాలనా చూసుకునే తీరిక కూడా ఉండదు. వాళ్లు ఎప్పుడు పెరిగి పెద్దవాళ్లు అయ్యారో కూడా కళ్లారా చూసుకునే వీలుండదు. నాకు ముగ్గురు పిల్లలుంటే నేను ఇంటికి రాగానే సుస్మిత, చరణ్ నా దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చేవాళ్లు. వాళ్లను దగ్గరకు తీసుకొని ముద్దు చేసేవాణ్ని. ఆ తర్వాత మేడపైకి వెళ్లిపోతుంటే సురేఖ ‘ఏవండీ.. ఒక్క నిమిషం మీకు మూడో పాప కూడా ఉంది గుర్తుందా?’ అనేది. ‘సారీ.. సారీ’ అంటూ తన గదిలోకి వెళ్లి శ్రీజను చూసేవాణ్ని. అప్పుడు శ్రీజ నెలల పిల్ల. ఇంకా నడక రాలేదు. దగ్గరకి వచ్చిన ఇద్దరి పిల్లలను ముద్డాడి, మూడో బిడ్డ గురించి మరచిపోయేవాణ్ణి. అంతలా పని చేశాను. అంత పని చేయకపోతే 33 సంవత్సరాల నా సినీ కెరీర్లో 150 సినిమాలు చేయడానికి కుదిరేది కాదు. రోజుకి 2–3 షిఫ్ట్‌లు చేసేవాణ్ణి. 33 ఏళ్లు నాన్‌స్టాప్‌గా పని చేశాక వచ్చిన ఆ గ్యాప్ అనేది మీ ఫ్యాన్స్‌కు చాలా బాధగా ఉండి ఉంటుంది. మీకెలా అనిపించేది? బాస్ సినిమాలు రావడం లేదనే ఫీలింగ్ వాళ్లకు ఉండి ఉండొచ్చు కానీ ఆ సమయంలో నేను తీసుకున్న నిర్ణయం సబబే. నేను చేసిన సర్వీస్ నాకు తృప్తిని ఇచ్చింది. ఆ తర్వాత నేను ఉన్న కాంగ్రెస్ పార్టీయే లేకుండా పోవడం? ఎటు వెళ్లాలి? అని అగమ్యగోచరంలో ఉండటం సినిమా ఇండస్ట్రీ నన్ను వెల్కమ్ చెప్పడంతో మళ్లీ వచ్చేశాను. నన్ను ఎంతగా ప్రేమించారు అని చెప్పడానికి ‘ఖైదీ నంబర్ 150’యే నిదర్శనం. రాజకీయాలు చూశాను, సినిమా పరిశ్రమ చూశాను కానీ సినిమా పరిశ్రమలో ఉండే తృప్తిగానీ, నేను పొందిన ఆనందం కానీ రాజకీయాల్లో నాకు రాలేదు. సినిమా పరిశ్రమ చాలా గొప్పది అనే ఫీలింగ్ నాకు ఉంది. నీ సంతోషం కోసం నువ్వు సినిమాలు చేసుకుంటూ వెళుతూ నిస్వార్థంగా నిన్ను ఆదరించి, కింగ్‌లాగా చూస్తారు. డెమీగాడ్లానూ చూస్తారు. అనుభవపూర్వకంగా తెలుసుకొని చెబుతున్నాను సినిమా పరిశ్రమలాంటిది మరోటి లేదు. నెక్ట్స్ కొరటాల శివ దర్శకత్వంలో చేయబోయే సినిమా గురించి? ఆయన స్టయిల్లో ఉంటుంది. ఆయన స్టయిల్లో నేను చేయడం కొత్తగా ఉంటుంది. లుక్ పూర్తిగా సెట్ కాలేదు. త్వరలోనే కొరటాల శివగారే ప్రకటిస్తారు. ఫైనల్లీ.. ఈ ప్రొఫెషన్ మిమ్మల్ని మెగాస్టార్‌ని చేసింది. వేలమంది అభిమానులను ఇచ్చింది. అదే వృత్తి మిమ్మల్ని కడుపు నిండా భోజనం చేయనివ్వలేదు, కంటి నిండా నిద్రపోనివ్వలేదు...వేళకు తినాలని, కడుపు నిండా తినాలని మన శరీరానికి ఆకలి ఎలా ఉంటుందో మన ఆత్మకి కూడా ఒక ఆకలి ఉంటుంది. ఆ సోల్‌కి కావాల్సింది దొరికితే ఫిజికల్ హంగ్రీ అనేది అసలు సమస్యే కాదు. అభిమానులు, ప్రేక్షకుల ప్రేమాభిమానాలతో నా సోల్ నిండుగా, సంపూర్ణంగా ఉంది. అందుకని ‘డైట్’ చేస్తున్నా ఏమీ అనిపించడంలేదు. ‘ఐయామ్ హ్యాపీ’. ‘సైరా’ సినిమా ఎందుకు చూడాలి అంటే తెలియని చరిత్ర కోసం చూడాలి. యువతను ప్రభావితం చేసేలా నరసింహారెడ్డి కథను చూపించగలిగారా? సురేందర్ రెడ్డిని ఈ సినిమాకి డైరెక్టర్‌గా అడిగినప్పుడు కొంచెం టైమ్ కావాలన్నాడు. తర్వాత కొన్ని రోజులు టచ్‌లో లేకపోవడంతో ‘చేయకూడదనుకుంటున్నాడా?’ అనిపించింది. అయితే కథతో సహా వచ్చాడు. చాలా అద్భుతంగా అనిపించింది. నరసింహారెడ్డి కథను తను తీసిన విధానం చూసేవారిని ప్రభావితం చేస్తుంది. ఈ సినిమాలో చిరంజీవిని చూడరు. ఒక పాత్రను చూస్తారు. సినిమాలో ఏం కోరుకుంటారో అవన్నీ ఉండటంతో పాటు ఒక మెసేజ్ ఉంటుంది. చాలామందిలో దేశభక్తి క్షీణిస్తున్న ఈ తరుణంలో మన పూర్వీకులు ఎంత సఫర్ అయ్యారు? బానిస బతుకు బతికి ఎన్ని కష్టాలు పడ్డారు వాళ్లందరి ప్రాణత్యాగాల ఫలమే మన స్వాతంత్య్రం అన్నది తెలుసుకోవాలి. వాళ్లందరినీ తలచుకోవాలి. గొప్పగా వాళ్లను స్మరించుకోగలిగితే అదే మనం వాళ్లందరికీ ఇచ్చే నివాళి. అలాంటి ఫీలింగ్ కలగాలంటే సినిమాను మించిన పవర్ఫుల్ మీడియమ్ లేదని అనుకుంటా. యువతరం చూడాల్సిన సినిమా. మీరు పిల్లల్ని బాగా ప్రేమిస్తారు. అసలు కన్నా కొసరు ముద్దు అన్నట్లు గ్రాండ్ చిల్డ్రన్ని గ్రాండ్‌గా చూసుకుంటారు కదా... గత నాలుగు రోజులుగా ‘సైరా’ ప్రమోషన్స్ చేస్తూ ఇంట్లో ఉండటం లేదు. మా చిన్నమ్మాయి శ్రీజ చిన్న కూతురికి పది నెలలు. ప్రమోషన్స్ అయి, ఇంటికి వెళ్లగానే కేకలు పెట్టేసింది. నన్ను చూసి పాప ఒకటే హుషారుగా ఆడుకోవడం మొదలుపెట్టింది. ఎత్తుకున్న తర్వాత కొనుక్కున్న కొత్త బొమ్మలను చూపించింది. అంతే.. నాలుగు రోజుల అలసట జస్ట్ అరగంటలో దూరం అయిపోయింది. పిల్లలు మన స్ట్రెస్‌ని అంతా ఇట్టే తగ్గించేస్తారు. అందుకే ‘ఐ లవ్ చిల్డ్రన్’. చిరంజీవి తనయుడు రామ్‌చరణ్, మనవరాళ్లు నివృతి, సమారా, సంహిత, మనవడు ఆర్నవ్ ‘మగధీర’ చూసి ఇలాంటి సినిమా చేయలేకపోయానన్నందుకు చరణ్ మీతో ‘సైరా’ తీశారు. ఈ సినిమా చేసినందుకు మీ భార్య సురేఖ ఏమన్నారు? ఇవాళ (సోమవారం) ఉదయం సురేఖ ఓ మాట అంది. ఈ సినిమా కొన్ని చోట్ల మేమే సొంతంగా రిలీజ్ చేస్తున్నాం. కొన్ని చోట్ల మంచి బిజినెస్ అయింది. ‘మనం డబ్బుల గురించి చూడకూడదు. డబ్బు వస్తుందో రాదో తెలియదు కానీ లైఫ్ టైమ్‌లో మీకు గొప్ప పాత్ర ఇది. ఆ తృప్తిని డబ్బుతో కొలవలేం. మీ కోరిక తీర్చాలని రామ్ చరణ్ ఈ సినిమా చేశాడు. ఆ విధంగా వాడు సంతృప్తిగా ఉంటాడు. గొప్ప పాత్ర చేశాను అనే మీ కోరిక నెరవేరింది. నేను మీతో సినిమా చేయాలనే నా కోరిక నెరవేరింది (సురేఖ సమర్పణలో ‘సైరా’ రూపొందింది)’ అని చెప్పింది. అలా ‘సైరా’ విషయంలో ఇంటిల్లిపాదీ ఆనందంగా ఉన్నాం. నటుడిగా శరీరానికి విపరీతమైన కష్టాన్ని ఇచ్చేశాం. కొంచెం సుఖపెట్టి ఉండుంటే బావుండేది అని ఎప్పుడైనా అనిపించిందా? అస్సలు అనిపించలేదు. నాకు సుఖం అంటేనే ఇష్టం ఉండదు. ఖాళీగా ఉంటే రెస్ట్‌లెస్ అయిపోతాను. ఉదాహరణకు రాజకీయాల్లో ఉన్నప్పుడు ఒక రకంగా ఉండేది. కమ్ బ్యాక్ మూవీ ‘ఖైదీ నంబర్ 150’కి మార్నింగ్ 7 అంటే 7, 9 అంటే 9కి మేకప్‌తో రెడీగా ఉండేవాణ్ని. చాలా హ్యాపీగా ఉండేది. ‘పని చేస్తేనే, షూటింగ్‌కి వెళ్తేనే మీరు హ్యాపీగా, హుషారుగా ఉంటారు. ఖాళీగా ఉంటే మాత్రం ఏంటోలా అయిపోతారు’ అని సురేఖ అంటుంది. -
అభినేత్రికి అభినందనలు
‘మహానటి’కి జాతీయ ఉత్తమ నటి అవార్డు అందుకున్న ఆనందంలో ఉన్నారు కీర్తీ సురేశ్. అందాల అభినేత్రి సావిత్రి పాత్రలో కీర్తి అద్భుతంగా ఒదిగిపోయారని ప్రత్యేకంగా చెప్పొచ్చు. అందుకే ఈ తరం అభినేత్రి అని ఆమెను చాలామంది కీర్తిస్తున్నారు. అందరి అభినందనలతో ఉత్సాహంగా ఉన్నారు కీర్తి. ఇటీవల చిరంజీవి కూడా తన అభినందనలతో పాటు కీర్తీ సురేశ్‌కు ఆశీస్సులు అందించారు. సైమా అవార్డ్స్ ఫంక్షన్‌కి అతిథిగా చిరంజీవి హాజరయ్యారు. సావిత్రిలా డ్రెస్ చేసుకుని కీర్తీ సురేశ్ ఈ అవార్డు వేడుకకు హాజరయ్యారు. అక్కడ చిరంజీవి అభినందనలు అందుకుంటున్న సమయంలో క్లిక్‌మన్న ఫోటో ఆకట్టుకునే విధంగా ఉంది. ‘సైరా’కు వాయిస్ ఓవర్ చిరంజీవి నటించిన లేటెస్ట్ చిత్రం ‘సైరా: నరసింహారెడ్డి’. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. రామ్‌చరణ్ నిర్మించారు. ఈ సినిమా టీజర్ ఆగస్ట్ 20న రిలీజ్ కానుంది. ఈ టీజర్‌కు పవన్ కల్యాణ్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. ‘‘టీజర్‌కు వాయిస్ ఓవర్ అందించినందుకు థ్యాంక్యూ కల్యాణ్ బాబాయ్’’ అని రామ్‌చరణ్ పేర్కొన్నారు.