
ఫస్ట్ హాఫ్ ఆయనకు నచ్చేసింది!
మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రానికి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నారని అధికారిక ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే.
మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రానికి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నారని అధికారిక ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే. అయితే గత రెండు, మూడు రోజులుగా ఈ చిత్రానికి వేరే దర్శకుణ్ణి తీసుకున్నారని ఫిలింనగర్‌లో ఓ చర్చ జరుగుతోంది. ఈ చర్చకు ఒక్క ట్వీట్‌తో పుల్‌స్టాప్ పెట్టేశారు పూరి జగన్నాథ్. ‘‘చిరంజీవిగారికి ఈ చిత్రానికి సంబంధించిన కథ తాలూకు ఫస్ట్ హాఫ్ చెప్పాను.
ఆయనకు బాగా నచ్చేసింది. ఇప్పుడు సెకండ్ హాఫ్ కోసం వర్క్ చేయాలి. ఇది పది రెట్లు బాగుండేలా తయారు చేస్తా’’ అని ట్విట్టర్ ద్వారా తెలియజేశారు పూరి.