
నగరంపాలెం(గుంటూరు) : డాక్టరు చిరంజీవి జీవిత ప్రస్థానాన్ని ఆదర్శంగా తీసుకొని సినీ పరిశ్రమలో ఎంతో మంది వర్థమాన నటులు రాణిస్తున్నారని ప్రముఖ గాయని గీతమాధురి అన్నారు. జిల్లా చిరంజీవి యువత ఆధ్యక్షుడు ఆళ్ల హరి ఆధ్వర్యంలో మంగళవారం ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరైన ఆమెను నగరంలోని శ్రీనివాసరావుతోట కల్యాణ మండపంలో సన్మానించారు. చిరంజీవి అభిమానులు ప్రజలకు సేవలందించడంలో ఎప్పుడూ ముందుటారన్నారు.
రక్తదానం వంటి మహోన్నతమైన సేవలో ఎంతో మంది ప్రాణాలు కాపాడిన ఘనత చిరంజీవి అభిమానులదే అన్నారు. అనంతరం ఆమెను శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో చందు, షంషేర్, కామేష్, సాయి, లోకేష్, ఉదయ్, పసుపులేటి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment