
క్రాక్ సినిమా బ్లాక్‌బస్టర్‌తో మాస్ మహరాజా రవితేజ మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. దాన్ని అలానే కొనసాగించాలనే ప్రయత్నంతో వరుసగా ప్రాజెక్టులు చేస్తున్నాడు రవి. ప్రస్తుతం ఈ వరుసలో.. ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీ, ధమాకా, రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు అనే చిత్రాలు ఉండగా, ఇటీవల చిరు సినిమాలో నటించే ఆఫర్ కూడా అందుకున్నాడని సమాచారం. ప్రస్తుతం ఈ వార్త టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది.
మెగా స్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. అందులో ఓ కీలక పాత్ర రవితేజ చేయాలని దర్శకుడా బాబీ అడిగారంట..ఓ వైపు మెగాస్టార్ చిరు సినిమా.. మరో వైపు బాబీతో సాన్నిహిత్యం కారణంగా రవితేజ్ వెంటనే ఓకే అన్నాడట. అయితే ఆ పాత్ర కోసం రవితేజ 7 కోట్లు తీసుకోబోతున్నాడని, నిర్మాతలు కూడా అంత మొత్తం ఇచ్చేందుకు అంగీకరించినట్లు టాలీవుడ్‌లో టాక్.
ఇప్పటికే చిరంజీవి అన్నయ్య సినిమాలో రవితేజ , వెంకట్ లు తమ్ముళ్లుగా నటించారు. ఆ సినిమా బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత చిరుతో రవితేజ జతకడితే.. సినిమాకు ఓ రేంజ్‌లో హైప్ రావడం ఖాయం. అయితే దీనికి సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.
చదవండి: Vijay Sethupathi: విజయ్ సేతుపతిపై క్రిమినల్ కేసు.. ఎందుకంటే ?
Comments
Please login to add a commentAdd a comment