మాస్ మహారాజా రవితేజ కెరీర్ పరంగా ఫుల్ జోష్‌లో ఉన్నాడు. ‘క్రాక్’ తర్వాత ఏకంగా ఐదు సినిమాలు ప్రకటించి అందరిని ఆశ్చర్యపరిచాడు. వాటిలో రెండు సినిమాలు షూటింగ్ ఆల్ మోస్ట్ కంప్లీట్ అయ్యాయి. రమేశ్ వర్మ దర్శకత్వం వహించిన ఖిలాడి మూవీ ఫిబ్రవరి 11న విడుదల కాబోతుంది. ఈ మూవీతో మాస్ మహారాజా బాలీవుడ్‌కి కూడా పరిచయం కాబోతున్నాడు.
ఇక శరత్ మండవ తెరకెక్కిస్తున్న ‘రామారావు ఆన్ డ్యూటీ’సినిమా షూటింగ్ ఎండింగ్ దశకు చేరుకుంది. స్పెషల్ యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రవితేజ ప్రభుత్వ అధికారి పాత్రలో నటిస్తున్నారు. మరో హీరో వేణు తొట్టెంపూడి ఈ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్‌ని స్టార్ట్ చేయబోతున్నాడు.
ఈ సినిమా తర్వాత మాస్ మహారాజా.. సుధీర్ వర్మ దర్శకత్వంలో ‘రావణాసుర’మూవీ చేయనున్నాడు. రవితేజ 70వ చిత్రమిది. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రవితేజ న్యాయవాదిగా కనిపించనున్నాడు. సుశాంత్ కీలక పాత్ర పోషిస్తున్నారు.
ఇక వీటితో పాటు సెట్‌పైకి వెళ్లిన రవితేజ మరో చిత్రం ‘ధమాకా’.డబుల్ ఇంపాక్ట్ అంటూ ఇంట్రెస్టింగ్ ట్యాగ్ లైన్‌తో ఈ మూవీ రూపొందుతోంది. మాస్ కథలకి, పాత్రలకు పెట్టింది పేరైన రవితేజ ఈ చిత్రాల్లోనూ అదే తరహాలో సందడి చేయనున్నట్లు ఇటీవల విడుదలైన పోస్టర్లను బట్టి తెలుస్తోంది.
ఈ నాలుగు చిత్రాలు సెట్స్‌పై ఉండగానే.. తన 71వ చిత్రానికి ‘టైగర్ నాగేశ్వరరావు’టైటిల్ ప్రకటించాడు రవితేజ. స్టూవర్టుపురంలో పేరుమోసిన గజదొంగ అయిన ‘టైగర్ నాగేశ్వరరావు’బయోపిక్ ఇది. రవితేజ కెరీర్‌లో అత్యంత భారీగా, పాన్ ఇండియా స్థాయిలో రూపొందబోతుంది. తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో ‘టైగర్ నాగేశ్వరరావు’ విడుదల కానుంది. విటితో పాటు చిరంజీవి హీరోగా నటిస్తున్న వాల్తేరు వీరయ్య మూవీలో ఓ కీలక పాత్రలో నటించబోతున్నాడు రవితేజ. ఇలా వరుస సినిమాలతో ఈ ఏడాదంతా ఫుల్ బిజీగా ఉన్న రవితేజ.. దాదాపు రూ. 300 కోట్ల మేర బిజినెస్ చేయబోతున్నాడని టాలీవుడ్‌లో చర్చ జరుగుతోంది. అంతేకాదు ఒక్కో సినిమాకు రూ.12 కోట్ల చొప్పున.. ఆరు సినిమాలకు గాను ఏకంగా రూ. 72 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి ‘క్రాక్’తర్వాత రవితేజ కెరీర్‌మూడు పూలు ఆరుకాయలు అనేంతలా మారిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment