ఆచార్య కోసం ఆలయం | Acharya Movie Regular Shooting Starts From August | Sakshi
Sakshi News home page

ఆచార్య కోసం ఆలయం

Published Wed, Jul 22 2020 3:07 AM | Last Updated on Wed, Jul 22 2020 8:49 AM

Acharya Movie Regular Shooting Starts From August - Sakshi

‘ఖైదీ నంబర్‌ 150, సైరా నరసింహారెడ్డి’ వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత చిరంజీవి హీరోగా నటిస్తున్న 152వ చిత్రం ‘ఆచార్య’. కొరటాల శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై రామ్‌చరణ్, నిరంజన్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కాజల్‌ అగర్వాల్‌ కథానాయిక. ఇప్పటికే సుమారు 40 శాతం చిత్రీకరణ పూర్తయింది. అయితే లాక్‌డౌక్‌ వల్ల షూటింగ్‌ ఆగిపోయింది. కాగా ఆగస్టు నుంచి ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ను ప్రారంభించే ఆలోచనలో ఉన్నారట చిత్రబృందం. ఈ సినిమాలో చిరంజీవి ద్విపాత్రాభినయం చేయనున్నారని టాక్‌. ఒకటి దేవాదాయ, ధర్మాదాయ శాఖ అధికారి పాత్ర‡అని సమాచారం. ఈ పాత్రకు సంబంధించిన కీలక సన్నివేశాల చిత్రీకరణ కోసం గుడి సెట్‌ తయారు చేయిస్తున్నారట. హైదరాబాద్‌ నగర శివారులో ప్రత్యేకంగా ఒక దేవాలయం సెట్‌ను రూపొందిస్తున్నారని టాక్‌. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement