
రెడీ.. గెట్.. సెట్.. గో!
స్టార్ట్.. కెమెరా.. యాక్షన్.. అని చెప్పగానే క్యారెక్టర్‌లో ఒదిగి నటించడం మెగాస్టార్ చిరంజీవికి కొత్తేమీ కాదు.
స్టార్ట్.. కెమెరా.. యాక్షన్.. అని చెప్పగానే క్యారెక్టర్‌లో ఒదిగి నటించడం మెగాస్టార్ చిరంజీవికి కొత్తేమీ కాదు. వంద సినిమాలకు పైగా నటించిన అనుభవం ఆయనది. చిరంజీవి కెమెరా ముందు నిలబడిన తర్వాత యాక్షన్.. అని చెప్పడం దర్శకుడు వీవీ వినాయక్‌కూ కొత్త కాదు. ఆల్రెడీ చిరూని ‘ఠాగూర్’గా చూపించారు.
కానీ, ఈసారి వినాయక్ ఎప్పుడు యాక్షన్ చెబుతారా? హీరోగా చిరు మేకప్ వేసుకుని కెమెరా ముందుకు ఎప్పుడు వస్తారా? అని మెగా అభిమానులు ఎన్నాళ్ల నుంచో ఎదురు చూస్తున్నారు. ఆ సమయం వచ్చేసింది. సుమారు తొమ్మిదేళ్ల విరామం తర్వాత చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న సినిమా చిత్రీకరణ ఈరోజు (గురువారం) మొదలవుతోంది. హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్టూడియోలో ఈ సినిమా కోసం ప్రత్యేకంగా సెట్ వేశారు.
ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో విజయ్ హీరోగా నటించిన తమిళ సినిమా ‘కత్తి’కి ఇది రీమేక్ అనే విషయం తెలిసిందే. తెలుగు నేటివిటీకి అనుగుణంగా కథలో మార్పులు చేశారు. చిరంజీవి సతీమణి సురేఖ, తనయుడు రామ్‌చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. రాబోయే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు సినిమాని తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.