Do You Know Who Child Artist Mithun Acted in Acharya Movie - Sakshi
Sakshi News home page

Acharya Movie: ‘ఆచార్య’లో నటించిన ఈ బాలుడు ఎవరో తెలుసా!

Published Fri, Apr 29 2022 6:24 PM | Last Updated on Fri, Apr 29 2022 7:00 PM

Megastar Chiranjeevi Acharya Child Artist Belongs Mandamarri Telangana - Sakshi

సాక్షి,మందమర్రిరూరల్‌: మెగాస్టార్‌ చిరంజీవి, రామ్‌చరణ్‌ నటించిన ఆచార్య సినిమాలో మందమర్రికి చెందిన బాలుడు మిథున్‌కు నటించే అవకాశం లభించింది. మందమర్రికి చెందిన డాక్టర్‌ భీమనాథుని సదానందం కుమారుడు శ్రీధర్, సరిత దంపతుల కుమారుడు మిథున్‌ శ్రేయాష్‌ హైదరాబాద్‌లోని రామంతాపూర్‌లో ఉంటున్నారు. మిథున్‌ సెయింట్‌ జోసెఫ్‌ హైస్కూల్‌లో ఐదో తరగతి చదువుతున్నాడు.

ఆచార్య సినిమాలో చైల్డ్‌ ఆర్టిస్ట్‌ కోసం వెతుకగా శ్రీధర్‌ మిత్రుడు విజయ్‌కుమార్‌కు తెలిసిన వారి ద్వారా సినిమా వాళ్లకి పరిచయం చేశారు. ఆడిషన్‌లో డైలాగ్‌లు బాగా చెప్పడంతో ఎంపిక చేసుకున్నారు. రాజమండ్రి మారెడుమల్లె, కోకాపేట ఏరియాలో జరిగిన షూటింగ్‌లో పాల్గొన్నాడు. ఆచార్య సినిమా శుక్రవారం రిలీజ్‌ కానుంది. చిరంజీవి సినిమాలో తమ మనవడు నటించడం సంతోషంగా ఉందని డాక్టర్‌ సదానందం తెలిపాడు. పట్టణంలోని ప్రైవేట్‌ వైద్యుల సంఘం ఆధ్వర్యంలో బాలుడిని అభినందించారు.

చదవండి: Acharya Movie Review: సాక్షి ఆడియన్స్‌ పోల్‌.. 'ఆచార్య'పై ప్రేక్షకుల రివ్యూ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement