అభినేత్రికి అభినందనలు | Keerthy Suresh Takes Megastar Blessings | Sakshi
Sakshi News home page

అభినేత్రికి అభినందనలు

Published Sat, Aug 17 2019 12:35 AM | Last Updated on Sat, Aug 17 2019 12:35 AM

Keerthy Suresh Takes Megastar Blessings - Sakshi

కీర్తీ సురేశ్‌, చిరంజీవి

‘మహానటి’కి జాతీయ ఉత్తమ నటి అవార్డు అందుకున్న ఆనందంలో ఉన్నారు కీర్తీ సురేశ్‌. అందాల అభినేత్రి సావిత్రి పాత్రలో కీర్తి అద్భుతంగా ఒదిగిపోయారని ప్రత్యేకంగా చెప్పొచ్చు. అందుకే ఈ తరం అభినేత్రి అని ఆమెను చాలామంది కీర్తిస్తున్నారు. అందరి అభినందనలతో ఉత్సాహంగా ఉన్నారు కీర్తి. ఇటీవల చిరంజీవి కూడా తన అభినందనలతో పాటు కీర్తీ సురేశ్‌కు ఆశీస్సులు అందించారు. సైమా అవార్డ్స్‌ ఫంక్షన్‌కి అతిథిగా చిరంజీవి హాజరయ్యారు. సావిత్రిలా డ్రెస్‌ చేసుకుని కీర్తీ సురేశ్‌ ఈ అవార్డు వేడుకకు హాజరయ్యారు. అక్కడ చిరంజీవి అభినందనలు అందుకుంటున్న సమయంలో క్లిక్‌మన్న ఫోటో ఆకట్టుకునే విధంగా ఉంది.

‘సైరా’కు వాయిస్‌ ఓవర్‌
చిరంజీవి నటించిన లేటెస్ట్‌ చిత్రం ‘సైరా: నరసింహారెడ్డి’. సురేందర్‌ రెడ్డి దర్శకత్వం వహించారు. రామ్‌చరణ్‌ నిర్మించారు. ఈ సినిమా టీజర్‌ ఆగస్ట్‌ 20న రిలీజ్‌ కానుంది. ఈ టీజర్‌కు పవన్‌ కల్యాణ్‌ వాయిస్‌ ఓవర్‌ ఇచ్చారు. ‘‘టీజర్‌కు వాయిస్‌ ఓవర్‌ అందించినందుకు థ్యాంక్యూ కల్యాణ్‌ బాబాయ్‌’’ అని రామ్‌చరణ్‌ పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement