
మెగా స్టార్ చిరంజీవి, రామ్ చరణ్, హాజరయ్యారు, అంత్యక్రియలు, కామారెడ్డి జిల్లా
దోమకొండ: దోమకొండ సంస్థాన వారసుడు, రిటైర్డు ఐఏఎస్ అధికారి కామినేని ఉమాపతిరావు(92) అంత్యక్రియలను ఆదివారం కామారెడ్డి జిల్లా దోమకొండలోని లక్ష్మీబాగ్‌లో నిర్వహించారు. ఆయన మే 27న హైదరాబాద్‌లో మరణించిన విషయం తెలిసిందే. ప్రముఖ సినీ హీరో చిరంజీవితో పాటు ఆయన తనయుడు రామ్‌చరణ్, ఇతర కుటుంబ సభ్యులు, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కుటుంబ సభ్యులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. చిరంజీవి, రామ్‌చరణ్‌లు పాడెను మోశారు. ఉమాపతిరావు కుమారుడు, చిరంజీవి వియ్యంకుడు అయిన అనిల్‌కుమార్ చితికి నిప్పు పెట్టారు. దోమకొండ కోట నుంచి ఉమాపతిరావు భౌతిక కాయాన్ని అంత్యక్రియల కోసం తరలించే సమయంలో ఒక్కసారిగా తేనెటీగలు అక్కడున్నవారిని చుట్టుముట్టాయి. చిరంజీవి ఉన్న ప్రాంతానికి తేనెటీగలు రావడాన్ని గమనించిన ఆయన భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమై టవల్‌తో వాటిని పారదోలుతూ ఆయనను అక్కడి నుంచి లోపలకు తీసుకువెళ్లారు. మిగతావారు సురక్షిత ప్రదేశాలకు పరుగులు తీశారు.
పాడె మోస్తున్న చిరంజీవి, రాంచరణ్ తేజ