attended
-
ఖండాంతరాలు దాటిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు (ఫొటోలు)
-
నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం జగన్
-
జనాభాను పెంచేందుకు సిక్కింలో ప్రభుత్వోద్యోగినులకు వరాలు
గాంగ్టాక్: సిక్కిం రాష్ట్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు సీఎం ప్రేమ్ సింగ్ తమంగ్ పలు ప్రోత్సాహకాలను ప్రకటించారు. వారి చిన్నారులకు ఇంటి వద్దే సహాయకులను ఉచితంగా ఏర్పాటు చేస్తామని తెలిపారు. చిన్నారుల బాధ్యత తీసుకునే ఆయాలకు నెలకు రూ.10 వేలను ప్రభుత్వమే ఇస్తుందన్నారు. 40 ఏళ్లు, ఆపైన వయస్సుండే మహిళలకు చిన్నారులను ఏడాది వరకు చూసుకునే బాధ్యతలను అప్పగిస్తామన్నారు. మహిళా ఉద్యోగుల ప్రసూతి సెలవులను 365 రోజులకు, తండ్రులకైతే నెల రోజులు సెలవులు ఇస్తామని చెప్పారు. రెండో బిడ్డను పోషించేందుకు ఒక ఇంక్రిమెంట్, మూడో బిడ్డకైతే రెండు ఇంక్రిమెంట్లు ఇస్తామన్నారు. తరిగిపోతున్న జననాల రేటు చాలా ఆందోళన కలిగించే అంశమన్నారు. క్షీణిస్తున్న స్థానిక జాతుల జనాభాను పెంచేందుకు ప్రభుత్వం సాధ్యమైన అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. తల్లులవ్వాలనుకునే ఉద్యోగినులు పుట్టబోయే తమ సంతానం బాగోగుల గురించి ఆందోళన చెందరాదనే ఈ నిర్ణయాలు తీసుకుంటున్నామన్నారు. జననాల రేటు పెంచేందుకు సాధారణ ప్రజానీకానికి కూడా ప్రోత్సహకాలు ప్రకటించనున్నట్లు ఆయన వెల్లడించారు. సంతానం కలగడంలో ఇబ్బందులు ఎదురయ్యే వారి కోసం ఐవీఎఫ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ కేంద్రాల్లో చికిత్స తీసుకునే వారికి రూ. 3 లక్షలు గ్రాంటుగా అందజేస్తామన్నారు. సిక్కింలోని 7 లక్షల లోపు జనాభాలో 80 శాతం మంది స్థానిక తెగల ప్రజలే. సంతానోత్పత్తి రేటు 1.1%గా ఉంది. -
మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు మనవడి వివాహ రిసెప్షన్ కు హాజరైన సీఎం జగన్
-
ముగిసిన కృష్ణా రివర్ మేనేజ్మెంట్ కమిటీ సమావేశం
-
కలెక్టర్ కార్యాలయంలో విచారణకు హాజరైన కరాటే కల్యాణి
-
ఉమాపతిరావు అంత్యక్రియలు పూర్తి
దోమకొండ: దోమకొండ సంస్థాన వారసుడు, రిటైర్డు ఐఏఎస్ అధికారి కామినేని ఉమాపతిరావు(92) అంత్యక్రియలను ఆదివారం కామారెడ్డి జిల్లా దోమకొండలోని లక్ష్మీబాగ్‌లో నిర్వహించారు. ఆయన మే 27న హైదరాబాద్‌లో మరణించిన విషయం తెలిసిందే. ప్రముఖ సినీ హీరో చిరంజీవితో పాటు ఆయన తనయుడు రామ్‌చరణ్, ఇతర కుటుంబ సభ్యులు, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కుటుంబ సభ్యులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. చిరంజీవి, రామ్‌చరణ్‌లు పాడెను మోశారు. ఉమాపతిరావు కుమారుడు, చిరంజీవి వియ్యంకుడు అయిన అనిల్‌కుమార్ చితికి నిప్పు పెట్టారు. దోమకొండ కోట నుంచి ఉమాపతిరావు భౌతిక కాయాన్ని అంత్యక్రియల కోసం తరలించే సమయంలో ఒక్కసారిగా తేనెటీగలు అక్కడున్నవారిని చుట్టుముట్టాయి. చిరంజీవి ఉన్న ప్రాంతానికి తేనెటీగలు రావడాన్ని గమనించిన ఆయన భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమై టవల్‌తో వాటిని పారదోలుతూ ఆయనను అక్కడి నుంచి లోపలకు తీసుకువెళ్లారు. మిగతావారు సురక్షిత ప్రదేశాలకు పరుగులు తీశారు. పాడె మోస్తున్న చిరంజీవి, రాంచరణ్ తేజ -
స్వయంగా పరీక్ష రాసిన వీణావాణీలు
వెంగళరావునగర్: విధి పరీక్షను చిర్నవ్వుతో ఎదుర్కొంటూనే పాఠాలు నేర్చుకున్న అవిభక్త కవలలైన వీణావాణీలు గురువారం రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన టెన్త్ పరీక్షలకు హాజరై తమ ఆత్మస్థైర్యాన్ని చాటి తమలాంటి మరెందరికో స్ఫూర్తినిచ్చారు. స్టేట్‌హోంలోని బాలసదన్ నుంచి జూబ్లీహిల్స్ నియోజకవర్గం వెంగళరావునగర్ డివిజన్ పరిధిలోని మధురానగర్‌కాలనీలో ఉన్న ప్రతిభా హైస్కూల్లోని పరీక్షా కేంద్రానికి ఉదయం 8.45 గంటలకు ప్రత్యేక అంబులెన్స్ ద్వారా వీరిని తీసుకొచ్చారు. బాలసదన్ ఇన్చార్జి సఫియా బేగంతో పాటు మరో సహాయకురాలు వీరితో పాటు వెంటవచ్చారు. పరీక్ష రాసేందుకు వీరిద్దరికీ రాష్ట్ర ప్రభుత్వం స్క్రైబర్స్‌ను ఏర్పాటు చేసినప్పటికీ వారిద్వారా పరీక్ష రాసేందుకు వీణావాణీలు తిరస్కరించారు. దీంతో వీణావాణీలు స్వయంగానే తెలుగు పరీక్షను రాశారు. నంబర్లు కన్పించక కొద్దిసేపు అయోమయం కాగా, పరీక్షలు రాయడానికి ఏర్పాటు చేసిన గదులు, విద్యార్థుల హాల్‌టికెట్ల నంబర్లతో అంటించిన నోటీసు బోర్డులో వీణావాణీల హాల్ టికెట్ నంబర్లు లేకపోవడంతో కొద్దిసేపు అయోమయ పరిస్థితి నెలకొంది. ప్రతిభా హైస్కూల్లో 11 గదులను (2022188183 నుంచి 2022188402 వరకు) ఏర్పాటు చేశారు. అయితే వీణావాణీల నంబర్ మాత్రం 2022188403/404గా ఉన్నాయి. వారికి ప్రత్యేక గదిని ఏర్పాటు చేయడంతో నోటీసుబోర్డులో అంటించలేదని స్కూల్ నిర్వాహకులు చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు. -
విధులకు 7 నెలల గర్భిణి
మంథని: పెద్దపల్లి జిల్లా మంథని డిపోకు చెందిన ఏడు నెలల గర్భిణి అయిన కండక్టర్ సుమలత శుక్రవారం విధులకు హాజరయ్యారు. 55 రోజుల సమ్మె, సెప్టెంబరు నెల వేతనం లేకపోవడం, కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో తాను విధులకు హాజరైనట్లు సుమలత తెలిపారు. కాగా, మంథనికి చెందిన స్థానికుడు మారుపాక సత్యనారాయణ.. సుమలతకు రూ.5 వేల నగదు, పండ్లు, బట్టలు అందించారు -
పల్లెల నుంచే ఆవిష్కరణలు
సాక్షి, హైదరాబాద్:ఆవిష్కరణలు నగరాలు కేంద్రంగా జరగవని, ఎక్కడో మారుమూల ప్రాంతా ల నుంచే వస్తాయని ఐటీ మంత్రి కేటీఆర్ అన్నారు. నూతన ఆవిష్కరణలతో వస్తే.. పరిశ్రమలకు తాము సకల సదుపాయాలు కల్పిస్తామన్నారు. ఉ న్నత విద్యను పరిశ్రమలతో అనుసంధానిస్తే.. ఉత్పత్తి రంగంలో నైపుణ్యమున్న మానవ వనరు లు సృష్టించి, నూతన ఆవిష్కరణలకు బీజం వేసిన వారిమవుతామన్నారు. శుక్రవారం మాదాపూర్‌లో ని హెచ్ఐసీసీలో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఇండస్ట్రీ అవార్డ్స్ –2019’కార్యక్రమానికి కె.తారకరామారావు ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ‘గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి బహుమతులు గెలుచుకున్న ఆవిష్కరణలకు శుభాకాంక్షలు. ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టిన సీఐఐకి కృతజ్ఞతలు.. తె లంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోంది. రాష్ట్రప్రభుత్వం ప్రారంభించిన టీఎస్ ఐపాస్‌కు వచ్చే నవంబర్‌లో ఐదేళ్లు పూర్తవనున్నాయి. ఇప్పటికే ఐపాస్ ద్వారా 11 వేల పరిశ్రమలకు అనుమతులిచ్చాం. రూ.1.70 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించి 13 లక్షల ప్రత్యక్ష ఉద్యోగాలు కల్పించగలిగాం. ఈ ఒరవడి ఇలాగే కొనసాగాలని ఆకాంక్షిస్తున్నా. రాష్ట్రం 14.9 వృద్ధిరేటు (జీఎస్డీపీ)తో ముందుకు సాగుతుండటం ఆనందకరం. లైఫ్‌సైన్సెస్, ఐటీ, ఏరోస్పేస్, రక్షణ తదితర ఉత్పత్తుల రంగాలకు తెలంగాణ..ప్రత్యేకించి హైదరాబాద్ కేంద్రంగా మారిన విషయం తెలిసిందే. ఆవిష్కరణలంటే హైదరాబాద్ లాంటి నగరాల నుంచే వస్తారని అనుకోను. మారుమూల ప్రాంతాలనుం చి చక్కటి ఆవిష్కరణలు వస్తుండటమే ఇందుకు ని దర్శనం. మహబూబ్‌నగర్‌లోని మారుమూల ప్రాంతమైన ఐజ, ఆసిఫాబాద్ జిల్లా సరిహద్దులోని తిర్యానీ, కరీంనగర్ నుంచి ఉన్నారు..’అని చెప్పారు. కేంద్రం తరహాలోనే ప్రోత్సాహం.. కేంద్ర ప్రభుత్వం స్టార్టప్‌లను ప్రోత్సహించిన తరహాలోనే తెలంగాణ కూడా ప్రోత్సహిస్తోందని కేటీఆర్ అన్నారు. ‘మీకు అత్యంత అద్భుతమైన వేదిక కల్పిస్తున్నాం. అన్నిరకాల చేయూతనందిస్తున్నాం. ఎన్నో సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. అద్భుతమైన ఆవిష్కరణలతోనే యువ ఎంటర్ప్రెన్యూర్లు వీటిని అందిపుచ్చుకోవాలి. అమెరికా–చైనాల మధ్య వాణిజ్య యుద్ధం జరుగుతున్న ఈ సమయంలో వినూత్న పారిశ్రామిక ఆవిష్కరణల తో ప్రపంచదేశాలను ఆకర్షించేందుకు కృషి చేయాలి. తెలంగాణ పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి స్వర్గధామం. తెలంగాణలో మైక్రో మ్యాక్స్ మూడే ళ్ల కిందపని ప్రారంభించి పలువురికి ఉపాధి అవకాశాలు కల్పించింది. ఫ్రెంచ్కు చెందిన ఏరోస్పేస్ కంపెనీ సాఫ్రన్ తెలంగాణలో పారిశ్రామిక విధా నం నచ్చి పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. ప్రభుత్వం వద్ద పరిమిత ఉపాధి వనరులున్నాయి. ప్రభుత్వం–పారిశ్రామికరంగం కలిస్తే.. కొత్త ఉద్యోగావకాశాలు సృష్టించగలం. టాస్క్ ద్వా రా యువతకు వివిధ రంగాల్లో నైపుణ్యం సాధించేందుకు శిక్షణ ఇస్తున్నాం..’ అని అన్నారు. సీఐఐకి మరోసారి విజ్ఞప్తి.. కాలేజీలను స్థానిక పరిశ్రమలను అనుసంధానించాలని కేటీఆర్ చెప్పారు. అప్పుడే నైపుణ్యమున్న మానవ వనరులను సృష్టించగలమన్నారు. జర్మనీలాంటి దేశాల నుంచి కొత్త పరిశ్రమలు వచ్చేలా కృషి చేయాలని సీఐఐకి మరోసారి విజ్ఞప్తి చేస్తు న్నా. అత్యధిక వృద్ధిరేటు సాధించిన మహీంద్రా కంపెనీకి శుభాకాంక్షలు. కార్పొరేట్ కంపెనీలన్నీ సామాజిక సేవలో మరింత భాగస్వామ్యం కావా లని విన్నవిస్తున్నా. జేకే గ్రూపు సాయంతో ప్రభు త్వ స్కూళ్లలో మరుగుదొడ్లు నిర్మించగలిగాం. ఇదేవిధంగా మిగిలిన కంపెనీలు కూడా ముందుకు రావాలని కోరుతున్నా..’అని ముగించారు. కార్యక్రమంలో ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్, సీఐఐ చైర్మన్ డి.రాజు, చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పెళ్లి వేడుకల్లో వైఎస్ జగన్
-
ఆర్మీ ర్యాలీకి 3694 మంది హాజరు
బోట్‌క్లబ్ (కాకినాడ) : జిల్లా క్రీడా మైదానంలో ఆరో రోజు సోమవారం నిర్వహించిన ఆర్మీ ర్యాలీకి వేలాది మంది అభ్యర్థులు హాజరయ్యారు. ర్యాలీలో పాల్గొన్న అభ్యర్థులకు సరైన వసతులు లేకపోవడంతో అవస్థలు పడుతున్నారు. ప్రతీ రోజు సుమారు నాలుగు వేల మంది అభ్యర్థులు ఈ ర్యాలీలో పాల్గొనేందుకు ఆరు జిల్లాలు నుంచి తరలివస్తున్నారు. అభ్యర్థులు సేదదీరేందుకు, సరిపడా మరుగుదొడ్ల సదుపాయం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కార్పొరేషన్ అధికారులు కేవలం నాలుగు మరుగుదొడ్లు మాత్రమే ఏర్పాటు చేశారు. దీంతో మరుగుదొడ్ల వద్ద యువకులు క్యూ కట్టాల్సి వస్తోంది. అత్యవసర పరిస్థితిలో అభ్యర్థులు పడరానిపాట్లు పడుతున్నారు. ట్రేడ్మన్ సెలక్షన్లకు 5052 మందికి అడ్మిట్ కార్డులు జారీ చేయగా 3694 మంది హాజరయ్యారని, వీరిలో సరిపడా ఎత్తు లేకపోవడంతో 791 మందిని తొలగించారని సెట్రాజ్ సీఈవో శ్రీనివాసరావు తెలిపారు. మిగిలిన 2903 మందిలో 194 మంది పరుగు పరీక్షలో పాస్ కాగా, వీరిలో 186 మంది వైద్య పరీక్షలకు ఎంపికయ్యారన్నారు. మంగళవారం ఆర్మీ టెక్నికల్ కేటగిరీలో సెలక్షన్లు నిర్వహిస్తారని తెలిపారు. సుమారు 4 వేల మంది పాల్గొనే అవకాశం ఉందన్నారు. -
ధ్రువీకరణపత్రాల పరిశీలనకు80 మంది హాజరు
బొమ్మూరు (రాజమహేంద్రవరం రూరల్) : బొమ్మూరులోని జిల్లా విద్యా శిక్షణా సంస్థ(డైట్) కళాశాలలో మంగళవారం జరిగిన ఏపీ ఎల్పీసెట్–2016 ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు 80 మంది హాజరయ్యారు. సర్వర్ కనెక్ట్ కాకపోవడంతో ఉదయం 11.30 గంటలకు పరిశీలన ప్రారం¿¶ మైంది. హిందీ పండిట్‌కు 30 మంది, తెలుగు పండిట్ 50 మంది అభ్యర్థులు హాజరయ్యారని డైట్ ప్రిన్సిపాల్ ఎ.జయప్రకాశరావు తెలిపారు. బుధవారం కూడా కార్యక్రమం కొనసాగుతుందన్నారు. -
ముగిసిన నంది నాటకోత్సవాలు
-
ఆ షోకు.. లోయిస్ విట్మన్ మిస్సవ్వలేదు..!
ఎలక్ట్రానిక్స్ షోలో ఆమెది ఏభై ఏళ్ళ ప్రస్థానం.. జనవరి తొమ్మిది వరకూ లాస్ వెగాస్ కన్వెన్షన్ సెంటర్ లో జరిగే కంజ్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో లోనూ లోయిస్ విట్మన్ పాత్ర ఉంది. ఇప్పుడే కాదు ఆమె న్యూయార్క్ సిటీ లో 1967లో మొట్టమొదటిసారి జరిపిన ప్రదర్శననుంచి ప్రతి సీఈఎస్ కు హాజరౌతూనే ఉంది. కంన్జూమర్ ఎలక్ట్రానిక్స్ లో నిర్వహిస్తున్న తన ఉద్యోగాన్నే కాక, ఆ వ్యాపారంలో ఉండే ప్రతి వారినీ ఆమె ఎంతో ఇష్ట పడుతుంది. హోం ఫర్నిషింగ్ డైలీ మాగజిన్ లో 1966 లో కెరీర్ ప్రారంభించిన లోయిస్ విట్మన్.. 1967 లో ప్రారంభమైన మొట్టమొదటి కన్జూమర్ ఎలక్ట్రానిక్ షో నుంచీ ప్రతి ప్రదర్శనలో పాల్గొంటోంది. అప్పట్లో ఈ షోలో... గడియారాలు, రేడియోలు, ఫర్నిచర్ తో పాటు, గృహోపకరణాల్లో ఉండే కన్సోల్ ఆడియోసిస్టమ్స్, టీవీలు వంటివి ఎక్కువగా ఉండేవి. అప్పటికే అమెరికాలో ఇళ్ళు కంప్యూటర్ ప్రపంచాన్ని ఆక్రమించడంతో.. హోం ఆడియోలు, టీవీలు యూఎస్ లో తయారుచేసేవారు. అయితే రాను రాను కొన్ని జపనీస్ కంపెనీల ఆధిపత్యం... హోమ్ ఆడియో సెక్టార్లో పుంజుకుంది. మొదట్లో కొన్ని షోలు కేవలం కొన్ని గంటల్లోనే చూడగలిగేలా చిన్నగా ఉండేవని విట్మన్ తన ఏభై ఏళ్ళ అనుభవాన్ని గుర్తు చేసుకుంటుంది. 1967 లో మొట్టమొదటిసారి న్యూయార్క్ సిటీలో మొదలైన కన్జూమర్ ఎలక్ట్రానిక్ షో 1970 వరకూ అక్కడే కొనసాగింది. ఆ తర్వాత చికాగో కు చేరి అక్కడే 1971 నుంచి 77 వరకు కొనసాగి, అక్కడినుంచి 1978 వింటర్ లో లాస్ వెగాస్ కు చేరింది. అప్పట్నుంచీ అక్కడ ప్రతి జనవరిలో వింటర్ సీఈఎస్ తోపాటు, లాస్ వెగాస్ లో 1978 నుంచి 95 వరకు ప్రతి సంవత్సరం సమ్మర్ సీఈఎస్ కూడ కొనసాగుతూనే ఉంది. అయితే ఈ ప్రతి షోలో విట్మన్ ఉంది. వీసీఆర్ లు వచ్చే సమయానికి విట్మస్ జర్నలిజం నుంచి బయటకు వచ్చి, హెచ్ డబ్ల్యూ హెచ్ పేరిట 1978లో ప్రజాంసంబంధాల సంస్థ ప్రారంభించింది. అప్పట్లో ఆమె ఖాతాల్లో ఒకటైన వీహెచ్ ఎస్... వీడియో టేప్ ఫార్మాట్ లో ఉండే జేవీసీ... సోనీ బీటామాక్స్ పేరిట బయటకు వచ్చేది. 1970 నుంచి 1980 లమధ్య వచ్చిన ఫార్మాట్ వార్ తో వీహెచ్ ఎస్ అమ్మకాలు కూడ ఒక్కో సంవత్సరం పెరుగుతూ వచ్చాయి. దీంతో విట్మన్ విజయపథంవైపు అడుగులు వేసింది. మొదటిసారి లేజర్ డిస్క్, ఆప్టికల్ డిస్క్ వీడియో ప్లేయర్ సంయుక్తంగా 1978 సమయంలో ప్రారంభిచబడింది. అప్పట్లో వీహెచ్ ఎస్, బీటా లకు ప్రజాదరణ కాస్త తగ్గినా... లేజర్ డిస్క్ మాత్రం మాస్ మార్కెట్లో దూసుకుపోయింది. 1982 లో సీఈఎస్ ప్రారంభమయ్యే సమయానికి విట్మస్ ఎనిమిది నెలల గర్భవతి. అయినా ఆమె ప్రదర్శనకు వెళ్ళడం మానలేదు. ఫ్లాట్ స్క్రీన్ డిస్ ప్లే ప్రారంభ సమయం కావడంతో 2000 సంవత్సరంలో ఆమె శామ్సంగ్ కు ఆ వర్గ మేనేజర్ గా మారింది. . పనిని ప్రేమించే తత్వం ఉన్న విట్మన్ 2016 సీఈఎస్ లో కొత్త ఎలక్ట్రానిక్ పరికరాలకోసం ఆత్రుతగా చూస్తోంది. ప్రస్తుతం డిజిడ్యామ్ బ్లాగ్ తోపాటు... తన భర్త ఎలైట్ హెస్ తో కలసి... విట్మన్... హెచ్ డబ్ల్యూ హెచ్ పబ్లిక్ రిలేషన్ ఏజెన్సీని నడుపుతోంది. ఎన్నో కంపెనీలకు బిజినెస్ అడ్వైజర్ గా, మార్కెటింగ్ కన్సల్టెంట్ గా, స్పీకర్ గా, రచయితగా ఉండటమే కాక, నేటికీ అలుపెరుగని నెట్‌వర్కర్ గా ఉత్సాహంగా జీవితాన్ని గడుపుతోంది. -
ఏసీబీ ఎదుట హాజరైన ఐదుగురు
-
మోడీ సభకు లక్షన్నర జనం
చెన్నై, సాక్షి ప్రతినిధి : రాష్ట్రంలో బలహీనంగా ఉన్న భారతీయ జనతా పార్టీని రాబోయే లోక్‌సభ ఎన్నికల నాటికి బలోపేతం చేసేందుకు ఆ పార్టీ నాయకులు కసరత్తు ప్రారంభించారు. ఈ క్రమంలో బీజేపీ ప్రచార కమిటీ చైర్మన్ హోదాలో సెప్టెంబర్ 26వ తేదీ తిరుచిరాపల్లి సభలో ప్రసంగించేందుకు వస్తున్న గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ కార్యక్రమాలను జయప్రదం చేయాలని భావిస్తున్నారు. ప్రచార కమిటీ చైర్మన్‌గా మోడీ నియమితులైన తరువాత దేశంలో తొలి విడతగా 100 నగరాల్లో భారీ సభలను నిర్వహించి లోక్‌సభ ఓటును కోరాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా తొలి సభను హైదరాబాద్‌లో నిర్వహించగా 1.20 లక్షల మంది జనం హాజరయ్యారు. ఆ తరువాత తిరుచ్చిలో జరిగే బహిరంగ సభను హైదరాబాద్ సభ కంటే విజయవంతం చేయాలనే లక్ష్యాన్ని ఆ పార్టీ నాయకులు నిర్దేశించుకున్నారు. తిరుచ్చిలోని చెన్నై బైపాస్ రోడ్డు పొన్మలై జీ కార్నర్లో సభాస్థలికి పరిశీలిస్తున్నారు. కనీసం 1.50 లక్షల మంది మోడీ సభకు హాజరయ్యేలా చూడాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పొన్ రాధాకృష్ణన్ పార్టీ శ్రేణులకు సూచించారు. ఁఇళంతామరైరూ. (యువ కమలం) పేరుతో నిర్వహించనున్న మోడీ సభకు 50 వేల మంది కళాశాల విద్యార్థులను, 35 ఏళ్ల వయస్సున్న లక్ష మంది యువతీ, యువకులను, ఇతర ప్రజలను సమీకరించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. గామాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని నిర్ణయించారు. భధ్రతా కారణాల దృష్ట్యా సభకు హాజరయే ు ఆన్లైన్ ద్వారా పేర్లను నమోదు చేసుకునే సదుపాయాన్ని వచ్చేనెల మొదటి వారంలో ప్రవేశపెట్టబోతున్నారు. ప్రవేశ రుసుముగా రూ.5 లేదా రూ.10లు వసూలు చేయాలని భావిస్తున్నారు. ఈ నెల 27వ తేదీన నిర్వహించే పార్టీ యువజన విభాగ రాష్ట్ర స్థాయి సమావేశంలో వీటిపై నిర్ణయం తీసుకుంటారు. -
ఇఫ్తార్ విందులతో మత సామరస్యం
ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి ప్రతీకలని మాజీ మంత్రి సబితారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం రాత్రి చేవెళ్లలోని అరుణ గార్డెన్స్‌లో కాంగ్రెస్ నియోజకవర్గ యువజన శాఖ అధ్యక్షుడు గుడుపల్లి రవికాంత్‌రెడ్డి ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా సబితారెడ్డి మాట్లాడుతూ.. సమాజంలోని అన్ని మతాల ప్రజలు కలిసిమెలిసి ఉండాలని సూచించారు. అందరం కలిసిఉంటే సమాజ ప్రగతి వేగవంతంగా జరిగే అవకాశముంటుందని పేర్కొన్నారు. అంతకుముందు ఆమె ఆర్అండ్బీ అతిథిగృహంలో స్థానిక నాయకులతో స్థానిక సమస్యలు, ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల గురించి మాట్లాడారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీసెల్ రాష్ట్ర కన్వీనర్ పి.వెంకటస్వామి, టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు కాలె యాదయ్య, డీసీసీబీ డెరైక్టర్ ఎస్.బల్వంత్‌రెడ్డి, మార్కెట్‌కమిటీ చైర్మన్ ఎం.వెంకటేశం గుప్తా, వైస్‌చైర్మన్ పి.గోపాల్‌రెడ్డి, మాజీ ఎంపీపీ విజయభాస్కర్‌రెడ్డి, సీనియర్ నాయకులు గుడుపల్లి నర్సింహారెడ్డి, ప్రకాశ్‌గౌడ్, బర్కల రాంరెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ జంగం శివానందం, పలువురు సర్పంచులు, మాజీ సర్పంచులు పాల్గొన్నారు.