మోడీ సభకు లక్షన్నర జనం
Published Sun, Aug 25 2013 5:39 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
చెన్నై, సాక్షి ప్రతినిధి : రాష్ట్రంలో బలహీనంగా ఉన్న భారతీయ జనతా పార్టీని రాబోయే లోక్‌సభ ఎన్నికల నాటికి బలోపేతం చేసేందుకు ఆ పార్టీ నాయకులు కసరత్తు ప్రారంభించారు. ఈ క్రమంలో బీజేపీ ప్రచార కమిటీ చైర్మన్ హోదాలో సెప్టెంబర్ 26వ తేదీ తిరుచిరాపల్లి సభలో ప్రసంగించేందుకు వస్తున్న గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ కార్యక్రమాలను జయప్రదం చేయాలని భావిస్తున్నారు. ప్రచార కమిటీ చైర్మన్‌గా మోడీ నియమితులైన తరువాత దేశంలో తొలి విడతగా 100 నగరాల్లో భారీ సభలను నిర్వహించి లోక్‌సభ ఓటును కోరాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా తొలి సభను హైదరాబాద్‌లో నిర్వహించగా 1.20 లక్షల మంది జనం హాజరయ్యారు.
ఆ తరువాత తిరుచ్చిలో జరిగే బహిరంగ సభను హైదరాబాద్ సభ కంటే విజయవంతం చేయాలనే లక్ష్యాన్ని ఆ పార్టీ నాయకులు నిర్దేశించుకున్నారు. తిరుచ్చిలోని చెన్నై బైపాస్ రోడ్డు పొన్‌మలై జీ కార్నర్‌లో సభాస్థలికి పరిశీలిస్తున్నారు. కనీసం 1.50 లక్షల మంది మోడీ సభకు హాజరయ్యేలా చూడాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పొన్ రాధాకృష్ణన్ పార్టీ శ్రేణులకు సూచించారు. ఁఇళంతామరైరూ. (యువ కమలం) పేరుతో నిర్వహించనున్న మోడీ సభకు 50 వేల మంది కళాశాల విద్యార్థులను, 35 ఏళ్ల వయస్సున్న లక్ష మంది యువతీ, యువకులను, ఇతర ప్రజలను సమీకరించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.
గామాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని నిర్ణయించారు. భధ్రతా కారణాల దృష్ట్యా సభకు హాజరయే ు ఆన్‌లైన్ ద్వారా పేర్లను నమోదు చేసుకునే సదుపాయాన్ని వచ్చేనెల మొదటి వారంలో ప్రవేశపెట్టబోతున్నారు. ప్రవేశ రుసుముగా రూ.5 లేదా రూ.10లు వసూలు చేయాలని భావిస్తున్నారు. ఈ నెల 27వ తేదీన నిర్వహించే పార్టీ యువజన విభాగ రాష్ట్ర స్థాయి సమావేశంలో వీటిపై నిర్ణయం తీసుకుంటారు.
Advertisement
Advertisement