ధ్రువీకరణపత్రాల పరిశీలనకు80 మంది హాజరు
బొమ్మూరు (రాజమహేంద్రవరం రూరల్) : బొమ్మూరులోని జిల్లా విద్యా శిక్షణా సంస్థ(డైట్) కళాశాలలో మంగళవారం జరిగిన ఏపీ ఎల్పీసెట్–2016 ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు 80 మంది హాజరయ్యారు. సర్వర్ కనెక్ట్ కాకపోవడంతో ఉదయం 11.30 గంటలకు పరిశీలన ప్రారం¿¶ మైంది. హిందీ పండిట్‌కు 30 మంది, తెలుగు పండిట్ 50 మంది అభ్యర్థులు హాజరయ్యారని డైట్ ప్రిన్సిపాల్ ఎ.జయప్రకాశరావు తెలిపారు. బుధవారం కూడా కార్యక్రమం కొనసాగుతుందన్నారు.