ఇఫ్తార్ విందులతో మత సామరస్యం
Published Mon, Aug 5 2013 1:11 AM | Last Updated on Wed, Mar 28 2018 10:56 AM
ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి ప్రతీకలని మాజీ మంత్రి సబితారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం రాత్రి చేవెళ్లలోని అరుణ గార్డెన్స్‌లో కాంగ్రెస్ నియోజకవర్గ యువజన శాఖ అధ్యక్షుడు గుడుపల్లి రవికాంత్‌రెడ్డి ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా సబితారెడ్డి మాట్లాడుతూ.. సమాజంలోని అన్ని మతాల ప్రజలు కలిసిమెలిసి ఉండాలని సూచించారు. అందరం కలిసిఉంటే సమాజ ప్రగతి వేగవంతంగా జరిగే అవకాశముంటుందని పేర్కొన్నారు.
అంతకుముందు ఆమె ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో స్థానిక నాయకులతో స్థానిక సమస్యలు, ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల గురించి మాట్లాడారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీసెల్ రాష్ట్ర కన్వీనర్ పి.వెంకటస్వామి, టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు కాలె యాదయ్య, డీసీసీబీ డెరైక్టర్ ఎస్.బల్వంత్‌రెడ్డి, మార్కెట్‌కమిటీ చైర్మన్ ఎం.వెంకటేశం గుప్తా, వైస్‌చైర్మన్ పి.గోపాల్‌రెడ్డి, మాజీ ఎంపీపీ విజయభాస్కర్‌రెడ్డి, సీనియర్ నాయకులు గుడుపల్లి నర్సింహారెడ్డి, ప్రకాశ్‌గౌడ్, బర్కల రాంరెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ జంగం శివానందం, పలువురు సర్పంచులు, మాజీ సర్పంచులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement