IFTAR party
-
బంజారాహిల్స్ : ముస్లింలకు ఘనంగా ఇఫ్తార్ విందు (ఫొటోలు)
-
ముస్లింలకు ఘనంగా ఇఫ్తార్ విందు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ రోడ్ నెం. 12 సయ్యద్‌నగర్‌లో పూండ్ల వెంకు రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు భారీగా ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఛారిటుబుల్ ట్రస్ట్ అధినేత పూండ్ల వెంకురెడ్డి, ట్రస్ట్ ప్రతినిధులు డాక్టర్ శ్రవణ్‌కుమార్‌రెడ్డి హాజరై ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతియేటా తమ స్వచ్ఛంద సంస్థ ద్వారా ఎన్నో సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తుంటామని అందులో భాగంగా ఈసారి 3 వేలమందికి ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఫిరోజ్‌ఖాన్, రశీద్‌ఖాన్, సురేందర్ తదితరులు పాల్గొన్నారు. -
రంజాన్ మాసం : ఘనంగా ఇఫ్తార్ విందు (ఫొటోలు)
-
బిర్యానీ పార్టీకి పిలిస్తే మంచివాళ్లా?.. హీరోయిన్‌పై నెటిజన్ ట్రోల్స్!
బాలీవుడ్ భామ ఆదా శర్మ నటించిన వివాదాస్పద చిత్రం 'ది కేరళ స్టోరీ' సంచలన విజయం సాధించింది. కేరళలోని అమ్మాయిలను మతం పేరుతో విదేశాలకు తరలించారనే నేపథ్యంలో తెరకెక్కించిన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. గతేడాది థియేటర్లలో రిలీజైన ఈ సినిమా భారీ వసూళ్లు సాధించింది. ఈ చిత్రానికి సుదీప్తో సేన్ దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. దాదాపు 9 నెలల తర్వాత ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. అయితే ప్రస్తుతం ఈ ఏడాది బస్తర్ సినిమాతో మార్చి 15న ప్రేక్షకులను పలకరించింది. గతంలో బస్తర్‌లో జరిగిన మావోయిస్టుల దాడి ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే తాజాగా ఆదా శర్మ ముంబైలో జరిగిన ఓ ఇఫ్తార్ విందుకు హాజరైంది. ప్రముఖ రాజకీయ నాయకుడు బాబా సిద్ధిక్ నిర్వహించిన ఇఫ్తార్ పార్టీలో మెరిసింది. ఈ విందుకు సల్మాన్ ఖాన్, ఇమ్రాన్ హష్మీ, మునావర్ ఫరూఖీ, ప్రీతి జింటా, ప్రియాంక చాహర్ చౌదరి, షెహనాజ్ గిల్ లాంటి ప్రముఖులు కూడా హాజరయ్యారు. ది కేరళ స్టోరీ సినిమా తర్వాత ఆదాశర్మ ఇఫ్తార్ విందుకు హాజరు కావడంపై ఓ నెటిజన్ ప్రశ్నించారు. ‘ఎంత మోసం.. ముస్లింలపై ద్వేషపూరిత సినిమాలు తీస్తారు.. ఇప్పుడేమో బిర్యానీ కోసం ఆహ్వానించగానే మంచివాళ్లు అయిపోయారా?’ అంటూ ఆదా శర్మ పార్టీలో ఉన్న వీడియోను పోస్ట్ చేశారు. దీనిపై ది కేరళ స్టోరీ నటి స్పందించింది. దీనిపై అదా శర్మ స్పందిస్తూ.. 'అప్పుడైనా..ఇప్పుడైనా ఉగ్రవాదులు అంటే విలన్లు. అంతేకాని ముస్లింలు కాదు' అంటూ రిప్లై ఇచ్చింది. కాగా.. కేరళలో అమ్మాయిలను బలవంతంగా మతమార్పిడి చేసి విదేశాలకు తరలించారనే నేపథ్యంలోనే ది కేరళ స్టోరీని రూపొందించారు. అయితే గతంలో తాము ఈ సినిమాను ఏ మతానికి వ్యతిరేకంగా నిర్మించలేదని తెలిపారు. టెర్రరిజానికి వ్యతిరేకంగా ఉన్నవారంతా మా పోరాటంలో భాగస్వాములు కావాలని కోరారు. కాగా.. ఈ చిత్రంలో యోగితా బిహానీ, సోనియా బలానీ, సిద్ధి ఇద్నానీ ప్రధాన పాత్రల్లో నటించారు. On odd and even days dear sir terrorists are villains . Not muslims. — Adah Sharma (@adah_sharma) March 26, 2024 What a fraud she is!!! On Odd Days Muslims are Villains for these people and you make hate movies against them!!! On Even Days Muslims are great for these people because you get invited for a Biryani!!! pic.twitter.com/ygNhPNMnkO — Sridhar Ramaswamy శ్రీధర్ రామస్వామి ✋🇮🇳 (@sridharramswamy) March 25, 2024 -
తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో 12న ఇఫ్తార్ విందు
సాక్షి,హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏప్రిల్ 12న ఇఫ్తార్ విందు నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి తన కార్యదర్శి భూపాల్‌రెడ్డిని ఆదేశించారు. ఇఫ్తార్ విందుకు కోసం ఎల్బీ స్టేడియంలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇఫ్తార్ విందులో సీఎం కేసీఆర్, మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం రంజాన్ పండుగ నేపథ్యంలో ముస్లింలకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. -
కేంద్రానికి రోగం వచ్చింది, చికిత్స చేయాలి: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ఎల్బీ స్టేడియంలో తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇఫ్తార్ విందులో మంత్రులు మహ్ముద్ అలీ, తలసాని శ్రీనివాస్, మల్లారెడ్డి, ఎంపీ అసదుద్దీన్, కే కేశవరావు, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, డీజీపీ మహేందర్ రెడ్డి, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఏకే ఖాన్, సీఎస్ సోమేష్ కుమార్, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మత పెద్దలు పాల్గొన్నారు. ఇఫ్తార్ విందుకు ప్రముఖులు, ఆహూతులు భారీ సంఖ్యలో హాజరైన నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం 5 నుంచి రాత్రి 9 గంటల మధ్య ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉన్నాయి. చదవండి: రుచుల పండుగ రంజాన్.. 10 వెరైటీలు మీకోసం! ఇఫ్తార్ విందు సందర్భంగా చిన్నారులకు సీఎం కేసీఆర్ చేతుల మీదుగా తోఫా అందించారు. అనంతరం సీఎం కేసీఆర్ మాట్లాడుతూ..కేంద్రానికి రోగం వచ్చిందని, చికిత్స చేయాలని అన్నారు. కేంద్రం, రాష్ట్రం బాగుంటేనే దేశం బాగుంటుందని తెలిపారు. కూల్చివేతలు సులువు కానీ దేశాన్ని నిర్మించడం కష్టమన్నారు. ఇక్కడ అల్లరి చేసేవాళ్ల ఆటలు సాగవని అన్నారు. తెలంగాణ ఏర్పడినప్పుడు రాష్ట్రంలో నీళ్లు, కరెంట్ లేవని, ఇప్పుడు అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోందన్నారు. ప్రస్తుతం దేశమంతా చీకటి అలుముకుంటే తెలంగాణలో వెలుగులు విరజిమ్ముతున్నాయని పేర్కొన్నారు. -
ఘనంగా ఇఫ్తార్ విందు
సాక్షి, అమరావతి: పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ముస్లింలకు ఘనంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసింది. బుధవారం సాయంత్రం విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలతో కలిసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. తలపై టోపీ ధరించి ఆద్యంతం చిరునవ్వుతో అభివాదం చేస్తూ కనిపించారు. ముస్లింలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అంతకు ముందు సీఎం.. విజయవాడలోని వన్‌టౌన్ వించిపేటలో షాజహుర్ ముసాఫిర్ ఖానా భవనాన్ని ప్రారంభించారు. ఇఫ్తార్ విందులో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హోరెత్తిన సభా ప్రాంగణం ప్రార్థనలు ముగిసిన అనంతరం ముస్లిం మత పెద్దలు, నాయకులతో కలిసి సీఎం ఇఫ్తార్ విందుకు వెళ్తున్న క్రమంలో సీఎం.. సీఎం.. అనే నినాదాలతో సభా ప్రాంగణం ఒక్కసారిగా హోరెత్తింది. యువత సెల్ ఫోన్లలో సీఎంను ఫొటోలు, వీడియో తీస్తూ సందడి చేశారు. అంతకు ముందు వేదికపై నుంచి డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా మాట్లాడుతూ.. ముస్లింల అభివృద్ధికి ప్రత్యేక సబ్‌ప్లాన్‌ను అమలు చేస్తున్న ఏకైక సీఎం జగన్మోహన్రెడ్డి అని కొనియాడారు. నమాజ్ చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ముస్లిం ప్రజా ప్రతినిధులు, మత పెద్దలు ఉర్దూకు రాష్ట్ర రెండో అధికారిక భాష హోదా కల్పించడంతో పాటు రాజకీయంగా ముస్లింలకు పెద్దపీట వేస్తున్నారని చెప్పారు. దివంగత సీఎం వైఎస్సార్ 4 % రిజర్వేషన్‌తో ముస్లింలను ఉన్నత స్థానాల్లో కూర్చోబెడితే.. ఆయన వారసుడు సీఎం జగన్ అంతకు మించి సంక్షేమాభివృద్ధిని అందిస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తానేటి వనిత, కొట్టు సత్యనారాయణ, రోజా, శాసనమండలి డిప్యూటీ చైర్ పర్సన్ జకియా ఖానమ్, పలువురు ఎమ్మెల్యేలు, ముస్లిం నాయకులు పాల్గొన్నారు. -
ఇఫ్తార్ విందులో పాల్గొన్న సీఎం జగన్ (ఫొటోలు)
-
Vijayawada: ఇఫ్తార్ విందులో పాల్గొన్న సీఎం జగన్
-
ఇఫ్తార్ విందుకు సర్వం సిద్ధం
గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): పవిత్ర రంజూన్ మాసాన్ని పురస్కరించుకుని నేడు (బుధవారం) ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇవ్వనున్న ఇఫ్తార్ విందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. స్టేడియంలో ఏర్పాట్లను డిప్యూటీ సీఎం, మైనారిటీశాఖ మంత్రి అంజద్‌బాషా మంగళవారం ఎమ్మెల్సీలు తలశిల రఘురాం, ఎండీ రుహుల్లా, లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యేలు వెలంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణు, కలెక్టర్ ఎస్.ఢిల్లీరావులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా అంజద్‌బాషా మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొనే ఈ ఇఫ్తార్ విందుకు ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున పాల్గొని హాజరుకావాలని కోరారు. ఎనిమిది వేల మంది ముస్లిం సోదరులకు పాస్‌లు అందజేస్తామన్నారు. స్టేడియం వాటర్ ట్యాంక్ వైపు గేటు నుంచి సాధారణ ప్రజలకు, బందరు రోడ్డు వైపు ప్రధాన గేటు నుంచి వీఐపీలకు ప్రవేశం కల్పించినట్లు తెలిపారు. ఇఫ్తార్ విందు కోసం మైనారిటీ సోదరులకు రాష్ట్ర వ్యాప్తంగా రూ.80 లక్షలు మంజూరు చేసినట్లు చెప్పారు. ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ విజయవాడ వన్‌టౌన్‌లో రూ.15 కోట్లతో నిర్మించిన ముసాఫిర్ ఖానాను సీఎం బుధవారం ప్రారంభిస్తారని తెలిపారు. నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, సబ్ కలెక్టర్ జి.సూర్యసాయిప్రవీణ్ చంద్, వైఎస్సార్సీపీ విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్చార్జి దేవినేని అవినాష్ పాల్గొన్నారు. -
27న విజయవాడలో సీఎం పర్యటన
సాక్షి, అమరావతి: ఈ నెల 27వ తేదీన సీఎం వైఎస్ జగన్ విజయవాడ, మంగళగిరిలో పర్యటించనున్నారు. 27న సాయంత్రం 5.10 గంటలకు విజయవాడ 1 టౌన్ వించిపేటలో షాజహుర్ ముసాఫిర్ ఖానా, ఫొటో ఎగ్జిబిషన్‌ను ప్రారంభిస్తారు. ముస్లిం మత పెద్దలతో భేటీ అవుతారు. అక్కడి నుంచి ఇందిరా గాంధీ మునిసిపల్ స్టేడియం చేరుకుని, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఇఫ్తార్ విందులో పాల్గొంటారు. రాత్రి 7.35 గంటలకు గుంటూరు జిల్లా మంగళగిరి సీకే కన్వెన్షన్‌లో గుంటూరు జెడ్పీ చైర్పర్సన్ కత్తెర హెనీక్రిస్టినా కుమారుడి వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు. -
‘అల్లా ఆశీస్సులతో మంచి పాలన అందిస్తాం’
సాక్షి, వైఎస్సార్‌జిల్లా : పవిత్ర రంజాన్ మాసంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఎన్నిక అవ్వడం సంతోషంగా ఉందని కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి అన్నారు. జిల్లా కలెక్టర్ హరికిరణ్ అధ్యక్షతన నగరంలోని అమీన్ ఫంక్షన్ ప్యాలెస్‌లో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా వైఎస్ అవినాష్ మాట్లాడుతూ.. అల్లా ఆశీస్సులు, ప్రజల ఆశీర్వాదంతో మంచి పాలన అందిస్తామన్నారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముస్లిం మైనార్టీలకు ఇచ్చిన నాలుగు శాతం రిజర్వేషన్లు ఎప్పటికి మరువలేమన్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మతపెల్లదు, మైనార్టీ సోదరులు, అంజాద్ బాషా, రఘురామిరెడ్డి, రవీంద్రనాధ్ రెడ్డి, వెంకటసుబ్బయ్య, ఎమ్మెల్సీ కత్తి నరసింహరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఇఫ్తార్ అతిథులకు పాక్ వేధింపులు
ఇస్లామాబాద్: దాయాది దేశం పాకిస్తాన్ మరోసారి తన వక్రబుద్ధిని బయటపెట్టుకుంది. ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్ శనివారం ఇచ్చిన ఇఫ్తార్ విందుకు పాక్ రాజకీయ, వాణిజ్య, మీడియా ప్రముఖులు రాకుండా నానా అడ్డంకులు సృష్టించింది. ఈ విందుకు వెళ్లరాదని పలువురు ప్రముఖులకు గుర్తుతెలియని నంబర్ల నుంచి బెదిరింపు ఫోన్‌కాల్స్ వెళ్లాయి. అయినాసరే లెక్కచేయకుండా హాజరైన అతిథుల్ని పోలీసులు, భద్రతాధికారులు తనిఖీల పేరుతో తీవ్రంగా వేధించారు. పలువురు తమ ప్రభుత్వ వ్యవహారశైలిపై తీవ్రంగా మండిపడ్డారు. పాక్‌లోని భారత రాయబారి అజయ్ బిసారియా ఇస్లామాబాద్‌లోని సెరేనా హోటల్లో శనివారం ఇఫ్తార్ విందు ఏర్పాటుచేశారు. ఇందుకు పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్, అధ్యక్షుడు ఆరీఫ్ అల్వీ సహా పలువురిని ఆహ్వానించారు. కానీ ఈ విందుకు వీరిద్దరూ గైర్హాజరయ్యారు. ఆ హోటల్ వద్ద భారీగా బలగాలను మోహరించిన ప్రభుత్వం, అతిథుల్ని వేధింపులకు గురిచేసింది. ఫోన్‌చేసి బెదిరింపులు.. ఈ విషయమై ప్రముఖ పాక్ జర్నలిస్ట్ మెహ్రీన్ జెహ్రా మాలిక్ మాట్లాడుతూ..‘మొదటగా నా ఆహ్వానపత్రికను పోలీసులు తనిఖీ చేశారు. నా వృత్తి, నివాసం ఉండే చోటు అడిగారు. చివరికి లోపలకు అనుమతించారు. కానీ నా డ్రైవర్‌తో దురుసుగా ప్రవర్తించారు. సెరేనా హోటల్ వద్ద భారీగా బలగాలను మోహరించారు. వారంతా హోటల్‌కు వచ్చేవారిని వేధిస్తున్నారు. ఇది ఉద్దేశపూర్వకంగా చేస్తున్న పనే’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరాచీ ఫెడరేషన్ ఆఫ్ చాంబర్స్ ఆఫ్ కామర్స్, ఫైసలాబాద్ చాంబర్స్ ఆఫ్ కామర్స్, లాహోర్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులకు పాక్ భద్రతాధికారులు గుర్తుతెలియని నంబర్ల నుంచి శుక్రవారం రాత్రి ఫోన్ చేశారు. భారత హైకమిషన్ ఇస్తున్న విందుకు వెళ్లరాదని హెచ్చరించారు. ఈ ఘటనను పాక్ మీడియా కవర్ చేయలేదు. పాక్ నేతకు చుక్కలు.. ఈ విందుకు హాజరైన పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ) నేత ఫర్హతుల్లాహ్ బాబర్‌కు పాక్ అధికారులు చుక్కలు చూపించారు. ‘‘నేను సెరేనా హోటల్‌కు రాగానే బారికేడ్లు దర్శనమిచ్చాయి. వాటిని దాటుకుని ముందుకెళ్లగా భద్రతాధికారులు ఇఫ్తార్ రద్దయిందని చెప్పారు. గట్టిగా అడిగేసరికి మరో గేటు నుంచి లోపలకు వెళ్లాలన్నారు. అటుగా వెళితే.. ఇటువైపు రావొద్దు. ముందువైపు గేటు నుంచే హోటల్లోకి వెళ్లండని ఇబ్బంది పెట్టారు’ అని బాబర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. క్షమాపణలు చెప్పిన బిసారియా.. ఇఫ్తార్ విందు సందర్భంగా వేధింపులకు గురైన ప్రముఖులకు భారత రాయబారి అజయ్ బిసారియా క్షమాపణలు చెప్పారు. ఇఫ్తార్ విందుకు కరాచీ, లాహోర్ వంటి దూరప్రాంతాల నుంచి హాజరైన ప్రతీఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు చాలామంది అతిథులపై పాక్ అధికారులు చేయి చేసుకున్నారనీ, మొబైల్ఫోన్లు లాక్కున్నారని భారత హైకమిషన్ తెలిపింది. ఇది దౌత్య చట్టాలను ఉల్లంఘించడమేననీ, ఈ వ్యవహారంపై పాక్ ప్రభుత్వం విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది. కాగా, ఢిల్లీలో పాక్ హైకమిషన్ ఇచ్చిన ఇఫ్తార్ విందుకు అతిథులు రాకుండా భారత్ ఇలాగే అడ్డుకుందనీ, అందుకే ఇలా ప్రతీకారానికి దిగిందని పాక్ దౌత్యవర్గాలు చెప్పాయి. -
భారత్ ఇఫ్తార్ విందులో పాక్ ఓవరాక్షన్
ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లోని ఇస్లామాబాద్‌లో భారత హైకమిషన్ ఇచ్చిన ఇఫ్తార్ విందులో ఆ దేశ భద్రతా సిబ్బంది వివాదాస్పదంగా ప్రవర్తించారు. ఇప్తార్ విందుకు హాజరైన అతిథులతో అత్యంత అమర్యాదగా వ్యవహరించారు. రంజాన్ సందర్భంగా ఇస్లామాబాద్‌లోని సెరెనా హోటల్లో భారత హైకమిషన్ అధికారులు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయగా, దానికి పలువురు అతిథులు వచ్చారు. అయితే, భద్రతా కారణాల పేరుతో పాక్ సెక్యూరిటీ.. గెస్ట్‌లను వేధింపులకు గురిచేశారు. భద్రత పేరుతో అతిథులకు తీవ్ర అసహం కలిగించారు. ఓ అతిథి మీద చేయి కూడా చేసుకున్నట్లు సమాచారం. మరికొందరు గెస్ట్‌ల కార్లను పార్కింగ్ స్థలం నుంచి తొలగించగా.. మరికొందరి వాహనాలను హోటల్లోకి అనుమతించలేదు. దీంతో కొందరు ముఖ్యలు కార్యక్రమానికి రాకుండానే వెనుదిరిగి వెళ్లిపోయారు. ఈ ఘటనకు సంబంధించి పాకిస్తాన్లో భారత హైకమిషనర్ అజయ్ బిసారియా క్షమాపణ చెప్పారు. ఉగ్రవాదుల మీద చర్యలు తీసుకోవాలంటూ పదే పదే భారత్ ఒత్తిడి తెస్తున్న నేపథ్యంలో గత కొన్ని నెలలుగా పాకిస్తాన్ భద్రతా ఏజెన్సీలు ఈ తరహాలో తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నాయి. ఇతర దేశస్తులు ఎవరైనా పాకిస్తాన్లో అడుగుపెట్టినా.. వారినికూడా ఇదే విధంగా వేధింపులకు గురిచేస్తోంది. ముఖ్యంగా రంజాన మాసం కావడంతో.. అనువనవూ గాలింపు చేపడుతున్నారు. -
విభజన వివాదాలకు తెర!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర విభజన సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకునే దిశగా మరో ముందడుగు పడింది. విభజన వివాదాల పరిష్కారం కోసం త్వరలో రెండు రాష్ట్రాల ఉన్నతాధికారులతో సమావేశం ఏర్పాటు చేయాలని తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్‌రావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్రెడ్డి నిర్ణయించారు. రాష్ట్ర విభజన జరిగి ఐదేళ్లు పూర్తయినా ఇంకా కొలిక్కి రాని వివాదాలకు సత్వర ముగింపు పలకాలని అభిప్రాయానికి వచ్చారు. ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ సమక్షంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు శనివారం సాయంత్రం రాజ్‌భవన్‌లో సమావేశమయ్యారు. సుమారు గంటకుపైగా చర్చలు జరిపారు. శనివారం సాయంత్రం రాజ్‌భవన్‌లో ఇఫ్తార్ సందర్భంగా ముస్లిం సోదరులతో కలసి నమాజ్ చేస్తున్న గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్, ఏపీ సీఎం వై.ఎస్. జగన్. చిత్రంలో ఏకే ఖాన్, ఎర్రబెల్లి, ఫరూక్ హుస్సేన్, మహమూద్ అలీ తదితరులు రాష్ట్ర విభజన చట్టంలోని షెడ్యూల్ 9, 10లో ఉన్న ప్రభుత్వరంగ సంస్థల విభజనతోపాటు విద్యుత్ ఉద్యోగుల విభజన, విద్యుత్ సంస్థల మధ్య విద్యుత్ బిల్లులు, ఆస్తులు, అప్పుల పంపకాలు, ఏపీ భవన్ విభజన తదితర అంశాలు ఈ భేటీలో ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. రాష్ట్ర విభజన జరిగి ఐదేళ్లు గడిచినా ఇంకా అపరిష్కృతంగా మిగిలిపోయిన అంశాలను ఉభయ ప్రయోజనకరంగా పరిష్కరించుకోవాలని ఈ భేటీలో నిర్ణయించినట్లు సమాచారం. రంజాన్ మాసం సందర్భంగా రాజ్‌భవన్ కాంప్లెక్స్‌లోని ‘సంస్కృతి’కమ్యూనిటీ హాల్లో గవర్నర్ శనివారం ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి సాయంత్రం 5 గంటలకు రాజ్‌భవన్ చేరుకున్న కేసీఆర్, జగన్... గవర్నర్ సమక్షంలో గంటకుపైగా చర్చలు జరిపారు. ఇఫ్తార్‌లో ఏపీ సీఎం వై.ఎస్. జగన్‌కు ఖర్జూరం తినిపిస్తున్న సీఎం కేసీఆర్ ప్రేమను పంచండి: గవర్నర్ సందేశం ప్రేమను పంచండి.. ప్రేమను చాటండి అని గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ పిలుపునిచ్చారు. రాజ్‌భవన్ కాంప్లెక్స్‌లోని సంస్కృతి కమ్యూనిటీ హాల్లో ఆయన ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరినీ ప్రేమించండి.. ప్రేమను పంచండి అని అల్లా చెప్పారన్నారు. ప్రజలు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో శాంతి నెలకొనాలని ఆకాంక్షించారు. అల్లా బోధనలను జీవితంలో ఆచరించాలని రంజాన్ సందేశమిస్తుందన్నారు. అందరికీ రంజాన్ పండుగ శుభకాంక్షాలు తెలిపారు. ఇఫ్తార్ విందులో పాల్గొన్న తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ముస్లిం మత పెద్దలు, ప్రముఖులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఇఫ్తార్ అనంతరం అక్కడే ముస్లిం సోదరులు మగ్రిబ్ నమాజ్ చేశారు. నమాజ్ అనంతరం గవర్నర్ అతిథులకు విందు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మంత్రులు మహమూద్ అలీ, ఈటల రాజేందర్, ఎర్రబల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్సీ ఫరూక్ హుస్సేన్, వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు వై. విజయసాయిరెడ్డి, ఎంపీ వై.ఎస్. మిథున్‌రెడ్డి, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె. జోషి, డీజీపీ మహేందర్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు ఏకే ఖాన్ తదితరులు పాల్గొన్నారు. సీఎం కేసీఆర్‌కు పండు తినిపిస్తున్న ఏపీ సీఎం వై.ఎస్. జగన్ -
రాజ్‌భవన్‌లో గవర్నర్ ఇఫ్తార్ విందు కేసీఆర్, వైఎస్ జగన్ హాజరు
-
ఇఫ్తార్ విందులో పాల్గొన్న వైఎస్ జగన్, కేసీఆర్ భేటీ
-
గవర్నర్‌ను కలిసిన రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు
-
రాజ్‌భవన్‌లో వైఎస్ జగన్, కేసీఆర్ భేటీ
సాక్షి, హైదరాబాద్ : రాజ్‌భవన్‌లో జరిగిన ఇఫ్తార్ విందులో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. రంజాన్ సందర్భంగా ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ శనివారం సాయంత్రం రాజ్‌భవన్‌లో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు అయ్యారు. ఇరువురు ముఖ్యమంత్రులు స్వీట్లు తినిపించుకున్నారు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, ముస్లిం సోదరులు ఈ కార్యక్రమానికి హాజరు అయ్యారు. కాగా అంతకు ముందు గవర్నర్ సమక్షంలో ఇద్దరు ముఖ్యమంత్రులు సమావేశం అయ్యారు. రెండు రాష్ట్రాలకు సంబంధించి పలు ఉమ్మడి అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఇక ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారి వైఎస్ జగన్ హైదరాబాద్ వచ్చారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : ఇఫ్తార్ విందులో పాల్గొన్న వైఎస్ జగన్, కేసీఆర్ భేటీ గవర్నర్‌ను కలిసిన రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
విందు..పసందు
-
ఆత్మీయులతో జగన్ మమేకం
సాక్షి ప్రతినిధి కడప: పులివెందులలో పర్యటిస్తున్న ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం బిజీబిజీగా గడిపారు. ఆయన క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన పార్టీ నాయకులు, ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ, యోగ క్షేమాలు తెలుసుకుంటూ వారితో మమేకమయ్యారు. వారి దగ్గర నుంచి వినతులు స్వీకరించిన ఆయన రాబోయేవన్ని మంచి రోజులేనని అందరికి మేలు చేస్తానని భరోసా ఇచ్చారు. పోరాటం చేశాం. కొద్దికాలం ఓపిక పట్టండి..దేవుని దయతో మనందరి ప్రభుత్వం అధికారంలోకి రానుంది. అందరికీ మంచి జరుగుతుందని జగన్మోహన్రెడ్డి వారితో అన్నారు. కిక్కిరిసిన క్యాంపు కార్యాలయం.. పులివెందులలోని భాకరాపురంలో ఉన్న ప్రతిపక్షనేత క్యాంపు కార్యాలయం ప్రజలతో కిక్కిరిసింది. ఆయనను కలిసేందుకు వివిధ ప్రాంతాల నుంచి పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, మహిళలు, వృద్ధులు, చిన్నారులు, యువకులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. కార్యాలయ ఆవరణం అంతా ఎక్కడ చూసినా పార్టీ శ్రేణులతో నిండిపోయింది. భారీగా వచ్చిన శ్రేణులను కట్టడి చేయడం పోలీసులకు కూడా కష్టతరమైంది. వివిధ నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ప్రతిపక్షనేతను కలిసిన వారిలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు పి.రవీంద్రనాథరెడ్డి, ఎస్.రఘురామిరెడ్డి, ఎస్.బి.అంజాద్ బాషా, రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, కొరముట్ల శ్రీనువాసులు, డాక్టర్ సుధీర్‌రెడ్డి, కరణం ధర్మశ్రీ, ఏసురత్నం, డాక్టర్ శిద్దారెడ్డి, తిరుపతి ఎంపీ అభ్యర్థి రెడ్డప్ప, కమలాపురం సమన్వయకర్త దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శంకర్‌రెడ్డి తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా వారితో జగన్మోహన్రెడ్డి పలు విషయాలు చర్చించారు. నూతన జంటకు ఆశీర్వాదం.. పులివెందులలోని రాజ్యలక్ష్మి థియేటర్ ఎదురుగా ఉన్న వీధిలో నివాసముంటున్న వైఎస్సార్సీపీ నాయకుడు మోడం పద్మనాభరెడ్డి ఇంటికి ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి వెళ్లారు. ఇటీవలే వివాహమైన పద్మనాభరెడ్డి కుమారుడు యశ్వంత్‌రెడ్డి, కోడలు సుజితలను ఆశీర్వదించారు. అప్పట్లో బిజీగా ఉండి వివాహానికి రాలేకపోయిన ఆయన బుధవారం సాయంత్రం మాజీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, పులివెందుల వైఎస్సార్సీపీ నేత వైఎస్ మనోహర్‌రెడ్డిలతో కలిసి వెళ్లి నూతన దంపతులను ఆశీర్వదించారు. ఇఫ్తార్ విందులో వైఎస్ జగన్.. పులివెందులలోని వీజే ఫంక్షన్ హాల్లో బుధవారం సాయంత్రం వైఎస్సార్సీపీ రాష్ట్ర బీసీ అధ్యయన కమిటీ సభ్యులు రసూల్ సాహెబ్ ఆధ్వర్యంలో ముస్లిం మైనార్టీ సోదరులకు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరయ్యారు. వైఎస్ జగన్‌కు ఇమామ్ జామిన్‌ను చేతికి కట్టారు. అనంతరం ఇస్లాం సంప్రదాయ పద్ధతి ప్రకారం టోపీ పెట్టుకుని దువా చేశారు. ఆ తరువాత విందారగించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, రాయచోటి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీకాంత్‌రెడ్డి, కడప ఎమ్మెల్యే అభ్యర్థి అంజాద్ బాషా, పార్టీ నాయకులు వైఎస్ మనోహర్‌రెడ్డి, శివప్రకాష్‌రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ చిన్నప్ప, పట్టణ కన్వీనర్ వరప్రసాద్, మైనార్టీ నాయకుడు ఇస్మాయిల్, రఫీ, హఫీజ్, బాబు, బాషాలతో పాటు పెద్ద ఎత్తున ముస్లిం సోదరులు పాల్గొన్నారు. -
ఇఫ్తార్ విందులో పాల్గొన్న వైఎస్ జగన్
-
ఇఫ్తార్ విందులో పాల్గొన్న వైఎస్ జగన్
సాక్షి, వైఎస్సార్ జిల్లా : వైఎస్సార్సీపీ నాయకుడు రసూల్ సాహేబ్ ఆధ్వర్యంలో వైఎస్సార్ జిల్లా పులివెందులలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు ఆ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ముస్లింలతో కలిసి వైఎస్ జగన్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం, ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందరర్భంగా వెఎస్ జగన్‌కు ముస్లిం సోదరులు ఖర్జూరాలు తినిపించారు సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : ఇఫ్తార్ విందులో పాల్గొన్న వైఎస్ జగన్ కడప జిల్లా పులివెందుల పర్యటనలో ఉన్న వైఎస్ జగన్ బుధవారం ఉదయం భాకరాపురంలోని తన క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. సాయంత్రం స్థానిక వీజే ఫంక్షన్ హాలులో రసూల్ సాహేబ్ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో వైఎస్ జగన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలతో పాటు పెద్ద ఎత్తున ముస్లిం, మైనారిటీ ప్రజలు పాల్గొన్నారు. -
కువైట్‌లో ఇఫ్తార్.. హాజరైన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు
కువైట్ : కువైట్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కమిటీ ఆధ్వర్యంలో పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరుల కోసం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కడప ఎమ్మెల్యే అంజాద్ బాషా, కమలాపురం ఎమ్మెల్యే పీ. రవింద్రనాథ్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరైయ్యారు. కువైట్ భారత అంబాసిడర్ అయిన హెచ్.ఇ.కే. జీవసాగర్‌ను శాసనసభ సభ్యులు కలిశారు. ఈ సందర్భంగా వారు కువైట్‌లో తెలుగు వారి సమస్యలు గురించి మాట్లాడారు. ఈ విషయాలను అధికార ప్రతినిధి ఆకుల ప్రభాకర్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా శాసనసభ సభ్యులు అంబాసిడర్‌తో మాట్లాడుతూ.. కువైట్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు చేసే సేవ కార్యక్రమాల ద్వారా తెలుగువారిని ఏ విధంగా ఆదకుంటుందో వివరంగా తెలిపారు. మన ఆంధ్ర వారు కువైట్‌లో దాదాపుగా 5 లక్షల మంది ఉన్నారు. ఒక కడప జిల్లా నుంచే సుమారు ఒక లక్ష యాభైవేల మంది ఉన్నారని తెలిపారు. అంతేకాక ఇక్కడ ఎవరైనా చనిపోతే వారి పార్ధివదేహాన్ని స్వస్థలం పంపించాలంటే రూ.లక్ష వరకూ ఖర్చు అవుతుందని చెప్పారు. పేదవారు ఆ ఖర్చును భరించలేరు.. కాబట్టి ఆ ఖర్చును అంబాసి భరించేటట్లు చూడాలన్నారు. ఇక్కడ ఇంట్లో పని చేయడానికి వచ్చే వారికి కొందరు స్పాన్సర్ కష్టాలు పెడుతున్నారు. అలాంటి వారిని ఆదుకుని ఎటువంటి కేసులు లేకుండా ఇండియాకు పంపాలని కోరారు. మహిళలు భారత్ నుంచి కువైట్‌కు రావాలంటే స్పాన్సర్ మన ప్రభుత్వానికి(అంబాసికి) దాదాపుగా రూ. 2 లక్షలు డిపాజిట్ కట్టాలని నిబంధన ఉంది. దాంతో స్పాన్సర్స్ ఇండియా మహిళను విజ ఇవ్వాలంటే ముందుకు రావడం లేదని ఎమ్మెల్యేలు తెలిపారు. కాబట్టి రూ. 2 లక్షల డిపాజిట్‌ను తగ్గించాలని అన్నారు. ఇంట్లో ద్రవర్ గ హౌస్ మెయిడ్ అని పిలిచి ఆ పని ఇవ్వకుండా ఎడారిలో గొర్రెలు మేపడానికి నియమిస్తున్నారు. వారు ఎడారిలో పని చేయలేక ఆత్మహత్యలు చేసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. అలాంటి వారికి రక్షణ కల్పించి తిరిగి స్వస్థలం పంపే ఏర్పాట్లు చేయాలని గల్ఫ్ కన్వీనర్ ఇలియాస్ అంబాసిడర్‌ను ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్ రెడ్డి, అంజాద్ బాషాలు కోరారు. దీనిపై అంబాసిడర్ సానుకూలంగా స్పందించి తప్పకుండా అభ్యర్థనను పరిశీలిస్తామని తెలిపారు. -
కాంగ్రెస్ వైఖరి తెలిసిపోయింది : ఒవైసీ
న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బుధవారం ఇచ్చిన ఇఫ్తార్ విందుపై హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ముస్లింలపై కపట ప్రేమను ప్రదర్శిస్తుందని ఆరోపించారు. ముస్లిం సాధికరతపై కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతుందని విమర్శించారు. వారు హిందువుల ఓట్ల కోసం ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యానించారు. వారం కిందట మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నాగ్‌పూర్‌లో ఆరెస్సెస్ కార్యక్రమానికి హాజరవ్వడంపై విమర్శలు చేసిన ఒవైసీ.. కాంగ్రెస్ ఇఫ్తార్ విందుకు ప్రణబ్‌ను ఆహ్వానించడంపై కూడా ఘూటుగానే స్పందించారు. ఈ విందుకు ప్రణబ్‌ని ఆహ్వానించి, గౌరవించడం ద్వారా కాంగ్రెస్ వైఖరి ఎంటో స్పష్టంగా తెలుస్తోందన్నారు. కాంగ్రెస్ ఇఫ్తార్ పేరుతో డ్రామా ఆడుతోందని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ రెండేళ్ల విరామం తరువాత ఇచ్చిన ఇఫ్తార్ విందుకు మాజీ రాష్ట్రపతులు ప్రణబ్ ముఖర్జీ, ప్రతిభా పాటిల్, మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌తో పాటు పలువురు విపక్ష నేతలు హాజరయ్యారు.