ఈసారైనా బాబు, కేసీఆర్ కలుస్తారా?
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ఈ నెల 10న ఇఫ్తార్ విందు ఇవ్వనున్నారు. రాజ్భవన్లో ఈ విందు ఏర్పాటు చేస్తారు. ఇఫ్తార్ విందుకు రావాల్సిందిగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కే చంద్రశేఖర్ రావులకు ఆహ్వానం అందింది.
కాగా వర్షాకాల విడిదికోసం హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి గవర్నర్ ఇచ్చిన విందుకు చంద్రబాబు హాజరుకాగా, కేసీఆర్ దూరంగా ఉన్నారు. అనారోగ్యంగా కారణంగా కేసీఆర్ గైర్హాజరయినట్టు చెప్పారు. ఇక రాష్ట్రపతి ఇచ్చిన విందులో కేసీఆర్ పాల్గొనగా, చంద్రబాబు జపాన్ పర్యటన కారణంగా వెళ్లలేకపోయారు. ఓటుకు కోట్లు కేసు అనంతరం ఇరు రాష్ట్రాల సీఎంల మధ్య విబేధాలు ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గవర్నర్ విందుల్లో చంద్రబాబు, కేసీఆర్ పాల్గొంటరా అన్న విషయం ఆసక్తికరంగా మారింది.