గవర్నర్, కేసీఆర్లతో భేటీ కానున్న చంద్రబాబు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాసేపట్లో హైదరాబాద్ చేరుకోనున్నారు. ఈ రోజు సాయంత్రం చంద్రబాబు.. తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావులతో సమావేశం కానున్నారు.
ఏపీ నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి రావాల్సిందిగా చంద్రబాబు.. నరసింహన్, కేసీఆర్లను ఆహ్వానించనున్నారు. చంద్రబాబు వీరిద్దరికీ ఆహ్వాన పత్రికలు అందజేస్తారు. ఈ నెల 22న ఏపీ రాజధాని శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించనున్న సంగతి తెలిసిందే.