రాజ్‌భవన్‌లో జరిగే ఇఫ్తార్ విందులో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు శనివారం సాయంత్రం గవర్నర్ నరసింహన్‌తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. రంజాన్ సందర్భంగా ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ శనివారం సాయంత్రం రాజ్‌భవన్‌లో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు అయ్యారు. గవర్నర్ సమక్షంలో ఇద్దరు ముఖ్యమంత్రులు సమావేశం అయ్యారు. కాగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారి వైఎస్ జగన్ హైదరాబాద్ వచ్చారు.